వెబ్‌కౌన్సెలింగ్ ద్వారా సర్టిఫికెట్ల పరిశీలన
11 నుంచి వెబ్ ఆప్షన్సు ఇచ్చుకునే అవకాశం
షెడ్యూల్లో మార్పు
యూనివర్సిటీ క్యాంపస్: ఎస్వీయూనివర్సిటీ పీజీ కోర్సుల్లో ప్రవేశానికి వెబ్‌కౌన్సెలింగ్ గురువారం ప్రారంభమైంది. డెరైక్టరేట్ అడ్మిషన్స్ కార్యాలయంలో ఈ ప్రక్రియ గురువారం ఉదయం నుంచి రాత్రి 9 గంటల వరకు కొనసాగింది. తొలిసారిగా పీజీ కోర్సుల్లో ప్రవేశానికి ఎస్వీయూ అధికారులు వెబ్ కౌన్సెలింగ్‌కు శ్రీకారం చుట్టారు. తొలిరోజు గురువారం ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఎలక్ట్రానిక్స్ సబ్జెక్టులకు కౌన్సెలింగ్ నిర్వహించారు. కెమిస్ట్రీలో ఒకటి నుంచి 1046 ర్యాంక్ వరకు, ఫిజిక్స్‌లో 1 నుంచి 608 వరకు, ఎలక్ట్రానిక్స్‌లో ఒకటి నుంచి 136వ ర్యాంక్ వరకు కౌన్సెలింగ్ నిర్వహించారు. హాజరైన విద్యార్థుల సర్టిఫికెట్లను పరిశీలించి వారికి స్క్రాచ్‌కార్డులు ఇచ్చారు. వారు శుక్రవారం నుంచి వెబ్‌సైట్‌లో లాగిన్ అయ్యి వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవచ్చు. వెబ్ ఆప్షన్స్ ఆధారంగా ఈనెల 16 లేదా 17 తేదీల్లో సీట్లను కేటాయిస్తారు. శుక్రవారం కామర్స్ విభాగంలో ఒకటినుంచి 1200వ ర్యాంక్ వరకు కౌన్సెలింగ్ జరగనుంది.
షెడ్యూల్‌లో మార్పు
రువారం ప్రారంభం అయిన పీజీ కౌన్సెలింగ్‌కు అభ్యర్థుల తాకిడి ఎక్కువ కావడంతో రాత్రి 9 వరకు కొనసాగుతూనే ఉంది. దీంతో షెడ్యూల్‌లో మార్పు చేశారు. కామర్స్ 1201 ర్యాంక్ నుంచి 1962 ర్యాంక్ వరకు, కంప్యూటర్ సైన్స్‌లో 1 నుంచి 562 ర్యాంక్ వరకు ఈనెల 14న కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. అలాగే ఇంగ్లీష్‌లో 1 నుంచి 239 ర్యాంక్ వరకు, ఎడ్యుకేషన్‌లో 1 నుంచి 156 వరకు, జనరల్ టెస్ట్ పరీక్షకు సంబంధించి 1 నుంచి 289 ర్యాంక్ వరకు ఈనెల 15న కౌన్సెలింగ్ నిర్వహిస్తారు.
వర్షంతో విద్యార్థులు ఇక్కట్లు
ఎస్వీయూలో ప్రారంభం అయిన వెబ్‌కౌన్సెలింగ్ ప్రకియ సందర్భంగా గురువారం సాయంత్రం వర్షం పడడంతో విద్యార్థులు ఇబ్బంది పడ్డారు.