Puranapul
-
Hyderabad: పురానాపూల్‌లో భారీ అగ్ని ప్రమాదం (ఫొటోలు)
-
పురానాపూల్: అదుపులోకి మంటలు..ఫైర్ ఆఫీసర్ ఏమన్నారంటే?
సాక్షి, హైదరాబాద్: నగరంలోని పురానాపూల్‌లో భారీ అగ్ని ప్రమాద ఘటన చోటుచేసుకుంది. పురానాపూల్‌లో ఉన్న ఓ గోదాంలో బుధవారం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వివరాల ప్రకారం.. పురానాపూల్‌లోని ఓ గోదాంలో అగ్ని ప్రమాదం జరిగింది. గోదాంలో టైర్లకు సంబంధించిన మెటీరియల్ ఉండటంతో మంటలు ఎగిసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువస్తున్నారు. ఆరు ఫైరింజన్లతో మంటలను అదుపులోకి తెస్తున్నారు. ఇక, షార్ట్ సర్య్కూట్ కారణంగా మంటలు చెలరేగాయా లేక మరేదైనా కారణంగా ప్రమాదం జరిగిందా? అనే విషయం తెలియాల్సి ఉంది. అయితే, ఈ ప్రమాదంలో ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ఈ ప్రమాదం సందర్భంగా తెలంగాణ రీజినల్ ఫైర్ ఆఫీసర్ పాపయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. కాగా, పాపయ్య మీడియాతో మాట్లాడుతూ.. ‘నాలుగు గోడల మధ్యనే అగ్ని ప్రమాదం జరిగింది కాబట్టి త్వరగా అదుపులోకి తీసుకొచ్చాం. షెడ్డు కూలి పడిపోవడంతో లోపలికి వెళ్లడానికి ఆలస్యమైంది. మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చాం. మొదటగా ఒక ఫైర్ ఇంజన్ మాత్రమే వచ్చింది. తర్వాత 7 ఫైరింజన్లు రావడంతో మంటలను అదుపులోకి తెచ్చాం. గోదాం పరిసర ప్రాంతాల్లో ఉన్న నివాసాలకు ఎలాంటి ప్రమాదం లేదు. అగ్ని ప్రమాదం కారణంగా చుట్టుపక్కల ఉన్న వారందరూ భయాందోళనలకు గురయ్యారు. ఈ గోదాంలో ఫైర్ సేఫ్టీ లేదు. సేఫ్టీ పాటించనందుకు కఠిన చర్యలు తీసుకుంటాం. ఈ ప్రమాదం ఎలా జరిగింది అనే దానిపై దర్యాప్తు కొనసాగుతోంది. ఈ ప్రమాదం షార్ట్ సర్కిటా వేరే కారణాలు జరిగిందా అనే దానిపై దర్యాప్తు కొనసాగుతుంది. ప్రతీ ఒక్కరూ ఫైర్ సేఫ్టీ పాటించాలి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అవగాహన కార్యక్రమం చేపడతాం’ అని తెలిపారు. -
భారీ వరద: కుంగిన పురానాపూల్ వంతెన
సాక్షి, హైదరాబాద్ : గత కొన్ని రోజులుగా హైదరాబాద్ నగరంలోకి కురుస్తున్న భారీ వర్షాలకు రోడ్లున్నీ దెబ్బతిన్నాయి. భారీ వరదల కారణంగా మూసీ నదికి వందేళ్ల కాలంలో ఎన్నడూ లేనంత వరద పోటెత్తడంతో పరివాహ ప్రాంతాలను మూసీ ముంచెత్తింది. ఈ క్రమంలోనే పురానాపూల్ వంతెన సైతం దెబ్బతిన్నది. భారీ ప్రవాహం ధాటికి బ్రిడ్జ్ పిల్లర్‌పై పగుళ్లు ఏర్పడటంతో కొంతమేర కుంగింది. సమచారం అందుకున్న అధికారులు పురానాపూల్ వంతెనపై నుంచి వాహనాల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేశారు. బారికేడ్లను ఏర్పాటు చేసి వాహనాలను మళ్లిస్తున్నారు. నిపుణుల కమిటీ పరిశీలించిన తర్వాత రాకపోకలపై నిర్ణయం తీసుకోనున్నారు. దీంతో వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు వర్షాల ముప్పు ఇంకా పొంచివుందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో నగర వాసులు భయపడుతున్నారు. ముఖ్యంగా మూసీ నది పరివాహక ప్రాంతంలోని నివాసితులు భీతిల్లుతున్నారు. (నిజాంల ‘ప్లాన్’ బెస్ట్!) -
భారీ వర్షం.. కొట్టుకొచ్చిన కొండచిలువ
సాక్షి, హైదరాబాద్ : ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో భాగ్యనగరం అల్లాడుతోంది. పలు ప్రాంతాలు నీట మునిగాయి. ఇళ్లలోకి వర్షపునీరు వచ్చి చేరడంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. భారీ వరద నీరు చేరుకోవడంతో బస్తీల్లోకి పాములు, తేళ్లు వస్తున్నాయి. తాజాగా పురానాపూల్ ప్రాంతంలోకి ఓ పెద్ద కొండచిలువ వచ్చింది. కొందరు యువకులు తమ ప్రాణాలను పణంగా పెట్టి దానిని పట్టుకొని సంచిలో వేసి బంధించారు. జలదిగ్బంధంలో చంద్రాయణగుట్ట వర్షం తగ్గుముఖం పట్టిన చాంద్రాయణగుట్ట పరిసరప్రాంతాలు ఇంకా జలదిగ్బంధంలోనే ఉన్నాయి. వరదలో ప్రైవేట్ బస్సులు లారీలు కార్లు ఫంక్షన్ హాల్స్ చిక్కుకున్నాయి. బుధవారం వరద కారణంగా పక్కనే ఉన్న రైస్ మిల్లు నుంచి పెద్ద ఎత్తున వరదల్లో వరి ధాన్యం కొట్టుకొచ్చింది. కొట్టుకుపోయిన కార్లు, బైకులు సరూర్‌నగర్‌లో వరద ఇంకా కొనసాగుతుంది. ఎగువ చెరువుల నుంచి వస్తున్న నీటితో సరూర్ నగర్ చెరువు నిండు కుండలా మారింది. నీరు కిందకు వదలడంతో పలు కాలనీలు నీట మునిగాయి. ఇళ్లలోకి వరద నీరు భారీగా వచ్చి చేరడంతో కార్లు, బైకులు, సామాగ్రి కొట్టుకుపోయాయి. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
అలా కలిశారు వారిద్దరూ..
సాక్షి,సిటీబ్యూరో: ప్రేమ.. ఓ అందమైన భావన. మధురమైన అనుభూతి. వందల ఏళ్లుగా సాగుతున్న హృదయాల కావ్యం. హైదరాబాద్.. దశాబ్దాల కిందట ప్రేమ పునాదులపై వెలసిన ప్రేమనగరం. ఇక్కడ కుల మతాలకు అతీతంగా భిన్న సంస్కృతులు, భాషల పూదోటలు విరిశాయి. భాగమతి, కులీ కుతుబ్షాల్లాగే ఆనాటి నుంచి నేటి వరకు ఎన్నెన్నో ప్రేమ జంటలు ఈ వలపుల పూదోటలో విహరించాయి. భాగమతి–కులీ కుతుబ్షాల ప్రేమ ఘట్టం అపురూప కావ్యంగా చరిత్రలో నిలిచిపోయింది. తర్వాత నిజాం కాలం నాటి బ్రిటిష్ రెసిడెంట్ కిర్క్ ప్యాట్రిక్, ఖైరున్నీసా ప్రేమ కూడా అలాగే సాగింది. కులీ, భాగమతిలను ఏకం చేసేందుకు మూసీనదిపై ఏకంగా ఒక ‘ప్రేమ వంతెన’ (పురానాపూల్) వెలిసింది. అప్పటికే పారిస్‌లోని సైనీ నదిపై నిర్మించిన ఫౌంట్‌న్యూఫ్ వంతెన తరహాలో దీన్ని నిర్మించడం విశేషం. ఇక కిర్క్ ప్యాట్రిక్, ఖైరున్నీసాల ప్రేమకు గుర్తుగా కోఠిలో ‘బ్రిటీష్ రెసిడెన్సీ’ వెలసింది. అందులోనే తన ప్రేయసికి కానుకగా ‘హవా మహల్’ను నిర్మించి ఇచ్చాడు ప్యాట్రిక్. హైదరాబాద్ అప్పుడు.. ఇప్పుడు ఓ ప్రేమనగరం. వాలంటైన్స్ డే సందర్భంగా ప్రత్యేక కథనం. అలా కలిశారు వారిద్దరూ.. ‘చిచలం’ హైదరాబాద్ రాజ్యంలోని ఓ పల్లె ప్రాంతం.. మూసి నదికి ఆవలవైపు ఉంది. అపుడే గుర్రంపై ‘చిచలం’ చేరుకున్న యువరాజు కులీ కుతుబ్‌షాకు ఎక్కడి నుంచో కాలి అందెల శబ్దం చెవులను తాకింది. ఆ సవ్వడిలో ఏదో గమ్మత్తును గుర్తించాడు. చూస్తే ఓ యువతి.. పేరు భాగమతి. పరవళ్లు తొక్కుతున్న మూసీ నదిలాగే అతడి హృదయంలో అలజడి రేగింది. ఆ రోజు ఆమె పల్లె పొలిమేరల్లో ఉన్న ఆలయానికి వెళ్తుండగా యువరాజు చూశాడు. ఆ యువతినే తన హృదయ సామ్రాజ్ఞిని చేసుకున్నాడు కులీ కుతుబ్‌షా. కానీ ఆమె సాధారణ యువతి. అతను యువరాజు. ఆమెది హైందవ సంప్రదాయం. అతనిది మహ్మదీయ మతం. మరేం జరిగింది..? ఏకం చేసిన ప్రేమ వంతెన.. హృదయాలు ఏకమైనా ఉప్పొంగే మూసీ వారి మధ్య అఖాతమైంది. ఆ దరి నుంచి ఈ దరికి చేరుకోకుండా అడ్డుపడింది. కానీ వారి ప్రేమ ముందు మూసీ ఓడిపోయింది. భీకరంగా ప్రవహిస్తోన్న మూసీ నదిని సైతం లెక్క చేయకుండా తన ప్రియురాలు భాగమతి కోసం ‘చిచలం’కు పరుగులు తీశాడు కుతుబ్. నదిని దాటేందుకు యువరాజు పడుతున్న ఇబ్బందులను తొలగించేందుకు గోల్కొండ పట్టణం నుంచి 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిచలం వెళ్లేందుకు తండ్రి ఇబ్రహీం కుతుబ్ షా మూసీ నదిపై 1578లో కట్టించిన ‘ప్యార్ నా పూల్’ (పురానాపూల్) వంతెనను కట్టించాడు. అది ప్రేమ వంతెనగా నిలిచిపోయింది. పురానాపూల్, పారిస్‌లోని సైని నదిపై నిర్మించిన ఫాంట్న్యూఫ్ బ్రిడ్జీలు ఇంచుమించు ఒకే కాలంలో.. ఒకే నమూనాతో నిర్మించారు. మూసీనదికి ఉత్తరాన కుతుబ్ షా మొట్టమొదటిసారి భాగమతిని చూసిన ‘చిచలం’ వద్ద 1592 నాటికి అద్భుతమైన కట్టడం చార్మినార్‌తో నగర నిర్మాణం పూర్తయింది. అప్పటికి ఆ ఊరు మహారణ్యంలో ఉన్న ఓ చిన్న పల్లె. దానినికి ‘భాగ్యనగర్’గా పేరుపెట్టారు. బహుశా మానవ చరిత్రలో ఇద్దరి ప్రేమకు చిహ్నంగా వెలిసిన నగరం ఏదైనా ఉందంటే అది హైదరాబాదే. నగర నిర్మాణం నాటికి కుతుబ్ షా వద్ద మీర్ మోమిన్ ప్రధానిగా ఉన్నాడు. ఆయన ఇరాన్‌కు చెందినవాడు కావడం వల్ల పర్షియాలోని ‘ఇస్పహాన్’ నగరం నమూనాలో హైదరాబాద్ నగరానికి ప్రణాళికలు రూపొందించారు. ఇందుకోసం ఇరాన్‌కు చెందిన వాస్తు శిల్పులను, నిపుణులను రప్పించారు. చరిత్రాత్మకమైన చార్మినార్‌కు నలువైపులా అందమైన ఉద్యానవనాలు, తటాకాలు, సరస్సులతో, రాజప్రముఖుల నివాస మందిరాలతో నగరం వెలసింది. లాల్‌మహల్, దాద్‌మహల్, జనాన మహల్, కుతుబ్ మందిర్, ఖుదాదత్ మహల్ వంటి అద్భుతమైన నిర్మాణాలన్నీ అప్పుడు కట్టించినవే. కిర్క్ ప్యాట్రిక్, ఖైరున్నీసాల ప్రేమ ఘట్టం భాగమతి, కుతుబ్షాల ప్రేమ ఘట్టంలాగే కిర్క్ ప్యాట్రిక్, ఖైరున్నీల ప్రేమ కూడా మధుర కావ్యమైంది. ప్యాట్రిక్ బ్రిటీష్ అధికారిగా వచ్చినప్పటికీ హైదరాబాద్ సాంస్కృతిలో కలిసిపోయిన గొప్ప పరిపాలనాదక్షుడు. 1798 నుంచి 1805 వరకు హైదరాబాద్ 6వ రెసిడెంట్‌గా బాధ్యతలు నిర్వహించాడు. అప్పటి వరకు ఉన్న రెసిడెంట్లంతా ‘షంషీద్‌జంగ్’ అనే అమీర్ తోటలో నివసించేవారు. కానీ మొదటిసారి ప్యాట్రిక్ ప్రత్యేకంగా ‘రెసిడెంట్ భవనం’ కట్టించాడు. నిజాం నవాబు సహకారంతో 64 ఎకరాల సువిశాలమైన స్థలంలో మూసీకి ఉత్తరాన ఈ మహాసౌధం వెలిసింది. ఈ భవనానికి లండన్ నుంచి అత్యంత ఖరీదైన ఫర్నిచర్ తెప్పించాడు. తన రెసిడెంట్ భవనానికి కొద్ది దూరంలో.. సుల్తాన్‌బజార్‌లోని ఓ ఇంట్లో నివసిస్తున్న ఖైరున్నీసా అనుకోకుండా ప్యాట్రిక్‌కు తారసపడింది. తొలి చూపులోనే ప్రేమించాడాయన. విషయాన్ని ఆమెకు చెప్పాడు. ఆమె కూడా ఇష్టపడింది. కానీ ఏంలాభం.. ఇద్దరి మతాలు.. భాషలు, ప్రాంతాలు వేరు. విషయాన్ని ఖైరున్నిసా కుటుంబ పెద్దలకు చెబితే వారు అంగీకరించలేదు. ప్యాట్రిక్ తన ప్రేమను గెలిపించుకోవాలనుకున్నాడు. తన పేరును ‘హస్మత్ జంగ్ బహదూర్’గా మార్చుకుని ముస్లిం పద్ధతిలో తన ప్రేయసి ఖైరున్నిసాను 1803లో పెళ్లి చేసుకున్నాడు. నేటి కోఠి ఉమెన్స్ కళాశాల ప్రాంగణంలో ‘హావామహాల్’ను నిర్మించి ఆమెకు బహుమతిగా ఇచ్చాడు. ఈ జంట సుల్తాన్‌బజార్‌లో షాఫింగ్ చేసే వారు. వీరిది మతాంతర వివాహం కావడంతో ప్రజలు వీరి ప్రేమ గురించి ప్రజలు కథలు కథలుగా చెప్పుకునేవారు. -
హైదరాబాద్‌లో పైశాచిక ఘటన
సాక్షి, హైదరాబాద్: నగరంలో పైశాచిక ఘటన చోటు చేసుకుంది. మూగ జీవి నుంచి పిల్లలను ఎత్తుకెళ్లిన కొందరు దుండగులు.. వాటి తల నరికి చంపారు. పురానాపూల్ లోని పార్థివాడ వద్ద ఈ ఘటన చోటు చేసుకోగా.. నిందితులను కఠినంగా శిక్షించాలని తీసుకోవాలని జంతు ప్రేమికులు డిమాండ్ చేస్తున్నారు. స్థానికంగా ఉండే క్రాంతి రాజా అనే వాలంటీర్ ఓ కుక్కకు, దాని పిల్లలకి భోజనం పెడుతుంటాడు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి నుంచి అవి కనిపించకుండా పోవటంతో చుట్టుపక్కల గాలించాడు. ఈ క్రమంలో సోమవారం ఉదయం ఓ సిమెంట్ పైప్ లైన్ల వద్ద ఓ పిల్ల దేహం ముక్కలై పడి ఉండగా.. తల్లి అక్కడక్కడే తిరుగుతూ కనిపించింది. ఓ పైపులో మిగతా మృతదేహాలు పడి ఉన్నాయి. నాలిగింటిని తల నరికి చంపగా.. మరో దానిని చర్మంతో సహా వలిచి ముక్కలుగా నరికారు. ఈ దారుణంపై స్థానిక పోలీసులకు క్రాంతి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకోని పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి తీరతామని చెబుతున్నారు. చుట్టుపక్కల సీసీ కెమెరాలు కూడా లేకపోవటంతో నిందితుడిని గుర్తించటం కష్టం మారిందని పోలీసులు చెబుతున్నారు. రెండు రోజుల క్రితం కొందరు తాగుబోతులు ఆ ప్రాంతంలో వీరంగం సృష్టించగా.. ఆ కుక్క వారిని చూసి మొరిగింది. ఈ కోపంలోనే వాళ్లు ఈ దాష్టీకానికి పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నారు. మృతదేహాలను ఖననం చేశాక కూడా ఆ తల్లి శునకం సిమెంట్ పైపులైన్ల వద్దే తచ్చాడుతూ రోదిస్తుండటం స్థానికులను కలిచివేస్తోంది. -
ప్రశాంతంగా రీ పోలింగ్
47.10 శాతం నమోదు చార్మినార్: పాతబస్తీలోని పురానాపూల్ డివిజన్లో శుక్రవారం రీ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావివ్వకుం డా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకున్నారు. నగర సంయుక్త పోలీసు కమిషనర్ శివ ప్రసా ద్ స్వయంగా శాంతి భద్రతలను పర్యవేక్షించారు. శుక్రవారం ఉదయం 7గంటలకు ప్రారంభమైన రీ పోలింగ్ సాయంత్రం 5 వరకూ కొనసాగింది. అభ్యర్థులు స్వయంగా పోలింగ్ కేంద్రాలను సందర్శించి... సరళిని పరిశీలించారు. వివిధ ప్రాం తాల ప్రజలు ఉత్సాహంగా ఓటు హక్కును విని యోగించుకున్నారు. ఈ నెల 2న 54.08 శాతం ఓట్లు పోలవ్వగా...శుక్రవారం రీ పోలింగ్‌లో 47.10 శాతం పోలయ్యాయి. -
పురానాపూల్ మజ్లిస్ ఖాతాలోకి...
వివాదాస్పదంగా మారి.. రీపోలింగ్ జరిగిన పురానాపూల్ డివిజన్ మజ్లిస్ ఖాతాలోకి వెళ్లింది. ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన సున్నం రాజ్ మోహన్ 2,877 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. రాజ్‌మోహన్‌కు 8,553 ఓట్లు రాగా... కాంగ్రెస్ అభ్యర్థి మహ్మద్ గౌస్‌కు 5,676 ఓట్లు వచ్చాయి. టీడీపీ అభ్యర్థి మధుకర్ యాదవ్‌కు 1,295 ఓట్లు, టీఆర్ఎస్ అభ్యర్థికి 747 ఓట్లు వచ్చాయి. -
నాడు ప్రేమకు... నేడు వివాదాలకు వారధి!
