
అమెరికా వర్సిటీలో ప్రసంగించనున్న కమల్
చెన్నై: నటుడిగా విశ్వనటుడు కమలహాసన్‌ది ఎల్లలు దాటిన ఖ్యాతి అని ఇప్పుడు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా ఆయనకు అమెరికా నుంచి అరుదైన ఆహ్వానం అందింది. అమెరికాలోని బాస్టన్ నగరంలో గల ప్రఖ్యాత హార్వర్డు వర్సిటీలో కమల్ ప్రసంగించనున్నారు.
ఫిబ్రవరి 6,7 తేదీల్లో ఈ యూనివర్శిటీలో జరిగే సదస్సులో భారతదేశ అభివృద్ధి, ఎదుర్కొంటున్న సవాళ్ల వంటి అంశాలపై కమల్ ప్రసంగించనున్నారు. ఇలాంటి సదస్సులో పాల్గొననున్న తొలి దక్షిణాది నటుడు కమలహాసన్ కావడం విశేషం.