
డిసెంబర్‌లో ఉస్మానియా డిగ్రీ, పీజీ పరీక్షలు
హైదరాబాద్: ఉస్మానియా వర్సిటీ పరిధిలో డిగ్రీ, పీజీ కోర్సుల పరీక్షలు డిసెంబర్‌లో ప్రారంభం కానున్నట్లు కంట్రోలర్ ప్రొ.అప్పారావు శుక్రవారం తెలిపారు. డిగ్రీ కోర్సుల్లో తొలిసారిగా సెమిస్టర్ పరీక్షల విధానాన్ని ప్రవేశపెట్టిన్నట్లు చెప్పారు. డిగ్రీ మొదటి సెమిస్టర్ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు నవంబర్ 18 లోగా ఫీజు చెల్లించాలని, రూ.500 అపరాధ రుసుముతో 26 వరకు చెల్లించవచ్చని పేర్కొన్నారు.
నవంబర్ 23 నుంచి డిగ్రీ కోర్సుల ప్రాక్టికల్స్ పరీక్షలు నిర్వహించనున్నట్లు చెప్పారు. కాగా, డిసెంబర్‌లో జరిగే పీజీ సెమిస్టర్ పరీక్ష ఫీజును వచ్చే నెల 16 లోగా చెల్లించాలని, రూ.300 అపరాధ రుసుముతో 23 వరకు చెల్లించవచ్చని చెప్పారు.