న్యూఢిల్లీ: చెల్లితో రాఖీ కట్టించుకుందామని ఆనందంగా భార్యతో కలిసి బైక్ పై కలిసి వస్తున్న వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. ఈ ఘటన ఢిల్లీ జాతీయ రహదారిలో చోటుచేసుకుంది. ఈ మేరకు రాజధానికి సమీపంలోని నాంగ్లోయ్‌లో నివశిస్తున్న 35 ఏళ్ల విపిన్ కుమార్ రక్షబంధన్ పండుగను జరుపుకునేందుకు లోని ప్రాంతంలో ఉన్న తన చెల్లి ఇంటికి తన భార్యతో వస్తున్నాడు. అతను బైక్‌పై శాస్త్రి ఫై ఓవర్ వద్దకు చేరుకునేటప్పటికీ చైనీస్ గాలిపటం అతని మెడకు చుట్టుకుంది.
అంతే అతను ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. దీంతో అతని భార్య రహదారిపై ఉన్న స్థానికుల సాయంతో తన భర్తను ఆస్పత్రికి తరలించేటప్పటికే మృతి చెందినట్లు వెద్యులు తెలిపారు. వాస్తవానికి ఈ ఘటనలు గతంలో చాలా జరగడంతో ఢిల్లీలో 2016లోనే ఈ గాలిపటాల విక్రయాలను నిషేధించారు. దీంతో ఈ విషయమై స్పందించిన ఢిల్లీ హైకోర్టు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నిషేధించిన చైనీస్ ఫ్లాగ్‌ల విక్రయంలో పోలీసులు తీసుకున్న చర్యలేంటో వివరించాలని కోరింది.
ధర్మాసం 2016లో ఈ చైనీస్ గాలిపటాలపై దాఖలైన ఫిల్‌ని విచారిస్తూ వీటిని నిషేధిస్తూ సంచలన తీర్పు ప్రకటించింది. గతంలో ఈ గాలిపటాల కారణంగా వేర్వేరు ప్రమాదంలో చిన్నారుల నుంచి పెద్దలు వరకు మృతి చెందిన పలు ఘటనలు చోటుచేసుకోవడంతో ఢిల్లీ హైకోర్టు వాటి విక్రయాలను నిషేధించింది.
(చదవండి: ఘోరం.. గోడపై మూత్రం పోయడంతో గొడవ.. తల్లిని దుర్భాషలాడినందుకు వెంటాడి చంపాడు)
Comments
Please login to add a commentAdd a comment