
హైదరాబాద్: పాతబస్తీలోఆదివారం సాయంత్రం వేళ భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఓ గోడౌన్‌లో అగ్ని ప్రమాదం జరగడంతో స్థానికంగా అలజడి రేకెత్తించింది. డబీర్‌పూరా పీఎస్ పరిధిలోని ఓ గోడౌన్‌లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదం ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటీనా అక్కడ చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు.
రెండు ఫైరింజన్లతో మంటలను అదుపు చేసే యత్నం చేస్తున్నారు అగ్ని మాపక సిబ్బంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగిందా.. లేక వేరే కారణాల వల్ల ఈ ప్రమాదం జరిగిందా అనే విషయం తేలాల్సి ఉంది. జనావాసాల మధ్యే ఈ గోడౌన్ ఉండటంతో స్థానికంగా ఉన్నవారిని ఖాళీ చేయించే యత్నం చేస్తున్నారు. ఈ ప్రమాదం సమాచారంతో ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలు కూడా అక్కడ చేరుకుని సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment