Graduate course
-
ఎడ్యుకేషన్ న్యూస్
పీజీ ప్రవేశాలకు కామన్ నోటిఫికేషన్ లేనట్లే! హైదరాబాద్: రాష్ట్రంలో అన్ని వర్సిటీల్లోని పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు ఒకే ఉమ్మడి పరీక్ష నిర్వహించాలని ఉన్నత విద్యా మండలి నిర్ణయించినా.. అందుకు వర్సిటీ లు సానుకూలంగా స్పందించడం లేదు. విద్యార్థులు ఒకే సబ్జెక్టుకు 2 వర్సిటీలు నిర్వహించే పరీక్షలకు ఫీజులు చెల్లిం చి, పరీక్షలు రాసేందుకు పడే ఇబ్బందులను తొలగించేందుకు ఈ చర్యలు చేపట్టినా అమలుకు నోచుకోలేని స్థితి నెలకొంది. వర్సిటీలకు ఫీజుల రూపంలో వచ్చే డబ్బుతోనే హాస్టళ్ల నిర్వహణ కొనసాగుతోంది. ఈ పరిస్థితుల్లో ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహిస్తే వచ్చే డబ్బు రాకుండా పోతుందన్న వాదన వర్సిటీ వర్గాల్లో నెలకొంది. దీంతో 2017–18 విద్యాసంవత్సరంలో అన్ని సబ్జెక్టులకు ఉస్మానియా, కాకతీయ వర్సిటీలు వేర్వేరుగానే పీజీ ప్రవేశాలకు పరీక్షలను నిర్వ హించే అవకాశం ఉంది. దీనిపై త్వరలోనే తుది నిర్ణయం వెలువడనుంది. ప్రత్యేక అధికారి నేతృత్వంలో డిగ్రీ ప్రవేశాలు సాక్షి, హైదరాబాద్: వచ్చే విద్యా సంవత్సరంలో డిగ్రీ ఆన్లైన్ ప్రవేశాలను తెలంగాణ ఉన్నత విద్యా మండలి ఆధ్వర్యంలో నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. గతేడాది కళాశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రవేశాలు చేపట్టినా.. అనేక సమస్యలు తలెత్తడం, విద్యార్థులు సీట్లను కోల్పోయి నష్టపోయిన నేపథ్యంలో మండలి ఆధ్వర్యంలో ప్రవేశాలను చేపట్టేందుకు కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా ఉన్నత విద్యాశాఖ, కళాశాల విద్యాశాఖ అధికారులతో చర్చించి తుది నిర్ణయం తీసుకునేందుకు మండలి సిద్ధమవుతోంది. ఉన్నత విద్యా మండలికి చెందిన వైస్ చైర్మన్లు ఇద్దరిలో ఎవరికైనా ఈ బాధ్యతలను అప్పగించి, ప్రత్యేక అధికారి నేతృత్వంలోనే ప్రవేశాలు చేపట్టేందుకు ఏర్పాట్లు చేస్తోంది. త్వరలోనే వీటిపై తుది నిర్ణయం తీసుకోవాలని భావిస్తోంది. రేపు పీఆర్టీయూ ఎమ్మెల్సీ అభ్యర్థి నామినేషన్ సాక్షి, హైదరాబాద్: పీఆర్టీయూ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్సీ కె.జనార్దన్‌రెడ్డి ఈ నెల 18న నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు పీఆర్ టీయూ వెల్లడించింది. మరోవైపు జనార్దన్‌రెడ్డికి రాష్ట్రీయ పండిత పరిషత్తు మద్దతు ప్రకటిస్తూ గురువారం పీఆర్టీయూ కార్యాలయంలో లేఖను అందజేసింది. -
డిసెంబర్లో ఉస్మానియా డిగ్రీ, పీజీ పరీక్షలు
హైదరాబాద్: ఉస్మానియా వర్సిటీ పరిధిలో డిగ్రీ, పీజీ కోర్సుల పరీక్షలు డిసెంబర్లో ప్రారంభం కానున్నట్లు కంట్రోలర్ ప్రొ.అప్పారావు శుక్రవారం తెలిపారు. డిగ్రీ కోర్సుల్లో తొలిసారిగా సెమిస్టర్ పరీక్షల విధానాన్ని ప్రవేశపెట్టిన్నట్లు చెప్పారు. డిగ్రీ మొదటి సెమిస్టర్ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు నవంబర్ 18 లోగా ఫీజు చెల్లించాలని, రూ.500 అపరాధ రుసుముతో 26 వరకు చెల్లించవచ్చని పేర్కొన్నారు. నవంబర్ 23 నుంచి డిగ్రీ కోర్సుల ప్రాక్టికల్స్ పరీక్షలు నిర్వహించనున్నట్లు చెప్పారు. కాగా, డిసెంబర్లో జరిగే పీజీ సెమిస్టర్ పరీక్ష ఫీజును వచ్చే నెల 16 లోగా చెల్లించాలని, రూ.300 అపరాధ రుసుముతో 23 వరకు చెల్లించవచ్చని చెప్పారు. -
పీజీ సెట్ కౌన్సెలింగ్ ప్రారంభం
వెబ్‌కౌన్సెలింగ్ ద్వారా సర్టిఫికెట్ల పరిశీలన 11 నుంచి వెబ్ ఆప్షన్సు ఇచ్చుకునే అవకాశం షెడ్యూల్లో మార్పు యూనివర్సిటీ క్యాంపస్: ఎస్వీయూనివర్సిటీ పీజీ కోర్సుల్లో ప్రవేశానికి వెబ్‌కౌన్సెలింగ్ గురువారం ప్రారంభమైంది. డెరైక్టరేట్ అడ్మిషన్స్ కార్యాలయంలో ఈ ప్రక్రియ గురువారం ఉదయం నుంచి రాత్రి 9 గంటల వరకు కొనసాగింది. తొలిసారిగా పీజీ కోర్సుల్లో ప్రవేశానికి ఎస్వీయూ అధికారులు వెబ్ కౌన్సెలింగ్‌కు శ్రీకారం చుట్టారు. తొలిరోజు గురువారం ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఎలక్ట్రానిక్స్ సబ్జెక్టులకు కౌన్సెలింగ్ నిర్వహించారు. కెమిస్ట్రీలో ఒకటి నుంచి 1046 ర్యాంక్ వరకు, ఫిజిక్స్‌లో 1 నుంచి 608 వరకు, ఎలక్ట్రానిక్స్‌లో ఒకటి నుంచి 136వ ర్యాంక్ వరకు కౌన్సెలింగ్ నిర్వహించారు. హాజరైన విద్యార్థుల సర్టిఫికెట్లను పరిశీలించి వారికి స్క్రాచ్‌కార్డులు ఇచ్చారు. వారు శుక్రవారం నుంచి వెబ్సైట్లో లాగిన్ అయ్యి వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవచ్చు. వెబ్ ఆప్షన్స్ ఆధారంగా ఈనెల 16 లేదా 17 తేదీల్లో సీట్లను కేటాయిస్తారు. శుక్రవారం కామర్స్ విభాగంలో ఒకటినుంచి 1200వ ర్యాంక్ వరకు కౌన్సెలింగ్ జరగనుంది. షెడ్యూల్లో మార్పు రువారం ప్రారంభం అయిన పీజీ కౌన్సెలింగ్‌కు అభ్యర్థుల తాకిడి ఎక్కువ కావడంతో రాత్రి 9 వరకు కొనసాగుతూనే ఉంది. దీంతో షెడ్యూల్లో మార్పు చేశారు. కామర్స్ 1201 ర్యాంక్ నుంచి 1962 ర్యాంక్ వరకు, కంప్యూటర్ సైన్స్‌లో 1 నుంచి 562 ర్యాంక్ వరకు ఈనెల 14న కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. అలాగే ఇంగ్లీష్‌లో 1 నుంచి 239 ర్యాంక్ వరకు, ఎడ్యుకేషన్‌లో 1 నుంచి 156 వరకు, జనరల్ టెస్ట్ పరీక్షకు సంబంధించి 1 నుంచి 289 ర్యాంక్ వరకు ఈనెల 15న కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. వర్షంతో విద్యార్థులు ఇక్కట్లు ఎస్వీయూలో ప్రారంభం అయిన వెబ్‌కౌన్సెలింగ్ ప్రకియ సందర్భంగా గురువారం సాయంత్రం వర్షం పడడంతో విద్యార్థులు ఇబ్బంది పడ్డారు. -
నేటి నుంచి ఓయూసెట్ పరీక్షలు
హైదరాబాద్: ఓయూతో పాటు తెలంగాణ, పాలమూరు, మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయాల్లో వివిధ పీజీ, పీజీ డిప్లొమా, ఐదేళ్ళ పీజీ కోర్సుల్లో ప్రవేశానికి సోమవారం నుంచి ఓయూసెట్-2016 ప్రవేశ పరీక్షలు జరగనున్నాయి. ఉదయం ఎమ్మెస్సీ జాగ్రఫీ, మధ్యాహ్నం ఎంఏ థియేటర్ ఆర్ట్స్, ఎమ్మెస్సీ జాగ్రఫీ, ఎలక్ట్రానిక్స్, సాయంత్రం ఎంఏ లింగ్విస్టిక్స్ కోర్సులకు ప్రవేశ పరీక్షలను నిర్వహించనున్నారు. బయోమెట్రిక్ విధానం కావడంతో పరీక్షకు అరగంట ముందుగా చేరుకోవాలని పీజీ అడ్మిషన్స్ జాయింట్ డెరైక్టర్ ప్రొఫెసర్ కిషన్ తెలిపారు.