patabasti
-
పాతబస్తీ మెట్రో భూసేకరణలో కీలక ఘట్టం
సాక్షి, హైదరాబాద్: పాతబస్తీ మెట్రో భూసేకరణ ప్రక్రియ కీలక ఘట్టానికి చేరుకుంది. ప్రభావిత ఆస్తుల యజమానులకు రేపు(సోమవారం) చెక్కుల పంపిణీ చేయనున్నట్లు హెచ్ఏఎంఎల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి వెల్లడించారు. పాత నగరంలో రెండో దశ మెట్రో పనుల ప్రారంభించడానికి మార్గం సుగమం అవుతోంది. ప్రభావిత ఆస్తుల యజమానులకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించడానికి ముహూర్తం ఖరారు చేసింది.కారిడార్-6లో ఎంజీబీఎస్- చంద్రాయణ్ గుట్ట మార్గంలో 1100 ప్రభావిత ఆస్తులు ఉండగా, పెద్ద ఎత్తున వాటి యజమానులు స్వచ్ఛందంగా తమ స్థలాలను మెట్రో రైలు నిర్మాణం కోసం ఇవ్వడానికి ముందుకు వస్తున్నారని ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ఇప్పటివరకు 169 మంది వారి అనుమతి పత్రాలను ఇచ్చారని ఆయన వెల్లడించారు. వాటిలో 40కి పైగా ఆస్తుల యాజమాన్యానికి సంబంధించిన ధ్రువీకరణ పూర్తయిందన్నారు. తొలి దశలో ఈ 40కి పైగా ఆస్తుల యజమానులకు ఈ నెల 6వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు చెక్కుల పంపిణీ చేయాలని నిర్ణయించినట్లు ఎన్వీఎస్ రెడ్డి చెప్పారు.వారికి నష్టపరిహారాన్ని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి, హైదరాబాద్ ఇంచార్జి మంత్రి శ్రీ పొన్నం ప్రభాకర్, హైదరాబాద్ లోక్‌సభ సభ్యులు అసదుద్దీన్ ఒవైసీ చెక్కుల రూపంలో అందజేస్తారని తెలిపారు. ప్రభావిత ఆస్తులకు చదరపు గజానికి రు. 81,000/- ఇవ్వడానికి ఇప్పటికే జిల్లా కలెక్టర్ నిర్ణయించారని.. దీంతో పాటు రిలీఫ్ అండ్ రిహాబిలిటేషన్ చట్టం ప్రకారం, పునరావాస పరిహారం, తొలగించే నిర్మాణాలకు కూడా నష్టపరిహారాన్ని అర్హులైన ఆస్తుల యజమానికి ఇవ్వడం జరుగుతుందని ఎన్వీఎస్ రెడ్డి స్పష్టం చేశారు.ఇదీ చదవండి: సంక్రాంతికి సొంతూరు వెళ్లేదెలా?భూ సేకరణ చట్టానికి లోబడి నష్టపరిహారాన్ని జిల్లా కలెక్టర్ నిర్ణయం ప్రకారం పరిహారాలు చెల్లిస్తున్నామని ఆయన తెలిపారు. లక్డీకాపుల్ దగ్గర ఉన్న హైదరాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు అధికారులు త్వరిత గతిన మెట్రో పనులు చేపట్టడానికి సన్నాహాలు చేస్తున్నారని, దీనిలో భాగంగా తొలుత 40 కి పైగా ఆస్తుల యజమానులకు ఇప్పుడు చెక్కుల పంపిణీ చేస్తున్నామని ఆయన వెల్లడించారు. అధికారుల తరఫున మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, జిల్లా కలెక్టర్ శ్రీ అనుదీప్ దురిశెట్టి ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. -
షాదాబ్‌లో బిర్యానీ.. ఎంజే మార్కెట్లో ఐస్‌క్రీం..
చార్మినార్: రాష్ట్ర ఐటీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు శుక్రవారంరాత్రి ఉన్నట్టుండి పాతబస్తీలో సందడి చేశారు. ఎలాంటి ప్రొటోకాల్ సెక్యూరిటీ లేకుండా ఆ ప్రాంతంలో పర్యటించి స్థానికులను ఆశ్చర్యపరిచారు. మదీనాలోని షాదాబ్ హోటల్‌కు వచ్చిన ఆయన ముందుగా ఇరానీ ఛాయ్ ఆర్డర్ ఇచ్చారు. ఆర్డర్ తీసుకుంటున్న వెయిటర్ కేటీఆర్‌ను గుర్తుపట్టి సార్.. ఆప్ మినిస్టర్ సాబ్ హై.. నా (సార్.. మీరు మినిస్టర్ గారు కదా..) అంటూ ప్రశ్నించే లోపే అందరి దృష్టి ఇటువైపు పడింది. వెంటనే స్పందించిన హోటల్ యాజమాన్యం కేటీఆర్‌ను ఏసీ రూంకు తీసుకెళ్లి అక్కడ బిర్యానీ ఆర్దర్‌ఇచ్చారు. బిర్యానీ రుచిచూసిన అనం తరం ఆయన ఇరానీ ఛాయ్ తాగారు. హోటల్ సిబ్బందితోపా టు పలువురు కస్టమర్లు కేటీఆర్‌తో సెల్ఫీలు తీసుకున్నా రు. ఈ సందర్భంగా అక్కడున్నవారిని ఆయన ఆప్యాయంగా పలకరించారు. ‘చికెన్ బిర్యానీ తిన్నారా.. ఇక్కడ భలే ఉంటుంది కదా, బిర్యానీ..’అంటూ ఇద్దరు చిన్నారులతో మంత్రి ముచ్చటించారు. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ నాయకులు అక్కడికి చేరుకుని కేటీఆర్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. అంతకుముందు మొజంజాహీ మార్కెట్లోని ఐస్‌క్రీం రిఫ్రెష్మెంట్ ఏరియాలోకి వెళ్లి ఐస్‌క్రీం తిన్నారు. ఎన్నికల ప్రచారంలో క్షణం తీరిక లేకుండా తిరుగుతున్న కేటీఆర్ శుక్రవారం రాత్రి అకస్మాత్తుగా పాతబస్తీలో కాసేపు కాలక్షేపం చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఈ ఎన్నికలలో తమపార్టీ విజయం తథ్య మని ధీమా వ్య క్తం చేశారు. -
అలంపూర్, పాత బస్తీ మినహా!.. మిగిలిన అందరికీ బీఫాంలు ఇచ్చేసిన బీఆర్ఎస్
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ ప్రకటించిన అసెంబ్లీ అభ్యర్థులందరికీ బీఫాంల పంపిణీ పూర్తి కావస్తున్నా.. హైదరాబాద్ పాతబస్తీలోని ఎనిమిది అసెంబ్లీ సెగ్మెంట్లతో పాటు అలంపూర్ నియోజకవర్గం అభ్యర్థికి బీఫాంలు ఇప్పటివరకు అందించలేదు. రెండు నెలల కిందటే అభ్యర్థులను స్వయంగా పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ప్రకటించి, ఈ నెల 15వ తేదీ నుంచి బీఫాంల పంపిణీ ప్రారంభించారు. అలంపూర్‌లో చక్రం తిప్పుతున్న ఎమ్మెల్సీ... మరోవైపు అలంపూర్ (ఎస్సీ) నియోజకవర్గం అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే అబ్రహం పేరును ఆగస్టు 21న ప్రకటించిన జాబితాలో ఖరారు చేసినా నేటికీ బీఫాం ఇవ్వలేదు. గతంలో టీడీపీ నుంచి ఆలంపూర్ ఎమ్మెల్యేగా పనిచేసిన అబ్రహం 2018లో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. తిరిగి ఆయనకే మరోమారు పోటీ అవకాశం ఇస్తూ ఆలంపూర్ అభ్యర్థిగా పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించారు. దీంతో ఆయన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌ను కేటీఆర్‌ను తరచూ ప్రగతిభవన్, తెలంగాణలో భవన్లో కలిసి బీ ఫారం కోసం విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే అలంపూర్ రాజకీయాల్లో కీలక నేతగా ఉన్న చల్లా వెంకట్రామ్రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యే అబ్రహం అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం. ఉపాధి హామీ పథకంలో ఫీల్డ్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న తన అనుచరుడు విజయుడుకి టికెట్ ఇవ్వాల్సిందిగా ఎమ్మెల్సీ పల్లా ప్రతిపాదించినట్లు తెలిసింది. అబ్రహంకు టికెట్ ఇస్తే పార్టీకి చెందిన జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు, ఇతర క్షేత్ర స్థాయి నాయకులు పార్టీని వీడుతారని ఎమ్మెల్సీ చల్లా పార్టీ అధిష్టానానికి చెప్తున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే అబ్రహం మాత్రం పార్టీ కేడర్ తన వెంటే ఉందని ఇటీవల కేటీఆర్‌కు విన్నవించుకున్నారు. మొత్తంగా ఒకటి రెండు రోజుల్లో అలంపూర్ టికెట్ వ్యవహారం కొలిక్కి వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఆ తొమ్మిది సీట్లు మినహా.. 119 అసెంబ్లీ స్థానాలకు గానూ కేసీఆర్ సహా 110 మంది అభ్యర్థులు బీ ఫాంలు కూడా అందుకున్నారు. నర్సాపూర్ అభ్యర్థి పేరుపై కూడా రెండు నెలలుగా కొనసాగిన సస్పెన్స్‌కు తెరదించుతూ మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డికి బీ ఫాం అందజేశారు. పాతబస్తీలోని 8 అసెంబ్లీ నియోజకవర్గాలకుగాను నాంపల్లి, గోషామహ ల్ నియోజకవర్గాల అభ్యర్థుల పేర్లు ఇంకా ఖరారు కావాల్సి ఉంది. తీగల అజిత్‌రెడ్డి (మలక్‌పేట), అయిందాల కృష్ణ (కార్వాన్), ఇబ్రహీంలోడీ (చార్మినార్), ఎం.సీతారాంరెడ్డి (చాంద్రాయణగుట్ట), సామ సుందర్‌రెడ్డి (యాకుత్‌పురా), అలీ బాఖ్రీ (బహదూర్‌పురా) కు టికెట్లు ఖరారు చేసినా బీ ఫాంలు జారీ చేయలేదు. ఇక నాంపల్లి నుంచి ఆనంద్‌గౌడ్, గోషామహల్ నుంచి నందకిషోర్ వ్యాస్ పేర్లు ఖరారైనట్లు ప్రచారం జరుగుతున్నా పార్టీ నుంచి ఎలాంటి ప్రకటనా వెలువడలేదు. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై సస్పెన్షన్ ఎత్తివేసి బీజేపీ టికెట్ ఇచి్చన నేపథ్యంలో ఇక్కడ బీఆర్ఎస్ ప్రతివ్యూహానికి పదును పెడుతోంది. చదవండి: రాజగోపాల్ బాటలో డీకే అరుణ కూడా? -
Hyderabad Bonalu: నేడు,రేపు పాతబస్తీలో ట్రాఫిక్ ఆంక్షలు
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 16,17 తేదీల్లో పాతబస్తీలో నిర్వహించే బోనాల జాతర ఉత్సవాలు, సామూహిక ఘటాల ఊరేగింపు సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతాయని నగర ట్రాఫిక్ అడిషనల్ పోలీస్ కమిషనర్ ఒక ప్రకటనలో తెలిపారు. దక్షిణ మండలంలోని ఫలక్‌నుమా, చార్మినార్, మీర్‌చౌక్, బహదూర్‌పురా ట్రాఫిక్ పోలస్స్టేషన్ల పరిధిలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగనున్నందున వాహనాలను ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా మళ్లింపు ఉంటుందన్నారు. ఈ నెల 16 నుంచి 17వ తేదీ రాత్రి 11 గంటల వరకు దారి మళ్లింపులు ఉంటాయన్నారు. చదవండి: తెలంగాణ ఆర్టీసీ బంపర్ ఆఫర్ ఆషాఢ మాసం బోనాలకు భాగ్యనగరం ముస్తాబైంది. పాతబస్తీతో సిటీ వ్యాప్తంగా సంబరాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. డప్పు చప్పుళ్లు.. బ్యాండ్ మేళాలు.. పోతరాజుల విన్యాసాలు.. శివసత్తుల పూనకాలు.. భక్తుల భావోద్వేగాల మధ్య బోనాల జాతర ఆద్యంతం ఆధ్యాత్మిక వైభవాన్ని చాటుకుంటోంది. గత నెల 22న గోల్కొండ జగదాంబ అమ్మవారికి సమర్పించిన బోనంతో ఆషాఢ మాసం బోనాల జాతర ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా ఈ నెల 7న పాతబస్తీలోని చారిత్రాత్మక పురాతన దేవాలయాల అమ్మవార్లకు కలశ స్థాపన, అభిషేకం, అలంకరణ, నైవేద్యం, తీర్థ ప్రసాదాలతో బోనాల జాతర ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ నెల 9న అమ్మవారి ఘటస్థాపన సామూహిక ఊరేగింపు కార్యక్రమాన్ని కన్నుల పండువగా నిర్వహించారు. ఘటస్థాపన అనంతరం వరుసగా ప్రతిరోజూ పూజలు నిర్వహించిన భక్తులు.. నేడు అమ్మవారికి పెద్ద ఎత్తున బోనాలు సమర్పిస్తున్నారు. సోమవారం పాతబస్తీ ప్రధాన వీధుల్లో అమ్మవారి సామూహిక ఘటాల ఊరేగింపు కన్నుల పండువగా జరగనుంది. -
Hyderabad: పాతబస్తీలో భారీ అగ్ని ప్రమాదం
హైదరాబాద్: పాతబస్తీలోఆదివారం సాయంత్రం వేళ భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఓ గోడౌన్లో అగ్ని ప్రమాదం జరగడంతో స్థానికంగా అలజడి రేకెత్తించింది. డబీర్‌పూరా పీఎస్ పరిధిలోని ఓ గోడౌన్లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదం ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటీనా అక్కడ చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. రెండు ఫైరింజన్లతో మంటలను అదుపు చేసే యత్నం చేస్తున్నారు అగ్ని మాపక సిబ్బంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగిందా.. లేక వేరే కారణాల వల్ల ఈ ప్రమాదం జరిగిందా అనే విషయం తేలాల్సి ఉంది. జనావాసాల మధ్యే ఈ గోడౌన్ ఉండటంతో స్థానికంగా ఉన్నవారిని ఖాళీ చేయించే యత్నం చేస్తున్నారు. ఈ ప్రమాదం సమాచారంతో ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కూడా అక్కడ చేరుకుని సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాయి. -
BJP MLA Raja Singh: అరెస్ట్.. టెన్షన్
సాక్షి, హైదరాబాద్ /చార్మినార్/అబిడ్స్: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను పోలీసులు గురువారం మరోసారి అరెస్ట్ చేయడంతో ధూల్‌పేట్‌లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఉదయం మంగళ్‌హాట్, షాహినాయత్‌గంజ్ పోలీసులు రాజాసింగ్‌కు నోటీసులు జారీ చేశారు. మధ్యాహ్నం వెస్ట్‌జోన్ పోలీసులతో పాటు టాస్‌్కఫోర్స్ పోలీసులు ఆయనను అరెస్ట్ చేయడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రాజాసింగ్ ఇంటి వద్ద ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లకు వ్యతిరేకంగా బీజేపీ కార్యకర్తలు నినాదాలు చేశారు. రాజాసింగ్ ఇంటి పరిసర ప్రాంతాల్లో పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి ఆయనను అరెస్ట్ చేశారు. ధూల్‌పేటతో పాటు గోషామహల్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. చార్మినార్ వద్ద బలగాల పహారా రాజాసింగ్ అరెస్టుకు నిరసనగా వ్యాపారులు దుకాణాలను మూసివేశారు. కొంతమంది బీజేపీ కార్యకర్తలు ద్విచక్ర వాహనాలపై వచ్చి దుకాణాలను మూసివేయించగా పలు ప్రాంతాల్లో స్వచ్ఛందంగా మూసివేశారు. ఫీల్‌ఖానా, బేగంబజార్, కోల్సివాడి, ఛత్రి, మిట్టికాషేర్, సిద్దిఅంబర్ బజార్, బర్తన్‌బజార్ ప్రాంతాల్లో దాదాపు వెయ్యిమంది వ్యాపారులు తమ దుకాణాలను మూసివేశారు. రాజాసింగ్ అరెస్టుతో ఎంజే మార్కెట్ చౌరస్తాలో ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మను బీజేపీ కార్యకర్తలు, రాజాసింగ్ అభిమానులు దహనం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు, మంత్రి కేటీఆర్‌లకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మజ్లిస్, టీఆర్ఎస్లు కక్షతోనే ఎమ్మెల్యేని అరెస్ట్ చేశాయని ఆవేదన వ్యక్తం చేశారు. గోషామహల్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసన వ్యక్తం చేశారు. బేగంబజార్, జాంబాగ్, ధూల్‌పేట్, మంగళ్‌హాట్, చుడీబజార్ తదితర ప్రాంతాల్లో ప్రజలు రాజాసింగ్ అరెస్టుపై చర్చించుకోవడం కనిపించింది. కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేస్తున్న రాజాసింగ్ అభిమానులు ఈ రోజు గడిస్తే చాలు! శుక్రవారం.. సాధారణ పరిస్థితుల్లోనే నగర పోలీసులు దీనిపై ప్రత్యేక శ్రద్ధ పెడతారు. అలాంటిది ప్రస్తుతం నెలకొన్న పరిణామాల నేపథ్యంలో అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారు. కేవలం పాతబస్తీలోనే కాకుండా నగర వ్యాప్తంగా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. నగరం సోమవారం రాత్రి నుంచి అట్టుడుకుతోంది. గురువారం సాయంత్రానికి సాధారణ పరిస్థితులు నెలకొన్నా.. ఎలాంటి ఏమరుపాటుకు తావివ్వకూడదని నిర్ణయించారు. దక్షిణ, తూర్పు, పశ్చిమ మండలాల్లోని పోలీసు స్టేషన్ల పరిధితో పాటు మిగిలిన చోట్లా ప్రత్యేక బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. బేగం బజార్లో భారీగా మోహరించిన పోలీసులు స్పెషల్ టీమ్స్ ఏర్పాటు.. బారికేడ్లు, సున్నిత ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన పికెట్ల వద్ద ఉన్న సిబ్బందికి తోడు అత్యవసర సమయాల్లో వి«నియోగించడానికి స్టైకింగ్ ఫోర్స్ టీమ్స్‌ను సిద్ధం చేస్తున్నారు. సమస్యాత్మక వ్యక్తుల కదలికలను కనిపెట్టి, వెంబడించడానికి మఫ్టీల్లో ఉండే షాడో పారీ్టలు ఏర్పాటు చేశారు. అవసరాన్ని బట్టి నగరంలోని ఏ ప్రాంతానికైనా తరలించేందుకు వీలుగా కొన్ని ప్రత్యేక బలగాలను రిజర్వ్‌లో ఉంచారు. విధుల్లో ఉన్న ఐపీఎస్ అధికారుల వెంట కొన్ని రిజర్వ్ టీమ్స్ ఉంటాయి. ఇవి సదరు అధికారి వెంటే ఉంటూ అవసరమైన చోటకు వెళ్తాయి. నగర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో అణువణువు నిఘా ఉంచి, చిత్రీకరించడానికి వీడియో, డిజిటల్ కెమెరాలతో ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేస్తున్నారు. పీస్ కమిటీలతో పోలీసులు ముందుకు వెళ్తున్నారు. అత్యంత అప్రమత్తంగా.. బందోబస్తు, భద్రత ఏర్పాట్లను నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. శుక్రవారం ప్రార్థనల నేపథ్యంలో పాతబస్తీలోని ప్రాంతాలతో పాటు మిగిలిన చోట్లా అత్యంత అప్రమత్తత ప్రకటించారు. దీనికి సంబంధించి కమిషనర్ గురువారం విస్తృత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. సీవీ ఆనంద్ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశానికి నగర అధికారులతో పాటు బందోబస్తు కోసం జిల్లాలు, ఇతర విభాగాల నుంచి వచ్చిన అధికారులు హాజరయ్యారు. ఇందులో శుక్రవారం అమలు చేయాల్సిన వ్యూహాన్ని ఖరారు చేశారు. అత్యంత సున్నిత ప్రాంతాలు ఎక్కువగా ఉన్న దక్షిణ, తూర్పు, పశ్చిమ మండలాలతో పాటు సోమవారం రాత్రి నుంచి నిరసనలు చోటు చేసుకున్న చోట్ల ప్రత్యేక దృష్టి పెట్టనున్నారు. నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరాల్లోని దృశ్యాలను కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్ నుంచి పర్యవేక్షించనున్నారు. అనుమానాస్పద కదలికలు ఇతర వ్యవహారాలను పసిగట్టడానికి వీటిని ఉపయోగించనున్నారు. దీని కోసం కంట్రోల్ రూమ్‌లో ప్రత్యేక సిబ్బందిని నియమించారు. రాజాసింగ్ అరెస్టును నిరశిస్తూ దుకాణాలు మూసివేత బోసిపోయిన పాతబస్తీ: పాతబస్తీలో గురువారం ప్రశాంత వాతావరణం కనిపించింది. ఉదయం నుంచీ సాయంత్రం ఎలాంటి నిరసన కార్యక్రమాలు.. ఆందోళనలు జరగలేదు. శాలిబండ చౌరస్తా వద్ద బుధవారం అర్ధరాత్రి నుంచి గురువారం తెల్లవారుజాము వరకు మజ్లిస్ నాయకులతో పాటు ఆ పార్టీ అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ప్రధాన రోడ్లపైకి వచ్చి రాజాసింగ్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాజాసింగ్‌ను అరెస్ట్ చేసి జైలుకు పంపే వరకు తమ ఆందోళన కొనసాగుతుందని పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో దక్షిణ మండలం పోలీసులు లాఠీ చార్జి చేశారు. విషయం తెలుసుకున్న శాలిబండ మజ్లిస్ కార్పొరేటర్ ముజఫర్ ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. కాగా.. రెండు మూడు రోజులుగా పాతబస్తీలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా గురువారం ఉదయం నుంచి సాయంత్రం వరకు చార్మినార్ వద్ద సందర్శకుల సందడి తగ్గింది. చిరు వ్యాపారాలు వెలవెలబోయాయి. నయాపూల్, మదీనా, మీరాలంమండి, పత్తర్‌గట్టి, గుల్జార్‌హౌజ్, చార్‌కమాన్, లాడ్‌బజార్ తదితర ప్రాంతాల్లోని రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. పాతబస్తీలో ఎలాంటి నిరసన ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహించుకోవడానికి ఎవరికి ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని దక్షిణ మండలం డీసీపీ సాయి చైతన్య తెలిపారు. ప్రాంతాలను బట్టి ఏర్పాట్లు.. నగర వ్యాప్తంగా ఏర్పాటు చేస్తున్న ఈ బందోబస్తులో ప్రాంతాల స్థితిగతులను బట్టి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఎలాంటి ఉద్రిక్తతలు, ఉద్రేకాలకు తావు లేని చోట్ల సాధారణ స్థాయి పెట్రోలింగ్ నిర్వహించనున్నారు. రాజధానిలోని అన్ని ప్రాంతాల్లో తనిఖీలు, సోదాలు, నాకాబందీలు నిర్వహించాలని నిర్ణయించారు. గురువారం రాత్రి నుంచే ఇవి ప్రారంభం కానున్నాయి. సున్నిత, సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక ఫుట్ పెట్రోలింగ్ నిర్వహించనున్నారు. కేవలం ప్రధాన రహదారులకే పరిమితం కాకుండా గల్లీలు, మారుమూల ప్రాంతాల్లోనూ చేపట్టాలని సిబ్బందికి ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. బుధవారం అర్ధరాత్రి, గురువారం తెల్లవారుజామున సైతం పాతబస్తీలోని కొన్ని ప్రాంతాల్లో ఆందోళనలు చెలరేగాయి. రాజేష్ మెడికల్ హాల్ వద్ద పోలీసులపై నిరసనకారులు రాళ్లు రువ్వారు. వీరిని వెంటనే అదుపులోకి తీసుకున్న పోలీసులు అనంతరం వదిలిపెట్టారు. బుధవారం మొఘల్‌పురా వద్ద పోలీసు వాహనం ధ్వంసానికి సంబంధించి స్థానిక ఠాణాలో కేసు నమోదైంది. (చదవండి: రాజా సింగ్‌పై పీడీ యాక్ట్.. ఈ చట్టం ఉద్దేశం ఏంటి?) -
పాతబస్తీలో బీజేపీ పాగా వేస్తుందా?.. వ్యూహం ఇదేనా?
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ మహానగరం మినీ భారతదేశం. రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలతో పాటు.. ఉత్తరాదివారు ఎక్కువగా నివసించే నగరం హైదరాబాద్. పైగా మైనారిటీలు కూడా అధికంగా ఉండే ప్రాంతం. ఇక్కడ ఒక్కో నియోజకవర్గం వైవిధ్యభరితంగా ఉంటుంది. సామాజిక సమీకరణాల్లో కూడా విభిన్నమైన నగరం. అందుకే ఏ పార్టీ అయినా హైదరాబాద్ నగరాన్ని గెలవాలనుకుంటుంది. వచ్చే ఎన్నికల్లో రాజధాని నగరం మీద ఏ పార్టీ పట్టు సాధించే అవకాశం ఉంది. పోటీలో నిలిచేదెవరు? గెలిచేదెవరు? రాజధాని రాజకీయాలపై సాక్షి ప్రత్యేక కథనాలు. చదవండి: ‘రాజాసింగ్ సస్పెన్షన్ పెద్ద డ్రామా.. కేంద్ర పెద్దల హస్తం ఉందా?’ తెలంగాణలో ముందస్తు ఎన్నికల ఊహాగానాలతో రాజకీయాలు ఊపందుకున్నాయి. హైదరాబాద్ జిల్లాలో మొత్తం 15 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. తెలంగాణ సెంటిమెంట్‌కు అతీతంగా హైదరాబాద్ ప్రజల తీర్పు ఉంటోంది. పాతబస్తీలోని 7 నియోజకవర్గాల్లో మజ్లిస్ పార్టీ ఆధిపత్యం కొనసాగుతోంది. న్యూ సిటీలోని 8 సెగ్మెంట్లలో ఆధిపత్యం కోసమే అన్ని పార్టీలు పోరాడుతున్నాయి. ఇందుకోసం అప్పుడే కసరత్తు కూడా ప్రారంభించేశాయి. కోటికి పైగా ఉన్న జనాభాతో నగరం కిక్కిరిసి ఉండటంతో పార్టీల ప్రచారం కూడా అంతే స్థాయిలో ఉంటుంది. చాలా సెగ్మెంట్లలో టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్, మజ్లిస్ పార్టీల మధ్య త్రిముఖ పోరు హోరా హోరీగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. గ్రేటర్ నగరపాలక సంస్థ ఎన్నికల్లో పెద్ద సంఖ్యలో డివిజన్లు సాధించుకున్న కాషాయ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బలం నిరూపించుకోవాలని తహతహలాడుతోంది. అదేవిధంగా పార్టీల్లో టిక్కెట్ల కోసం పోటీ కూడా ఎక్కువగానే ఉంది. గత ఎన్నికల్లో గోషామహల్ సీటులో బీజేపీ విజయం సాధించింది. మిగిలిన ఏడు సీట్లు టీఆర్ఎస్ గెలుచుకుంది. ప్రస్తుతం పోటీ తీవ్రంగా ఉన్నందున గులాబీ పార్టీ కొందరు సిటింగ్‌లను మారుస్తుందనే ప్రచారం సాగుతోంది. పాతబస్తీలోని సీట్లను గెలవడం బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్‌లకు కష్టమే అయినప్పటికీ ఈ పార్టీలు సీరియస్‌గానే ప్రయత్నిస్తున్నాయి. అదే వ్యూహంతో బీజేపీ ఎమ్మెల్యేలు లేవనెత్తుతున్న సున్నిత అంశాలు కూడా చర్చనీయాంశమవుతున్నాయి. తాజాగా ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు, దానిపై వెల్లువెత్తిన నిరసనలు, పార్టీలోనే అసంతృప్తి.. ఇవన్నీ కూడా ఎన్నికలను ప్రభావితం చేసే అంశాలు. ఇన్నాళ్లు పాత బస్తీని ప్రయోగ క్షేత్రంగా తీసుకున్న బీజేపీ నేతలు ఇప్పుడు ఎలాగైనా అక్కడ పాగా వేయాలని గట్టిగా ప్రయత్నిస్తున్నారు. పాతబస్తీకి బ్రాండ్ అంబాసిడర్ చార్మినార్‌కు కూతవేటు దూరంలో ఉన్న భాగ్యలక్ష్మి దేవాలయం నుంచే బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఏ కార్యక్రమాన్నయినా చేపడుతున్నారు. హోంమంత్రి అమిత్‌షా, ఢిల్లీ నుంచి ఏ ప్రముఖులు వచ్చినా ఇక్కడ పూజలు నిర్వహించడం వల్ల బీజేపీ ఓ వర్గం ఓట్లన్నింటిని కేంద్రీకృతం చేసే వ్యూహాంలో ఉన్నట్టు కనిపిస్తోంది. న్యూ సిటీలోని సెగ్మెంట్లలో టీఆర్ఎస్ అసంతృప్త నేతలు, కార్పోరేటర్లను తమవైపు తిప్పుకునేందుకు కాంగ్రెస్, బీజేపీలు ప్రయత్నిస్తున్నాయి. అయితే ఈ రెండు పార్టీలలో ఇప్పటికే టిక్కెట్ల కోసం తీవ్ర పోటీ నెలకొంది. ప్రతీ నియోజకవర్గంలో కనీసం ఇద్దరు, ముగ్గురు నేతలు పోటీ పడుతున్నారు. అన్ని పార్టీలు తమ బలాలు, బలహీనతలపై అంతర్గత సర్వేలు చేయించుకుంటున్నాయి. సర్వేలో వెల్లడైన సానుకూల అంశాలు, సామాజిక సమీకరణాలను బేరీజు వేసుకుని టిక్కెట్లు కేటాయించేందుకు సిద్ధం అవుతున్నాయి. దీంతో రాజధాని నగర రాజకీయం వేడెక్కుతుంది. -
హైదరాబాద్ ప్రజలకు గుడ్‌న్యూస్.. మళ్లీ ఏక్ షామ్.. చార్మినార్ కే నామ్
చార్మినార్: కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా తాత్కాలికంగా రద్దయిన ఏక్ షామ్.. చార్మినార్ కే నామ్ కార్యక్రమం ఈ నెల 21 (నేటి) నుంచి తిరిగి ప్రారంభమవుతుంది. ఇప్పటికే ట్యాంక్ బండ్‌పై సండే ఫన్ డే ప్రారంభమైంది. ఈ ఆదివారంతో ఏక్ షామ్.. చార్మినార్ కే నామ్ కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభిస్తున్నామని కులీకుతుబ్‌షా నగరాభివృద్ది సంస్థ కార్యదర్శి తెలిపారు. స్టాల్స్‌తో పాటు ఇతర వ్యాపార సంస్థల స్టాల్స్ కొనసాగిస్తామని.. వినోదాత్మక కార్యక్రమాలు ప్రస్తుతానికి ఉండవని ఆయన తెలిపారు. సాయంత్రం 5 నుంచి రాత్రి 10 గంటల వరకు ఈ కార్యక్రమం కొనసాగనుంది. ఇందుకోసం ఇప్పటికే అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కాగా.. శనివారం పాతబస్తీలోని పర్యాటక ప్రాంతాలు సందర్శకులతో రద్దీగా మారాయి. చార్మినార్ కట్టడంతో పాటు హెచ్‌ఈహెచ్ నిజాం మ్యూజియం, సాలార్ జంగ్ మ్యూజియం, చౌమహల్లా ప్యాలెస్, లాడ్‌బజార్ తదితర ప్రాంతాలలో సందర్శకుల సందడి కనిపించింది. (చదవండి: ప్రీలాంచ్ మాయ ) -
పాతబస్తీ మెట్రోపై మళ్లీ కదలిక!
సాక్షి, హైదరాబాద్: పాతబస్తీకి మెట్రో ఏర్పాటుపై మళ్లీ కదలిక వచ్చింది. ఈ మార్గంలో మెట్రో ఏర్పాటుకు అడ్డు తొలగించాల్సిన ఆస్తుల గుర్తింపు, విద్యుత్ స్తంభాలు, కేబుల్స్, తాగునీరు, మురుగు నీటి పైపులైన్లను గుర్తించే ప్రక్రియను ప్రారంభించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. కాగా మెట్రో మొదటి దశ ప్రాజెక్టులో భాగంగా చేపట్టాల్సిన ఎంజీబీఎస్–ఫలక్‌నుమా(5.5 కి.మీ)మార్గం ఏర్పాటు ప్రక్రియ అనేక అవాంతరాల నేపథ్యంలో నిలిచిపోయిన విషయం విదితమే. తాజా అంచనాల నేపథ్యంలో ఈ మార్గం పూర్తికి సుమారు రూ.1500 కోట్లు వ్యయం కానుందని ప్రాథమికంగా భావిస్తున్నారు. ఈ ఏడాది వార్షిక బడ్జెట్లో ప్రభుత్వం రూ.500 కోట్లు కేటాయించడంతో ఈ ప్రాజెక్టు పూర్తిపై ఆశలు చిగురిస్తున్నాయి. అడ్డంకులు వేనవేలు.. పాతనగరంలో మెట్రో మార్గాన్ని ఏర్పాటుచేసేందుకు సుమారు వెయ్యి ఆస్తులను సేకరించాల్సి ఉంది. వీటికి సుమారు రూ.వంద కోట్లకుపైగా నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుంది. ఎంజీబీఎస్– ఫలక్‌నుమా రూట్లో 5.5 కి.మీ మార్గంలో మెట్రో ప్రాజెక్టును ఏర్పాటు చేయడంతోపాటు సాలార్జంగ్ మ్యూజియం, చార్మినార్, శాలిబండ, ఫలక్‌నుమా, శంషీర్‌గంజ్ ప్రాంతాల్లో ఐదు మెట్రో స్టేషన్లను నిర్మించాల్సి ఉంది. ఇందుకు రూ.1500 కోట్లు వ్యయం చేయాల్సి ఉంటుందని అంచనావేస్తున్నారు. ఇక ఆస్తుల సేకరణ ఆలస్యమైతే పనులు చేపట్టేందుకు అవసరమైన రైట్ఆఫ్ వే స్థల సమస్యల కారణంగా ప్రాజెక్టు నిర్మాణ గడువు ఆలస్యమయ్యే ప్రమాదం పొంచి ఉంది. పనులు ఆలస్యమైతే నిర్మాణ వ్యయం కూడా భారీగా పెరిగే అవకాశం ఉంది. ఇక ఈ రూట్లో సుమారు 69 వరకు ఉన్న ప్రార్థనాస్థలాలకు నష్టం వాటిల్లుతుందన్న ఆందోళనలు సైతం వ్యక్తమౌతున్నాయి. ఈ సమస్యల కారణంగానే గతంలో తొలిదశ మెట్రో నిర్మాణ సంస్థ ఎల్అండ్టీ ఓల్డ్‌సిటీలో మెట్రో పనులు చేపట్టేందుకు విముఖత వ్యక్తం చేసిన విషయం విదితమే. తొలిదశ మెట్రో మార్గాల్లో పనుల ఆలస్యం కారణంగా వాణిజ్య బ్యాంకుల నుంచి సేకరించిన రుణాలపై వడ్డీ, ఇతరత్రా నిర్మాణ వ్యయాలు పెరగడంతో అదనంగా రూ.4 వేల కోట్లు నిర్మాణ వ్యయం పెరిగింది. ఈ మొత్తాన్ని సైతం తమకు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలని నిర్మాణ సంస్థ వర్గాలు ప్రభుత్వంతో గతంలో పలు మార్లు సంప్రదింపులు జరిపాయి. కనీసం సాఫ్ట్‌లోన్ అయినా మంజూరు చేయాలని విజ్ఙప్తి చేసినప్పటికీ ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన లభించలేదు. మరోవైపు ఈ మెట్రో మార్గాన్ని బహదూర్‌పూరా –కాలాపత్తర్– ఫలక్‌నుమా మీదుగా మళ్లించాలన్న డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి. ఈ అవాంతరాలను అధిగమించి మెట్రోను పూర్తిచేసి ఓల్డ్‌సిటీ వాసులకు మెట్రో కలను సాకారం చేయాలని సిటీజనులు కోరుతున్నారు. (చదవండి: 12 సీసీకెమెరాలు పెట్టినా...రూ.40 లక్షలు స్వాహా) -
సాహోరే.. వారధులు! పాతబస్తీకే మణిహారాలు
సాక్షి, హైదరాబాద్: ఇప్పటి వరకు ఐటీ కారిడార్లున్న, ఐటీ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు అధిక సంఖ్యలో ఉన్న శేరిలింగంపల్లి, కూకట్పల్లి జోన్లు.. ఐటీ తదితర సంస్థలున్న ఉప్పల్ జోన్, కోర్‌సిటీలోని ఖైరతాబాద్, సికింద్రాబాద్‌లలో ఎస్సార్డీపీ కింద పలు ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లు అందుబాటులోకి తెచ్చిన ప్రభుత్వం.. ప్రస్తుతం పాతబస్తీ ప్రాంతమైన చార్మినార్ జోన్‌వైపు దృష్టి సారించింది. ఇటీవలే డాక్టర్ అబ్దుల్‌కలాం ఫ్లై ఓవర్ వినియోగంలోకి రాగా.. రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం వైపు నుంచి కోర్‌సిటీలోకి రాకపోకలు సాగించేవారికి ఉపకరించే రెండు ఫ్లైఓవర్లు త్వరలో పూర్తి కానున్నాయి. వీటిలో ఆరాంఘర్– జూపార్క్ ఫ్లై ఓవర్ వ్యూహాత్మక రహదారుల పథకం (ఎస్సార్డీపీ)లో భాగంగా జీహెచ్ఎంసీ ఇప్పటి వరకు నిర్మించిన అన్ని ఫ్లై ఓవర్లకంటే పెద్దది. ఇటీవలే ప్రారంభమైన షేక్‌పేట ఫ్లై ఓవర్ (పొడవు 2.71 కి.మీ.) కంటే కూడా ఇదే పెద్దది. దీని పొడవు దాదాపు 4 కి.మీ. బహదూర్‌పురా జంక్షన్ వద్ద మరో ఫ్లై ఓవర్ నిర్మిస్తున్నారు. ఈ రెండూ వినియోగంలోకి వస్తే విమానాశ్రయం వెళ్లే వారితోపాటు మహబూబ్‌నగర్ తదితర ప్రాంతాలకు వెళ్లే వారికి, జూపార్క్ సందర్శకులకు, పాతబస్తీ ప్రజలకు సమయం కలిసి వస్తుంది. రెండింటికీ అయ్యే ఖర్చు దాదాపు రూ. 706 కోట్లు. సీఎస్ సోమేశ్‌కుమార్ తనిఖీ ► రెండు ఫ్లై ఓవర్ల నిర్మాణాల్ని వేగవంతం చేసి, నిర్ణీత వ్యవధి కంటే ముందే పూర్తి చేయాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ అధికారులను ఆదేశించారు. బహదూర్‌పురా జంక్షన్‌లోని నిర్మాణ పనులను బుధవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ► ఆరాంఘర్– జూపార్కు ఫ్లై ఓవర్ పనుల్ని కూడా వీలైనంత త్వరితంగా పూర్తిచేయాలనగా వచ్చే సంవత్సరం మార్చినాటికి పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు. ఆస్తుల సేకరణలో ఎదురవుతున్న ఇబ్బందుల్ని సీఎస్ దృష్టికి తేగా.. ఫ్లై ఓవర్ మౌలిక డిజైనింగ్‌కు అంతరాయం కలుగకుండా సేకరించాల్సిన మొత్తం 163 ఆస్తుల్లో కొన్నింటిని మినహాయించాల్సిందిగా సూచించారు. ► సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. బహదూర్‌పురా జంక్షన్ ఫ్లై ఓవర్ ► అంచనా వ్యయం: రూ.69 కోట్లు ► పొడవు: 690 మీటర్లు ► లేన్లు: 6(రెండు వైపులా ప్రయాణం) ► వెడల్పు: 24 మీటర్లు ► ఇరవయ్యేళ్లకు పెరిగే ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకొని ఈ ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టారు. బహదూర్‌పురా జంక్షన్ వద్ద ప్రస్తుతమున్న ట్రాఫిక్ చిక్కులు ఉండవు. సిగ్నల్ ఫ్రీగా సాగిపోవచ్చు. ► దాదాపు 70 శాతం పనులు పూర్తయిన ఈ ఫ్లైఓవర్ ఈ సంవత్సరం అందుబాటులోకి రానుంది. ఆరాంఘర్– జూపార్కు ఫ్లైఓవర్ ► అంచనా వ్యయం: రూ.636.80 కోట్లు ► పొడవు: 4.04 కి.మీ. ► లేన్లు: 6 (రెండు వైపులా ప్రయాణం) ► వెడల్పు: 24 మీటర్లు ► 2037 నాటికి రద్దీ సమయంలో 5210 వాహనాలను పరిగణనలోకి తీసుకొని ఈ ఫ్లైఓవర్‌ను నిర్మిస్తున్నారు. ► ఇది అందుబాటులోకి వస్తే ప్రస్తుతమున్న ట్రాఫిక్ సిగ్నళ్లు తాడ్బన్, దానమ్మహట్స్, హసన్‌నగర్ జంక్షన్ల వద్ద ఎక్కడా ఆగకుండా నేరుగా రయ్‌మని వెళ్లిపోవచ్చు. ► తద్వారా ప్రయాణ సమయం తగ్గడంతోపాటు లూబ్రికెంట్స్, ఇంధన వ్యయం తగ్గుతుంది. వాయు కాలుష్యం తగ్గి, ప్రజలకు ఆరోగ్య సమస్యలు కూడా తగ్గుతాయి. వచ్చే సంవత్సరం దీన్ని అందుబాటులోకి తేనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. -
బతుకు చిత్రం : మేమూ ఉన్నాం
-
పాతబస్తీలో కాంగ్రెస్ టీఆర్ఎస్ ఎలాంటి అభివృద్ధి చేయలేదు
-
పాతబస్తీలో డ్రోన్ కెమెరా కలకలం
-
చిత్రగుప్తుడి ఆలయం
చిత్రగుప్తుడి పేరు వినే ఉంటారు కదా... యమధర్మరాజు వద్ద పాపుల చిట్టాపద్దులు చూసే ఆయన. ఆయనకు ఒక ఆలయం ఉంది. మృత్యుదేవత అయిన యమధర్మరాజుకు ఆలయాలు ఉన్నప్పుడు ఆయన అనుంగు అనుచరుడైన చిత్రగుప్తుడికి కూడా ఆలయాలు లేకపోతే ఎలా మరి... ఈ లోటు తీర్చడానికే కాబోలు... హైదరాబాద్ పాతబస్తీలోని ఉప్పుగూడ రైల్వేస్టేషన్‌కు సమీపంలోగల ఛత్రినాకలో చిత్రగుప్త మహాదేవుడి ఆలయం ఉంది. సుమారు రెండున్నర శతాబ్దాల క్రితం నిర్మించినట్లుగా భావిస్తున్న ఈ ఆలయంలో నిత్యం పూజలు జరుగుతుంటాయి. అన్నట్టు చిత్రగుప్తుడి నోము కూడా ఉంది తెలుసు కదా... పాపప్రక్షాళన జరిగి, ఆయుష్షు పెంచుకునేందుకు నోచే నోమది. స్త్రీలు సుమంగళిత్వం కోసం నోచుకుంటారా నోమును. విశాలమైన ప్రాంగణంలో గల ఈ ఆలయంలో చిత్రగుప్తుడితోపాటు ఆయన దేవేరులు, ఆయన సంతానానికి కూడా విగ్రహాలున్నాయి. కాయస్థ వంశస్తులు తమ కులదైవంగా చిత్రగుప్తుని కొలుస్తుంటారు. -
పోలీసుల అదుపులో 267 మంది యువకులు
- పాతబస్తీలో ఆపరేష్న్ చబుత్రా హైదరాబాద్: నగరంలోని పాతబస్తీలో శుక్రవారం రాత్రి పోలీసులు ఆపరేషన్ చబుత్ర నిర్వహించారు. బస్తీలోని పలు ప్రాంతాల్లో అర్ధరాత్రి దాటాక గుమిగూడి కాలక్షేపం చేస్తున్న 267 మంది యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో మైనర్లు కూడా ఉన్నారు. గతంలో నిర్వహించిన ఆపరేషన్‌లో పట్టుబడి.. మళ్లీ ఇప్పుడు చిక్కిన వారిపై పెట్టీ కేసుల నమోదు చేశారు. పలువురు అనుమానితుల నుంచి వేలి ముద్రలు సేకరించారు. శనివారం యువకుల తల్లిదండ్రుల సమక్షంలో వారికి కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు. -
ఘనంగా లాల్ దర్వాజ బోనాలు
హైదరాబాద్: చారిత్రక పాతనగరంలో లాల్ దర్వాజ సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర ఘనంగా సాగుతోంది. ఉదయం నుంచే మహిళా భక్తులు అమ్మవారికి బోనాలు, నైవేద్యం సమర్పించేందుకు బారులు తీరారు. టీఆర్ఎస్ ఎంపీ కవిత, తెలంగాణ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ తదితరులు అమ్మవారికి బోనం సమర్పించారు. ఉదయం నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తుండటంతో ఆలయం వద్ద కోలాహలం నెలకొంది. మరోవైపు పాతబస్తీ అంతటా బోనాల జాతర సందడి నెలకొంది. అమ్మవారి జానపద గీతాలు, బోనాల ఊరేగింపు, పోతురాజుల విన్యాసాలతో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. ఆషాఢమాసం బోనాల ఉత్సవాలలో ప్రధాన ఘట్టమైన లాల్‌దర్వాజ సింహవాహిని మహంకాళి అమ్మవారిని మహిమాన్వితమైన శక్తిప్రదానియిగా భక్తులు కొలుస్తారు. నిజాం నవాబుల కాలం నుంచి లాల్ దర్వాజ్ సింహవాహిని అమ్మవారు పూజలందుకుంటున్నారు. పెద్ద ఎత్తున భక్తులు తరలిరావడంతో ఆలయం వద్ద, పరిసర ప్రాంతాల్లో పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. మూడు వందల సీసీ కెమరాలు ఏర్పాట్లను చేశామని, వాటిని కమాండ్ కంట్రోల్ రూమ్‌కు అనుసంధానించి ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తున్నామని సౌత్ జోన్ డీసీపీ సత్యనారాయణ తెలిపారు. -
ఆజా.. ఆజా.. లాడ్ బజార్
