ప్రశాంతంగా రీ పోలింగ్ | Peaceful re-polling | Sakshi
Sakshi News home page

ప్రశాంతంగా రీ పోలింగ్

Published Sat, Feb 6 2016 1:37 AM | Last Updated on Sun, Sep 3 2017 5:01 PM

ప్రశాంతంగా రీ పోలింగ్

ప్రశాంతంగా రీ పోలింగ్

47.10 శాతం  నమోదు
 
చార్మినార్: పాతబస్తీలోని పురానాపూల్ డివిజన్‌లో శుక్రవారం రీ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావివ్వకుం డా పోలీసులు కట్టుదిట్టమైన  భద్రతా చర్యలు తీసుకున్నారు. నగర సంయుక్త పోలీసు కమిషనర్ శివ ప్రసా ద్ స్వయంగా శాంతి భద్రతలను పర్యవేక్షించారు. శుక్రవారం ఉదయం 7గంటలకు ప్రారంభమైన రీ పోలింగ్ సాయంత్రం 5 వరకూ కొనసాగింది.

అభ్యర్థులు స్వయంగా పోలింగ్ కేంద్రాలను సందర్శించి... సరళిని పరిశీలించారు. వివిధ ప్రాం తాల ప్రజలు ఉత్సాహంగా ఓటు హక్కును విని యోగించుకున్నారు. ఈ నెల 2న 54.08 శాతం ఓట్లు పోలవ్వగా...శుక్రవారం రీ పోలింగ్‌లో 47.10 శాతం పోలయ్యాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement