Governing Body
-
బోర్డు లేదు.. స్పెసిఫైడ్ అథారిటీ లేదు
సాక్షి ప్రతినిధి, తిరుపతి : తిరుమల తిరుపతి దేవస్థానంపై చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. చంద్రబాబు కూటమి ప్రభుత్వం ఏర్పడి వందరోజులైనా తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి నియామకం జరగలేదు. పాలకమండలి ఆలస్యమైతే వెంటనే స్పెసిఫైడ్ అథారిటీని ఏర్పాటు చేయాలన్నది నిబంధన. దీనీని సీఎం చంద్రబాబు పట్టించుకోలేదు. కనీసం నెయ్యి, ఇతర వస్తువుల పర్చేజింగ్ కమిటీని కూడా నియమించలేదు. ఇవేమీ లేకుండానే శ్రీవారి బ్రహ్మోత్సవాలు, కొనుగోళ్లు జరిగిపోతున్నాయి. ప్రస్తుతం బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. పాలక మండలి, కనీసం స్పెసిఫైడ్ అథారిటీ లేక తిరుమలపై భక్తుల సౌకర్యాల్లో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఎటువంటి కమిటీ లేకుండా బ్రహ్మోత్సవాలు నిర్వహించడం టీటీడీ చరిత్రలో ఇదే మొదటిసారి. ఇంత నిర్లక్ష్యమా అంటూ బాబు సర్కారుపై భక్తులు మండిపడుతున్నారు.కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే సీఎం చంద్రబాబు తిరుమల వచ్చారు. వైఎస్సార్సీపీ పాలనపై విమర్శలు చేశారు. నాడు అవినీతి, అక్రమాలు జరిగాయని, ప్రక్షాళన టీటీడీ నుంచే ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. అయినా ఇంతవరకు సరైన పాలన వ్యవస్థనే ఏర్పాటు చేయలేకపోయారు. నిత్యం వేలాది భక్తులు, కోట్ల రూపాయల్లో ఆదాయం ఉండే టీటీడీలో ఏ వస్తువు కొనాలన్నా పాలక మండలి ఆమోదం, పర్చేజింగ్ కమిటీ అనుమతులు తప్పనిసరి. పర్చేజింగ్ కమిటీలో మార్కెటింగ్ అధికారి, ఫైనాన్స్ అడ్వైజర్ అండ్ అకౌంట్స్ ఆఫీసర్ (ఎఫ్ఏ అండ్ సీఏఓ), జేఈవో, బోర్డు మెంబర్లు ఉంటారు. నెయ్యి వివాదం నేపథ్యంలో ఈ కమిటీ అత్యవసరం కూడా. అయితే మూడు నెలలుగా బోర్డు, పర్చేజింగ్ కమిటీ రెండూ లేవు. కనీసం ఉన్నతాధికారులతో కూడిన స్పెసిఫైడ్ అథారిటీ కూడా లేదు. -
తిరుమల: టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయాలు
సాక్షి, తిరుమల: టీటీడీ ఉద్యోగులకు మరో తీపి కబురు తెలిపారు పాలకమండలి చైర్మన్ కరుణాకర్ రెడ్డి. నోటిఫికేషన్ ద్వారా ఎంపికైన కాంట్రాక్ట్ ఉద్యోగులతో సహా బోర్డు తీర్మానం ద్వారా ఎంపికైన వారిని కూడా రెగ్యూలైజ్ చేయాలని నిర్ణయించారు. 2014 ఏడాదిని కట్ ఆఫ్ ఇయర్‌గా పరిగణనలోకి తీసుకొని టీటీడీ పరిధిలో ఉన్న ఉద్యోగులకు కూడా జీఓ వర్తించేలా చేయాలని ప్రభుత్వాన్ని కోరేందుకు తీర్మానం చేశారు. ఈ నిర్ణయం ద్వారా వేలాదిమంది ఉద్యోగుల మేలు జరుగుతుందని పేర్కొన్నారు. టీటీడీ పాలకమండలి సమావేశం సోమవారం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అనంతరం నిర్ణయాలను టీటీడీ పాలకమండలి చైర్మన్ కరుణాకర్ రెడ్డి మీడియా ముందు ప్రకటించారు. స్విమ్స్ ఆసుపత్రిలో మరింత మెరుగైన వైద్య సేవలు అందించేందుకు 479 నర్సు పోస్టుల భర్తీకి పాలకమండలి ఆమోదం తెలిపింది. టీటీడీ విద్యాసంస్థల్లో ఎలాంటి సిఫార్సు లేకుండా హాస్టల్ వసతి కల్పించేలా ఏర్పాట్లకు, నూతన హాస్టల్ భవన నిర్మాణాలకు ఆమోదం తెలిపింది. చదవండి: మాటలు కావవి.. ప్రతిపక్షాలకు గుచ్చే బాణాలు రూ. 1.88 కోట్లతో పీఏసీ అభివృద్ధి పనులకు నిధులు కేటాయింపు, యాత్రికుల వసతి సముదాయాలలో లిప్ట్ ఏర్పాటు చెయ్యాలని నిర్ణయం తీసుకున్నారు. తిరుమల చుట్టూ రూ. 1.50 కోట్లతో మిగిలిన ఔటర్ ఫెన్సింగ్ ఏర్పాటకు ఆమోదం తెలిపారు. రూ. 14 కోట్లతో ఉద్యోగస్తుల వసతి సముదాయాల అభివృద్ధికి ఆమోదం తెలిపింది. తిరుపతి గోవింద రాజస్వామి ఆలయంలోని భాస్యకారుల సన్నిధిలోని మకర తోరణానికి, పార్థ సారథి స్వామి, కళ్యాణ వెంకటేశ్వర స్వామి బంగారు అభరణాల బంగారు పూతకు ఆమోదించారు. టీటీడీ ఐటీ సేవల కోసం టెక్ రీప్లేస్ మెంట్ కోసం ఐదేళ్ల పాటు నిర్వహణ కోసం రూ. 12 కోట్లు నిధులు కేటాయించారు. శ్రీవాణి ట్రస్ట్ ద్వారా టీటీడీ ఆద్వర్యంలో ఉన్న ఆలయాల్లో అభివృద్ధి పనులకు చెయ్యాలని ఆమోదం తెలిపింది పాలకమండలి. ఇటీవల ఘాట్ రోడ్డులో మరణించిన శ్రీవారి ఆలయ అర్చకుడు యతిరాజు నరసింహులు కుటుంబానికి రూ.5 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. తిరుమలను నో ఫ్లయింగ్ జోన్‌గా ప్రకటించడం కుదరదని కేంద్ర విమానాయన మంత్రిత్వశాఖ తెలిపిందని భూమన చెప్పారు. -
ఎల్వీ వ్యాఖ్యలు అర్థరహితం
తిరుపతి మంగళం: టీటీడీ వంటి ఆధ్యాత్మిక క్షేత్రంలో మూడేళ్లు ఈవోగా పనిచేసిన ఎల్వీ సుబ్రమణ్యం టీటీడీకి వ్యతిరేకంగా మాట్లాడడం దారుణమని టీటీడీ పాలకమండలి సభ్యుడు పోకల అశోక్‌కుమార్ పేర్కొన్నారు. తిరుపతిలో గురువారం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. టీటీడీ ఈవోగా పనిచేసిన ఎల్వీ సుబ్రమణ్యం శ్రీవారి విషయాన్ని రాజకీయం చేసి మాట్లాడడం ఏమిటని ప్రశ్నించారు. కరోనా అనంతరం భక్తుల రద్దీ గణనీయంగా పెరుగుతోందని, భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని టీటీడీ పాలకమండలి, అధికారులు చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని చెప్పారు. రెండోరోజు దర్శన టోకెన్లు జారీచేయకపోవడంతో భక్తుల సంఖ్య పెరిగి కొంతసేపు తోపులాట జరిగిందన్నారు. అంతేతప్ప భక్తుల పట్ల ఎవరూ అశ్రద్ధగా లేరని చెప్పారు. ఎల్వీ సుబ్రమణ్యం కేవలం చంద్రబాబుకు తొత్తుగా టీటీడీని రాజకీయం చేస్తున్నట్లు ఉందే తప్ప టీటీడీ మాజీ ఈవోగా మాట్లాడలేదని మండిపడ్డారు. టీటీడీ పాలకమండలి సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తోందన్నారు. టీటీడీ పాలకమండలిలో ఎంతమంది సభ్యులు ఉన్నారో తెలుసుకోకుండా మాట్లాడడం ఆయన అజ్ఞానానికి నిదర్శనమన్నారు. మాజీ ఈవోగా టీటీడీకి సలహాలు, సూచనలు ఇవ్వాలే తప్ప ఇలా ఆరోపణలు చేయడం సరికాదన్నారు. స్వామి ప్రతిష్టను దిగజార్చి, భక్తుల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడితే సహించేదిలేదని హెచ్చరించారు. టీటీడీ విధివిధానాలపై అపార అనుభవం ఉన్న వ్యక్తి ధర్మారెడ్డి అని చెప్పారు. సామాన్య భక్తులకు పెద్దపీట వేసి ప్రతి భక్తుడికి దర్శనం కల్పించాలనే ఆలోచనతో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఏఈవో ధర్మారెడ్డి వీఐపీ బ్రేక్ దర్శనాలను కూడా రద్దుచేశారని ఆయన గుర్తుచేశారు. ఈ సమావేశంలో వైఎస్సార్సీపీ నేతలు ఎం.వి.ఎస్.మణి, బండ్ల లక్ష్మీపతిరాయల్ పాల్గొన్నారు. -
ఫొటోలు దిగడం తప్ప ప్రజలకు చేసిందేమిటో..!
సాక్షి, హైదరాబాద్: బాధ్యతల స్వీకరణకు ముందు పలు వివాదాలకు కారణమై.. తీవ్ర ఉత్కంఠ రేపి ఎట్టకేలకు ఎన్నికయ్యాక రెండు నెలల తర్వాత పగ్గాలు చేపట్టిన జీహెచ్ఎంసీ పాలకమండలి ఏడాది కాలంలో ఏం చేసిందో కనిపించడం లేదు. పైపెచ్చు కార్పొరేటర్ల నుంచి మేయర్ వరకు అవకతవకలు, సొంతలాభం వంటి మరకలంటుకున్నాయి. ఇక మహిళా సాధికారత లక్ష్యంగా అతివలకు ప్రాధాన్యమిచ్చినా.. పతుల తోడు లేనిదే ముందుకు కదలని వారు ఎందరో. నగరం గురించి విజన్ ఉందని.. చేయాలనుకున్నవి చేసి చూపిస్తామన్న మేయర్ తన విజన్‌ను ఏమేరకు అమలు చేశారో ఆమెకే తెలియాలి. పాలకమండలి పగ్గాలు చేపట్టినప్పటికీ, స్వతంత్ర నిర్ణయాలతో పనిచేసిన దాఖలాల్లేవు. అధికారుల అజెండాలకు.. పాలకమండలి సభ్యులు పచ్చజెండాలూపి ఫొటోలు దిగడం తప్ప వారు చేసిందేమిటో ప్రజలకు తెలియడం లేదు. ► గత ఏడాది ఫిబ్రవరి 11న పాలకమండలి కొలువుదీరినప్పటికీ, జూన్ 29 వరకు సర్వసభ్య సమావేశమే జరగలేదు. బడ్జెట్ ఆమోదం కోసం వర్చువల్‌గా నిర్వహించారు. ఆ సమావేశంపై ప్రతిపక్ష బీజేపీ పెదవి అసంతృప్తి వ్యక్తం చేసింది. అనంతరం డిసెంబర్ 18న భౌతికంగా సమావేశాన్ని నిర్వహించినా.. బల్దియా చరిత్రలో అంతకు ముందెన్నడూ లేనివిధంగా కౌన్సిల్ హాల్లోకి మీడియాకు అనుమతి నిరాకరించి చీకటి దినంగా గుర్తుండేలా చేశారు. ► తమ వాణి వినిపించేలా సర్వసభ్య సమావేశాన్ని ఏర్పాటు చేయాలని పలుమార్లు డిమాండ్ చేసిన బీజేపీ సభ్యులు నవంబర్ 23న మేయర్ చాంబర్లో రణరంగం సృష్టించారు. ఫర్నిచర్ ధ్వంసం చేశారు. జీహెచ్ఎంసీ అధికారుల ఫిర్యాదు మేరకు 32 మంది బీజేపీ కార్పొరేటర్లపై కేసులు నమోదు చేశారు. పాలకమండలి పగ్గాలు చేపట్టా క తొమ్మిదినెలల తర్వాత నవంబర్‌లో స్టాండింగ్ కమిటీ ఎన్నిక ఏకగ్రీవంగా ముగిసింది. గతంలో మాదిరిగానే టీఆర్ఎస్, ఎంఐఎం పరస్పర ఒప్పందంతో టీఆర్ఎస్ నుంచి 8 మందికి ఎంఐఎం నుంచి ఏడుగురికి అవకాశం కల్పించారు. మరిన్ని విశేషాలు.. ► ఎస్ఎఫ్ఏల తొలగింపు, నియామకాల్లో జోక్యంతో మేయర్ సీటు వన్నె తగ్గింది. అధికారిక, అనధికారిక అన్ని కార్యక్రమాల్లోనూ డిప్యూటీ మేయర్ వెంట ఆమె భర్త ఉండటం చర్చనీయాంశంగా మారింది. మహిళా సాధికారతపై సంశయాలు రేకెత్తించింది. అసలే ఆర్థిక కష్టాల్లో ఉన్న జీహెచ్ఎంసీ నిధుల నుంచి మేయర్, డిప్యూటీ మేయర్ వంటి వారు కార్యాలయాలు, క్యాంప్ కార్యాలయాల ఆధునికీకరణల పేరిట నిధులు దుబారా చేయడం వారి ఆశను వెల్లడించింది. (చదవండి: నిషా ముక్త్ నగరమే లక్ష్యం) ► వానలు రావద్దని కోరుకుంటానంటూ మేయర్ వ్యాఖ్యానించడం, ఇంటికి జనరేటర్ కావాలని కోరడం వివాదాలకు కారణమయ్యాయి. స్వచ్ఛ హైదరాబాద్, పచ్చదనం పెంపు వంటి అంశాల్లో నగరం మెరుగైన ర్యాంక్ సాధించడం కలిసి వచ్చింది. ర్యాంకులొచ్చినా, స్వచ్ఛ ఆటోలు పెరిగినా, చెత్త సమస్యలు తీరలేదు. ట్విట్టర్ వంటి సోషల్ మీడియాలో పోస్టింగులకు ప్రాధాన్యం పెరిగింది. సామాన్య ప్రజల ఫిర్యాదులు స్వీకరించే దిక్కు లేకుండా పోయింది. ► పాలకమండలికి అధికార యంత్రాంగంపై పట్టులేక పోవడం వెల్లడైంది. జోన్లు,సర్కిళ్ల స్థాయిలో అవినీతి పెచ్చరిల్లిందనే విమర్శలున్నాయి. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలోనూ ఎవరు కార్యాలయాలకు వస్తున్నారో, ఎవరు రావడం లేదో తెలియని దుస్థితి. అందరికీ బయోమెట్రిక్ హాజరు అన్నది పబ్లిసిటీకి మాత్రం పనికొచ్చింది. కంట్రోల్ రూమ్‌ల పేరిట ఖర్చులు పెరిగాయి. గతంలోని కంట్రోల్ రూమ్ చేయలేకపోయిందీ.. కొత్తగా ఏర్పాటు చేసింది చేస్తున్నదేమిటో పట్టించుకున్న వారు లేరు. (చదవండి: మున్సిపాలిటీల్లో వార్డు ఆఫీసర్లు!) ► కనీస సమాచారం సైతం కరువైన దుస్థితి నెలకొంది. ఇటీవలి కాలంలో మేయర్ జోన్లవారీ సమీక్షలు నిర్వహిస్తుండటం చెప్పుకోదగ్గ అంశం. సభా మర్యాదలు మంట గలిశాయి. ఒక్క సమావేశమే జరిగినా అర్థవంతమైన చర్చల సంగతటుంచి నువ్వా.. నేనా..? తేల్చుకుందామన్నట్లుగా వ్యవహరించారు. ఏడాదైనా వార్డు కమిటీలు ఏర్పాటు కాలేదు. ఇలా.. ఇంకా.. ఎన్నో.. ఎన్నెన్నో! -
డిసెంబర్ 14న ఆర్టీసీ ఎన్నికలు
సాక్షి, అమరావతి: ఏపీఎస్ ఆర్టీసీలో ఎన్నికల సమీకరణలు రసవత్తరంగా మారుతున్నాయి. ఆర్టీసీలోని క్రెడిట్ కో ఆపరేటివ్ సొసైటీ (సీసీఎస్) పాలక మండలి ఎన్నికలు డిసెంబర్ 14న జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో పోటీకి దిగిన ఎంప్లాయిస్ యూనియన్ (ఈయూ)కు ఏపీ పీటీడీ ఆఫీస్ స్టాఫ్ వెల్ఫేర్ అసోసియేషన్ (ఓస్వా) మద్దతును ప్రకటించింది. ఈ మేరకు శనివారం జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్టు ఓస్వా రాష్ట్ర అధ్యక్షుడు ఐఎల్ నారాయణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.శివప్రసాద్ ఒక ప్రకటన విడుదల చేశారు. డిసెంబర్ 14న జరుగుతున్న సీసీఎస్ ఎన్నికల్లో రాష్ట్రంలోని 129 డిపోలు, యూనిట్లు, ఆఫీసు కార్యాలయాల్లో పనిచేసే పీటీడీ ఆఫీస్ స్టాఫ్ వెల్ఫేర్ అసోసియేన్ (ఓస్వా) సభ్యులు అంతా ఏపీ పీటీడీ ఎంప్లాయీస్ యూనియన్ (ఈయూ)కు మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు. ఈయూ గుర్తింపు సంఘంగా ఉన్నప్పుడు జేఏసీగా రాష్ట్రవ్యాప్తంగా జరిపిన అన్ని పోరాటాల్లోనూ ఓస్వా భాగస్వామ్యం ఉందని పేర్కొన్నారు. 2017 వేతన సవరణ ఒప్పందంలో 25 శాతం తాత్కాలిక ఫిట్మెంట్ సాధించుకున్నామని, సిబ్బంది పదోన్నతుల కోసం పోరాడామని తెలిపారు. -
‘ఆర్టీసీ’లో ఎన్నికల హారన్
సాక్షి, అమరావతి: ఆర్టీసీ ఉద్యోగుల పొదుపు–పరపతి సహకార సొసైటీ ఎన్నికల నగారా మోగింది. రెండేళ్ల కాల పరిమితితో 210 మంది ప్రతినిధులను ఎన్నుకునేందుకు డిసెంబర్ 14న ఎన్నికలు జరగనున్నాయి. అనంతరం ఎన్నికైన సొసైటీ ప్రతినిధులు 9 మంది పాలక మండలి సభ్యులను డిసెంబర్ 29న ఎన్నుకుంటారు. ఈ మేరకు సొసైటీ ఎన్నికల షెడ్యూల్ బుధవారం వెలువడింది. దాని ప్రకారం.. సొసైటీ నూతన పాలకమండలి ఎన్నికలకు నోటిఫికేషన్‌ను 15న విడుదల చేస్తారు. నోటిఫికేషన్ విడుదలయ్యే నాటికి సొసైటీలో సభ్యులుగా నమోదైన వారు ఓటర్లుగా ఉంటారు. కనీసం ఏడాది సర్వీస్‌ను పూర్తి చేసుకుని, సీసీఎస్ ఫామ్ సమర్పించడంతో పాటు రూ.300 షేర్ క్యాపిటల్ చెల్లించిన ఆర్టీసీ ఉద్యోగులు ఓటర్లుగా నమోదయ్యేందుకు అర్హులు. నూతన ఓటర్ల నమోదు ఈ నెల 15 వరకూ కొనసాగుతుంది. ప్రస్తుతం సొసైటీలో 50,300 మంది ఓటర్లున్నారు. ఎన్నికల నోటిఫికేషన్‌పై అభ్యంతరాలను ఈ నెల 22 వరకూ స్వీకరిస్తారు. ఈ నెల 29 నుంచి డిసెంబర్ 12 వరకూ నామినేషన్లు స్వీకరిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు డిసెంబర్ 10 వరకూ అవకాశం కల్పిస్తారు. పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితాను డిసెంబర్ 10న ప్రకటిస్తారు. పోలింగ్‌ను డిసెంబర్ 14న నిర్వహించి.. అదే రోజు ఫలితాలను ప్రకటిస్తారు. ఎన్నికైన ప్రతినిధులు 9 మంది పాలక మండలి సభ్యులను ఎన్నుకుంటారు. ఆర్టీసీ నాలుగు జోన్ల నుంచి ఇద్దరు చొప్పున సభ్యులు, హెడ్ ఆఫీస్ నుంచి ఒక సభ్యుడు.. మొత్తం మీద 9 మంది పాలక మండలి సభ్యులను ఎన్నుకుంటారు. ఆర్టీసీ ఎండీ చైర్మన్‌గా వ్యవహరించే ఈ సొసైటీకి వైస్ చైర్మన్‌గా ఆర్టీసీ ఈడీతో పాటు, మరో ముగ్గురు అధికారులు సభ్యులుగా ఉంటారు. ఇదిలా ఉండగా ఆర్టీసీలో సొసైటీ ఎన్నికల హడావుడి ఇప్పటికే మొదలైంది. హామీలు నెరవేర్చాం.. మరోసారి అవకాశం ఇవ్వండి ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ తమ సభ్యులతో విజయవాడలో బుధవారం సమావేశం నిర్వహించింది. ఈయూ నేతృత్వంలోని పాలక మండలి.. ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమానికి విశేషంగా కృషి చేసిందని ఆ సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వైవీ రావు, దామోదరరావు చెప్పారు. ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చామన్నారు. సొసైటీకి రావాల్సిన బకాయిలను చెల్లించేందుకు ఆర్టీసీ ఎండీ సీహెచ్ ద్వారకా తిరుమలరావు బుధవారం హామీ ఇవ్వడంపై వారు హర్షం వ్యక్తం చేశారు. ఉద్యోగులకు మరిన్ని సేవలందించేందుకు ఈయూ అభ్యర్థులను గెలిపించాలని వారు కోరారు. ఎన్ఎంయూ అభ్యర్థులను గెలిపించండి సొసైటీ ఎన్నికల్లో నేషనల్ మజ్దూర్ యూనియన్ (ఎన్ఎంయూ) అభ్యర్థులను గెలిపించాలని ఆ సంఘం అధ్యక్షుడు రమణారెడ్డి కోరారు. విజయవాడలో ఎన్ఎంయూ బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత పాలకవర్గం వైఫల్యంతో కుటుంబ నేస్తం, జనతా వ్యక్తిగత బీమా పథకాలు రద్దయ్యాయని విమర్శించారు. సొసైటీకి సంస్థ నుంచి రావాల్సిన బకాయిలను రాబట్టలేకపోయారని విమర్శించారు. -
టీటీడీ బోర్డు కార్యదర్శిగా ఈవో ప్రమాణ స్వీకారం
తిరుమల: టీటీడీ పాలకమండలి సభ్య కార్యదర్శిగా టీటీడీ ఈవో కె.ఎస్.జవహర్‌రెడ్డి శ్రీవారి ఆలయంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఆలయంలోని బంగారు వాకిలి వద్ద టీటీడీ అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి ఈవోతో ప్రమాణం చేయించారు. అనంతరం ఆలయం వెలుపల ఈవో మీడియాతో మాట్లాడుతూ శ్రీవారి బ్రహ్మోత్సవాలను అక్టోబర్ 7 నుంచి 15వ తేదీ వరకు నిర్వహించేందుకు ఏర్పాట్లను పూర్తి చేస్తున్నామని తెలిపారు. కోవిడ్ నేపథ్యంలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలను ఏకాంతంగా నిర్వహించనున్నట్లు చెప్పారు. గరుడోత్సవం రోజున శ్రీవారికి ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలను అందజేసేందుకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని టీటీడీ ఆహ్వానించనుందని వెల్లడించారు. దీంతోపాటు హనుమంతుని జన్మస్థలం అంజనాద్రిలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించనున్నామన్నారు. తాళ్లపాక అన్నమాచార్యుని సంకీర్తనలు పాటలు పోటీలను ‘అదివో అల్లదివో’ పేరుతో నిర్వహించనున్నట్లు చెప్పారు. అన్నమయ్య సంకీర్తనలపై నిరంతర పరిశోధనలు అన్నమాచార్యుల సంకీర్తనలపై నిరంతరం పరిశోధనలు నిర్వహించేందుకు తిరుపతిలోని కేంద్రీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో ‘అన్నమయ్య పీఠం’ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని జవహర్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. టీటీడీ ధార్మిక ప్రాజెక్టులపై శుక్రవారం ఆయన సమీక్షించారు. -
ఏపీఎస్ ఆర్టీసీ పాలక మండలి నియామకం
సాక్షి, అమరావతి: ఏపీఎస్ ఆర్టీసీ పాలక మండలిని ప్రభుత్వం నియమించింది. ఆర్టీసీ చైర్మన్ ఎ.మల్లికార్జునరెడ్డి నేతృత్వంలోని ఈ పాలకమండలిలో ఓ వైస్‌చైర్మన్, నలుగురు ఆర్టీసీ జోనల్ చైర్మన్లతోపాటు మరో ఆరుగురు రాష్ట్ర ఉన్నతాధికారులు, ఐదుగురు కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు డైరెక్టర్లుగా ఉన్నారు. ఈ మేరకు రోడ్లు, భవనాలు, రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు మంగళవారం ఉత్తర్వులిచ్చారు. ఆర్టీసీకి పూర్తిస్థాయిలో పాలక మండలిని నియమించడంపై నేషనల్ మజ్దూర్ యూనియన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రమణారెడ్డి, వై.శ్రీనివాసరావు హర్షం వ్యక్తం చేశారు. పాలక మండలి ఇదీ.. చైర్మన్: ఎ.మల్లికార్జున రెడ్డి, వైస్‌చైర్మన్–డైరెక్టర్: మెట్టపల్లి చిన్నప్పరెడ్డి విజయానందరెడ్డి, డైరెక్టర్లు: గాదల బంగారమ్మ, తాతినేని పద్మావతి, బత్తుల సుప్రజ, మల్యావతం మంజుల, రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి, ఆర్థిక శాఖ కార్యదర్శి, జీఏడీ కార్యదర్శి, ఆర్టీసీ ఎండీ, ఆర్టీసీ అదనపు కమిషనర్/ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ఆర్టీసీ ఆర్థిక సలహాదారు, అసోíసియేషన్ ఆఫ్ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండర్ టేకింగ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ డైరెక్టర్, కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ డైరెక్టర్, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ డైరెక్టర్. -
ముగిసిన దుర్గగుడి పాలకమండలి సమావేశం
సాక్షి, విజయవాడ: దుర్గగుడి పాలకమండలి బుధవారం రోజున ఏర్పాటు చేసిన సమావేశం ముగిసింది. పలు అంశాలపై పాలకమండలి చర్చించారు. సుమారు 66 అజెండాలపై చర్చించి, చాలా వరకు అంశాలను పాలక మండలి ఆమోదించింది. రానున్న దసరా ఉత్సవాల్లో భక్తులకు ఇబ్బంది కలుగకుండా ఏర్పాట్లను చేస్తున్నట్లు పాలకమండలి వెల్లడించింది. ప్రతి భక్తుడికి 250 గ్రాముల దద్దోజనం, 250 గ్రాముల సాంబార్ రైస్‌ను ప్రసాదంగా ఇవ్వాలని దుర్గగుడి పాలకమండలి నిర్ణయించింది. ఆలయానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కుంకుమ, అమ్మవారి ప్రతిమ ఉన్న డాలర్‌ను ఇవ్వనున్నట్లు పాలకమండలి పేర్కొంది. దసరా ఏర్పాట్లను చేయడానికి పాలకమండలి సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. కలెక్టర్, కో ఆర్డినేషన్ కమిటీల సమన్వయంతో ఉత్సవాలకు బడ్జెట్‌ను కేటాయిస్తామని పేర్కొంది. గత దసరాకి ముఖ్యమంత్రి కేటాయించిన రూ. 70 కోట్ల నిధులకు సంబంధించి పనులను పూర్తి చేస్తున్నట్లు దుర్గగుడి దేవస్థానం చైర్మన్ పైలా స్వామినాయుడు, ఈవో భ్రమరాంబ వెల్లడించారు. చదవండి: ఏపీ పర్యాటకానికి ప్రత్యేక యాప్: మంత్రి అవంతి -
జూబ్లీహిల్స్ సొసైటీ అక్రమాలు.. రంగంలోకి పోలీసులు
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ నూతన పాలక మండలి అక్రమాల ఆరోపణలపై పోలీసులు రంగంలోకి దిగారు. సొసైటీ కార్యాలయానికి చేరుకున్న జుబ్లీహిల్స్ పోలీసులు విచారణ ప్రారంభించారు. సొసైటీ ప్రెసిడెంట్ రవీంద్రనాధ్, కోశాధికారి నాగరాజుపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సొసైటీ స్థలం తక్కువ ధరకు అమ్మి రూ.5 కోట్ల నష్టం చేశారని సభ్యుడు సురేష్ బాబు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. సొసైటీ స్థలం పక్కనే ఉన్న ప్రభుత్వ భూమి ఆక్రమణను జీహెచ్ఎంసీ తొలగించింది. ప్రాథమిక సమాచారం ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. త్వరలో సొసైటీ ప్రెసిడెంట్ రవీంద్రనాధ్, కోశాధికారి నాగరాజుకు నోటీసులు ఇవ్వనున్నట్లు తెలిసింది. -
టీటీడీ పాలకమండలి భేటీ: కీలక నిర్ణయాలు
సాక్షి, తిరుమల: డిసెంబరు 27 నుంచి పది రోజులపాటు వైకుంఠ ద్వారాలు తెరిచి ఉంచాలని నిర్ణయించామని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. తిరుమలలోని అన్నమయ్య భవన్లో శనివారం పాలక మండలి సమావేశం నిర్వహించారు. టీటీడీ ఆస్తులపై ఆయన శ్వేతపత్రం విడుదల చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ వైకుంఠ ఏకాదశి సందర్భంగా వైకుంఠ ద్వారం పది రోజుల పాటు తెరిచే ఉంచాలని భక్తులు కోరారని, ప్రత్యేక కమిటి ఏర్పాటు చేసి దేశంలోని ప్రధాన పీఠాధిపతులతో చర్చించి నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. పది రోజులపాటు భక్తులకు స్వామి దర్శనం కల్పిస్తామని ఆయన వెల్లడించారు. (చదవండి: శ్రీవారి ఆలయంలో కైశిక ద్వాదశి ఆస్థానం) ‘‘భక్తులు విరాళంగా ఇచ్చిన ఆస్తులను అమ్మడానికి వీలు లేకుండా శ్వేత పత్రం విడుదల చేశాం. తిరుమలలోని ధ్వజస్తంభం, బలిపీఠం, మహాద్వారానికి బంగారు తాపడంపై చర్చించి నిర్ణయం తీసుకున్నాం. ప్రైవేట్ సెక్యూరిటీ వారికి యూనిఫాం అలవెన్స్ గా రెండు వేల రూపాయలు ఇవ్వాలని నిర్ణయించాం. కాలు నడక భక్తుల కోసం షెల్టర్ కూడా ఆధునీకరణ పనులు చేపడుతున్నాం. గాలి గోపురాల మరమ్మత్తులకు నిధుల కేటాయించాం. తిరుమలలో పర్యావరణాన్ని కాపాడటంలో ప్లాస్టిక్‌ను నియంత్రించాం. తిరుమలను గ్రీన్‌సిటీగా తీర్చిదిద్దుతాం. తిరుమలకు ఎలక్ట్రిక్ బస్సులు 100 నుండి 150 బస్సులు ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. తిరుమలలో గ్రీన్‌పవర్ వాడేందుకు పాలక మండలి సభ్యులు తీర్మానించారు. (చదవండి: భవానీ భక్తులపై కోవిడ్ ఎఫెక్ట్) తిరుచానూరు అమ్మవారి ఆలయంలో సూర్యప్రభ వాహనానికి 11.76 లక్షల బంగారు తాపడం కోసం నిధులు కేటాయించాం. సాధారణ భక్తులకు కేటాయించే కాటేజీల ఆధునీకరణకు నిర్ణయం తీసుకున్నాం. ధర్మ రథాలు ధర్మ ప్రచార పరిషత్ కోసం తిరిగి ప్రారంభిస్తాం. టీటీడీ ఆధ్వర్యంలో పేదల వివాహం కోసం కల్యాణ మండపాల్లో కల్యాణమస్తు కార్యక్రమం పున:ప్రారంభిస్తాం. బాల మందిరాల్లో అనాధ పిల్లల సౌకర్యార్థం పది కోట్ల రూపాయలు నిధులు కేటాయించాం. చెన్నై వలందురు పేటలో నాలుగు ఎకరాల్లో రూ.10 కోట్ల వ్యయంతో శ్రీవారి ఆలయం నిర్మించేందుకు నిర్ణయం తీసుకున్నాం. జాతీయ ప్రముఖ ప్రైవేట్ బ్యాంకుల్లోనే టీటీడీ డిపాజిట్లు చేయాలని నిర్ణయం తీసుకున్నామని’’ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. -
తిర‘కాసు’ వేతనం
అనంతపురం విద్య: కీలకమైన పదవిలో ఉన్న ఓ రిజిస్ట్రార్ బాధ్యాతారాహిత్యంగా వ్యవహరించి అడ్డంగా దొరికిపోయారు. ఆశ్రిత పక్షపాతంతో అడ్డగోలుగా ఆదేశాలు జారీ చేశారు. అయిన వారికి అందినకాడికి దోచుకునే అవకాశం కల్పించారు. అనుమతులు లేకపోయినా.. ఉన్నట్లు సృష్టించి భారీగా లబ్ధి చేకూర్చారు. ఏకంగా రివైజ్డ్ పేస్కేల్ మంజూరయ్యేలా తతంగం నడిపించడం గమనార్హం. జీఓ ఏం చెబుతోందంటే.. ►గతేడాది ఫిబ్రవరి 13న రాష్ట్ర ప్రభుత్వం జీఓ నెంబర్ 14ను జారీ చేసింది. ఇందులో అర్హులైన వారికి రివైజ్డ్ పేస్కేల్–2016 మంజూరు చేయాలని పేర్కొంది. ►మార్చి 20, 2019న ఎస్కేయూ పాలకమండలి సమావేశం(నెంబర్–163) జరిగింది. ఇందులో ఏ–4 అంశంగా ఆర్.పీ.ఎస్–2016ను ఎజెండాగా పేర్కొన్నారు. అయితే కేవలం ప్రొఫెసర్లు, అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, లైబ్రేరియన్లు, ఫిజికల్ ఎడ్యుకేషన్ విభాగంలో పనిచేసే డైరెక్టర్లకు మాత్రమే ఆర్పీఎస్ వర్తిస్తుందని పాలకమండలి తీర్మానం చేసింది. ఏం చేశారంటే.. ►ఏప్రిల్ 16, 2019లో అప్పటి ఎస్కేయూ వీసీ ప్రొఫెసర్ రహంతుల్లా ఆడిట్‌కు సిఫార్సు చేశారు. ►మే 5, 2019లో ఆడిట్ నివేదికకు అనుగుణంగా వీసీ ప్రొసీడింగ్స్ ఇచ్చారు. కేవలం ప్రొఫెసర్లు, అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, లైబ్రేరియన్లు, ఫిజికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్లకు ఆర్పీసీ వర్తిస్తుందని.. వెంటనే మంజూరు చేయమని రిజి్రస్టార్‌కు ఆదేశాలు ఇచ్చారు. ►ఏప్రిల్ 16, 2019లో వైస్ ఛాన్స్లర్ ప్రొసీడింగ్స్ లేకుండా, నేరుగా రిజి్రస్టార్.. అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్‌కు లబ్ధి చేకూరేలా ఉత్తర్వులు జారీ చేశారు. శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్, తాజా మాజీ రిజి్రస్టార్ వ్యవహార శైలి మొదటి నుంచీ వివాదాస్పదమే. గత ప్రభుత్వ హయాంలో అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్‌కు రెండింతల పదోన్నతులను అక్రమంగా కట్టబెట్టారు. ఇందులోనూ నిబంధనలను పక్కనపెట్టడం చర్చనీయాంశమవుతోంది. ఇంతటితో ఆగకుండా ఏకంగా రివైజ్డ్ పేస్కేలు(2016)ను ఎవరి అనుమతి లేకుండానే మాజీ రిజిస్ట్రార్ మంజూరు చేశారు. వాస్తవానికి రివైజ్డ్ పేస్కేల్‌కు అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ అనర్హుడు. పాలకమండలిలో ఆమోదం పొందలేదు.. వైస్ ఛాన్స్లర్ ప్రొసీడింగ్స్ ఇవ్వలేదు.. అయినప్పటికీ ఫైలు మీద రిజి్రస్టార్ సంతకం పెట్టి ఎస్టాబ్లిష్మెంట్ సెక్షన్‌కు అనుమతులు ఇచ్చేశారు. అనుకున్నదే తడవుగా ఎస్టాబ్లి‹Ùమెంట్ అప్పటి డిప్యూటీ రిజి్రస్టార్ రాజభక్తిని ప్రదర్శించి రివైజ్డ్ పేస్కేలు మంజూరు చేశారు. బయటపడిందిలా.. ►వాస్తవానికి ఎలాంటి ఉత్తర్వు అయినా వీసీ ప్రొసీడింగ్స్ లేకుండా రిజి్రస్టార్ ఉత్తర్వులు ఇవ్వడానికి వీల్లేదు. వీసీ ప్రొసీడింగ్స్ లేకపోయినా ఉత్తర్వులు ఇవ్వడం చట్టరీత్యా నేరమని నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. అలా ఇచ్చే ఉత్తర్వులు చెల్లవు. ►వీసీ ప్రొసీడింగ్స్ ఉన్నాయా? లేవా? అని ఎస్టాబ్లిష్మెంట్ డిప్యూటీ రిజిస్ట్రార్, అసిస్టెంట్ రిజి్రస్టార్, సూపరింటెండెంట్ క్షుణ్ణంగా పరిశీలించాలి. కానీ ఉద్దేశపూర్వకంగానే ఆర్పీఎస్–2016ను మంజూరు చేసినట్లు స్పష్టమవుతోంది. ►గతేడాది మే చివర్లో నూతన ప్రభుత్వం ఏర్పడటంతో.. జూలైలో ఇంక్రిమెంట్‌కు దరఖాస్తు చేసుకుంటే తతంగం బయటపడుతుందనే ఉద్దేశంతో దరఖాస్తు చేసుకోలేదని తెలుస్తోంది. ►తాజాగా ఈ ఏడాది జూన్ 24న ఇంక్రిమెంట్‌కు దరఖాస్తు చేసుకున్న సమయంలో ఎస్టాబ్లిష్మెంట్ విభాగం పరిశీలించడంతో వెలుగులోకి వచ్చింది. చర్యలు తప్పవు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవు. వీసీ ప్రొసీడింగ్స్ లేకుండా ఆర్పీసీ మంజూరు చేసిన విషయం నా దృష్టికి రాలేదు. ఎస్టాబ్లిష్మెంట్ విభాగం నుంచి రికార్డులు తెప్పించుకుని పరిశీలిస్తాం. అక్రమాలు వీసీ దృష్టికి తీసుకెళ్లి ఆయన ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటాం. – ప్రొఫెసర్ ఎ.మల్లిఖార్జున రెడ్డి, రిజిస్ట్రార్, ఎస్కేయూ -
టీటీడీ కొత్త పాలకమండలి నియామకం
సాక్షి, అమరావతి/తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) కొత్త పాలక మండలిని ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికే టీటీడీ చైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డిని గత జూన్ 21న నియమించిన ప్రభుత్వం బుధవారం పాలక మండలిలోని మిగిలిన సభ్యుల్ని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. టీటీడీ పాలక మండలిని 29 మంది సభ్యులకు పెంచుతూ ప్రభుత్వం ఇటీవల గెజిట్ జారీ చేయడం తెలిసిందే. గతంలో ఎక్స్అఫీషియో సభ్యులు కాకుండా 19 మందితో పాలకవర్గం ఉండేది. తాజా ఉత్తర్వుల్లో 24 మంది సభ్యులు, నలుగురు ఎక్స్అఫీషియో సభ్యులతో కూడిన కొత్త పాలకమండలిని ప్రకటించింది.విశాఖపట్నం జిల్లా యలమంచిలి ఎమ్మెల్యే యూవీ రమణమూర్తిరాజు, వైఎస్సార్ జిల్లా రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి, కృష్ణా జిల్లా పెనమలూరు ఎమ్మెల్యే కె.పార్థసారథిలతో పాటు పరిగెల మురళీకృష్ణ, కృష్ణమూర్తి వైద్యనాథన్, నారాయణస్వామి శ్రీనివాసన్, జె.రామేశ్వరరావు, వేమిరెడ్డి ప్రశాంతి, బి.పార్థసారథిరెడ్డి, డాక్టర్ ముప్పవరపు నిశ్చిత, నాదెళ్ల సుబ్బారావు, డీపీ అనంత, రాజేష్‌శర్మ, రమేష్ శెట్టి, గుండవరం వెంకట భాస్కరరావు, మూరంశెట్టి రాములు, డి.దామోదరరావు, చిప్పగిరి ప్రసాదకుమార్, ఎం.ఎస్.శివశంకరన్, సంపత్ రవినారాయణ, సుధా నారాయణమూర్తి, కుమారగురు(తమిళనాడు ఎమ్మెల్యే), పుత్తా ప్రతాప్‌రెడ్డి, కె.శివకుమార్‌లు పాలకమండలి సభ్యులుగా నియమితులయ్యారు. దేవాదాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, దేవదాయ శాఖ కమిషనర్, తుడా చైర్మన్, టీటీడీ ఈవోలను పాలకమండలిలో ఎక్స్అఫీషియో సభ్యులుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. కాగా, నూతనంగా నియమితులైన టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యులు ఈ నెల 23న ప్రమాణ స్వీకారం చేయనున్నట్టు సమాచారం. అనంతరం జరిగే కొత్త పాలక మండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశమున్నట్టు తెలుస్తోంది. కాగా, తెలంగాణ నుంచి టీటీడీ బోర్డు సభ్యులుగా నియమితులైన దివకొండ దామోదర్ రావు, వి.భాస్కర్ రావు, ఎం.రాములు బుధవారం ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం వారిని అభినందించారు. దీవకొండ దామోదర్‌రావు, ఉద్యమ నేత తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా వ్యవహరించారు. నమస్తే తెలంగాణ, టీ న్యూస్‌ల ఏర్పాటులో కీలకంగా వ్యవహరించారు. ప్రస్తుతం ఆయన ఆ పత్రిక చైర్మన్‌గా, టీ న్యూస్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. 2001 నుంచి టీఆర్ఎస్ పారీ్టలో వివిధ పదవుల్లో పనిచేశారు. పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడిగా, ప్రధాన కార్యదర్శిగా, పార్టీ ఫైనాన్స్ ఇన్చార్జిగా వ్యవహరించారు. జగిత్యాల జిల్లా మద్దునూరు ఆయన స్వగ్రామం. వెంకట భాస్కరరావు, కావేరీ సీడ్స్ సీఎండీ విత్తన ఉత్పత్తిలో తనకంటూ ప్రత్యేకత సాధించిన గుండవరం వెంకట భాస్కరరావు వ్యవసాయ రంగం పురోగతిలో చురుగ్గా వ్యవహరిస్తున్నారు. తొలినాళ్ల లో కరీంనగర్ జిల్లా గట్ల నరసింగాపూర్‌లో తన వ్యవసాయ క్షేత్రంలో విత్తన ఉత్పత్తికి బాటలు వేసిన ఆయన ప్రస్తుతం కావేరీ సీడ్స్ కంపెనీ లిమిటెడ్‌కు చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. ఆధ్యాత్మిక భావనలు ఎక్కువ. జూపల్లి రామేశ్వరరావు, మై హోమ్ అధినేత హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ రంగం వేగం పుంజుకుంటున్న తరుణంలో రియల్టర్‌గా రంగప్రవేశం చేసి అనతికాలంలోనే మొదటి స్థానం దక్కించుకున్నారు జూపల్లి రామేశ్వరరావు. మై హోమ్ గ్రూపు స్థాపించి ఆ రంగంలో అత్యంత చురుకుగా వ్యవహరిస్తున్నారు. ఆధ్యాతి్మకతలోనూ తనదైన పాత్ర పోషిస్తున్నారు. చిన జీయర్‌స్వామి ఆధ్వర్యంలో జరిగే ఆధ్యాతి్మక కార్యక్రమాల్లో ఆయన చాలా చురుకుగా వ్యవహరిస్తున్నారు. సీఎం కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడుగా ఉన్నారు. బండి పార్థసారథిరెడ్డి, హెటిరోడ్రగ్స్ అధినేత ఔషధ రంగంలో తెలంగాణ ప్రాంతం నుంచి ప్రముఖ పాత్ర పోషిస్తున్న బండి పార్థసారథిరెడ్డి ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్న హెటిరో డ్రగ్స్ సీఎండీగా వ్యవహరిస్తున్నారు. ఈ కంపెనీని స్థాపించటానికి పూర్వం ఆయన డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్‌లో చీఫ్ టెక్నాలజిస్ట్‌గా దశాబ్దానికి పైగా పనిచేశారు. వీరితో పాటు తెలంగాణ నుంచి మూరంశెట్టి రాములు, పుత్తా ప్రతాప్‌రెడ్డి, కె.శివకుమార్‌లు పాలకమండలి సభ్యులుగా నియమితులయ్యారు. -
వైవీయూ నిర్లక్ష్యం..!
ఆధునిక సాంకేతికత కొంత్తపుంతలు తొక్కుతున్న తరుణంలో.. అందుకు అనుగుణంగా పనిచేయాల్సిన విశ్వవిద్యాలయం పాత చింతకాయపచ్చడిలా..పాత సమాచారాన్నే కొనసాగిస్తూ.. నెటిజన్లను గందరగోళానికి గురిచేస్తోంది. సాక్షాత్తు విశ్వవిద్యాలయం చాన్స్‌లర్, రాష్ట్ర గవర్నర్ మారినా ఇంకా అధికారులకు మాత్రం తెలియనట్లుంది. వైవీయూ పాలకమండలిని రద్దు చేసి నెలరోజులవుతున్నా ఇంకా వారిపే ర్లనే కొనసాగిస్తూ తరిస్తున్నారు. ఇటువంటి చిత్ర విచిత్రాల సమాచారం కనిపించే వైవీయూ వెబ్సైట్ నిర్వహణపై ప్రత్యేక కథనం.. సాక్షి, వైవీయూ: ప్రస్తుత డిజిటల్ యుగంలో ఏదైనా సమాచారం అవసరమైతే ఎక్కువగా ఇంటర్నెట్ మీద ఆధారపడుతున్నారు. పొరుగు జిల్లాలు, రాష్ట్రాల విద్యార్థులు ఏదైనా సమాచారం కోసం వైవీయూ వెబ్‌సైట్‌ను సందర్శిస్తే కొన్ని అంశాలు మినహా మిగతా సమాచారం అంతా పాతదే కనిపిస్తోంది. దీనికి తోడు జూలై 17న విశ్వవిద్యాలయాలు తప్పని సరిగా వెబ్సైట్లో సమాచారాన్ని వెబ్సైట్లో నమోదు చేయాలని యూజీసీ సూచిస్తూ రిజిస్ట్రార్‌కు లేఖ రాసింది. వెబ్సైట్లో నమోదు చేసే అంశాలకు సంబంధించి డాక్యుమెంట్స్, ఫొటోగ్రాఫ్స్, వీడియో తదితర అంశాలను తాజా సమాచారంతో పొందుపరచాలని సర్కులర్ సైతం జారీ అయింది. అప్డేట్ కాని సమాచారం.. ►ఈనెల 24వ తేదీన రాష్ట్ర గవర్నర్‌గా బిశ్వభూషణ్ హరిచందన్ బాధ్యతలు స్వీకరించారు. గవర్నర్ ఎవరైతే ఉంటారో వారే విశ్వవిద్యాలయాలకు చాన్సలర్‌గా ఉంటారు. అయితే వైవీయూ వెబ్సైట్లో మాత్రం ఇప్పటికీ చాన్సలర్‌గా పూర్వపు గవర్నర్ నరసింహన్ చిత్రమే కనిపించడంతో పాటు పేరు కూడా మార్చలేదు. ►జూన్ 28వ తేదీన వైవీయూ పాలకమండలిని రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఇప్పటికీ పాలకమండలి సభ్యులుగా టీడీపీ నాయకులు గోవర్ధన్‌రెడ్డి, విజయజ్యోతి, సానుభూతి పరులు పెంచలయ్య, రామచంద్రయ్య పేర్లను వెబ్సైట్లో కొనసాగిస్తున్నారు. ఇదే వరుసలో ఉన్న ప్రిన్సిపల్, రిజిస్ట్రార్, రెక్టార్ల పేర్లను, సమాచారం మాత్రం అప్డేట్ చేసిన వీరికి పైనే మారిన పాలకమండలి సభ్యుల పేర్లు కనిపించకపోవడం గమనార్హం. ►వెబ్సైట్లో ప్రిన్సిపల్‌గా ఆచార్య జి.సాంబశివారెడ్డి పేరు, ఫొటో కరెక్ట్‌గా చూపుతున్న వెబ్సైట్, వైస్ ప్రిన్సిపల్‌గా ఆచార్య కె. కృష్ణారెడ్డి నియమితులైనా ఆయన ఫొటో, పేరు లేకుండా మళ్లీ ఆచార్య జి.సాంబశివారెడ్డి చిత్రమే కనిపిస్తోంది. ►పరీక్షల విభాగంలో అదనపు పరీక్షల నియంత్రణాధికారిగా పనిచేసిన డా. వి. వెంకట్రామ్ రెండు నెలల క్రితమే మచిలీపట్నంలోని కృష్ణా యూనివర్సిటీకి అనుబంధ నూజివీడు పీజీ కళాశాలలో ప్రొఫెసర్‌గా నియమితులయ్యారు. అయినప్పటికీ ఆయన చిత్రం, పేరు, సమాచారమే ఇప్పటికీ దర్శనమిస్తోంది. ఈయన వైవీయూ రిసెర్చ్ సెల్ కోఆర్డినేటర్‌గా కూడా కొనసాగుతున్నట్లు పాతసమాచారమే దర్శనమిస్తోంది. ►వెబ్సైట్లో ప్రవేశాల గురించి తెలుసుకుందామని అడ్మిషన్స్‌పై క్లిక్ చేస్తే అండర్ కన్స్ట్రక్షన్స్ అని చూపుతోంది. ►వీటితో పాటు వైవీయూలోని కోర్సులకు సంబంధించిన పూర్తి సమాచారం లేదు. గత రెండు సంవత్సరాలకు పైగా ఉర్దూ కోర్సు నడుస్తున్నప్పటికీ ఇది ఉన్నట్లు కూడా చూపడం లేదు. ఇటీవల ప్రవేశపెట్టిన ఎంఏ రూరల్ డెవలప్మెంట్ ఎంఎస్సీ ఫుడ్‌టెక్నాలజీ, ఎంఎస్సీ కంప్యూటేషనల్ డాటా సైన్స్ కోర్సుల ఊసు వెబ్సైట్లో లేదు. ►వీటితో పాటు ఐక్యూఏసీ (ఇంటర్ క్వాలిటీ అసెస్‌మెంట్‌సెల్) విభాగం క్లిక్ చేస్తే చివరిసారిగా 2015 డిసెంబర్ 1లో అప్డేట్ చేసినట్లు చూపుతోంది. ►ఇటీవల కాలంలో విశ్వవిద్యాలయానికి పలు పురస్కారాలు వచ్చాయి. వీటికి సంబంధించిన సమాచారం కూడా నమోదు చేయలేదు. రూ.17 కోట్లు వెచ్చించి నిర్మించిన ఆర్ట్స్బ్లాక్కు సంబంధించిన చిత్రం ఒక్కటి కూడా వైవీయూ ఫొటోగ్యాలరీలో కనిపించకపోవడం గమనార్హం. ►అబౌట్ వైవీయూలోకి వెళ్లి అడ్మినిష్ట్రేషన్ వింగ్‌ను క్లిక్ చేస్తే కేవలం చిత్రాలు ఉంటాయే తప్ప అక్కడ ఎవరి పేర్లు, సమాచారం కనిపించవు. వివరాలు లేకుండా ఫొటోలు ఎందుకు ఉంచారో ఎవరికీ తెలియదు. ►వైవీయూ పీహెచ్డీ థీసిస్ అన్న అంశాన్ని ఓపెన్‌చేస్తే 2017 జూలై 21వ తేదీ వరకు వచ్చినవి మాత్రమే కనిపిస్తాయి. తర్వాత నుంచి సమర్పించిన పీహెచ్‌డీల సమాచారం లేదు. ►2019 పరీక్షలు ముగిసి ఫలితాలు వచ్చినా ఇంకా 2018 ఇన్స్టంట్ పరీక్షలకు సంబంధించిన ఫలితాల సమాచారమే కనిపిస్తోంది. ►సమాచారహక్కు చట్టంలో నేటికీ నాలుగు సంవత్సరాల క్రితం ప్రిన్సిపల్‌గా పదవీ విరమణ చేసిన ఆచార్య జయపాల్‌గౌడ్ పేరే ఉండటం గమనార్హం. పైన కనిపిస్తున్నవన్నీ కొన్ని ఉదాహరణలు మాత్రమే. అందరికీ ఆదర్శంగా నిలుస్తూ అప్డేట్ సమాచారాన్ని అందించాల్సిన విశ్వవిద్యాలయ పాలకులు ఇంకా పాత సమాచారాన్నే కలిగి ఉండటం నెటిజన్లకు ఇబ్బందికరంగా తయారైంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి తాజా సమాచారంతో పాటు విభాగాలకు సంబంధించిన పూర్తి సమాచారం విశ్వవిద్యాలయ వెబ్సైట్లో ఉంచాలని విద్యార్థులు, మేధావులు కోరుతున్నారు. వైవీయూ వెబ్సైట్లో దర్శనమిస్తున్న పూర్వపు చాన్సలర్ చిత్రం -
ఎంసీఐ స్థానంలో ఇక పాలక మండలి
న్యూఢిల్లీ: అవినీతిలో కూరుకుపోయిన భారతీయ వైద్య మండలి (ఎంసీఐ–మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా)ని రద్దు చేసి, దాని బాధ్యతలను పరిపాలక మండలికి అప్పగిస్తూ కేంద్రం బుధవారం ఆర్డినెన్స్ జారీచేసింది. ఆ వెంటనే ఆర్డినెన్స్‌కు రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. ఎంసీఐని రద్దు చేసి దాని స్థానంలో కొత్త సంస్థను ఏర్పాటుచేసేందుకు ఉద్దేశించిన బిల్లును పార్లమెంటు ఆమోదించేంత వరకు ఎంసీఐ అధికారాలన్నీ ఈ పరిపాలక మండలి వద్ద ఉంటాయి. ఎంసీఐ స్థానంలో జాతీయ వైద్య కమిషన్‌ను ఏర్పాటు చేసేందుకు ఉద్దేశించిన బిల్లు పార్లమెంటులో పెండింగ్‌లో ఉండటం తెలిసిందే. నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్, ఎయిమ్స్–ఢిల్లీ డైరెక్టర్ రణదీప్ గులేరియా, పీజీఐఎంఈఆర్–చండీగఢ్ డైరెక్టర్ జగత్ రామ్, నిమ్హాన్స్–బెంగళూరు డెరెక్టర్ గంగాధర్, నిఖిల్ టాండన్(ఢిల్లీ ఎయిమ్స్)లు పరిపాలక మండలిలో సభ్యులుగా ఉంటారు. -
‘గుడిలో పనిచేసే మహిళలపై లైంగిక వేధింపులు’
సాక్షి, విజయవాడ: బెజవాడ కనకదుర్గ చీర దొంగతనం కేసుకు సంబంధించి సస్పెన్షన్‌కు గురైన మాజీ పాలకమండలి సభ్యురాలు కోడెల సూర్యలత సంచలన ఆరోపణలు చేశారు. దుర్గగుడిలో ఓపీడిఎస్‌కు చెందిన మహిళలపై లైంగిక వేధింపులు జరుగుతున్నాయని ఆమె ఆరోపించారు. పాలక మండలి సభ్యులు వెలగపూడి శంకరబాబు గుడిలో పనిచేసే మహిళలను వేధింపులకు గురిచేస్తున్నారన్నారు. గతంలో బాధిత మహిళలు శంకరబాబుపై ఫిర్యాదు చేసినా చైర్మన్ గౌరంబాబు ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలిపారు. ఫిర్యాదులను గౌరంబాబు పట్టించుకోకపోవడమే కాకుండా శంకరబాబును వెనకేసుకొచ్చేవాడని మండిపడ్డారు. ఆలయంలో అక్రమాలు ఆలయ అభివృద్ది పనుల్లో భాగంగా సీసీ రోడ్, ఘాట్‌రోడ్ టెండర్లలో అక్రమాలు జరిగాయని ఆరోపించారు. చైర్మన్ అక్రమాలను వ్యతిరేకించినందుకే తనపై కక్ష్య కట్టారని పేర్కొన్నారు. చీరల విషయంలో లక్షల అక్రమాలు జరిగాయని, వాటిని ప్రశ్నించినందుకు తనను చీరల దొంగగా చిత్రీకరించారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాథమిక దర్యాప్తు జరపకుండానే తనను తొలిగించారని, తాను ఏ తప్పు చేయలేదని సూర్యలత స్పష్టంచేశారు. -