రంజాన్ సమీపిస్తోంది. పాతబస్తీలో సందడి పెరిగింది. గాజుల కొనుగోళ్లతో లాడ్ బజార్ గలగలలాడుతోంది. చిన్నా..పెద్దా షాపింగ్ సందడితో గల్లీలన్నీ కిక్కిరిసిపోతున్నాయి. కొత్త దుస్తులు, గాజులు, చెప్పులు, వాచీలు, హ్యాండ్‌బ్యాగులు, అలంకరణ వస్తువులకు గిరాకీ పెరిగింది. షీర్‌కుర్మాకు ఉపయోగించే సేమియాలు పెద్ద ఎత్తున విక్రయిస్తున్నారు. ఇకరంజాన్ మాసంలో చివరిది కావడంతో శుక్రవారం చార్మినార్, మక్కామసీద్, మదీనా తదితర ప్రాంతాల్లో భారీ ఎత్తున ముస్లింలు సామూహిక ప్రార్థనల్లో పాల్గొన్నారు. -
పాతబస్తీలో కల్తీ దందా గుట్టు రట్టు
-
ప్రాణం తీసిన స్వల్ప వివాదం
-
ఘటం.. ఘనం
-
వైభవంగా లాల్‌దర్వాజా సింహవాహిని బోనాలు
హైదరాబాద్: పాతబస్తీలోని లాల్‌దర్వాజా సింహవాహిని అమ్మవారి బోనాల ఉత్సవం ఆదివారం అంగరంగ వైభవంగా జరిగింది. తెల్లవారు జాము నుంచే అమ్మవారికి బోనం సమర్పించడానికి మహిళలు బారులు తీరారు. భక్తుల రద్దీతో పరిసర రోడ్లన్నీ కళకళలాడాయి. రాష్ట్ర ప్రభుత్వం తరుఫున దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో మంత్రులు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీతో పాటు మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి, కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, మాజీ మంత్రి దానం నాగేందర్, ఎమ్మెల్యేలు శ్రీనివాస్ గౌడ్, టి. ప్రకాశ్ గౌడ్, మహేశ్ గౌడ్, బీజేపీ ఎమ్మెల్యేలు కిషన్‌రెడ్డి, రాంచంద్రారెడ్డి, మాజీ మంత్రి డి.కె. అరుణ, గ్రేటర్ బీజేపీ అధ్యక్షుడు బి. వెంకట్ రెడ్డి తదితరులు పూజల్లో పాల్గొన్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తుతో పాటు భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. -
రంజాన్ పోలీస్
నగర పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి సోమవారం రాత్రి పాతబస్తీలో పర్యటించారు. మదీనా నుంచి చార్మినార్ వరకు ఆయన కాలినడకన వెళ్లి రాత్ బజార్‌ను తిలకించారు. మదీనా చౌరస్తా వరకు పోలీసు వాహనంలో వచ్చిన మహేందర్‌రెడ్డి...అక్కడి నుంచి దారిపొడుగునా నడుచుకుంటూ పలుచోట్ల షాపింగ్ చేశారు. పర్ఫ్యూమ్ కొనుగోలు చేసి చార్మినార్‌కు చేరుకున్నారు. అక్కడి నుంచి పిస్తాహౌస్, శాలిబండ, రాజేశ్ మెడికల్ హాల్ వరకు నడుచుకుంటూ వెళ్లారు. పోలీసుల బందోబస్తును పర్యవేక్షించారు. పిస్తా హౌస్ దగ్గర హలీమ్‌ను ఆసక్తిగా తిలకించారు. రంజాన్ సందర్భంగా పాతబస్తీలో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటుచేశామని,పోలీసు శాఖ అప్రమత్తంగా ఉందని చెప్పారు. నగర అదనపు పోలీసు కమిషనర్(శాంతి భద్రతలు) వీవీ శ్రీనివాసరావు, సౌత్‌జోన్ డీసీపీ సత్యనారాయణలు సీపీ వెంట ఉన్నారు. - యాకుత్‌పురా -
రంజాన్ షాన్
పాతబస్తీ రంజాన్ జోష్‌ను పులుముకుంది. మార్కెట్లు కొనుగోళ్ల సందడితో నిండిపోయాయి. వీధులు అత్తరు పరిమళాలతో గుబాళిస్తున్నాయి. దారివెంట వెలసిన దుకాణాల్లో హలీం, కుర్బానీ మీఠా రుచులు చవులూరిస్తున్నాయి. రాత్రివేళ చిరు అంగళ్ల వద్ద వెలిగే విద్యుద్దీపాలు.. మిణుగురులు వరుస కట్టినట్టు వెలుగులు చిమ్ముతున్నాయి. ఆదివారం రాత్రి చార్మినార్ పరిసరాలు ఇలా కాంతివంతంగా కనిపించాయి. -
అక్రమాలే పునాదులు
బహదూర్‌పురా: పాతబస్తీ ఓల్డ్ ఖబూతర్‌ఖానాలో ఇద్దరి మృతికి కారణమైన మహేశ్వరి సేవా ట్రస్టు భవనం వెనుక అడుగడుగునా అక్రమాలు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. సదరు స్థలానికి ఎలాంటి అనుమతులు లేకపోగా, అక్రమంగా అదనపు అంతస్తులు నిర్మిస్తూ ఇద్దరు కార్మికులను పొట్టనబెట్టుకున్నారు. వివరాల్లోకి వెళితే.. మహేశ్వరి ట్రస్టు భవనంలో మొదటి అంతస్తు వరకు స్లాబ్ నిర్మించిన ఇంజనీర్, కాంట్రాక్టర్లు మధ్యలో ఎలాంటి ఆధారం లేకుండా కట్టెలు, గోవాల సహాయంతో రెండో అంతస్తులో స్లాబ్ వేసేందుకు చర్యలు చేపట్టారు. అయితే కింద ఆధారం లేకపోవడంతో రెండో అంతస్తులో స్లాబ్ పనులను నిర్వహిస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలడంతో ఇద్దరు కూలీలు మృతి చెందారు. గుట్టుచప్పుడు కాకుండా రాత్రికి రాత్రే పనులు.. యజమానిగా చెప్పుకుంటున్న మహేశ్వరి సేవా ట్రస్టు ప్రతినిధి జీహెచ్ఎంసీ నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండా రాత్రికి రాత్రే పనులు చేపట్టారని జీహెచ్ఎంసీ దక్షిణ మండలం జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. వివాదంలో ఉన్న ఈ స్థలంలో ఎలాంటి నిర్మా ణాలు చేపట్టరాదని తాము గతంలో ట్రస్టు నిర్వాహకులకు నోటీసులు జారీ చేశామని, దీనిపై హుస్సేనీఆలం పీఎస్‌లో కేసులు నమోదైనట్లు తెలిపారు. ఆదినుంచి అక్రమాలే వాస్తవానికి భవన నిర్మాణం చేపట్టిన స్థలం మహేశ్వరి సేవాట్రస్టుకుచెందినది కాకపోయినా తమదిగా పేర్కొం టూ సేవాట్రస్ట్ సభ్యులు మూడంతస్తుల భవన నిర్మాణానికి అనుమతికోసం దరఖాస్తు చేసుకోగా టౌన్‌ప్లానింగ్ విభాగం 2015 ఆగస్టు 13న తిరస్కరించింది. అయినా అక్రమంగా నిర్మాణాలు చేపట్టడంతో ట్రస్ట్ ప్రతినిధి శ్రీనివాస్ బంగ్, ఇతర సభ్యులపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఫిబ్రవరి 20న జీహెచ్ఎంసీ అధికారులు హుస్సేనీఆలం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చే శారు. అక్రమాలను తొలగించేందుకు వెళ్లి న, అసిస్టెంట్ సిటీప్లానర్, సెక్షన్ ఆఫీసర్, సిబ్బందిపై శ్రీనివాస్ అతని అనుచరులు దాడులకు పాల్పడ్డారు. సిటీ సివిల్ కోర్టు ద్వారా ట్రస్టు సదరు స్థలంపై ఇంటెరిమ్ ఇంజక్షన్ ఆర్డర్ పొందిందని, దీనిపై జూన్ 14న కోర్టులో విచారణ జరగాల్సి ఉందన్నారు. ఇంతలోనే హడావుడిగా అర్ధరాత్రి నిర్మాణం చేపట్టి ఇద్దరి మృతికి కారణమయ్యారని అధికారులు పేర్కొన్నారు. చట్ట విరుద్ధంగా ట్రస్టు నిర్వహణ జీహెచ్ఎంసీ సమాచారం మేరకు సదరు స్థలంపై ట్రస్ట్‌కు ఎలాంటి హక్కు లేదు. 1977లో ఏపీహెచ్‌బీ సదరు స్థలాన్ని ఎంసీహెచ్‌కు అప్పగించింది. దానిని నెథర్లాండ్ ఫౌండేషన్ సహకారంతో పిల్లల సంక్షేమ కార్యక్రమాల కోసం ఇండో-డచ్ ప్రాజెక్టుకు కేటాయించారు. సదరు ప్రాజెక్ట్‌కు దీనిపై యాజమాన్య హక్కు ఉండదని, ఎంసీహెచ్కే చెందుతుందని 1976లో ఎంసీహెచ్ స్టాండింగ్ కమిటీలో తీర్మానం చేశారు. అనంతరం ఇండో డచ్ కార్యక్రమాలను ‘ముఖ్య కుటుంబ వికాస కేంద్ర’కు బదిలీ చే శారు. దాని కాలపరిమితి ముగియడంతో మదర్ అండ్ చైల్డ్ కేర్ సొసైటీకి అప్పగించారు. చివరకు మహేశ్వరి సేవాట్రస్ట్ చట్టవిరుద్ధంగా ఎంసీహెచ్ భవనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు వారు వివరించారు. మృతుల బంధువుల ఆందోళన ప్రమాదానికి కారణమైన కాంట్రాక్టర్, ఇంజనీర్, భవన యజమానులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బాధిత కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. సీఐటీయూ నాయకులు శేఖర్ యాదవ్ వారికి మద్దతు తెలుపుతూ మృతుల కుటుంబాలకు రూ.50 లక్షలు, గాయపడిన వారికి రూ. 5 లక్షలు నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆపద్భంధు సాయం అందిస్తాం ప్రమాదంలో మృతి చెందిన నందు, వెంకటయ్య కుటుంబ సభ్యులకు ఆపద్భాంధువు పథకం కింద రూ.50 వేలను మంజూరు చేసేందుకు కృషి చేస్తామని బహదూర్‌పురా తహ శీల్ధార్ నవీన్ తెలిపారు. చార్మినార్ ఎమ్మెల్యే సయ్యద్ అహ్మద్ పాషా ఖాద్రీ బాధితులను పరామర్శించారు మరో ఇద్దరి పరిస్థితి విషమం అఫ్జల్‌గంజ్: భవనం పైకప్పు కూలిన ఘటనలో గాయపడిన ఎనిమిది మంది వ్యక్తులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఉస్మానియా ఆస్పత్రి వైద్యులు తెలిపారు. బాధితుల్లో దశరధ్, జయప్రకాష్ పరిస్థితి విషమంగా ఉందన్నారు. మిగతావారు శివకుమార్, లోకేష్, నరేష్, నలక్శ్రీను, చోటాలాల్, సయ్యద్ అలీ తదితరులకు ఔట్ పేషెంట్ విభాగంలో చికిత్స అందించి ఇళ్లకు పంపినట్లు తెలిపారు. -
‘బాంబు బ్లాస్ట్’కు తొమ్మిదేళ్లు
ఘటన అనంతరం మక్కా మసీదులో భద్రత పెంపు 23 కెమెరాలు ఏర్పాటు... {పస్తుతం పని చేయని 18 కెమెరాలు పట్టించుకోని అధికారులు చార్మినార్: మే 18వ తేదీ వస్తుందంటే చాలు పాతబస్తీ ప్రజలు ఆనాటి ఛేదు జ్ఞాపకాల నుంచి తేరుకోలేకపోతున్నారు. 2007 మే 18వ తేదీ వుధ్యాహ్నం 1.18 గంటలకు జరిగిన బాంబు పేలుడు ఘటన ఈ ఏడాదితో తొమ్మిదేళ్లు పూర్తికావస్తోంది. ఆనాటి విషాదకర ఘటనలు గుర్తుకొచ్చి బాధిత కుటుంబాలు కన్నీరుమున్నీరవుతున్నాయి. బాంబు పేలుడు తదనంతరం జరిగిన పోలీసు కాల్పుల్లో వుృతి చెందిన తమ కుటుంబ సభ్యులకు తీరని నష్టం జరిగిందని వాపో తున్నారు. మక్కా వుసీదులో రౌండ్ ది క్లాక్ భద్రత... 2007 మే 18న జరిగిన బాంబు పేలుడు అనంతరం మక్కా మసీదులో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇక్కడ భద్రతను పర్యవేక్షించడానికి మూడు షిప్టులలో 18 వుంది హోంగార్డులను ప్రభుత్వం నియుమించింది. వీరు రౌండ్ ది క్లాక్ విధుల్లో ఉంటున్నారు. అలాగే, ప్రధాన ద్వారం వద్ద డోర్ ఫ్రేమ్ మెటల్ డిటెక్టర్లను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు శాంతి భద్రతలను పర్యవేక్షిస్తున్నారు. విద్రోహశక్తులు, అనుమానితులు ప్రవేశాన్ని పసిగట్టేందుకు మసీదు ఆవరణ, కొలను, లైబ్రరీతో పాటు ప్రార్థనాలయం ప్రధాన హాలు, కార్యాలయం వద్ద నిఘా కెమెరాలను ఏర్పాటు చేశారు. పని చేయని 18 సీసీ కెమెరాలు.... బాంబు పేలుడు ఘటన అనంతరం మక్కా మసీదులో ఏర్పాటు చేసిన 23 సీసీ కెమెరాలు, స్టాటిక్ కెమెరాలలో ప్రస్తుతం కేవలం 5 మాత్రమే పని చేస్తున్నాయి. ఆరు నెలలుగా 18 కెమెరాలు పని చేయడం లేదు. నిరసన సభలకు అనుమతి లేదు .. మక్కా వుసీదు వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు శాంతి భద్రతలను పర్యవేక్షిస్తున్నాం. దక్షిణ మండలంలోని నలుగురు ఏసీపీలు, 18 పోలీస్స్టేషన్ల ఇన్స్పెక్టర్లు, సబ్ ఇన్స్పెక్టర్లు ఇతర పోలీసు సిబ్బంది ఎప్పటికప్పుడు శాంతి భద్రతలను పర్యవేక్షిస్తున్నారు. పాతబస్తీలో ఎక్కడ నిరసన సభలు, ర్యాలీలు నిర్వహించుకోవడానికి ఎవరికీ ఎటువంటి అనువుతులు ఇవ్వడం లేదు. - వి.సత్యనారాయణ, దక్షిణ వుండలం డీసీపీ -
మజ్లిస్ ఓటు బ్యాంకుకు గండి!
పాతబస్తీలో తగ్గిన ఓట్లు 20 నెలల్లో 1.43 లక్షలు తేడా బలపడుతున్న అధికార టీఆర్ఎస్ సిటీబ్యూరో: పాతబస్తీలో మజ్లిస్ పార్టీ పట్టు సడలిందా? ప్రజ ల చూపు ఆ పార్టీ పైనుంచి అధికార టీఆర్ఎస్ వైపు మళ్లుతోందా? జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలు ఈ ప్రశ్నలను రేకెత్తిస్తున్నాయి. ఈ ఎన్నికల్లో పాతబస్తీలో మజ్లిస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసినా... ఓటు బ్యాంక్‌కు మాత్రం గట్టి దెబ్బ తగిలింది. కేవలం 20 నెలల వ్యవధిలోనే సుమారు 1.43 లక్షల ఓట్లకు గండి పడింది. అధికార టీఆర్ఎస్ పార్టీ అక్కడ పాగా వేయలేకపోయిన్పపటికీ అనూహ్యంగా మజ్లిస్ ఓట్లను రాబట్టగలిగింది. గతంతో పొల్చితే మజ్లిస్ ఓట్లు గణనీయంగా తగ్గగా... టీఆర్ఎస్ బాగా పుం జుకుంది. దశాబ్దాలుగా పాతబస్తీలో తిరుగులేని శక్తిగా మారిన మజ్లిస్‌కు ఈ విషయం ఆందోళన కలిగిస్తోంది. 2014లో జరిగిన సాధారణ ఎన్నికల్లో పాతబస్తీలోని 8 నియోజకవర్గాలకు కలిపి మజ్లిస్ పార్టీకి 5,75,537 ఓట్లు లభించగా... తాజాగా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మాత్రం 4,41,605 ఓట్లకే పరిమితమైంది. వచ్చే మూడేళ్లలో మరింతగా ఓట్లను కోల్పోయే ప్రమాదం ఉందని ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. భారీ వ్యత్యాసం తాజా ఎన్నికల ఫలితాలను బట్టి నియోజకవర్గాల వారీ గా పరిశీలిస్తే.. కార్వాన్లో అత్యధికంగా మజ్లిస్ ఓట్లకు గండి పడింది. బహదూర్‌పురా, మలక్‌పేటలో సైతం భారీగా ఓట్లు కోల్పోయింది. కార్వాన్లో 32,084 ఓట్లు, బహదూర్‌పురాలో 27,268, మలక్‌పేటలో 23,361, చాంద్రాయణగుట్టలో 17,253, రాజేంద్రనగర్‌లో 16, 944, యాకుత్‌పురాలో 10,986, చార్మినార్‌లో 8,060, నాంపల్లిలో 7,976 ఓట్లకు గండి పడినట్లు తెలుస్తోంది. మజ్లిస్ పార్టీకి నియోజకవర్గాల వారీగా లభించిన ఓట్లు నియోజకవర్గం 2014 2016 మలక్‌పేట 58,976 35,615 చార్మినార్ 62,941 54,881 యాకుత్‌పురా 66,843 55,857 చాంద్రాయణగుట్ట 80,393 63,140 బహుదుర్‌పురా 1,06,874 79,606 నాంపల్లి 64,066 56,090 కార్వాన్ 86,391 54,307 రాజేంద్రనగర్ 49,053 32,109 -
పట్టు నిలుపుకున్న మజ్లిస్
బహదూర్‌పురా, చాంద్రాయణగుట్ట స్వీప్ యాకుత్‌పురా, చార్మినార్‌లో నాలుగేసి డివిజన్లు కైవసం చార్మినార్: పాతబస్తీలో మజ్లీస్ హవా కొనసాగింది. చార్మినార్, బహదూర్‌పురా, చాంద్రాయణగుట్ట, యాకుత్‌పురా నియోజకవర్గాల్లోని 25 డివిజన్లలో 22 డివిజన్లు తన ఖాతాలో వేసుకొని పాతబస్తీలో జయుకేతనం ఎగురవేసింది . సిట్టింగ్ సీట్లన్నీ తిరిగి కైవసం చేసుకుంది. బహదూర్‌పురా నియోజకవర్గంలోని ఫలక్‌నుమా, నవాబ్‌సాబ్‌కుంట, జహనుమా, కిషన్‌బాగ్, రామ్నాస్పురా, దూద్‌బౌలి తదితర డివిజన్లన్నీ మజ్లీస్ ఖాతాలోకి చేరాయి. చార్మినార్ నియోజకవర్గంలోని మొత్తం ఐదు డివిజన్లలో మొఘల్‌ఫురా, పత్తర్‌గట్టి, శాలిబండ, పురానాపూల్‌లలో మజ్లీస్ అభ్యర్థులు విజయం సాధించగా...ఘాన్సీబజార్ డివిజన్లో మాత్రం బీజేపీ అభ్యర్థి విజయం సాధించారు. చాంద్రాయణగుట్ట నియోజకవర్గంలో చాంద్రాయణగుట్ట, బార్కాస్, రియాసత్‌నగర్, కంచన్‌బాగ్, ఉప్పుగూడ, జంగమ్మెట్, లలితాబాగ్ డివిజన్లను మజ్లీస్ కైవసం చేసుకుంది. గతంలో ఈ డివిజన్లన్నీ మజ్లీస్వే. యాకుత్‌పురా నియోజకవర్గంలో ఏడు డివిజన్లు ఉండగా... డబీర్‌ఫురా, తలాబ్‌చంచలం, సంతోష్‌నగర్, రెయిన్‌బజార్, కుర్మగూడ తదితర ఐదు డివిజన్లను మజ్లీస్ పార్టీ తన ఖాతాలో వేసుకోగా... మిలిగిన గౌలిపురాలో బీజేపీ, ఐ.ఎస్.సదన్‌లో టీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించారు. -
ప్రశాంతంగా రీ పోలింగ్
47.10 శాతం నమోదు చార్మినార్: పాతబస్తీలోని పురానాపూల్ డివిజన్లో శుక్రవారం రీ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావివ్వకుం డా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకున్నారు. నగర సంయుక్త పోలీసు కమిషనర్ శివ ప్రసా ద్ స్వయంగా శాంతి భద్రతలను పర్యవేక్షించారు. శుక్రవారం ఉదయం 7గంటలకు ప్రారంభమైన రీ పోలింగ్ సాయంత్రం 5 వరకూ కొనసాగింది. అభ్యర్థులు స్వయంగా పోలింగ్ కేంద్రాలను సందర్శించి... సరళిని పరిశీలించారు. వివిధ ప్రాం తాల ప్రజలు ఉత్సాహంగా ఓటు హక్కును విని యోగించుకున్నారు. ఈ నెల 2న 54.08 శాతం ఓట్లు పోలవ్వగా...శుక్రవారం రీ పోలింగ్‌లో 47.10 శాతం పోలయ్యాయి. -
పాతబస్తీలో నకిలీ దందా బాగోతం
-
పాతబస్తీలో అపరేషన్ స్మైల్-2
-
హైదరాబాద్ పాతబస్తీలో 144 సెక్షన్
-
పాతబస్తీలో పోలీసుల తనిఖీలు
-
పాతబస్తీలో ‘ఆపరేషన్ లేట్‌నైట్’
- 282 మంది యువకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు - తల్లిదండ్రులకు డీసీపీ కౌన్సెలింగ్ చాంద్రాయణగుట్ట: పాతబస్తీలో ఇటీవల జరిగిన స్ట్రీట్ ఫైట్ ఘటనలో ఓ యువకుడు మృతి చెందడంతో పోలీసులు మేల్కొన్నారు. దక్షిణ మండలం డీసీపీ వి.సత్యనారాయణ పర్యవేక్షణలో శుక్రవారం రాత్రి 10 ప్రత్యేక బృందాలు 17 పోలీస్స్టేషన్ల పరిధిలో ‘ఆపరేషన్ లేట్ నైట్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయి. అర్ధరాత్రి రోడ్లపై ఆవారాగా తిరిగే యువకులతో పాటు హుక్కా సెంటర్లు, స్విమ్మింగ్ పూళ్లు, స్మోకింగ్ ఏరియాలు, టిఫిన్ సెంటర్లు, బస్తీ చబుత్రాల్లో మంతనాలు చేస్తున్న 282 మంది యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తీగలకుంట, తలాబ్‌కట్ట, చాంద్రాయణగుట్ట, బాబానగర్, సంతోష్‌నగర్ బస్తీలకు చెందిన యువకులు పెద్ద సంఖ్యలో పట్టుబడ్డారు. కాగా పట్టుబడిన వారిలో 30 మంది 16-17 ఏళ్ల వయసున్న మైనర్లు కాగా మిగతా వారు 18-25 ఏళ్ల వయసున్న వారు. వారి తల్లిదండ్రులను పిలిపించి దక్షిణ మండలం డీసీపీ వి.సత్యనారాయణ తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ నిర్వహించారు. నెలలోపు పిల్లలు ప్రవర్తన మార్చుకోకపోతే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. సమాజంలో మంచిగా మెలుగుతామని పట్టుబడిన యువకులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో దక్షిణ మండలం అదనపు డీసీపీ కె.బాబురావు, ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు. క్రమశిక్షణ అలవర్చేందుకే : డీసీపీ సత్యనారాయణ ఆవారాగా తిరుగుతున్న యువకుల్లోక్రమశిక్షణ అలవర్చేందుకు నగర పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి ఆదేశానుసారం ఆపరేషన్ లేట్‌నైట్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని దక్షిణ మండలం డీసీపీ వి.సత్యనారాయణ తెలిపారు. తల్లిదండ్రుల పర్యవేక్షణ లోపంతో స్ట్రీట్ ఫైట్ ఘటన జరిగి నబీల్ అనే విద్యార్థి మృతి చెందాడని అన్నారు. చాంద్రాయణగుట్ట పరిసరాల్లో అర్ధరాత్రి స్విమ్మింగ్ పూళ్ల వద్ద బెట్టింగ్‌లు నిర్వహిస్తున్నట్లు తేలిందన్నారు. కొందరు యువకులు రౌడీషీటర్లతో కూడా స్నేహాన్ని పెంచుకుంటున్నారని తెలిపారు. -
మృత్యువుతో సయ్యాట
- రాత్రంతా షికార్లు..పొద్దంతా నిద్ర - పాతబస్తీలో కొందరు యువకుల తీరు ఇదీ - కొన్ని సందర్భాల్లో అసాంఘిక శక్తులుగా మారుతున్న వైనం. - ఇటీవల తల్లిదండ్రులకు డీసీపీ కౌన్సెలింగ్ - తాజాగా వెలుగులోకి వచ్చిన స్ట్రీట్ ఫైట్ చాంద్రాయణగుట్ట: పాతబస్తీలోని కొందరు యువకులు సరదాలు ప్రాణాంతంగా మారుతున్నారు. సరదాకోసం కొందరు ఎంతటి సాహసానికైనా ఒడిగట్టడం ఆందోళన కలిగిస్తోంది. గ్రూప్‌లుగా ఏర్పడి రాత్రి పూట బైక్‌లపై సవారీ చేయడం, పగటి పూట జరిగిన చిన్నచిన్న సంఘటనలను సాకుగా తీసుకుని ప్రతీకార దాడులకు పాల్పడటం పరిపాటిగా మారింది. ఈ నేపథ్యంలో కొన్ని సందర్భాల్లో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. ఒక్కోసారి మరీ హద్దు మీరి ప్రవర్తిస్తూ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారు. ఇందులో భాగంగానే హిమాయత్ సాగర్‌పై బైక్ రేసింగ్‌లకు పాల్పడుతున్న దాదాపు వంద మంది యువకులు ఇటీవల పోలీసులకు పట్టుబడిన విషయం తెలిసిందే. చార్మినార్, డబీర్‌పురా, మీర్‌చౌక్, యాకుత్‌పురా, బహదూర్‌పురా, హసన్‌నగర్, కామాటీపురా, కాలాపత్తర్, ఫలక్‌నుమా, జంగమ్మెట్, జీఎం కాలనీ, చాంద్రాయణగుట్ట, బాబానగర్, బండ్లగూడ, బార్కాస్, పహాడీషరీఫ్, షాయిన్‌నగర్, ఎర్రకుంట, రియాసత్‌నగర్, సంతోష్‌నగర్, ఈదిబజార్, తలాబ్‌కట్టా తదితర బస్తీల్లో ఇలాంటి ఘటనలు ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయి. ఒక్కోసారి క్రికెట్, ఫుట్‌బాల్ తదితర ఆటల్లో తలెత్తే వివాదాలు కూడా దాడులు, ప్రతిదాడులకు కారణమవుతున్నాయి. స్నేక్ గ్యాంగ్ నుంచి స్ట్రీట్ ఫైట్ వరకు. ఈ సంసృ్కతి నగర శివారు బస్తీలకు విస్తరించింది. ఈ క్రమంలోనే పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో స్నేక్‌గ్యాంగ్ ఘటన వెలుగు జూసిన విషయం తెలిసిందే. దాదాపు పది మంది యువకులు గ్యాంగ్‌గా ఏర్పడి ఇలాంటి అరాచకాలకు నాంది పలికారు. ఎన్నో ఘటనలకు పాల్పడిన ఈ ముఠా చివరకు ఫాం హౌస్‌లో యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడటంతో వారి అరాచకాలు వెలుగులోకి వచ్చాయి. అయితే ఈ సంఘటన తరువాత కూడా వారిలో మార్పు రాకపోగా, కొత్త కోణాలు వెలుగులోకి రావడం గమనార్హం. తాజాగా స్ట్రీట్ ఫైట్ ఘటనలో నబీల్ అనే ఇంటర్ విద్యార్థి మృతి చెందడం నగరంలో చర్చనీయాంశంగా మారింది. పిల్లలపై దృష్టి సారించాలి తమ పిల్లల వ్యవహారశైలిపై తల్లిదండ్రులు దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బయటికి వెళ్లిన కుమారుడు ఇంటికి రాగానే ఎక్కడికి వెళ్లావు...? ఏ పని మీద వెళ్లావు..? అనే విషయాలపై ఆరా తీస్తే వారిలో భయం ఏర్పడుతుంది. అయితే కొందరు తల్లిదండ్రులు కనీసం పట్టించుకోకపోవడంతో పిల్లలు ఆడిందే ఆట....పాడిందే పాట అన్న చందంగా మారింది. ఈ నేపథ్యంలో కొందరు యువకులు దారితప్పుతున్న సంఘటనలూ వెలుగులోకి వస్తున్నాయి. 2012లో ఉప్పుగూడలోని గుల్షన్ ఎక్బాల్ కాలనీకి చెందిన విద్యార్థి ఒబేద్‌కు ఉగ్రవాద కార్యకలాపాలతో సంబంధాలున్నాయని కర్ణాటక పోలీసులు తీసుకెళ్లేంత వరకు కూడా తల్లిదండ్రులకు తెలియకపోవడం గమనార్హం. -
విషాద యాత్ర
విహార యాత్రకు వెళ్లి ఏడుగురు మృతి మృతుల్లో ఐదుగురు ఒకే కుటుంబానికి చెందిన వారు మరో ఇద్దరు బంధువులు మహబూబ్‌నగర్ జిల్లా అమనగల్లు మండలంలో ఘటన చాంద్రాయణగుట్ట: విహార యాత్ర విషాదాంతం కావడంతో పాతబస్తీలో విషాదం నెలకొంది. విహారయాత్ర కోసం వెళ్లిన వారిని చెరువు రూపంలో మత్యువు కబళించింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు, ఇద్దరు బంధువులు మృతి చెందడంతో చాంద్రాయణగుట్ట అల్ జుబేల్ కాలనీ, ఘాజీమిల్లత్ కాలనీ, హషమాబాద్లలో విషాద చాయలు అలుముకున్నాయి. వివరాల్లోకి వెళితే.. అల్ జుబేల్ కాలనీకి చెందిన అహ్మద్ బేగ్ అలియాస్ బాబు బాయి ఉస్మానియా మార్చురీలో పని చేస్తున్నాడు. బుధవారం అతను కుటుంబ సభ్యులతో కలిసి ఆమనగల్లు మండల పరిధిలోని సరికొండ గౌరమ్మ చెరువుకు విహార యాత్రకు వెళ్లేందుకు నిర్ణయించుకున్నారు. దీంతో బేగ్ ఇద్దరు కుమారులు సల్మాన్ (30), రహెమాన్ (19), కుమార్తె రొఖియా బేగం(18), కోడలు మోనా సుల్తానా (20), అల్లుడు షేక్ బాసిత్ (30), హషమాబాద్‌కు చెం దిన బంధువుల అమ్మాయి ముస్రత్ ఫాతీమా (19), వట్టేపల్లికి చెందిన ముస్కాన్ (18)లతో కలిసి మొత్తం 13 మంది రెండు వాహనాల్లో సరిగొండ గౌరమ్మ చెరువుకు వెళ్లారు. అయితే వీరిలో ఒకరు చెరువులోకి దిగుతుండగా అందులో పడి పోవడంతో వారిని కాపాడే క్రమంలో ఒకరి తరువాత ఒకరు మొత్తం ఏడు మంది చెరువులో దిగి మృతి చెందారు. దీనిపై సమాచారం అందడంతో ఆయా ప్రాంతాల్లో విషాదం నెలకొంది. మృతదేహాలను కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం అనంతరం గురువారం నగరానికి తీసుకురానున్నట్లు తెలిసింది. బేగ్ కుటుంబంలో ఐదుగురు.. కాగా ఈ ఘటనలో అహ్మద్ బేగ్ కుటుంబంలో ఐదుగురు మృతి చెందడం స్థానికులను కలచివేస్తోంది. బేగ్ ఇద్దరు కుమారులతో పాటు కోడలు కూడా ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది. చిన్న కుమార్తె రొఖియా బేగం మృతి చెందగా, పెద్ద కుమార్తె అస్మా బేగం భర్త బాసిత్ అసువులు బాసాడు. దీంతో ఆ కుటుంబంలో బేగ్ దంపతులతో పాటు పెద్ద కుమార్తె ఒక్కరే మిగి లారు. విదేశాలకు వెళ్లిన బేగ్ భార్య గురువారం హైదరాబాద్‌కు తిరిగిరానున్నట్లు బంధువులు తెలిపారు. పెళ్లయిన 4నెలలకే.. మృతుల్లో ఒకరైన మోనా బేగం అలియాస్ మోనా సుల్తానాకు అహ్మద్ బేగ్ కుమారుడు సల్మాన్‌తో నాలుగు నెలల క్రితమే వివాహం జరిగింది. కాగా సల్మాన్, మోనాలిద్దరూ ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోవడంతో మోనా కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. 3నెలల క్రితమే రొఖియా బేగంకు నిశ్చితార్థం అహ్మద్ బేగ్ చిన్న కుమార్తె రొఖియా బేగంకు మూడు నెలల క్రితం నిశ్చితార్థం జరిగింది. నిశ్చితార్థానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు చూసుకుంటూ ఇరు కుటుంబాలు ఆనందంగా ఉన్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. రొఖియా బేగం ఈ ప్రమాదంలో మృతి చెందడంతో వరుడి కుటుంబ సభ్యులు కూడా కన్నీటి పర్యంతమయ్యారు. ఆరుగురు క్షేమం మొత్తం 13మంది విహారానికి వెళ్లగా అందులో ఆరుగురు మాత్రం ప్రమాదం నుంచి బయటపడ్డారు. ప్రమాదం నుం చి బయటపడిన వారంతా చిన్న పిల్లలు, వృద్ధులే. ఒకరిని కాపాడేందుకు ఒకరు చెరువులోకి వెళ్లి మరణించగా.. వీరు పిల్లలు, వృద్ధులు కావడంతో వారిని కాపాడే ప్రయత్నం చేయలేక పోయారు. దీంతో వారు ప్రమాదంలో చిక్కుకోలేదు. నగరానికి చేరుకున్న మృతదేహాలు... కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రి మార్చురిలో పోస్టు మార్టమ్ నిర్వహించిన అనంతరం ఏడుగురి మృతదేహాలను బుధవారం రాత్రి చాంద్రాయణగుట్ట పరిధిలోని హషామాబాద్, ఆల్బుబేర్కాలనీ, జీఎం కాలనీలలోని వారి నివాసాలకు తరలించారు. మృతుల కుటుంబాలను స్థానిక ఎమ్మెల్యే పాషా ఖాద్రీ, మజ్లిస్ పార్టీ నాయకులు పరామర్శించారు. ఎక్స్‌గ్రేషియా చెల్లిస్తాం: మంత్రి జూపల్లి కృష్ణారావు వెల్దండ: ఆమనగల్లు మండలం చరికొండ గౌరమ్మ చెరువులో పడి మృతి చెందిన ఏడు మృతదేహలను పోస్టుమార్టం నిమిత్తం కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న మంత్రి జూపల్లి కృష్ణారావు, కలెక్టర్ శ్రీదేవితో పాటు ప్రజాప్రతినిధులు మృతదేహలను పరిశీలించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులను ఓదార్చి పరామర్శించారు. మృతుల్లో ఒక్కొక్కరికి లక్ష రూపాయల చొప్పున వారి కుటుంబ సభ్యులకు ఎక్స్‌గ్రేషియా అందిస్తామని చెప్పారు. పరీక్షా ఫలితాల కోసం ఎదురు చూస్తున్న రహ్మాన్ అహ్మద్ బేగ్ చిన్న కుమారుడు పదో తరగతి పరీక్ష రాసి ఫలితాల కోసం ఎదురు చూస్తున్నాడు. బుధవారం జరిగిన ప్రమాదంలో రహ్మాన్ మృతి చెందినట్లు తెలుసుకున్న అతని స్నేహితులు కన్నీటి పర్యంతమయ్యారు. ఈ ఘటలోనే మృతి చెందిన హషమాబాద్‌కు చెందిన ముస్రత్ ఫాతీమా ఇంటర్ పరీక్షలు రాసింది. మరో మృతురాలు ముస్కాన్ కుటుంబ సభ్యులు విదేశాల్లో ఉంటున్నందున ఆమె అహ్మద్ బేగ్ ఇంటిలోనే ఆశ్రయం పొందుతున్నట్లు స్థానికులు తెలిపారు. -
పాతబస్తీలో కా౦ట్రాక్ట్ మ్యారేజ్ గుట్టు రట్టు
-
అంతులేని వ్యథ
పాతబస్తీ.. హైదరాబాద్ షాన్కెంత ప్రసిద్ధో.. గరీబీకీ అంతే పరిచయం! ఆ పేదరికం.. అనుభవించేవాళ్లనందరినీ కష్టపెడుతున్నా బలికోరుతున్నది మాత్రం ఆడపిల్లలనే! ఎప్పుడో జరిగిన అమీనా నిఖానే కాదు ఇప్పటికీ ఆగని ఆ పెళ్లిళ్లు, బాలికావధువులే అందుకు ఉదాహరణ.. ఇప్పుడు చదవబోయే రుబీనా (పేరు మార్చాం) కథ కూడా అలాంటిదే.. ..:: సరస్వతి రమ జావేద్ఖాన్ (పేరు మార్చాం), రజియా (పేరు మార్చాం)లకు ముగ్గురు ఆడపిల్లలు. వాళ్లలో పెద్దమ్మాయే రుబీనా. జావేద్ఖాన్ భార్య రజియాని బాగా హింసించేవాడు. అది తట్టుకోలేక రజియా ఇంట్లోంచి వెళ్లిపోయింది. అప్పుడు రుబీనాకు మూడేళ్లు. రజియా వెళ్లిపోవడంతో ముగ్గురు పిల్లల్ని తన తల్లిదగ్గర వదిలాడు జావేద్ఖాన్. ఓ నాలుగేళ్లు నానమ్మ దగ్గరున్నారు పిల్లలు. తర్వాత.. రుబీనా నానమ్మకు గల్ఫ్‌లో పనిదొరకడంతో ఆ దేశానికి టేకాఫ్ అయింది. పిల్లలు తల్లి గూటికి చేరారు. అప్పటికే రజియా ఇంకో పెళ్లిచేసుకుంది. ఇటు జావేద్ఖాన్ తాగుడికి బానిసయ్యాడు, డ్రగ్స్‌కీ అలవాటు పడ్డాడు. రుబీనా సవతి తండ్రి ఈ పిల్లల్ని శ్రద్ధగా చూసేవాడుకాదు. బాగా కొట్టేవాడు. స్కూల్‌కి పంపకుండా దగ్గర్లో కార్ఖానాల్లో పనికి పంపేవాడు. అదంతా రజియాకు మళ్లీ హింసలా తయారైంది. పదమూడేళ్లు వచ్చేసరికి.. ముగ్గురు పిల్లల్నీ తీసుకొని ఇల్లు వదిలింది రజియా. పాతబస్తీలోనే ఓ ఇల్లు తీసుకొని ఉండసాగింది. ఓ ఏడాది గడిచాక నెమ్మదిగా రుబీనాకు పెళ్లిచేసేస్తే తన బాధ్యత కొంత తీరుతుందనుకొని ఆ పిల్లకు సంబంధాలు చూడటం మొదలుపెట్టింది. ఈలోపే సవతి తండ్రి మళ్లీ వీళ్లను చేరాడు. దాంతో ముగ్గురు పిల్లల్ని తన తల్లి దగ్గర పెట్టింది రజియా. అయితే అమ్మమ్మ పద్నాలుగేళ్ల రుబీనాకు 55 ఏళ్ల అరబ్ షేక్‌తో పెళ్లి జరిపించింది. రుబీనా అసలు తండ్రితోపాటు, సవతి తండ్రీ వచ్చి ఆమె అమ్మమ్మతో గొడవ పెట్టుకున్నారు. అంతా అయిపోయాక ఎంత గొడవపడితే ఏం లాభం? మళ్లీ ఇంటికి.. ఈ వ్యవహారం సద్దుమణిగాక రజియా మిగిలిన ఇద్దరు పిల్లల్ని సముదాయించి, వాళ్లను తీసుకొని రెండో భర్తతో వెళ్లిపోయింది. ఓ రెండు నెలలు గడిచాయి. అరబ్‌షేక్ వెళ్లిపోయాడు. రుబీనా తల్లిదగ్గరికి వచ్చేసింది. ఓ వారానికి రుబీనా గర్భవతి అని తేలింది. అరబ్షేక్కి ఫోన్‌చేసి విషయాన్ని చెవినవేశారు. ‘అయితే నాకేంటి? నాకెందుకు ఫోన్ చేస్తున్నారు? చేయొద్దు’ అంటూ నోటికొచ్చినట్టు తిట్టి ఫోన్‌పెట్టేశాడు. ఆరు నెలల వరకు డబ్బులు పంపించి ఆపై ఆపేశాడు. అంతేకాదు రుబీనాను అనుమానిస్తూ ఆమెకు వివాహేతర సంబంధం ఉందంటూ నిందవేశాడు. రుబీనా ఆడపిల్లను కన్నది. బిడ్డ పుట్టిందని మళ్లీ అరబ్షేక్కి ఫోన్ చేసినా అక్కడి నుంచి ఎలాంటి పలుకూ లేదు. మధ్యవర్తుల ద్వారా చెప్పించినా స్పందనలేదు. ఇంట్లో భయంకరమైన పేదరికం. ముగ్గురు పిల్లలకు తోడు చంటిది. పాలబొట్టూ కరువైంది ఆ పసిదానికి. రెండో తప్పు.. ఈ పేదరికం నుంచి బయటపడటానికి రజియా తన రెండో కూతురికీ అరబ్షేక్ని వె దికింది. అక్క జీవితాన్ని కళ్లారా చూసిన ఈ చెల్లి తనకూ అదే గతి పడుతుందని గ్రహించి ఇంట్లోంచి వెళ్లిపోయింది. ఇదిలా ఉంటే రుబీనా తన కూతురు, మూడో చెల్లెలితో తండ్రి దగ్గరికి వచ్చేసింది. కొన్నాళ్లు బాగానే చూసుకున్నాడు. తర్వాత రోడ్డుమీదకి తెచ్చాడు. మళ్లీ తల్లి ఇల్లే గతి అయింది వాళ్లకు. ఈసారి సవతి తండ్రి రుబీనాకు ఆఫ్రికన్ వరుడిని వెదికాడు. ప్రమాదం పసిగట్టిన రుబీనా బిడ్డను తీసుకొని ఇంటి నుంచి వెళ్లిపోయింది. తర్వాత నిస్సహాయులైన మహిళలకు ఆసరగా నిలుస్తున్న ‘షాహీన్’ సంస్థను చేరుకుంది. అక్కడే టైలరింగ్ నేర్చుకుంటూ తన బిడ్డకు మంచి జీవితాన్నివ్వాలని ఆశపడుతోంది. ఆమె కూతురికిప్పుడు నాలుగేళ్లు. రుబీనా ఎంచుకున్న దార్లో ఆమెను నడవనిద్దాం.. అలసిపోయినప్పుడు అండగా నిలబడదాం.. ఆ పసిబిడ్డను కాపాడుకుందాం! -
రెండేళ్ల తర్వాత తల్లిదండ్రుల చెంతకు...
ఏడాదిగా జువైనల్ హోంలో ఉంటున్న బాలుడు అనుమానంతో హోంకు వచ్చిన తండ్రి.. కనిపించిన కుమారుడు సైదాబాద్: రెండేళ్ల క్రితం తప్పిపోయాడనుకున్న బాలుడు ఎట్టకేలకు తల్లిదండ్రుల చెంతకు చేరాడు. దీంతో వారి ఆనందానికి అవధులు లేకుండాపోయింది. పాతబస్తీలో పోలీసులు ఇటీవల చేపట్టిన కార్డన్ సర్చ్‌లో బాలకార్మికులు పట్టుబడిన విషయం తెలిసి ఓ బాలుడి తండ్రి తన కొడుకు వారిలో ఉన్నాడేమోనని సైదాబాద్‌లోని జువైనల్ హోంకు వచ్చాడు. అక్కడ తమ కుమారుడు కనిపించడంతో ఆనందభాష్పాలు రాల్చాడు. వివరాలు.. బీహార్‌కు చెందిన కాలురాం, శీలదేవి దంపతులు పదేళ్ల క్రితం జీవనోపాధి కోసం నగరానికి వచ్చారు. కాటేదాన్‌లో ఉంటూ కూలి పని చేసుకుంటూ జీవిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు లాలుబాబురాం(8) రెండేళ్ల క్రితం కాటేదాన్‌లోని తన ఇంటి వద్ద ఆడుకుంటూ తప్పిపోయాడు. కొడుకు కోసం స్థానికంగాను, బంధు,మిత్రుల ఇళ్లలోనూ వెతికినా ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో మైలార్దేవుపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. మిస్సింగ్ కేసు (405/2013) నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అప్పటి నుంచి కుమారుడి ఆచూకీ కోసం కళ్లల్లో ఒత్తులేసుకొని ఎదురు చూస్తున్నారు. కాగా, తప్పిపోయిన వీరి కుమారుడు లాలుబాబురాం ప్రకాశజిల్లా ఒంగోలులో రోడ్లపై తిరుగుతుండగా అక్కడి చైల్డ్ వెల్ఫేర్ కమిటీ వారు 2014లో సైదాబాద్‌లోని వీధి బాలుర సదనానికి తీసుకొచ్చి అప్పగించారు. అప్పటి నుంచి సైదాబాద్ బాలుర సదనంలోనే అతడు ఉంటున్నాడు. అయితే బీహార్‌కు చెందిన ఈ బాలుడి భాష అర్థం కాకపోవడంతో చైల్డ్ వెల్ఫేర్ అధికారులు అతడి తల్లిదండ్రుల సమాచారం తెలుసుకోలేకపోయారు. -
షాదీ..‘ముబారక్’ ఏదీ?
భారీగా దరఖాస్తులు సకాలంలో అందని సాయం తల్లిదండ్రులకు అప్పులే దిక్కు పాతబస్తీలోని యాకుత్‌పురాకు చెందిన సబా సుల్తానా (19) తల్లి చిన్నప్పుడే చనిపోగా, తండ్రి మరో వివాహం చేసుకున్నాడు. దీంతో అమ్మమ్మ, మామయ్యల వద్ద ఉంటోంది. ఆమెకు పెళ్లి కుదరడంతో ‘షాదీ ముబారక్’ పథకం కింద ఆర్థిక సాయానికి ప్రభుత్వానికి బంధువులు దరఖాస్తు చేసుకున్నారు. పెళ్లి (నిఖా)కి ముహుర్తం పెట్టుకున్నారు. సమయానికి డబ్బులు అందనప్పటికీ అప్పోసప్పో చేసి 2014 అక్టోబర్ 20న పెళ్లి జరిపించారు. మూడు నెలలు గడిచినా ఇంతవరకూ ఆర్థిక సాయం అందలేదు. కనీసం విచారణకైనా అధికారులు రాలేదు. కానీ అప్పులిచ్చిన వారు మాత్రం రోజూ ఇంటి చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఇది ఒక్క సబా సుల్తానా కుటుంబమే కాదు.. షాదీ ముబారక్ పథకాన్ని నమ్ముకుని పెళ్లి ముహూర్తాలు పెట్టుకున్న అనేక కుటుంబాలది ఇదే పరిస్థితి. వారంతా అప్పుల పాలై.. ఆర్థిక సాయానికి ఎదురు చూస్తున్నారు. సిటీబ్యూరో: నిరుపేద ముస్లిం యువతుల పెళ్లిళ్లకు ఆర్థిక తోడ్పాటు అందించేందుందుకు సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన షాదీముబారక్ పథకం బాలారిష్టాలు దాటడం లేదు. రాష్ట్ర బడ్జెట్లో పథకానికి రూ.100 కోట్లు కేటాయించారు. జిల్లాకు రూ.2 కోట్ల చొప్పున విడుదల చేశారు. హైదరాబాద్-రంగారెడ్డి జిల్లాలకు కలిపి రూ.4 కోట్లు విడుదలయ్యాయి. ఈ పథకం ద్వారా ఆర్థిక సాయం అందుతుందున్న ఆశతో ఆడబిడ్డల పెళ్లిళ్లకు తేదీలు ఖరారు చేసుకుంటున్న తల్లిదండ్రులు ఆర్థిక సమస్యల్లో మునిగిపోతున్నారు. మైనార్టీ సంక్షేమ శాఖ ఉదాసీన వైఖరి, రెవెన్యూ శాఖ నిర్లక్ష్యం... వెరసి ఈ దరఖాస్తులకు మోక్షం లభించడం లేదు. మరోవైపు నిధులు మంజూరైనాట్రెజరీ శాఖ ప్రతి నెలా 5 నుంచి 17వ తేదీ వరకు మాత్రమే బిల్లులకు పాస్ చేస్తుండటంతో సకాలంలో లబ్ధిదారులకు సాయం అందడం లేదు. దీంతో నిరుపేద కుటుంబాలకు అప్పులు తప్పడం లేదు. ఈ ఏడాది మార్చి 31 నాటికి సుమారు 20 వేల పేద యువతుల వివాహాలు జరిపించాలనేది ప్రభుత్వ లక్ష్యం. కానీ ఈ దిశగా సరిగా అడుగులు పడడం లేదు. ఇదీ పరిస్థితి... ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మరో రెండు నెలల్లో ముగుస్తోంది. కానీ పథకం అమలు వేగవంతం కావడం లేదు. షాదీముబారక్ పథకం కింద సాయానికి ఇప్పటి వరకు 711 కుటుంబాలు దరఖాస్తు చేసుకున్నాయి. అందులో ఇప్పటి వరకు 313 దరఖాస్తులను మాత్రమే పరిశీలించారు. వీటిలో 291 దరఖాస్తులను ఆమోదిస్తూ ట్రెజరీ శాఖకు బిల్లులు పంపించారు. వాటిలో 43 బిల్లులకే గ్రీన్ సిగ్నల్ లభించింది. మిగిలిన 247 బిల్లులు ట్రెజరీలో పెండింగ్‌లో మగ్గుతున్నాయి. సుమారు 387 దరఖాస్తులు అసలు విచారణకు నొచుకోలేదు.11 దరఖాస్తులను వివిధ కారణాలతో తిరస్కరించారు. సిబ్బంది కొరత రాష్ర్టంలో ‘షాదీ ముబారక్’ పథకాన్ని అమలు చేస్తున్న మైనార్టీ సంక్షేమ శాఖలో సరిపడే సిబ్బంది లేకపోవడంతో దరఖాస్తుల పరిశీలన బాధ్యత ను రెవెన్యూ శాఖకు అప్పగించారు. ఆ శాఖ సిబ్బంది ఆసరా, ఆహార భద్రత, ఇతరత్రా విధుల్లో బిజీబిజీగా ఉండటంతో షాదీముబారక్ దరఖాస్తుల పరిశీలన పెండింగ్‌లో పడింది. వాస్తవంగా వివాహానికి నెల రోజుల ముందు ఆహ్వాన పత్రికతో దరఖాస్తు చేసుకుంటే... ఆ యువతి పెళ్లికి ముందే బ్యాంక్ ఖాతాలో నగదు జమ చేయాలి. కానీ వివాహాలు జరిగి నెలలు దాటుతున్నా సాయం అందడం లేదు. అప్పుల్లో మునిగిపోయాం షాదీ ముబారక్పథకాన్ని నమ్ముకొని అప్పులు చేసి పెళ్లి జరిపించాం. ఇంతవరకూ ఆర్థిక సాయం అందలేదు. అధికారులు, నేతలు చుట్టూ తిరిగినా పట్టించుకోవడం లేదు. అక్క బిడ్డను ఆదుకుందామని అప్పులు చేస్తే.. ఇప్పుడు అప్పుల వాళ్లు సతాయిస్తున్నారు. ఎలా తీర్చాలో తెలియడం లేదు. - పర్వీన్ సుల్తానా, యాకుత్‌పురా, హైదరాబాద్ -
అప్పు చెల్లించాలంటూ దాడులు
-
వడ్డీ కాసురులు -part 2
-
వడ్డీ కాసురులు-part 1
-
రెచ్చిపోతున్న ఫైనాన్స్ వ్యాపారులు
-
పాతబస్తీనా.. మినీ పాకిస్తానా?
బీజేపీ సభ్యుడు రాజాసింగ్ వ్యాఖ్యలతో శాసనసభలో దుమారం సాక్షి, హైదరాబాద్: రాజధానిలోని పాతబస్తీపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు మంగళవారం శాసనసభలో తీవ్ర దుమారం లేపాయి. జీరో అవర్‌లో ఆయన ఉగ్రవాద కార్యకలాపాల అంశాన్ని లేవనెత్తారు. పాతబస్తీ మినీ పాకిస్తాన్లా మారుతోందని ఈ సందర్భంగా అన్నారు. ‘‘సాయిబాబా దేవాల యం, గోకుల్‌చాట్, లుంబినీ పార్క్ తదితర ప్రాంతాల్లో చోటుచేసుకున్న ఉగ్రవాద చర్యలతో సంబంధమున్నవారు పాతబస్తీలో పట్టుబడుతున్నారు. ఇటీవల వేరే ప్రాంతంలో చోటుచేసుకున్న పేలుడు ఘటనకు సంబంధిం చిన నిందితుడు కూడా పాత నగరంలోనే పట్టుబడ్డాడు. అతను ఉంటున్న ఇంటికింది భాగంలో ఓ లోకల్ పార్టీ కార్యాలయం కొనసాగుతోంది. పాతబస్తీ క్రమంగా మినీ పాకిస్తా న్లా మారుతోంది’ అంటూ రాజాసింగ్ వ్యాఖ్యానించారు. తొలుత మంత్రి హరీశ్‌రావు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ వెంటనే టీఆర్ఎస్, మజ్లిస్ సభ్యులు సభ ముందువైపు దూసుకొచ్చి అభ్యంతరం తెలిపారు. ఈ తరుణంలో రాజాసింగ్ మైక్‌ను స్పీకర్ కట్ చేసినప్పటికీ ఆయన గట్టిగా మాట్లాడుతూనే ఉన్నారు. దీంతో సభ గందరగోళంగా మారింది. ఈ సమయంలో ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ జోక్యం చేసుకుని రాజాసింగ్ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని కోరారు. ‘సభ్యుడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. అది పద్ధతి కాదు. ఇది అసెంబ్లీ అన్న విషయం మరిచిపోవద్దు. అభ్యంతరకరమైన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొల గించాలి’ అని డిమాండ్ చేశారు. ఆ మాటలను రికార్డుల నుంచి తొలగిస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు. అయినా సభ అదుపులోకి రాకపోవడంతో 10 నిమిషాల పాటు వాయిదా వేశారు. -
డబ్బు కోసమే...
