ఐఫోన్లు, యాపిల్‌ ప్రొడక్ట్స్‌కు హై సివియారిటీ వార్నింగ్‌! | CERTIn HIGH Severity warning for Apple Products | Sakshi
Sakshi News home page

High Severity Warning: ఐఫోన్లు, యాపిల్‌ ప్రొడక్ట్స్‌కు హై సివియారిటీ వార్నింగ్‌!

Published Sat, Sep 23 2023 3:52 PM | Last Updated on Sat, Sep 23 2023 4:39 PM

CERTIn HIGH Severity warning for Apple Products - Sakshi

ఐఫోన్లు (iPhone), పలు ఇతర యాపిల్‌ (Apple) ఉత్పత్తులకు కేంద్ర ఎలక్ట్రానిక్స్‌, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ శాఖ పరిధిలోని ఇండియన్‌ కంప్యూటర్‌ ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ టీమ్‌ (CERT-In) హై సివియారిటీ వార్నింగ్‌ ఇచ్చింది. పలు ఉత్పత్తుల్లో సాఫ్ట్‌వేర్లు సైబర్‌ దాడికి గురయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించింది.

ఐఫోన్లు, యాపిల్‌ మ్యాక్‌లు, వాచ్‌లు, ఐపాడ్‌లలో ఉపయోగిస్తున్న పలు వర్షన్ల సాఫ్ట్‌వేర్లు సైబర్‌ దాడికి గురయ్యే అవకాశం ఉందని సెర్ట్‌ఇన్‌ గుర్తించింది. ఆయా సాఫ్ట్‌వేర్లు టార్గెటెడ్‌ సిస్టమ్‌పై ఆర్బిటరీ కోడ్‌ అమలు చేయడానికి, భద్రతా పరిమితులను చేధించడానికి అటాకర్‌కు వీలు కల్పిస్తున్నట్లు పేర్కొంది. 

ప్రభావిత సాఫ్ట్‌వేర్‌లు ఇవే..

  • Apple macOS Monterey 12.7కి ముందు వెర్షన్‌లు
  • Apple macOS Ventura సంస్కరణలు 13.6కి ముందు వెర్షన్‌లు
  • Apple watchOS 9.6.3కి ముందు వెర్షన్‌లు
  • Apple watchOS 10.0.1కి ముందు వెర్షన్‌లు
  • Apple iOS 16.7కి ముందు వెర్షన్‌లు, iPadOS 16.7కి ముందు వెర్షన్‌లు
  • Apple iOS 17.0.1కి ముందు  వెర్షన్‌లు iPadOS  17.0.1కి ముందు ఉన్న వెర్షన్‌లు
  •  Apple Safari 16.6.1కి ముందు ఉన్న వెర్షన్‌లు

సెక్యూరిటీ కాంపోనెంట్‌లో సర్టిఫికేట్ ధ్రువీకరణ, కెర్నల్‌, వెబ్‌కిట్ కాంపోనెంట్‌లో సమస్యల కారణంగా యాపిల్‌ ఉత్పత్తులలో సైబర్‌ దాడికి అవకాశాలు ఉన్నట్లు సెర్ట్‌ఇన్‌ పేర్కొంది. ప్రత్యేకంగా రూపొందించిన అభ్యర్థనను పంపడం ద్వారా ఈ అవకాశాలను అటాకర్‌ ఉపయోగించుకోవచ్చని హెచ్చరించింది. ఆయా వెర్షన్‌లకు ముందున్న సాఫ్ట్‌వేర్‌లను వెంటనే అప్‌డేట్‌ చేసుకోవాలని యూజర్లకు సూచించింది.

(ఐఫోన్‌ 15పై అప్పుడే వెల్లువెత్తిన కంప్లైంట్లు..)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement