Su University
-
పీజీ సెట్ కౌన్సెలింగ్ ప్రారంభం
వెబ్‌కౌన్సెలింగ్ ద్వారా సర్టిఫికెట్ల పరిశీలన 11 నుంచి వెబ్ ఆప్షన్సు ఇచ్చుకునే అవకాశం షెడ్యూల్లో మార్పు యూనివర్సిటీ క్యాంపస్: ఎస్వీయూనివర్సిటీ పీజీ కోర్సుల్లో ప్రవేశానికి వెబ్‌కౌన్సెలింగ్ గురువారం ప్రారంభమైంది. డెరైక్టరేట్ అడ్మిషన్స్ కార్యాలయంలో ఈ ప్రక్రియ గురువారం ఉదయం నుంచి రాత్రి 9 గంటల వరకు కొనసాగింది. తొలిసారిగా పీజీ కోర్సుల్లో ప్రవేశానికి ఎస్వీయూ అధికారులు వెబ్ కౌన్సెలింగ్‌కు శ్రీకారం చుట్టారు. తొలిరోజు గురువారం ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఎలక్ట్రానిక్స్ సబ్జెక్టులకు కౌన్సెలింగ్ నిర్వహించారు. కెమిస్ట్రీలో ఒకటి నుంచి 1046 ర్యాంక్ వరకు, ఫిజిక్స్‌లో 1 నుంచి 608 వరకు, ఎలక్ట్రానిక్స్‌లో ఒకటి నుంచి 136వ ర్యాంక్ వరకు కౌన్సెలింగ్ నిర్వహించారు. హాజరైన విద్యార్థుల సర్టిఫికెట్లను పరిశీలించి వారికి స్క్రాచ్‌కార్డులు ఇచ్చారు. వారు శుక్రవారం నుంచి వెబ్సైట్లో లాగిన్ అయ్యి వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవచ్చు. వెబ్ ఆప్షన్స్ ఆధారంగా ఈనెల 16 లేదా 17 తేదీల్లో సీట్లను కేటాయిస్తారు. శుక్రవారం కామర్స్ విభాగంలో ఒకటినుంచి 1200వ ర్యాంక్ వరకు కౌన్సెలింగ్ జరగనుంది. షెడ్యూల్లో మార్పు రువారం ప్రారంభం అయిన పీజీ కౌన్సెలింగ్‌కు అభ్యర్థుల తాకిడి ఎక్కువ కావడంతో రాత్రి 9 వరకు కొనసాగుతూనే ఉంది. దీంతో షెడ్యూల్లో మార్పు చేశారు. కామర్స్ 1201 ర్యాంక్ నుంచి 1962 ర్యాంక్ వరకు, కంప్యూటర్ సైన్స్‌లో 1 నుంచి 562 ర్యాంక్ వరకు ఈనెల 14న కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. అలాగే ఇంగ్లీష్‌లో 1 నుంచి 239 ర్యాంక్ వరకు, ఎడ్యుకేషన్‌లో 1 నుంచి 156 వరకు, జనరల్ టెస్ట్ పరీక్షకు సంబంధించి 1 నుంచి 289 ర్యాంక్ వరకు ఈనెల 15న కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. వర్షంతో విద్యార్థులు ఇక్కట్లు ఎస్వీయూలో ప్రారంభం అయిన వెబ్‌కౌన్సెలింగ్ ప్రకియ సందర్భంగా గురువారం సాయంత్రం వర్షం పడడంతో విద్యార్థులు ఇబ్బంది పడ్డారు. -
ఒక వర్గానికే పెద్దపీట
ఎస్వీయూ పాలకమండలిలో సామాజిక అసమతుల్యం మైనారిటీ, మహిళలకు దక్కని చోటు బీసీలకు తగ్గిన {పాధాన్యం యూనివర్సిటీక్యాంపస్: ఎస్వీ యూనివర్సిటీకి బుధవారం ప్రకటించిన పాలకమండలిలో సామాజిక అసమతుల్యత నెలకొంది. ఎస్వీయూకు పాలకమండలిని నియమిస్తూ బుధవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. సీఎం తన సొంత సామాజిక వర్గానికే పెద్దపీట వేశారన్న విమర్శలు వెల్లువెత్తుతు న్నాయి. పాలకమండలిలో నియమితులైన తొమ్మిది మందిలో నలుగురు సీఎం సొంత సామాజిక వర్గానికి చెందినవారు కావడం గమనార్హం. అంతేగాకుండా మహిళలకు మొండిచేయి చూపించారు. ఒక్క మహిళకు కూడా అవకాశం కల్పిం చలేదు. అలాగే మైనారిటీలకు అవకాశం కల్పించలేదు. పాలకమండలిలో గల్లా రామచంద్రనాయుడు, గురుప్రసాద్, హరి, అరుణ(పురుషుడు), బాల సిద్ధముని, జీవీ ప్రసాద్, అబ్బయ్య, చంద్ర య్య, బాబుకు చోటు దక్కింది. వీరిలో నలుగురు సీఎం సొంత సామాజిక వర్గానికి చెందినవారు కాగా రెడ్డి, బీసీ, కాపు, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలకు చెందిన వారు ఒక్కొక్కరి వంతున ఉన్నారు. మహిళలకు ప్రాతినిథ్యం లేకపోవడం విమర్శలకు తావిస్తోంది. మహిళలకు అన్యాయం ఎస్వీయూ పాలకమండలిలో మహిళలకు, మైనారిటీలకు అవకాశం కల్పించకపోవడం దారుణం. రాష్ట్ర జనాభాలో 50 శాతం ఉన్న బీసీలకు కేవలం ఒకరికి మాత్రమే పదవి ఇచ్చారు. అలాగే మహిళలకు ఇవ్వకపోవడంతో మహిళా సాధికారితకు అర్థం లేకుండాపోయింది. ఎస్వీయూలో రిజిస్ట్రార్, సెక్యూరిటీ ఆఫీసర్, సెక్యూరిటీ నిర్వహిస్తున్న ఔట్సోర్సింగ్ సంస్థ నిర్వాహకులు, ఇతర ముఖ్య పదవుల్లో సీఎం సొంత సామాజిక వర్గానికి చెందినవారే ఉన్నారు. ఎస్వీయూ పాలకమండలిని రద్దు చేసి మహిళలకు, మైనారిటీలకు అవకాశం కల్పించాలి. - వి.హరిప్రసాద్‌రెడ్డి, వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు