హైదరాబాద్, సాక్షి: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సాధారణ ఎన్నికల ఫలితాలు యావత్ సమాజాన్ని ఆశ్చర్యానికి గురి చేశాయి. ఐదేళ్లపాటు సంక్షేమ పథకాలతో.. అభివృద్ధి దిశగా రాష్ట్రం ఉరకలేసింది. ముఖ్యమంత్రిగా అన్నింటా అణగారిన వర్గాలకు పెద్ద పీట వేశారు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి. అయినా కూడా ఫలితాలు ఘోరంగా వచ్చాయి. ఊహించని ఈ ఫలితంపై రాష్ట్రవ్యాప్తంగా తీవ్రస్థాయిలో చర్చ నడుస్తోంది.
వివిధ సంక్షేమ పథకాలతో పాటు మెడికల్ కాలేజ్ లు, పోర్ట్ లు,నాడు-నేడు, ఇంగ్లీష్ విద్య.. ఇలా ఎన్నో సంస్కరణలతో ఏపీని దేశ చిత్ర పటంలో ప్రత్యేకంగా నిలిపింది జగన్ పాలన. ఎన్నికలు ముగిశా.. ఎగ్జిట్ పోల్స్‌లోనూ వైఎస్సార్‌సీపీకే అనుకూల ఫలితాలు వచ్చాయి. అలాంటి పార్టీకి గారి పార్టీ కి 11 మళ్ళీ,4 ఎంపీ లు రావడం అనేది చాలా దారుణమనే అభిప్రాయం వినవస్తోంది.
ఆఖరికి అధికార యంత్రాంగంలో భాగమైన పోలీసులు, ఎన్నికల కమిషన్ వాళ్లు కుమ్మక్కై కూటమి కోసం పని చేశాయి. ఈ క్రమంలో వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుల్ని హింసించాయి. మరోవైపు కూటమి అభ్యర్థుల గెలుపు.. మెజారిటీపైనా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సంక్షేమ పథకాల లబ్ధి పొందిన ప్రజలంతా ఫ్యాన్ గుర్తుకే ఓటేశామని అంటున్నారు. అలాంటప్పుడు.. ఇలాంటి ఓటమి ఎలా?.
వైఎస్సార్‌సీపీ శ్రేణుల్లో ఈవీఎంల మీద అనుమానాలున్నాయి. అందుకే ఎన్నికలను రద్దు చేసి.. మళ్లీ నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ క్రమంలో.. సానే అమర్‌నాథ్ Change.org ద్వారా పిటిషన్ వేశారు. వీలైనంత వరకు తిరిగి ఎన్నికలు జరిపించేంత వరకు తనతో పోరాడాలని, లేదంటే రీకౌంటింగ్ అయినా చేయించాలని ఎన్నికల సంఘాన్ని ఆయన డిమాండ్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment