punam mahajan
-
‘అంత్యోదయ’మే మోదీ నినాదం
సాక్షి, హైదరాబాద్: దేశంలో చిట్టచివరి వ్యక్తికి కూడా అభివృద్ధి ఫలాలు అందాలన్న ఏకైక లక్ష్యంతోనే మోదీ ప్రభుత్వ పాలన కొనసాగుతోందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. అంత్యోదయ నినాదంతో పనిచేస్తున్నందున.. 2019 ఎన్నికల్లో ఎన్డీయే ప్రభుత్వాన్ని భారీ మెజారిటీతో మరోసారి అధికారంలోకి తీసుకురావాలని బీజేవైఎం కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో బీజేవైఎం ‘విజయ్‌లక్ష్య 2019 యువ మహాధివేశన్’లో ఆదివారం ప్రసంగించారు. పేదరికాన్ని అనుభవించిన మోదీకి ప్రజలకు ఎదురయ్యే కష్టాలేంటో తెలుసన్నారు. అందుకే బడుగు, బలహీన, పేదల సంక్షేమానికి అనేక సంక్షేమ, అభివృద్ధి పథకాలు అమల్లోకి తెచ్చారన్నారు. ఆర్థిక స్వావలంబనతో విశ్వశిఖరంపై భారత జెండా ఎగురవేసిన ఘనత మోదీదేనన్నారు. యువమోర్చా ప్రతినిధులలే.. రేపటి భావి నేతలని, సేవే లక్ష్యంగా పని చేయాలని సూచించారు. ‘బూత్ స్థాయిలో గెలిస్తేనే పార్టీ గెలుస్తుంది. బూత్ స్థాయినుంచే పార్టీని బలోపేతం చేయాలి. అమిత్ షా, పూనమ్ మహాజన్ ఆధ్వర్యంలో యువమోర్చా ప్రతినిధులంతా కొత్త ఉత్సాహంతో పనిచేయాలి’అని గోయల్ కోరారు. కేంద్రం చేపట్టిన పథకాలను ప్రజలకు వివరించాలని సూచించారు. ఇక తెలంగాణ వంతు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్ మాట్లాడుతూ.. బీజేపీ 20 రాష్ట్రాల్లో గెలిచిందని, ఇప్పుడు తెలంగాణలోనూ గెలవాలన్నారు. అందుకు యువమోర్చా రెట్టించిన ఉత్సాంతో పని చేయాలన్నారు. ప్రధాని మోదీకి సియోల్ శాంతి బహుమతి వచ్చిందని, ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా ప్రధానికి అద్భుతమైన మర్యాద, స్వాగతం లభిస్తున్నాయన్నారు. భారత గౌరవాన్ని ప్రపంచవ్యాప్తంగా మరింత గొప్పగా చేసిన ఘనత ప్రధానిదేనని రాంమాధవ్ ప్రశంసించారు. వివిధ దేశాధి నేతలు కలిస్తే.. ప్రపంచం దృష్టంతా మోదీపైనే ఉంటుందన్నారు. యెమెన్ అంతర్యుద్ధం సమయంలో.. అక్కడ చిక్కుకున్న భారతీయులను రక్షించేందుకు సైన్యాన్ని రంగంలోకి దించామని ఆయన గుర్తుచేశారు. ఇదే సమయంలో అక్కడున్న చిక్కున్న తమవారినీ కాపాడాలంటూ 30 దేశాలు భారత్ సాయాన్ని అర్థించాయన్నారు. దేశవ్యాప్తగా బీజేపీ జోరును అడ్డుకునేందుకు ఎవరెన్ని కుట్రలు పన్నినా పెద్ద ప్రభావం ఉండదన్నారు. తెలంగాణలో బీజేపీ విజయానికి.. ఈ సదస్సు కొత్త ఉత్సాహాన్ని ఇస్తుందన్నారు. ‘19 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నాం. 20వ రాష్ట్రంగా తెలంగాణ కూడా బీజేపీ ఖాతాలోకి రాబోతోంది’ఇందులో సందేహమేమీ లేదు. అని రాంమాదవ్ పేర్కొన్నారు. బీజేవైఎం జాతీయ అధ్యక్షురాలు పూనమ్ మహజన్ అధ్యక్షతన జరిగిన ఈ సమ్మేళనం లో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శులు మురళీధర్‌రావు, రాంలాల్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణలో కమలోదయం... డిసెంబర్ 11న తెలంగాణలో బీజేపీ జెండా ఎగరడం ఖాయమని బీజేవైఎం జాతీయ అధ్యక్షురాలు పూనం మహాజన్ జోస్యం చెప్పారు. తెలంగాణ ఎన్నికల్లో గెలుపు ద్వారా 2019లో మోదీ విజయం సంపూర్ణం చేయాలని ఆమె పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ గెలుపే లక్ష్యంగా భారతీయ జనతా యువ మోర్చా (బీజేవైఎం) భవిష్యత్తు కార్యాచరణను ఖరారు చేసేందుకు సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో ‘విజయలక్ష్యం 2019 యువ మహాధివేశన్’పేరుతో యువ సమ్మేళనాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె తెలుగులో కూడా ప్రసంగించారు. నరేంద్ర మోదీ వంటి ప్రధాని దొరకడం మన అదృష్టమన్నారు. పతంగి పట్టుకుని కారు నడుపుతున్న వారి మధ్యలోకి అమిత్ షా లాంటి సింహం రావడంతో భయపడుతున్నారని వ్యాఖ్యానించారు. తాను తెలంగాణ బిడ్డనని, ఆంధ్రా కోడలినని తెలిపారు. పప్పూ వెంట కొంత మంది మూర్ఖులు ఉన్నారని పరోక్షంగా రాహుల్ గాంధీ గురించి ప్రస్తావించారు. 2019లో విజయమే మన సంకల్పమని, మోదీ అభివృద్ధిని ముందుకు తీసుకుపోవాలన్నారు. ఈ సందర్భంగా ఆమె అమిత్ షాను సత్కరించి, వివేకానంద పుస్తకం బహూకరించారు. అధికారంలోకి వస్తే మెగా డీఎస్సీ: లక్ష్మణ్ తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే మెగా డీఎస్సీతో పాటు పెద్దఎత్తున ఉద్యోగాలు భర్తీ చేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ పేర్కొన్నారు. అధికారంలోకి వస్తే లక్షా 10 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీఇచ్చి కేవలం 15 వేల ఉద్యోగాలను మాత్రమే కేసీఆర్ భర్తీ చేశారని విమర్శించారు. ఇంటికో ఉద్యోగం అన్న కేసీఆర్, అధికారంలోకి వచ్చిన అనంతరం ఇంట్లోనే నాలుగు ఉద్యోగాలు ఇచ్చుకున్నారని విమర్శించారు. డీఎస్సీ కోసం యువత ఎదురు చూసి విసిగిపోయారన్నారు. అమిత్ షా నేతృత్వంలో మరొకసారి మోదీ ప్రధాని కావడం తథ్యమన్నారు. తెలంగాణ యువకులు కమల వికాసానికి కంకణబద్ధులై ముందుకుసాగాలని పిలుపునిచ్చారు. -
‘భగత్‌సింగ్ కలలుగన్న సుపరిపాలన అందిస్తున్నాం’
సాక్షి, హైదరాబాద్: బీజేపీ జాతీయ యువమోర్చా (బీజేవైఎం) ఆధ్వర్యంలో తొలిసారిగా హైదరాబాద్‌లో నిర్వహిస్తోన్న జాతీయ యువ సమ్మేళనాన్ని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ... యువ శక్తి ఎక్కువగా ఉన్న ఏకైక దేశం కేవలం భారత్ మాత్రమేనని అన్నారు. దేశాభివృద్ధి లో యువతను భాగస్వామి చేసి మోదీ సర్కారు.. భగత్ సింగ్ కలలు కన్న సుపరిపాలనను అందిస్తోందన్నారు. విశ్వంలో దేశం పేరు నిలబెట్టిన స్వామి వివేకానంద కూడా యువకుడేనని.. అందుకే ఆయన యూత్ ఐకాన్ అయ్యారని వ్యాఖ్యానించారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత తొలిసారి కాంగ్రెస్ వ్యతిరేక పార్టీ పూర్తి మెజార్టీ పొందిన బీజేపీ ప్రస్తుతం ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా అవతరించిందన్నారు. నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, సెల్ఫ్ లాస్ట్ అనే నినాదంతో ముందుకు సాగుతున్న బీజేపీ అన్ని వర్గాలకు సమన్యాయం అందించేందుకు కృషి చేస్తుందని వ్యాఖ్యానించారు. ఇంకా మాట్లాడుతూ.. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగానే భారత్ ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశంగానే ఉందని రాజ్‌నాథ్ విమర్శించారు. కాంగ్రెస్ పార్టీకి జాతి హితం కన్నా రాజకీయ హితమే ముఖ్యమని అందుకే ప్రజలకు మంచి జరుగుతుంటే వారు ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తోందన్నారు. మోదీని, బీజేపీని ఓడించడమే తప్ప విపక్షాలకు దేశ అభివృద్ధి ఎజెండా లేదని విమర్శించారు. ఇప్పుడు కాంగ్రెస్‌తో జట్టుకట్టే పార్టీ లు తర్వాత.. మీటూ.. ఉద్యమం చేయాల్సి వస్తుందని ఎద్దేవా చేశారు. 2019లో భారత్ విశ్వగురువుగా అవతరించాలంటే.. 350 సీట్లు గెలిచేంత వరకు కార్యకర్తలు నిద్ర పోవద్దని పిలుపునిచ్చారు. కాగా సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి బీజేవైఎం జాతీయ అధ్యక్షురాలు, ఎంపీ పూనమ్ మహాజన్, బీజేపీ జాతీయ కార్యదర్శి మురళీధర్ రావు తదితరులు హాజరయ్యారు. వీరితో పాటు అన్ని రాష్ట్రాల నుంచి సుమారు 40 వేల మంది ప్రతినిధులు పాల్గొన్నారు. ‘విజయ్‌లక్ష్య 2019 యువ మహా ఆదివిశేషణ్’ పేరుతో ఈ సమ్మేళనం రెండు రోజుల పాటు కొనసాగనుంది. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈ సమ్మేళనం హైదరాబాద్‌లో నిర్వహిస్తుండటంతో రాజకీయంగా కూడా ప్రాధాన్యం ఏర్పడింది. తెలంగాణలో సమ్మేళనం నిర్వహించడం ద్వారా పార్టీ శ్రేణుల్లో మరింత ఉత్సాహం నింపవచ్చని, ముఖ్యంగా యువతను పార్టీ వైపు ఎక్కువగా ఆకర్షించవచ్చని బీజేపీ పెద్దలు భావిస్తున్నారు. ఇందులో భాగంగానే రేపు(ఆదివారం) జరుగునున్న యువభేరీ బహిరంగ సభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా హాజరుకానున్నారు. -
హార్వర్డ్ సదస్సుకు కేటీఆర్, అమరీందర్
వాషింగ్టన్: ఫిబ్రవరి 10, 11వ తేదీల్లో హార్వర్డ్ యూనివర్సిటీలో జరగనున్న 15వ భారత వార్షిక సదస్సుకు కేంద్ర మంత్రి సురేశ్ ప్రభు, పంజాబ్ సీఎం అమరీందర్, సినీ నటుడు కమల్ హాసన్ సహా పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు. ఈ సదస్సులో ‘భారత్ – అద్భుత ఆవిష్కరణలు’ అనే అంశంపై చర్చ జరగనుంది. సదస్సుకు తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి తారక రామారావు, బీజేపీ ఎంపీ పూనమ్ మహాజన్, కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఇన్చార్జి, నటి దివ్య స్పందన, క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ ఆదిల్ జైనుల్‌బాయ్ తదితరులు హాజరుకానున్నట్లు నిర్వాహకులు ఓ ప్రకటనలో తెలిపారు. -
అనురాగ్ ఠాకూర్ స్థానంలో పూనమ్ మహాజన్!
బీజేపీ కార్యవర్గం విషయంలో పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా తీవ్రమైన నిర్ణయం తీసుకున్నారు. ఆయన అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత ఇంత తీవ్ర నిర్ణయం తీసుకోవడం ఇది రెండోసారి మాత్రమే. ఆరేళ్లుగా భారతీయ జనతా యువమోర్చా అధ్యక్షుడిగా ఉన్న అనురాగ్ ఠాకూర్‌ను తప్పించి, ఆయన స్థానంలో యువ మహిళా ఎంపీ పూనమ్ మహాజన్‌ను నియమించారు. సాధారణంగా మహిళలను పార్టీలలో మహిళా విభాగాలకు మాత్రమే అధ్యక్షులుగా చేస్తుంటారు. కానీ, బీజేవైఎం జాతీయ అధ్యక్ష పదవిని ఓ మహిళకు ఇవ్వడం గమనార్హం. దివంగత బీజేపీ నాయకుడు ప్రమోద్ మహాజన్ కుమార్తె అయిన పూనమ్ (36).. ముంబై నార్త్ సెంట్రల్ ఎంపీగా ఉన్నారు. ప్రమోద్ మహాజన్‌కు పార్టీలో చాలా మంచి స్థానం ఉండేది. పార్టీ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, కిసాన్ మోర్చాలకు కూడా అధ్యక్షులను మార్చారు. కౌశాంబి ఎంపీ వినోద్ సర్కార్, ఛత్తీస్‌గఢ్ రాజ్యసభ సభ్యుడు రాంవిచార్ నేతమ్, వీరేంద్ర సింగ్ మస్త్, మాజీ ఎంపీ దారాసింగ్ చౌహాన్లను ఎస్సీ, ఎస్టీ, కిసాన్, ఓబీసీ విభాగాల అధ్యక్షులుగా నియమించారు. -
‘స్లీపింగ్ బ్యూటీ’ రాహుల్.. పూనమ్ ఎద్దేవా
ధరల పెరుగుదలపై లోక్‌సభలో ఎన్డీయే ప్రభుత్వం మీద విరుచుకుపడ్డ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి బీజేపీ ఎంపీ పూనమ్ మహాజన్ గట్టి సమాధానం ఇచ్చారు. ఈ అంశంపై లోక్‌సభలో మాట్లాడినప్పుడు ఆమె రాహుల్ గాంధీని ‘స్లీపింగ్ బ్యూటీ’ అని ప్రస్తావించారు. ఎప్పుడూ విదేశీ పర్యటనలలోనే కాలం గడిపేసే రాహుల్.. ఈమధ్య యువత గురించి, ధరల పెరుగుదల గురించి కూడా మాట్లాడటం ఆశ్చర్యంగా ఉందన్నారు. పదేళ్ల యూపీఏ పాలనాకాలంలో ధరల పెరుగుదల గురించి ఏనాడూ గుర్తురాలేదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ కూడా గత 60 ఏల్లుగా నిద్రపోతూనే ఉందని.. ఆ పార్టీ ఉపాధ్యక్షుడు పార్లమెంటులోనే కునుకు తీస్తున్నారని విమర్శించారు.