నల్లగొండ టౌన్: గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం అమలు చేసిన కేసీఆర్ కిట్‌లపై ఉన్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫొటోలపై ఇప్పుడు తెల్లని స్టిక్కర్లను అతికించి బాలింతలకు పంపిణీ చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే బాలింతలకు అందజేస్తున్న కేసీఆర్ కిట్ పేరును మార్చుతూ ఉత్తర్వులు జారీ చేసింది. కేసీఆర్ కిట్‌కు బదులు ఎంసీహెచ్ (మదర్ అండ్ చైల్డ్ హెల్త్) కిట్‌గా పేరు మారుస్తూ వైద్య, ఆరోగ్యశాఖ సర్క్యులర్ జారీ చేసింది.
ప్రస్తుతం జిల్లాల్లో అందుబాటులో ఉన్న కేసీఆర్ కిట్‌లపై ఉన్న కేసీఆర్ ఫొటోపై తెల్లని స్టిక్కర్ అతికించి దానిపై ఎంసీహెచ్ కిట్ అని పేరు రాసి బాలింతలకు పంపిణీ చేస్తున్నారు. దాంతో పాటుగా గర్భిణులకు అందజేస్తున్న న్యూట్రీషియన్ కిట్‌లోని వస్తువులపై ఉన్న కేసీఆర్ ఫొటోలపై కూడా తెల్లని స్టిక్కర్ అతికించి ఇస్తున్నారు.
ప్రభుత్వ ఆదేశాల ప్రకారం పంపిణీ
రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల ప్రకారం కిట్‌లు పంపిణీ చేస్తున్నాం. ఎంసీహెచ్ పేరుతో ముద్రించిన కిట్‌లు వచ్చే వరకు.. ఇప్పటికే జిల్లాలో ఉన్న కిట్‌ల స్టాక్‌పై ఉన్న కేసీఆర్ పేరు, ఫొటోపై స్టిక్కర్లు అతికించి ఎంసీహెచ్ కిట్‌ల పేరు రాసి పంపిణీ చేస్తున్నాం. అలాగే న్యూట్రిషియన్ కిట్‌లలోని వస్తువులపై ఉన్న కేసీఆర్ ఫొటోలపై కూడా తెల్లని స్టిక్కర్ వేస్తున్నాం. – డాక్టర్ కొండల్‌రావు, డీఎంహెచ్‌ఓ, నల్లగొండ
Comments
Please login to add a commentAdd a comment