హైదరాబాద్‌: కోఠిలో అగ్ని ప్రమాదం | Hyderabad: Fire Accident In Koti | Sakshi
Sakshi News home page

Hyderabad: కోఠిలో అగ్ని ప్రమాదం

Published Sat, May 27 2023 4:15 PM | Last Updated on Sat, May 27 2023 4:23 PM

Hyderabad: Fire Accident In Koti - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్ కోఠి లోని ట్రూప్ బజార్ లో అగ్నిప్రమాదం సంభవించింది. ట్రూప్ బజార్ లోని ఎల్.ఈ.డి లైట్స్ గోదాంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హాటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్ని‍స్తున్నారు. ఈ క్రమంలో 4 ఫైర్ ఇంజన్లు మంటలను ఆర్పే పనిలో నిమగ్నమయ్యాయి.

ప్రమాద సమయానికి గోదాంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. మూడు అంతస్తుల ఈ భవనంలో రెండు అంతస్తులలో మాటలు వ్యాపించాయి.. దీంతో స్థానికులు.. వ్యాపారులు భయాందోళకు గురయ్యారు. ఈ అగ్నిప్రమాదం ఎలక్ట్రిక్ షాట్ సర్క్యూట్ వల్లనే జరిగిందని.. ప్రాధమికంగా నిర్దారించారు.

చదవండి: HYD: తనను పెళ్లి చేసుకోవాలని నా భర్తను వేధించింది.. మమత కీలక వ్యాఖ్యలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement