ఎస్వీయూ పాలకమండలిలో సామాజిక అసమతుల్యం
మైనారిటీ, మహిళలకు దక్కని చోటు
బీసీలకు తగ్గిన {పాధాన్యం
యూనివర్సిటీక్యాంపస్: ఎస్వీ యూనివర్సిటీకి బుధవారం ప్రకటించిన పాలకమండలిలో సామాజిక అసమతుల్యత నెలకొంది. ఎస్వీయూకు పాలకమండలిని నియమిస్తూ బుధవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. సీఎం తన సొంత సామాజిక వర్గానికే పెద్దపీట వేశారన్న విమర్శలు వెల్లువెత్తుతు న్నాయి. పాలకమండలిలో నియమితులైన తొమ్మిది మందిలో నలుగురు సీఎం సొంత సామాజిక వర్గానికి చెందినవారు కావడం గమనార్హం. అంతేగాకుండా మహిళలకు మొండిచేయి చూపించారు. ఒక్క మహిళకు కూడా అవకాశం కల్పిం చలేదు. అలాగే మైనారిటీలకు అవకాశం కల్పించలేదు. పాలకమండలిలో గల్లా రామచంద్రనాయుడు, గురుప్రసాద్, హరి, అరుణ(పురుషుడు), బాల సిద్ధముని, జీవీ ప్రసాద్, అబ్బయ్య, చంద్ర య్య, బాబుకు చోటు దక్కింది. వీరిలో నలుగురు సీఎం సొంత సామాజిక వర్గానికి చెందినవారు కాగా రెడ్డి, బీసీ, కాపు, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలకు చెందిన వారు ఒక్కొక్కరి వంతున ఉన్నారు. మహిళలకు ప్రాతినిథ్యం లేకపోవడం విమర్శలకు తావిస్తోంది.
మహిళలకు అన్యాయం
ఎస్వీయూ పాలకమండలిలో మహిళలకు, మైనారిటీలకు అవకాశం కల్పించకపోవడం దారుణం. రాష్ట్ర జనాభాలో 50 శాతం ఉన్న బీసీలకు కేవలం ఒకరికి మాత్రమే పదవి ఇచ్చారు. అలాగే మహిళలకు ఇవ్వకపోవడంతో మహిళా సాధికారితకు అర్థం లేకుండాపోయింది. ఎస్వీయూలో రిజిస్ట్రార్, సెక్యూరిటీ ఆఫీసర్, సెక్యూరిటీ నిర్వహిస్తున్న ఔట్‌సోర్సింగ్ సంస్థ నిర్వాహకులు, ఇతర ముఖ్య పదవుల్లో సీఎం సొంత సామాజిక వర్గానికి చెందినవారే ఉన్నారు. ఎస్వీయూ పాలకమండలిని రద్దు చేసి మహిళలకు, మైనారిటీలకు అవకాశం కల్పించాలి. - వి.హరిప్రసాద్‌రెడ్డి, వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు
ఒక వర్గానికే పెద్దపీట
Published Fri, Feb 5 2016 2:26 AM | Last Updated on Mon, Oct 22 2018 7:27 PM
Advertisement