
గాయపడిన వాహిద్
అల్వాల్: గాలిపటం ఎగరవేసేందుకు వెళ్లిన ఓ యువకుడు ప్రమాదవశాత్తు గోదాంలో జారి పడిపోయిన సంఘటన ఆలస్యంగా గురువారం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే..అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హస్మత్‌పేట్‌కు చెందిన వాహిద్ వారం రోజుల క్రితం గాలిపటం ఎగరవేసేందుకు అదే ప్రాంతంలో ఉన్న మూతపడిన గోదాం పైకి ఎక్కాడు. పతంగి ఎగరవేస్తున్న అతను ప్రమాదవశాత్తు కాలుజారి లోపల పడిపోయాడు. ఈ ఘటనలో తీవ్ర గాయాలు కావడంతో అతను బయటికి రాలేకపోయాడు. బుధవారం రాత్రి గోదాం పక్కనే ఉన్న మరో గోదాంకు వచ్చిన కొందరు వ్యక్తులు వాహిద్ కేకలు విని అక్కడికి చేరుకుని అతడిని బయటికి తీసుకువచ్చారు. వారం రోజుల పాటు తిండి లేకపోవడంతో నిరసించిన అతడిని చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించార
Comments
Please login to add a commentAdd a comment