చిన్నారులను కిడ్నాప్ చేసి చంపేస్తున్న దుండగులు వరుస ఘటనలతో తల్లిదండ్రుల ఆందోళన చాంద్రాయణగుట్ట: తల్లిదండ్రులపై ఉన్న కోపం...ఆర్థిక వివాదాలు...అక్రమంగా డబ్బు సంపాదించాలన్న ఆలోచనతో కొందరు పాతబస్తీలోని చిన్నారులను కిడ్నాప్ చేసి దారుణంగా హత్య చేస్తున్నారు. ఆరు నెలల క్రితం జంగమ్మెట్కు చెందిన బాలుడిని కిడ్నాప్ చేసి హత్య చేసిన ఘటన మరువక ముందే తాజాగా.. చాంద్రాయణగుట్ట ఇంద్రానగర్‌కు చెందిన బాలుడిని కిడ్నాప్ చేసి కిరాతకంగా హత్య చేయడంతో పాతబస్తీవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమతో పాటే బస్తీల్లో ఉంటున్న మానవ మృగాలు ఇలాంటి దారుణాలకు ఒడిగట్టడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. పాఠశాలకు వెళ్లిన తమ చిన్నారులు క్షేమంగా ఇంటికి తిరిగి వస్తారో.. లేదోనని భయపడిపోతున్నారు. పాతబస్తీలోని ఫలక్‌నుమా డివిజన్ పరిధిలోనే చిన్నారుల కిడ్నాప్, హత్య ఘటనలు ఎక్కువుగా జరుగుతున్నాయి. ఈ డివిజన్లో జరిగిన ముగ్గురు చిన్నారుల హత్యలకు ప్రధాన కారణం డబ్బే. ఇలాంటి ఘటనలు జరుగకుండా ఉండేందుకు తల్లిదండ్రులు స్కూల్‌కు వెళ్లే తమ పిల్లల రాకపోకలపై ఓ కన్నేసి ఉంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అనుమానితులెవరైనా పిల్లలతో మాట్లాడుతున్నట్టు తెలిస్తే వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని పోలీసులు సూచిస్తున్నారు. కిడ్నాప్ జరిగిన సమయంలో పూర్తి వివరాలు తమకు తెలియజేస్తే చిన్నారులను కాపాడేందుకు అవకాశం ఉంటుందంటున్నారు. స్కూళ్ల వద్ద కానరాని సీసీ కెమెరాలు... పాతనగరంలో ఇప్పటి వరకు జరిగిన చిన్నారుల కిడ్నాప్‌లో అధికంగా పాఠశాలల వద్దే జరిగాయి. దీన్ని దృష్టిలో ఉంచుకొని పాఠశాలల యజమాన్యాలు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాల్సి ఉన్నా.. పట్టించుకోవడం లేదు. ఛత్రినాక పోలీస్‌స్టేషన్ పరిధిలో నాలుగైదు పర్యాయాలు చిన్నారుల కిడ్నాప్‌కు విఫలయత్నాలు జరిగాయి. అయినా పాఠశాలల వద్ద కెమెరాలు ఏర్పాటు చేయలేదు. పోలీసులు పట్టించుకోకపోవడమే దీనికి కారణం. గతంలో జరిగిన కొన్ని ఘటనలు చాంద్రాయణగుట్ట ఠాణా పరిధిలో గతనెల 22న ప్రభాకర్, ఉమారాణిల కుమారుడు కరుణాకర్(10)ను అదే ప్రాంతానికి చెందిన మల్లికార్జున్, మోహన్‌లు కిడ్నాప్ చేసి అదేరోజు దారుణంగా హత్య చేశారు. డబ్బు కోసం వీరు పది రోజుల పాటు చిన్నారి తల్లిదండ్రులకు ఫోన్ చేసి వేధించారు. ఛత్రినాక ఠాణా పరిధిలో ఈ ఏడాది ఏప్రిల్ 5న జంగమ్మెట్ ఎంసీహెచ్ క్వార్టర్స్ ప్రాంతంలోని ఇంటి ముందు ఆడుకుంటున్న రాజు, సుజాత దంపతుల కుమారుడు మాస్టర్ డి.కార్తీక్ (10)ను బంధువు శివకుమర్ (22) కిడ్నాప్ చేసి రూ. 2 లక్షలు డిమాండ్ చేశాడు. తల్లిదండ్రుల నుంచి సమాధానం వచ్చేంత లోపే బాలుడిని షాద్‌నగర్‌లో చంపేశాడు. గతేడాది నవంబర్‌లో పాతబస్తీ రికాబ్గంజ్కు చెందిన బంగారు వ్యాపారి గోపాల్ మాజీ కుమారుడు ఆకాష్ ( రెండున్నరేళ్లు)ను దుకాణంలో పనిచేసే దూరపు బంధువు రాంప్రసాద్ (26) కిడ్నాప్ చేశాడు. మూడు కిలోల బంగారం కావాలంటూ పది రోజుల పాటు డిమాండ్ చేశాడు. కాని ఈ ఘటనలో మాత్రం పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి బాలుడిని రక్షించి నిందితుడిని అరెస్ట్ చేశారు. చాంద్రాయణగుట్ట ఠాణా పరిధిలో 2010 డిసెంబర్లో చిట్టీ డబ్బులు ఇవ్వడం లేదన్న కక్షతో సదరు ఏజెంట్ కుమారుడిని దుండగులు కిడ్నాప్ చేసి బీచ్పల్లిలో కృష్ణానది వద్ద చంపేశారు. -
బోనాలకు సర్వం సిద్ధం
నేడు జాతర హాజరు కానున్న మంత్రులు ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టువస్త్రాలు చార్మినార్: ఆషాఢ మాసం బోనాల ఉత్సవాలకు పాతబస్తీలోని ఆలయాలు ముస్తాబయ్యాయి. ఆదివారం ఉదయం జాతరకు పలువురు మంత్రులు హాజరవుతున్నట్టు మహంకాళి బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ అధ్యక్షుడు పొటేల్ రాము యాదవ్, కార్యదర్శి దత్తాత్రేయ, మాజీ అధ్యక్షుడు అంజయ్య తెలిపారు. పాతబస్తీలోని లాల్‌దర్వాజా సింహవాహిని మహంకాళి దేవాలయంతో పాటు, మీరాలంమండి, ఉప్పుగూడ, సుల్తాన్షాహి, గౌలిపురా, మురాద్‌మహాల్, అక్కన్నమాదన్న మహంకాళి దేవాలయాలు.. బేలా ముత్యాలమ్మ ఆలయం, బంగారు మైసమ్మ, రాంబక్షి బండ తదితర ఆలయాలను సిద్ధం చేసినట్టు వారు తెలిపారు. భక్తులకు ఇబ్బందులు కలుగకుండా అన్ని జాగ్రత్త చర్యలు తీసుకున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారన్నారు. బోనాలకు గట్టి పోలీసు బందోబస్తు సిటీబ్యూరో: గొల్కొండ, లష్కర్ బోనాలను శాంతియుతంగా నిర్వహించిన నగర పోలీసులు నేడు పాతబస్తీలో జరిగే బోనాల ఉత్సవాలపై దృష్టి సారించారు. ఈ మేరకు పాతబస్తీలో పోలీసు బలగాలను మోహరించారు. అత్యంత సమస్యాత్మక ప్రాంతాలలో అదనపు పికె ట్లను ఏర్పాటు చేశారు. గస్తీ పోలీసులను, శాంతి కమిటీలను అప్రమత్తం చేశారు. లాల్‌దర్వాజ బోనాలకు వీఐపీలు, వీవీఐపీల తాకిడి ఎక్కువగా ఉండడంతో పోలీసు కమిషనర్ ఎమ్.మహేందర్‌రెడ్డి ఈ ప్రాంతాలపై ఎక్కువగా దృష్టి కేంద్రీకరించారు. బందోబస్తు చర్యలపై ఆయన అన్ని జోన్ల డీసీపీలతో చర్చించారు. అమ్మవారికి పట్టువస్త్రాల సమర్పణ చాంద్రాయణగుట్ట: లాల్‌దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారికి టీఎన్జీవో రాష్ర్ట అధ్యక్షుడు దేవి ప్రసాద్ శనివారం పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో టీఎన్జీవో ప్రధాన కార్యదర్శి రవీందర్‌రెడ్డి, గ్రేటర్ అధ్యక్షుడు ముజీబ్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రభుత్వంలో చేరేది లేదు..
మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ స్పష్టీకరణ ప్రభుత్వ చిహ్నంగా చార్మినార్ ను గుర్తించాలి.. కేసీఆర్‌కు అసద్ పలు ప్రతిపాదనలు సాక్షి,సిటీ బ్యూరో: ఏళ్లుగా పాతబస్తీ రాజకీయాలను శాసిస్తున్న మజ్లిస్ పార్టీ కొత్తగా ఏర్పడే తెలంగాణ రాష్ట్రంలో తొలిప్రభుత్వంలో చేరబోమని స్పష్టం చేసింది. ప్రభుత్వానికి సంపూర్ణ మద్దతు ఇచ్చి ముందుకు నడిపిస్తాం..తప్ప పదవులపై వ్యామోహం లేదని తేల్చిచెప్పింది. దీంతో రాజకీయ ఉత్కంఠకు తెరపడినట్లయ్యింది. ఈ నేపధ్యంలో గురువారం మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ఒవైసీ, అగ్రనేత అక్బరుద్దీన్లు కాబోయే ముఖ్యమంత్రి కేసీఆర్‌తో సమావేశమై మహానగరాభివృద్ధిపై తమ ప్రతిపాదనలు ముందుంచారు. ఇదీ మా లెక్కంటూ స్పష్టంచేశారు. ఆ వివరాలు.. నూతనంగా ఏర్పడే తెలంగాణ రాష్ట్రానికి ప్రభుత్వ చిహ్నంగా చారిత్రక కట్టడమైన చార్మినార్ గుర్తించాలని విజ్ఞప్తి. ప్రస్తుతం కొనసాగుతున్న జీహెచ్ఎంసీని రద్దు చేసి దానిస్థానంలో పాత ఎంసీహెచ్‌ను పునరుద్ధరించాలి. నగర శివారు రంగారెడ్డి, మెదక్ జిల్లా ప్రాంతాలను కొత్త మున్సిపాలిటీలుగా ఏర్పాటు చేయాలి. నగరానికి కృష్ణా, గోదావరి జలాలను పూర్తిస్థాయిలో తీసుకరావాలి. పాతబస్తీ అభివృద్ధికి 2006లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ మంజూరుచేసిన రూ.2,075 కోట్లను విడుదల చేసి పెండింగ్ పనులు పూర్తిచేయాలి. నగరంలో విద్యుత్ సమస్యను అధిగ మించేందుకు 440-800 కేవీ సబ్స్టేషన్లను వెంటనే ఏర్పాటు చేయాలి. ధర్మాస్పత్రి ఉస్మానియాను అత్యాధునిక సదుపాయాలతో నిమ్స్ కంటే మెరుగ్గా అభివృద్ధి పర్చాలి. బండ్లగూడలో అందుబాటులో ఉన్న 100 ఎకరాల భూమిని బలహీనవర్గాల వారికి ఇళ్లస్థలాలుగా కేటాయించాలి. ఎస్సీ,ఎస్టీ సబ్‌ప్లాన్ మాదిరి మైనార్టీ సబ్‌ప్లాన్‌ను రూపొందించాలి. ముస్లింలు 45 శాతం ఉన్న హైదరాబాద్ జిల్లాలో ముస్లిం అధికారులనే జిల్లా విద్యాశాఖాధికారిగా పోస్టింగ్ ఇవ్వాలి. ఉర్దూ టీచర్ల భర్తీకి ప్రత్యేక డీఎస్సీ నిర్వహించాలి. మైనార్టీ స్టడీ సెంటర్లను ఏర్పాటు చేసి ముస్లింలలో విద్యను అభివృద్ధి చేయాలి. పరిశ్రమలను అభివృద్ధి చేసి ఉపాధి అవకాశాలు మెరుగుపర్చాలి. -
పాతబస్తీలో పోలీసుల కవాతు
చాంద్రాయణగుట్ట, న్యూస్‌లైన్: గత కొన్ని రోజులుగా చోటు చేసుకుంటున్న ఘటనల నేపథ్యంలో దక్షిణ మండలం పోలీసులు శనివారం పాతబస్తీలో కేంద్ర బలగాలతో కవాతు నిర్వహించారు. డీసీపీ సర్వశ్రేష్ఠ త్రిపాఠీ ఆదేశాల మేరకు ఫలక్‌నుమా, చార్మినార్, మీర్‌చౌక్, సంతోష్‌నగర్ ఏసీపీ డివిజన్ల పరిధిలో కవాతు జరిపారు. ఏసీపీలు, సీఐల ఆధ్వర్యంలో ఆర్ఏఎఫ్, బీఎస్ఎఫ్, ఏపీఎస్పీ బలగాలు మార్చ్ఫాస్ట్ నిర్వహించాయి. ఫలక్‌నుమా ఏసీపీ మహ్మద్ అబ్దుల్ బారీ ఆధ్వర్యంలో చాంద్రాయణగుట్ట నుంచి ప్రారంభమైన కవాతులో ఇన్స్పెక్టర్లు అందె శ్రీనివాసారావు, ఎస్.మహేశ్వర్, షాకీర్ హుస్సేన్ పాల్గొన్నారు. -
సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి
అల్లర్లపై గవర్నర్‌కు కాంగ్రెస్ విజ్ఞప్తి సాక్షి, హైదరాబాద్: పాతబస్తీలోని సిక్చావ్ని ప్రాంతంలో జరిగిన అల్లర్లపై సిట్టింగ్ జడ్జిచే విచారణ జరిపించాలని మాజీమంత్రి దానం నాగేందర్ రాష్ట్ర గవర్నర్ ఈసీఎల్ నరసింహన్‌కు విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్సీ ఎమ్మెస్ ప్రభాకర్, నగర డిప్యూటీ మేయర్ రాజ్‌కుమార్‌తో కలిసి గురువారం దానం గవర్నర్‌కు వినతి పత్రం అందజేశారు. అంతకుముందు మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ అధినేత్రి సోనియూగాంధీ, రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్‌సింగ్ తనకు ఫోన్ చేసి సంఘటన వివరాలు తెలుసుకోవడంతోపాటు జరిగిన ఘటనపట్ల సానుభూతి వ్యక్తం చేశారని చెప్పారు. మరోవైపు టీపీసీసీ కిసాన్- ఖేత్ మజ్దూర్ యూనియన్ ఛైర్మన్ ఎం.కోదండరెడ్డి గురువారం గవర్నర్ సలహాదారు ఏఎన్ రాయ్‌ను కలిసి తెలంగాణలో ఆకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని వినతి పత్రం అందజేశారు. వర్షాల కారణంగా వరి, మొక్కజొన్న, కూరగాయలు, మామిడి తోటలకు భారీ నష్టం వాటిల్లిందన్నారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయడంతోపాటు కనీస మద్దతు ధర చెల్లించాలని కోరారు. విత్తనం కొరత లేకుండా సబ్సిడీపై అన్ని రకాల విత్తనాలు సరఫరా చేయాలని వినతిపత్రంలో పేర్కొన్నారు.