అనురాగ్ ఠాకూర్ స్థానంలో పూనమ్ మహాజన్! | punam mahajan replaces anurag thakur in bjym | Sakshi
Sakshi News home page

అనురాగ్ ఠాకూర్ స్థానంలో పూనమ్ మహాజన్!

Published Fri, Dec 16 2016 8:34 AM | Last Updated on Mon, Sep 4 2017 10:53 PM

అనురాగ్ ఠాకూర్ స్థానంలో పూనమ్ మహాజన్!

అనురాగ్ ఠాకూర్ స్థానంలో పూనమ్ మహాజన్!

బీజేపీ కార్యవర్గం విషయంలో పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా తీవ్రమైన నిర్ణయం తీసుకున్నారు. ఆయన అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత ఇంత తీవ్ర నిర్ణయం తీసుకోవడం ఇది రెండోసారి మాత్రమే. ఆరేళ్లుగా భారతీయ జనతా యువమోర్చా అధ్యక్షుడిగా ఉన్న అనురాగ్ ఠాకూర్‌ను తప్పించి, ఆయన స్థానంలో యువ మహిళా ఎంపీ పూనమ్ మహాజన్‌ను నియమించారు. సాధారణంగా మహిళలను పార్టీలలో మహిళా విభాగాలకు మాత్రమే అధ్యక్షులుగా చేస్తుంటారు. కానీ, బీజేవైఎం జాతీయ అధ్యక్ష పదవిని ఓ మహిళకు ఇవ్వడం గమనార్హం. దివంగత బీజేపీ నాయకుడు ప్రమోద్ మహాజన్ కుమార్తె అయిన పూనమ్ (36).. ముంబై నార్త్ సెంట్రల్ ఎంపీగా ఉన్నారు. ప్రమోద్ మహాజన్‌కు పార్టీలో చాలా మంచి స్థానం ఉండేది. 
 
పార్టీ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, కిసాన్ మోర్చాలకు కూడా అధ్యక్షులను మార్చారు. కౌశాంబి ఎంపీ వినోద్ సర్కార్, ఛత్తీస్‌గఢ్ రాజ్యసభ సభ్యుడు రాంవిచార్ నేతమ్, వీరేంద్ర సింగ్ మస్త్, మాజీ ఎంపీ దారాసింగ్ చౌహాన్‌లను ఎస్సీ, ఎస్టీ, కిసాన్, ఓబీసీ విభాగాల అధ్యక్షులుగా నియమించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement