Automated Hiring Software: చాలామంది ఉద్యోగాల కోసం రెజ్యూమ్‌లను.. నౌకరీలాంటి జాబ్ పోర్టల్స్‌లో అప్‌లోడ్ చేస్తుంటారు. అయితే ఫ్రొఫైల్ ఎంత ఘనంగా ఉన్నా.. ఉద్యోగాలకు పిలుపు మాత్రం అందదు. అదే టైంలో తమ కన్నా తక్కువ ప్రదర్శన ఉన్న వాళ్లకు మంచి మంచి కంపెనీలలో, మంచి హైక్‌లతో జాబ్‌లు వస్తుండడంతో తెగ ఫీలైపోతుంటారు. మరి సమస్య ఎక్కడ ఉంటోంది?..
ఈ సమస్య ఎక్కడో కాదు.. కంపెనీలు ఎంపిక చేసే విధానంలోనే ఉంటోంది. సాధారణంగా ఉద్యోగాల భర్తీ కోసం కంపెనీలు హైరింగ్ డిపార్ట్‌మెంట్స్(లేదంటే హెచ్‌ఆర్ వ్యవస్థ)ను ఏర్పాటు చేసుకుంటాయి కంపెనీలు. అయితే కరోనా ముందు వరకు ఈ విభాగాల్లో ఎక్కువ మంది పని చేసేవాళ్లు. ఆ తర్వాత నుంచి తీసివేతల కారణంగా.. ఆ విభాగాల్లోనూ ఉద్యోగులు తగ్గిపోయారు. దీంతో మిగిలిన ఉద్యోగులపై ఒత్తిడి పడకుండా ఉండేందుకు రిక్రూట్‌మెంట్ ప్రాసెస్‌లో ‘ఆటోమేటెడ్ సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామ్స్’ను ఉపయోగించుకుంటున్నాయి చాలా కంపెనీలు.
అవును.. ఈ సాఫ్ట్‌వేర్‌లు జాబ్ పోర్టల్స్ నుంచి తమ కంపెనీలకు కావాల్సిన ప్రొఫైల్స్‌ను స్కాన్ చేసి ఉద్యోగులను ఎంపిక చేస్తుంటాయి. ఈ క్రమంలోనే పొరపాట్లు జరుగుతున్నాయి. అర్హతలు ఉన్నా లక్షల మంది ఉద్యోగుల రెజ్యూమ్‌లు ఎంపిక కావడం లేదు.
లెక్కగట్టి..
సీవీ(రెజ్యూమ్) స్కానింగ్ సాఫ్ట్‌వేర్ ఇప్పుడు ఉద్యోగుల సెలక్షన్ ప్రాసెస్‌లో తప్పనిసరిగా మారింది. అప్లికెంట్ ట్రాకింగ్ సిస్టమ్ పేరుతో అమెరికాలో 75 శాతం కంపెనీలు, భారత్‌లో సుమారు 65 శాతం కంపెనీలు(ఎక్కువగా ఎంఎన్‌సీలు) ఈ రకమైన పద్దతిని ఉపయోగిస్తున్నాయి. కొన్నిసార్లు మధ్యవర్తి కంపెనీలు(హైరింగ్ ప్రాసెస్ నిర్వహించే థర్డ్ పార్టీలు) కూడా ఇలాంటి సాఫ్ట్‌వేర్‌లను ఆశ్రయిస్తున్నాయి. ఇవి తమ పరిధిలోని ప్యాకేజీకి తగ్గట్లు ఉద్యోగుల్ని ఎంపిక చేస్తున్నాయి. ఈ ప్రాసెస్‌లోనే ప్యాకేజీకి తగ్గట్లు ప్రొఫైల్ లేకపోవడం, లేదంటే స్కానింగ్ పొరపాట్లు జరగడం వల్ల రెజ్యూమ్ తిరస్కరణకు గురవుతోంది. ఇలా అర్హత ఉన్నా.. మంచి ప్రొఫైల్ ఉన్నవాళ్లు ఉద్యోగాలకు ఎంపిక కావడం లేదు. ఇదీ జరుగుతున్న అసలు కథ. కిందటి ఏడాదితో పోలిస్తే.. ఇది ఈ ఏడాదిలో మరింతగా పెరిగిందట. లక్షల మంది ఈ టెక్నికల్ ప్రాసెస్ వల్ల మంచి ప్యాకేజీలకు దూరం అవుతుండడం గమనార్హం.
హర్వార్డ్ బిజినెస్ లా నిర్వహించిన స్టడీలో పై సమాచారం వెల్లడైంది. ‘హిడెన్ వర్కర్స్: అన్‌టాప్డ్ టాలెంట్’ పేరుతో నిర్వహించిన స్టడీలో పాజిటివ్ కోణంలో ఉపయోగించాలనుకుంటున్న ఇలాంటి సాఫ్ట్‌వేర్‌లు.. ఉద్యోగుల పాలిట ఎలా శత్రువులుగా మారుతున్నాయో వివరంగా తెలియజేశారు.
Comments
Please login to add a commentAdd a comment