Retail inflation at 15 month high in July వినియోగదారుల ధరల సూచీ రిటైల్ ద్రవ్యోల్బణం 15 నెలల గరిష్టానికి చేరింది. నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ (ఎన్ఎస్ఓ) డేటా ప్రకారం జూలైలో రిటైల్ ద్రవ్యోల్బణం 15 నెలల గరిష్ట స్థాయి 7.44 శాతానికి ఎగబాకింది. ముఖ్యంగా టమాట ధరలు భగ్గుమనడంతోపాటు పాటు ఇతర కూరగాయల ధర సెగతో రీటైల్ ఇన్‌ఫ్లేషన్ ఎగబాకిందని , ఈ ఒత్తిడిమరి కొంతకాలం కొనసాగ వచ్చని భావిస్తున్నారు. (ఎల్‌ఐసీ కొత్త ఎండీగా ఆర్ దొరైస్వామి)
ఆహార పదార్థాలు, ముఖ్యంగా కూరగాయల ధరలు పెరగడంతో జూలైలో 4.87 శాతం 15 నెలల గరిష్ట స్థాయికి చేరింది. వినియోగదారుల ఆహార ధరల సూచీ ద్రవ్యోల్బణం జూలైలో 11.51శాతానికి పెరిగింది, అయితే ఫుడ్ అండ్ బేవరేజెస్ ద్రవ్యోల్బణం 10.57శాతానికి పెరిగింది. కూరగాయల రిటైల్ ద్రవ్యోల్బణం జూన్‌లో ప్రతి ద్రవ్యోల్బణం -0.93శాతం నుండి గత నెలలో 37.34శాతాకి పెరిగింది. (SpiceJet-Credit Suisse Case: సుప్రీంకోర్టులో స్పైస్‌జెట్ ఎండీకి భారీ షాక్!)
వినియోగదారుల ధరల సూచీ ఆధారంగా ఆ చిల్లర ద్రవ్యోల్బణాన్ని లెక్కగడతారు. జులైలో ఒక్కసారిగా పైకెగబాకడానికి కారణం టమాటాలు, ఇతర కూరగాయల ధరలు భగ్గుమనడమేనని డేటా పేర్కొంది. 2022 ఏప్రిల్ మాసంలో 7.79 శాతంగా నమోదైంది.
Comments
Please login to add a commentAdd a comment