
పురానాపూల్ మజ్లిస్ ఖాతాలోకి...
వివాదాస్పదంగా మారి.. రీపోలింగ్ జరిగిన పురానాపూల్ డివిజన్ మజ్లిస్ ఖాతాలోకి వెళ్లింది. ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన సున్నం రాజ్ మోహన్ 2,877 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. రాజ్‌మోహన్‌కు 8,553 ఓట్లు రాగా... కాంగ్రెస్ అభ్యర్థి మహ్మద్ గౌస్‌కు 5,676 ఓట్లు వచ్చాయి. టీడీపీ అభ్యర్థి మధుకర్ యాదవ్‌కు 1,295 ఓట్లు, టీఆర్‌ఎస్ అభ్యర్థికి 747 ఓట్లు వచ్చాయి.