మొక్కుబడి పాలన
సాక్షి, విజయవాడ : దుర్గగుడికి సుమారు దశాబ్దకాలం తరువాత ఏర్పడిన పాలకమండలి అధి కారం చేపట్టి ఏడాది దాటుతున్నా భక్తులకు కానీ, సిబ్బందికి కానీ ఒరిగిందేమీ లేదు. గత ఏడాది జూన్ 29న పాలకమండలి బాధ్యతలు స్వీకరిం చింది. ఈ ఏడాది కాలంలో అధికారులతో వివా దాలు పెట్టుకోవడం మినహా చెప్పుకోదగిన నిర్ణయాలు ఏవీ పాలకమండలి తీసుకోలేకపోయింది. భక్తులకు ఉపయోగపడే నిర్ణయాలు నిల్ ఏడాదిలో భక్తులకు ఉపయోగపడే నిర్ణయాలు ఒక్కటి కూడా తీసుకోలేకపోయింది. పెంచిన టిక్కెట్ల ధర తగ్గించడం కానీ, దూరప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు రాత్రిళ్లు బస చేసేందుకు కాటేజ్‌లు నిర్మించడం కాని, అమ్మవారి ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా కాపాడం కాని చేయలేకపోయింది. దసరా, భవానీదీక్షలకు చేసే తాత్కాలిక ఏర్పాట్లను పర్మినెంట్ ఏర్పాట్లుగా మార్చి దేవస్థానం ఖర్చులు తగ్గేటట్లు చేయలేకపోయారు. తమకు ఉన్న పరిచయాలు ఉపయోగించుకుని దేవస్థానం ఆదాయం పెంచలేదు. ఇక పాలమండలి సభ్యులు ప్రభుత్వంలో తమకు ఉన్న పరపతిని ఉపయోగించి దేవస్థానానికి రావాల్సిన నిధులను ప్రభుత్వం నుంచి రాబట్టలేకపోయారు. కనీసం దసరా ఉత్సవాలకు అయ్యే వ్యయాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి రాబట్టలేకపోయారు. గతంలో కాంగ్రెస్ హయాంలో ఏర్పడిన పాలకమండలి సిబ్బంది అవినీతిని ఆధారాలతో సహా బయటపెట్టేవారు. ప్రస్తుత పాలకమండలి అది కూడా చేయలేకపోయిందనే విమర్శలు ఉన్నాయి. అధికారులతో గొడవ..క్షురకుల సమస్య పరిష్కారం నిల్ పాలకమండలి ఏడాది కాలంలో అధికారులతో గొడవ పడటం మినహా సాధించింది ఏమీ లేదు. గత ఈఓ ఎ.సూర్యకుమారితో ఢీ అంటే ఢీ అన్నారు. తాంత్రిక పూజలు దేవస్థానంలో జరగకుండా అడ్డుకోలేకపోయారు. పూజలు అయిపోయిన తరువాత పాలకమండలి ఈఓ పై మీడియాలో విరచుకుపడటంతో రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ట మంటగలిసింది. మరో వైపు దేవస్థానం క్షురకుడిపై పాలకమండలి సభ్యుడు పెంచలయ్య దాడిచేయడం చిలికిచిలికి గాలివానగా మారింది. తమకు జీతాలు ఇవ్వాలంటూ క్షురకులు రోడ్డెక్కగా చివరికి ముఖ్యమంత్రి చంద్రబాబు వారిపై వీరంగం వేయడంతో దేవాలయ పాలకమండలితో పాటు రాష్ట్రప్రభుత్వ ప్రతిష్ట మంటగలిసింది. ముఖ్యమంత్రి ఆగ్రహం ఈఓ సూర్యకుమారిపై పాలకమండలి సభ్యులు ఇష్టానుసారంగా మాట్లాడటంపై ముఖ్యమంత్రి చంద్రబాబు సభ్యు›లపై ఆగ్రహం వ్యక్తంచేశారు. దీంతో ప్రస్తుతం అధికారులకు ఎదురు చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో తూతూమంత్రంగా పాలకమండలి సమావేశాలు ముగుస్తున్నాయి. దసరాకు రూ. 32 లక్షలతో దేవాలయానికి రంగులు వేయాలని, దుర్గగుడిలో వేర్వేరు ప్రాంతాల్లో రూ.10 లక్షలతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, రికార్డింగ్ స్టోరేజీకి మరో రూ.8 లక్షలు వెచ్చించాలని, దేవాలయంలో అగ్నిమాపక సామగ్రి ఏర్పాటుకు రూ.36 లక్షలు ఖర్చు చేయాలనే తాత్కాలిక నిర్ణయాలు మాత్రమే తీసుకున్నారు. -
7 మార్కెట్ కమిటీలకు పాలకమండళ్లు
హైదరాబాద్: తెలంగాణలోని ఏడు వ్యవసాయ మార్కెట్ కమిటీలకు పాలక మండళ్లను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. 169 వ్యవసాయ మార్కెట్ కమిటీలకు గాను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు 101 కమిటీలకు పాలక మండళ్లను నామినేట్ చేయగా.. తాజాగా మరో ఏడు కమిటీలకు పాలక మండళ్లను ఖరారు చేశారు. కరీంనగర్ జిల్లా వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్‌గా పూడూరి మణెమ్మ, వైస్ ఛైర్మన్‌గా కట్ల శంకర్, మల్యాల మార్కెట్ కమిటీ ఛైర్మన్‌గా చింతపంటి లక్ష్మి, వైస్ ఛైర్మన్‌గా బోయినపల్లి మధుసూధన్‌రావు నియమితులయ్యారు. వరంగల్ జిల్లా స్టేషన్ ఘణపూర్ మార్కెట్ కమిటీ ఛైర్మన్‌గా అన్నం బ్రహ్మారెడ్డి, వైస్ ఛైర్మన్‌గా భూక్యా రమేశ్ నాయక్, ఆదిలాబాద్ జిల్లా కాగజ్‌నగర్ కమిటీ ఛైర్మన్‌గా నర్సింగోజు పద్మ, వైస్ ఛైర్మన్‌గా కంబగేని సతీష్‌గౌడ్‌ను నామినేట్ చేశారు. మహబూబ్‌నగర్ జిల్లా నాగర్‌కర్నూలు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్‌గా నల్లగంటి వెంకటయ్య, వైస్‌ఛైర్మన్‌గా గంగనమోని కుమరయ్య, నల్గొండ జిల్లా కోదాడ మార్కెట్ కమిటీ ఛైర్మన్‌గా కె.శశిధర్‌రెడ్డి, వైస్ ఛైర్మన్‌గా మట్టపల్లి శ్రీనివాస్ గౌడ్‌ను నియమించారు. ఖమ్మం జిల్లా ఇల్లందు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్‌గా భూక్యా నాగేశ్వర్రావు, వైస్ ఛైర్మన్‌గా తాటి భిక్షంను నామినేట్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. -
పదోన్నతులకు పాలకమండలి ఆమోదం
ఎస్కేయూ : శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో కెరీర్ అడ్వాన్స్ స్కీం కింద పలువురికి అసోసియేట్, ప్రొఫెసర్ పదోన్నతులకు ఎట్టకేలకు పాలకమండలి ఆమోదం లభించింది. ఎస్కేయూ పాలకమండలి సమావేశం బుధవారం ఎస్కేయూ వీసీ ఆచార్య కే.రాజగోపాల్ అధ్యక్షతన హైదరాబాద్‌లో జరిగింది. సుదీర్ఘంగా జరిగిన సమావేశంలో పలు అంశాలపై కీలక చర్చ జరిగింది. ఎజెండాలో చేర్చిన అంశాలపై జరిగిన చర్చలో అభిప్రాయభేదాలు తలెత్తాయి. ప్రైవేటు సెక్యూరిటీ గార్డుల నియామకం, దూరవిద్య విభాగంలో నిబంధనలకు విరుద్ధంగా అధ్యయన కేంద్రాల మంజూరు, టెండర్లు లేకుండా నామినేషన్ పద్దతిలో అభివృద్ధిపనులు వంటి అంశాలపై వాడీవేడి చర్చ జరిగినట్లు తెలిసింది. పత్రికల్లో వచ్చిన కథనాలపై కూడా సమగ్రంగా విశ్లేషణ జరిగినట్లు సమాచారం. సాక్షిలో ఈ అంశాలన్నింటిపై అనేక కథనాలు వచ్చాయి. వీటిన్నింటిపై పాలకమండలి సమావేశంలో సమీక్ష నిర్వహించారు. సమావేశంలో రెక్టార్ ఆచార్య జి. శ్రీధర్ , రిజిస్ట్రార్ ఆచార్య వెంకటరమణ, పాలకమండలి సభ్యులు ఆచార్య ఏ. మల్లిఖార్జున రెడ్డి, ఆచార్య ఫణీశ్వరరాజు, నాగజ్యోతిర్మయి, విజయారావు, ఆచార్య సుధాకర్ బాబు, ఎం. రామయ్య, ప్రిన్సిపల్ సెక్రెటరీ సుమిత్రా దావ్రా, ఫైనాన్స్ అదనపు సెక్రెటరీ సుబ్రమణ్యం పాల్గొన్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు పాలకమండలిలో చర్చించిన అంశాలిలా ఉన్నాయి. ∙ఇంజనీరింగ్, ఫార్మసీ , బీఈడీ కళాశాలలో అడ్హాక్ కాంట్రాక్టు బేసిక్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసోసియేట్, ప్రొఫెసర్ ఉద్యోగాల భర్తీకి సమగ్రంగా చర్చించిన అనంతరం కమిటీ వేసిన తరువాత ఎంత మంది అవసరం అవుతారో వారిని భర్తీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ∙8 అసిస్టెంట్, 21 అసిస్టెంట్ ప్రొఫెసర్లకు రీవైజ్డ్ పేస్కేలు, అరియర్స్ ఇవ్వాలనే ప్రతిపాదనకు హైకోర్టులో ఉన్న కేసులు సాకుగా చూపించి తిరస్కరించారు. ∙డాక్టర్ నరేంద్ర మద్దు అమెరికాకు వెళ్లడానికి రామన్ ఫెలోషిప్ ప్రాజెక్టుకు వెళ్లడానికి అనుమతి నిరాకరణ. ∙ప్రైవేటు సెక్యూరిటీ గార్డుల ఏజెన్సీ ఏడాది సమయం పూర్తయిన వెంటనే ఈ– ప్రొక్యూర్మెంట్ ద్వారా టెండర్లు అప్పగించాలని నిర్ణయం. ∙దూరవిద్య విభాగంలో నూతనంగా డెబ్ (డిస్టెన్స్ ఎడ్యుకేషన్ బ్యూరో) నిబంధనలకు విరుద్ధంగా జారీ చేసిన నూతన అధ్యయన కేంద్రాల రద్దు చేస్తున్నట్లు వర్సిటీ ఉన్నతాధికారులు సమావేశంలో పేర్కొన్నారు. -
బాధ్యతగా పనిచేయండి
ఉపాధ్యాయులు విధులకు సక్రమంగా హాజరుకావాలి వైద్యులు లేని పీహెచ్‌సీలు ఉండకూడదు నిరుపేదలకు రుణాలు ఇవ్వకుంటే చర్యలు తప్పవు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి వాడీవేడీగా ఐటీడీఏ 58వ పాలకమండలి సమావేశం ఏటూరునాగారం : ‘‘ఏజెన్సీ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు మీటింగుల పేరిట ఐటీడీఏ చుట్టూ తిరుగుతూ బాతాకానీలు కొట్టొద్దు.. విధులకు సక్రమంగా హాజరై గిరిజన విద్యార్థుల కు మెరుగైన బోధనలు అందించాలి.. లేకుంటే కఠిన చర్యలు తీసుకుంటాం’’ అని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి హెచ్చరించారు. కలెక్టర్, ఐటీడీఏ చైర్మన్ వాకాటి కరుణ అధ్యక్షతన బుధవారం మండల కేంద్రంలో గిరిజనాభివృద్ధి సంస్థ 58 పాలకమండలి సమావేశం వాడీవేడీగా జరిగింది. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం శ్రీహరి విద్యా, వైద్యం పనితీరుపై సుదీర్ఘంగా ప్రసంగించారు. ఏజెన్సీలో బడిబాటలో చేపట్టిన విద్యార్థుల ఎన్రోల్మెంట్ వివరాలు చెప్పాలని డీఈఓ రాజీవ్, డీడీ పోచంను కోరగా... వారు ఎలాంటి సమాధానం చెప్పలేదు. సమగ్రమైన సమాచారం లేకుండా సమావేశానికి ఎందుకు వస్తారని ఆయన వారిపై మండిపడ్డారు. అనంత రం డిప్యూటీ సీఎం మాట్లాడుతూ ఉపాధ్యాయులు, అధికారులు బాధ్యతగా పనిచేసి ఐటీడీఏ లక్ష్యాన్ని నెరవేర్చాలని ఆదేశించారు. కాగా, సమావేశంలో విద్య, వైద్యం, ఆర్ఓఎఫ్ ఆర్, హరితహారం, ఇంజినీరింగ్, ఈఎస్ఎస్ రుణాలపై డిప్యూటీ సీఎం శ్రీహరి, గిరిజన సంక్షేమశాఖ మంత్రి అజ్మీరా చందూలాల్, ఎంపీలు పసునూరి దయాకర్, అజ్మీరా సీతారాంనాయక్, ఎమ్మెల్యేలు రెడ్యానాయక్, బానోతు శంకర్‌నాయక్‌తోపాటు జెడ్పీ చైర్పర్సన్ జి. పద్మ చర్చించారు. హరితహారంతో పచ్చదనాన్ని నింపాలి.. హరితహారం పథకంతో ఏజెన్సీలోని పల్లెలను పచ్చదనంతో నింపాలని కలెక్టర్ కరుణ సభ్యులను కోరారు. ఈ ఏడాది జిల్లాలో 3.50 కోట్లతో మొక్కలు నాటేందుకు ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. లక్నవరం, మేడారం ప్రాంతాల్లో లక్ష మొక్కలు నాటుతున్నామని, వరంగల్ స్మృతివనానికి ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. డిప్యూటీ సీఎం శ్రీహరి మాట్లాడు తూ ప్రభుత్వం ఈ ఏడాది జిల్లాలోని ప్రతి ఒక్కరికి పండ్ల మొక్కలను ఉచితంగా అందజేస్తుందన్నారు. 2005 లోపు పోడు భూమిలో సాగు చేసుకుంటున్న రైతుల జోలికి ఎవ రూ వెళ్లవద్దని, 2005 తర్వాత పోడు చేసిన బడావ్యక్తులు, ఉద్యోగుల నుంచి భూముల ను స్వాధీనం చేసుకోవాలని డిప్యూటీ సీఎం డీఎఫ్ఓ కిషన్‌ను ఆదేశించారు. కాగా, మం త్రి చందూలాల్ మాట్లాడుతూ కొత్తగూడలో డీఎఫ్ఓ కిషన్ ఆగడాలు రోజురోజుకు మితి మీరిపోతున్నాయని ఆరోపించారు. దీనిపై డీఎఫ్ఓ కిషన్ మాట్లాడుతూ 2012-16లో 52 వేల హెక్టార్లలో పోడు నరికివేతకు గురైందన్నారు. సర్వాపురంలో 200, కామారం, పూనుగొండ్లలో 100 హెక్టార్ల అడవి పోడుకు గురైందని వివరించారు. అనంతరం డిప్యూటీ సీఎం మా ట్లాడుతూ జాయింట్ టీం ఏర్పాటు చేసి సమస్యాత్మకమైన మండలాల్లో పర్యటించి పోడు ఎందుకు జరుగుతుందనే విషయాన్ని తెలుసుకుని పరిష్కరిం చాలని ఆదేశించారు. కాగా, 2013-14లో మంజూరైన పోస్టుమెట్రిక్ హాస్టళ్ల నిర్మాణానికి సంబంధించిన స్థలాల ఎంపిక ఇప్పటి వరకు పూర్తి కాకపోవడంపై డిప్యూటీ సీఎం.. ఈఈ కోటిరెడ్డిపై మండిపడ్డారు. ఇదిలా ఉండగా, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు ప్రభుత్వం సబ్సిడీ రుణాలు మంజూరు చేస్తుంటే బ్యాంకు అధికారులు ఎందుకు ఇవ్వ డం లేదని డిప్యూటీ సీఎం.. ఎల్డీ బ్యాంకు మేనేజర్‌ను ప్రశ్నించారు. కాగా, తాడ్వాయి మండలంలోని కాటాంంలో ఉండాల్సిన బ్యాంకును పస్రాలో ఎందుకు ఏర్పాటు చేశార ని గిరిజన సంక్షేమశాఖ మంత్రి చందూలాల్ .. మేనేజర్‌ను ప్రశ్నించారు. ఈఎస్ఎస్ రుణాలు 1736 మందికి రూ. 12.74 కోట్లు ఇచ్చామని చెప్పడం తప్పా.. అవి ఇంతవరకు గ్రౌండింగ్ కాలేదని ఎమ్మెల్యే రెడ్యా నాయక్ సభ దృష్టికి తీసుకొచ్చారు. రుణాలు గ్రౌండింగ్ చేసే సమయంలో స్థానిక ఎమ్మెల్యేలను భాగస్వాములు చేయాలని డిప్యూటీ సీఎం.. కలెక్టర్‌ను ఆదేశించారు. ఏజెన్సీలోని విద్య, వైద్యంపై సమగ్ర సమీక్ష చేసేందుకు మరో మూడు నెలల్లో సమావేశం ఏర్పాటు చేయాలని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అధికారులకు సూచించారు. ఇదిలా ఉండగా, సమావేశం ప్రారంభంలో జెడ్పీ ఫ్లోర్‌లీడర్ సకినాల శోభన్, స్థానిక జెడ్పీటీసీలు మాట్లాడుతూ ములుగు నియోజకవర్గాన్ని సమ్మ క్క, సారలమ్మ పేరిట జిల్లాగా ఏర్పాటు చేయాలని కోరారు. సమావేశంలో ఐడీటీఏ పీఓ అమయ్‌కుమార్, ఆర్డీఓ మహేందర్‌జీ, ఎంపీపీలు, జెడ్పీటీసీ సభ్యులు, వివిధశాఖల అధికారులు పాల్గొన్నారు. అక్రమాలు జరిగిన పనులకు ఆమోదం..! ఐటీడీఏలోని వివిధ గ్రాంట్ల ద్వారా చేపట్టిన అభివృద్ధి పనుల్లో అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు వచ్చినా వాటిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై గిరిజన సంఘాల నాయకులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. కా గా, ఇలాంటి పనులకు వ్యయం చేసినట్లు పాలకమండ లి సమావేశంలో సభ్యులు ఆమోదం తెలుపడం దారు ణమని వారు వాపోయారు. ఐటీడీఏ సబ్‌ప్లాన్ పరిధిలోని మండలాల్లో ఉపాధిహామీలో వందల కోట్లతో మెటల్‌రోడ్లు నిర్మించారు. ఇవి పూర్తిగా నాసిరంగా ఉన్నాయని ఆయా గ్రామాల ప్రజలు అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ వాటిపై ఎలాంటి విచారణ చేపట్టలేదు. ఏజెన్సీ అభివృద్ధి పనుల్లో చోటుచేసుకున్న అవినీతిపై ఎలాంటి చర్చ లేకుండా సమావేశం ముగించడం గమనార్హం. చర్చకు రాని అంశాలు.. మత్స్య, పట్టుపరిశ్రమ, ఎన్ఆర్జీఎస్, వ్యవసాయ, ఉద్యానవనశాఖలపై మంత్రులు, సభ్యులు చర్చించలేదు. గిరిజనుల అభివృద్ధి కోసం నెలకొల్పిన ఐటీడీఏ ద్వారా పై శాఖలను రూపొందించి వాటిద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా లబ్ధి చేకూర్చాలి. అయితే కొన్ని సం వత్సరాలుగా వాటి నిర్వహణను ఎవరూ పట్టించుకోకపోవడంతో శాఖలు పూర్తిగా నిర్వీర్యమవుతున్నాయని గిరిజన సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. -
‘మేయర్’ ఎన్నిక ఏర్పాట్లు చకచకా..
కౌన్సిల్ హాలు ముస్తాబు తొలుత కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారం ఎక్స్‌అఫీషియోలకు విప్ లేదు... సిటీబ్యూరో: జీహెచ్ఎంసీ కొత్త పాలకమండలి ప్రమాణ స్వీకారం, మేయర్ ఎన్నిక గురువారం జరుగనుండటంతో ఆ కార్యక్రమాల వేదిక అయిన జీహెచ్ఎంసీలోని కౌన్సిల్ హాల్‌ను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. గత పాలకమండలి సర్వసభ్యసమావేశాలన్నీ ఈ కౌన్సిల్హాల్లోనే జరిగాయి. గతంలో మేయర్, డిప్యూటీ మేయర్ల ఎన్నికలు జూబ్లీహాల్లో జరిగినప్పటికీ, ప్రస్తుతం ఆ ఎన్నికలు సైతం జీహెచ్ఎంసీ కౌన్సిల్హాల్లోనే నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్నికలో పాల్గొనే 217 మంది ఓటర్లకు సరిపడా కుర్చీలు అందుబాటులో ఉంచడంతోపాటు వాటికి నగిషీలు చెక్కుతున్నారు. అవసరమైన చోట రంగులు వేస్తున్నారు. కౌన్సిల్ సభ్యులందరికీ ప్రిసైడింగ్ అధికారి, తదితరుల మాటలు స్పష్టంగా వినపడేందుకు, కార్పొరేటర్ల ప్రమాణ కార్యక్రం.. ఎన్నికయ్యాక మేయర్, డిప్యూటీమేయర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమం సవ్యంగా సాగేందుకు మైకులు, లైట్లు, ఏసీలు తదితరమైనవి సవ్యంగా ఉన్నదీ లేనిదీ పరిశీలించారు. సభాధ్యక్షస్థానంలో మేయర్ కుర్చీని ఘనంగా తీర్చిదిద్దారు. పైఅంతస్తులోని విలేకరుల గ్యాలరీ, తదితర ప్రదేశాల్లోనూ లోటుపాట్లు లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. టీవీల ద్వారా ప్రత్యక్షప్రసారానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అవసరమైన చర్యలు చేపడుతున్నారు. ఎలక్ట్రానిక్ మీడియా కోసం పన్వర్‌హాల్‌లో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఎక్స్ అఫీషియోలకు విప్ లేదు.. జీహెచ్ఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో ఎవరికి ఓటు వేయాలో నిర్దేశిస్తూ గుర్తింపు పొందిన రాజకీయపార్టీలు తమ సభ్యులకు విప్ జారీ చేసే అధికారం ఉన్నా అది ఎక్స్అఫీషియో సభ్యులకు వర్తించదు. కేవలం ఎన్నికైన కార్పొరేటర్లకు మాత్రమే విప్ వర్తిస్తుందని జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్(ఎన్నికలు) కె.సురేంద్రమోహన్ స్పష్టం చేశారు. మేయర్‌ను ఎన్నుకునేందుకు ఓటర్లయిన కార్పొరేటర్లతోపాటు ఎక్స్అఫీషియో సభ్యులుగా ఉన్న రాజ్యసభ సభ్యులు, లోక్‌సభ సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సైతం వారి పార్టీలు జారీ చేసే విప్‌లు వర్తిస్తాయని ఇప్పటి వరకు భావించారు. టీడీపీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లో చేరినప్పటికీ, జీహెచ్ఎంసీ రికార్డుల మేరకు వారు టీడీపీ సభ్యులుగానే ఉన్నారు. వారిలో మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో విప్ అంశం ప్రస్తావనకొచ్చింది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రజలచే ఎన్నికైన కార్పొరేటర్లకు మాత్రమే విప్ వర్తిస్తుందని స్పష్టం చేశారు. పెరుగుతున్న టీఆర్ఎస్ బలం సోమవారం వరకు ఎక్స్‌అఫీషియోలతో కలుపుకొని మేయర్‌ను ఎన్నుకునేందుకు టీఆర్ఎస్కున్న బలం 133 కాగా, తాజాగా కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానందగౌడ్ టీడీపీ నుంచి టీఆర్ఎస్లో చేరడంతో ఆ బలం 134కు పెరిగింది. ఆమేరకు టీడీపీ బలం తగ్గింది. టీఆర్ఎస్కు తమ అభ్యర్థిని మేయర్‌గా గెలిపించుకునేందుకు స్పష్టమైన మెజారిటీ బహిరంగంగా కనిపిస్తున్నప్పటికీ, ఆపార్టీలో చేరుతున్నవారితో ఇది మరింత పెరుగుతోంది. -
ఒక వర్గానికే పెద్దపీట
ఎస్వీయూ పాలకమండలిలో సామాజిక అసమతుల్యం మైనారిటీ, మహిళలకు దక్కని చోటు బీసీలకు తగ్గిన {పాధాన్యం యూనివర్సిటీక్యాంపస్: ఎస్వీ యూనివర్సిటీకి బుధవారం ప్రకటించిన పాలకమండలిలో సామాజిక అసమతుల్యత నెలకొంది. ఎస్వీయూకు పాలకమండలిని నియమిస్తూ బుధవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. సీఎం తన సొంత సామాజిక వర్గానికే పెద్దపీట వేశారన్న విమర్శలు వెల్లువెత్తుతు న్నాయి. పాలకమండలిలో నియమితులైన తొమ్మిది మందిలో నలుగురు సీఎం సొంత సామాజిక వర్గానికి చెందినవారు కావడం గమనార్హం. అంతేగాకుండా మహిళలకు మొండిచేయి చూపించారు. ఒక్క మహిళకు కూడా అవకాశం కల్పిం చలేదు. అలాగే మైనారిటీలకు అవకాశం కల్పించలేదు. పాలకమండలిలో గల్లా రామచంద్రనాయుడు, గురుప్రసాద్, హరి, అరుణ(పురుషుడు), బాల సిద్ధముని, జీవీ ప్రసాద్, అబ్బయ్య, చంద్ర య్య, బాబుకు చోటు దక్కింది. వీరిలో నలుగురు సీఎం సొంత సామాజిక వర్గానికి చెందినవారు కాగా రెడ్డి, బీసీ, కాపు, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలకు చెందిన వారు ఒక్కొక్కరి వంతున ఉన్నారు. మహిళలకు ప్రాతినిథ్యం లేకపోవడం విమర్శలకు తావిస్తోంది. మహిళలకు అన్యాయం ఎస్వీయూ పాలకమండలిలో మహిళలకు, మైనారిటీలకు అవకాశం కల్పించకపోవడం దారుణం. రాష్ట్ర జనాభాలో 50 శాతం ఉన్న బీసీలకు కేవలం ఒకరికి మాత్రమే పదవి ఇచ్చారు. అలాగే మహిళలకు ఇవ్వకపోవడంతో మహిళా సాధికారితకు అర్థం లేకుండాపోయింది. ఎస్వీయూలో రిజిస్ట్రార్, సెక్యూరిటీ ఆఫీసర్, సెక్యూరిటీ నిర్వహిస్తున్న ఔట్సోర్సింగ్ సంస్థ నిర్వాహకులు, ఇతర ముఖ్య పదవుల్లో సీఎం సొంత సామాజిక వర్గానికి చెందినవారే ఉన్నారు. ఎస్వీయూ పాలకమండలిని రద్దు చేసి మహిళలకు, మైనారిటీలకు అవకాశం కల్పించాలి. - వి.హరిప్రసాద్‌రెడ్డి, వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు -
ఎస్కేయూలో పచ్చ నియామకం
సాక్షి ప్రతినిధి, అనంతపురం : అధికార పార్టీ నేతల అభీష్టాలను నెరవేర్చేందుకు జిల్లాలో అధికారులు ‘రాజును మించిన రాజభక్తి’ చూపుతున్నారు. ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ శ్రేణులను దెబ్బ తీస్తూ.. తెలుగు తమ్ముళ్లను అందలం ఎక్కించే ప్రక్రియ జిల్లాలో స్టోర్ డీలర్ల నుంచి యూనివర్సిటీ న్యాయవాదుల నియామకం వరకూ అడ్డూ అదుపూ లేకుండా సాగుతోంది. అధికార పార్టీ నేతలు చెప్పిందే తడవు.. చట్టాలు, విధి విధానాలు, నియమ నిబంధనలు.. వేటీనీ ఖాతరు చేయకుండా అధికార గణం తమ రాజభక్తిని చాటుకుంటోందనేందుకు ఇటీవల శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీలో జరిగిన ‘స్టాండింగ్ కౌన్సిల్’ నియామకం ప్రత్యక్ష నిదర్శనం. వివరాల్లోకి వెళితే.. యూనివర్సిటీ తరఫున వచ్చే న్యాయ వివాదాలను హైకోర్టులో వాదించేందుకు జే.ఉగ్రనరసింహను స్టాండింగ్ కౌన్సిల్‌గా గత ప్రభుత్వం నియమించింది. ఈయన కాల పరిమితి మూడేళ్లు. ఈ గడువు ముగియగానే తదుపరి ప్రభుత్వ ఉత్తర్వులు ఇచ్చేవరకూ ఉగ్రనరసింహనే స్టాండింగ్ కౌన్సిల్‌గా కొనసాగాలని యూనివర్సిటీ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడంతో ఆ పార్టీ నేతల కన్ను ఈ పోస్టుపై పడింది. గత ప్రభుత్వ హయాంలో నియమితమైన ఉగ్రనరసింహను తొలగించి ఆ స్థానంలో గతంలో చంద్రబాబు హయాంలో (1998-2005) యూనివర్సిటీ స్టాండింగ్ కౌన్సిల్‌గా వ్యవహరించిన పి.శ్రీరాములు నాయుడును తీసుకొచ్చే ప్రయత్నాలు మొదలయ్యాయి. అధికార పార్టీ నేతల అభీష్టాన్ని నెరవేర్చే పనిలో యూనివర్సిటీ అధికారులు తమ పరిధికి మించి వ్యవహరించారు. ఉగ్రనరసింహను తొలగిస్తూ, ఆ స్థానంలో శ్రీరాములు నాయుడిని నియమిస్తూ రిజిస్ట్రారే ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వుల్లో ఉగ్రనరసింహం యూనివర్సిటీ కేసులను సరిగా వాదించడం లేదని, ఇతని ఉదాసీనత కారణంగా పలు కేసులు పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొన్నారు. ఈ కారణాల రీత్యా ఇతని స్థానంలో శ్రీరాములు నాయుడును నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసి ఆ ప్రతిని హైకోర్టు రిజిస్ట్రార్‌కు, అడ్వకేట్ జనరల్‌కు పంపారు. అడ్వకేట్ జనరల్ ఘాటు లేఖ.. యూనివర్సిటీ అధికారుల నిర్వాకంపై రాష్ట్ర అడ్వకేట్ జనరల్ తీవ్రంగా స్పందిస్తూ ఘాటుగా లేఖ రాశారు. జీవో ఆర్టీ నెం 168 ప్రకారం యూనివర్సిటీలతో సహా ఇతర రాష్ట్ర ప్రభుత్వ సంస్థలకు స్టాండింగ్ కౌన్సిల్ నియామకాలు చేపట్టే అధికారం ఉండదని, అడ్వకేట్ జనరల్ సిఫారసు మేరకు ప్రభుత్వం మాత్రమే వీరి నియామకపు ఉత్తర్వులు జారీ చేస్తుందని ఆ లేఖలో అడ్వకేట్ జనరల్ యూనివర్సిటీ రిజిస్ట్రార్‌కు స్పష్టం చేశారు. పరిధి మీరి స్టాండింగ్ కౌన్సిల్‌గా వేరే వారిని నియమించిన ఉత్తర్వులను వెంటనే ఉపసంహరించుకోవాలని.. లేకపోతే ఈ మొత్తం వ్యవహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సి ఉంటుందని పేర్కొన్నారు. అధికారులకు లీగల్ నోటీసు .. తనపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఇప్పటిదాకా స్టాండింగ్ కౌన్సిల్‌గా ఉన్న ఉగ్రనరసింహ యూనివర్సిటీ అధికారులకు లీగల్ నోటీసు పంపారు. యూనివర్సిటీ కేసులు వాదించడంలో అలసత్వం వహిస్తున్నట్లు తనపై నిరాధార ఆరోపణలు చేశారని, వాటిని వెంటనే ఉపసంహరించుకోవాలని ఆయన నోటీసులో పేర్కొన్నారు. దిద్దుబాటు చర్యలు .. తమ ఇష్టానుసారం స్టాండింగ్ కౌన్సిల్‌ను నియమించుకోవాలనుకున్న యూనివర్సిటీ అధికారుల ప్రయత్నాలు బెడిసి కొట్టడంతో ప్రస్తుతం దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ కే.దశరథరామయ్యను ‘సాక్షి’ సంప్రదించగా.. సమస్య పరిష్కారమయ్యే దశలో ఇప్పుడీ వార్త ప్రచురించడం ఎందుకంటూ సలహా ఇచ్చారు. ఉగ్రనరసింహం పదవీ కాలం 2013 నవంబర్‌లో ముగిసిందని, అప్పుడు పదవీ కాలం పొడిగింపు ఉత్తర్వులు యూనివర్సిటీనే ఇచ్చిందన్నారు. తామిచ్చిన పదవీ పొడగింపు ఉత్తర్వులు చెల్లుబాటు అవుతున్నప్పుడు ఆయనను తొలగించే అధికారం తమకు ఎందుకుండదంటూ.. తన చర్యను సమర్థించుకున్నారు.