► ప్రతిసారీ మారుతున్న రిజర్వేషన్లు ► మజ్లిస్ పార్టీకి కంచుకోటగా పురానాపూల్ ► కాంగ్రెస్‌లో చేరిన మహ్మద్ గౌస్ మారిన సమీకరణలు చార్మినార్: పురానాపూల్... పోలింగ్ నాటి సంఘటనలు...రీ పోలింగ్‌తో ఈ ప్రాంతం ఒక్కసారి వార్తల్లోకి వచ్చింది. గ్రేటర్ ఎన్నికల ప్రకటన వెలువడినప్పటి నుంచే కాంగ్రెస్, మజ్లిస్ పార్టీల నడుమ ఘర్షణ వాతావరణం నెలకొంది. పోలింగ్ మొదలైనప్పటినుంచి రెండు పార్టీల నాయకులు, అభ్యర్థులు, కార్యకర్తలకు అక్కడక్కడ వాగ్వాదాలు, ఆందోళనలతో పాటు అరెస్ట్‌లూ చోటుచేసుకున్నాయి. పరిస్థితులను సమీక్షించిన ఉన్నతాధికారులు పురానాపూల్ డివిజన్లో శుక్రవారం రీ-పోలింగ్‌కు ఆదేశాలు జారీ చేశారు. మారుతున్న రిజర్వేషన్లు 1986 నాటి బల్దియా ఎన్నికల్లో ఎస్సీ రిజర్వేషన్‌గా ఉన్న పురానాపూల్ డివిజన్ 2002లో బీసీలకు కేటాయించారు. 2009లో మహిళలకు రిజర్వ్ చేశారు. ఇలా 1986 నుంచీ మారుతూ వస్తోంది. పునర్విభజన అనంతరం తాజాగా బీసీ జనరల్‌గా మారింది. 2009లో 23,863 మంది ఓటర్లు ఉండగా... ప్రస్తుతం ఈ సంఖ్య 34,407. రాజకీయ నేపథ్యం 1986లో పురానాపూల్ డివిజన్ ఎస్సీలకు రిజర్వు కావడం తో అప్పట్లో బీజేపీ అభ్యర్థి విజయ్ కుమారి కార్పొరేటర్‌గా ఎన్నికయ్యారు. 2002లో మజ్లిస్ పార్టీ అభ్యర్థి సున్నం రాజ్‌మోహన్ విజయం సాధించారు. అనంతరం మహిళా రిజర్వేషన్ కావడంతో మజ్లిస్ అభ్యర్థి సున్నం శ్రీలత గెలుపొందా రు. అప్పటి నుంచీ మజ్లిస్‌కు కంచుకోటగా మారింది. ప్రస్తుతం పునర్విభజన అనంతరం రాజకీయ సమీకరణలు మారాయి. మహ్మద్ గౌస్ కాంగ్రెస్‌లో చేరడంతో.... పురానాపూల్ డివిజన్ నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున మాజీ కార్పొరేటర్ మహ్మద్ గౌస్ పోటీ చేస్తున్నారు. ఆయనతో పాటు కుమారుడు, భార్య కూడా రంగంలోకి దిగారు. దీంతో ఒవైసీ సోదరులకు, మహ్మద్ గౌస్‌కు నడుమ పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. దశాబ్దాలుగా మజ్లిస్ పార్టీ కార్యకర్తగా కొనసాగిన గౌస్... 2002లో చార్మినార్ డివిజన్ నుం చి, 2009లో శాలిబండ నుంచి మజ్లిస్ పార్టీ అభ్యర్థిగా భారీ మెజార్టీతో విజయం సాధిం చారు. ఉన్నట్టుండి ఆ పార్టీకి గుడ్‌బై చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరడంతో పాతబస్తీలో రాజకీయాలు వేడెక్కాయి. అంతేకాకుండా తన కుటుంబ సభ్యు లు పోటీ చేస్తున్న మూ డు డివి జన్ల నుంచి విజయం సాధిం చాలనే బాధ్యతలను కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మహ్మద్ గౌస్‌కు అప్పగిం చింది. ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ అధిష్ఠానం దృష్టినంతా పురానాపూల్, ఘాన్సీబజార్, శాలిబండ డివి జన్లపై పెట్టింది. మజ్లిస్ పార్టీ తప్పొప్పులను స్థానిక ప్రజ లకు చెబుతూ ప్రజల్లోకి దూసుకెళ్లే ప్రయత్నం చేసిన మహ్మ ద్ గౌస్ బహిరంగ సభల ద్వారా ఒవైసీ సోదరులకు సవాళ్లు విసిరారు. ఖిల్వత్ మైదానంలో బహిరంగ సభ ఏర్పాటు చేసి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ మహ్మద్ అలీ షబ్బీర్‌లను రప్పిం చారు. రోడ్ షోలతో ప్రజలను ఆకట్టుకునేప్రయత్నం చేశారు. మజ్లిస్ వ్యూహాత్మకంగా... కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులతో పాటు మహ్మద్ గౌస్‌కు చెక్ పెట్టాలని ఒవైసీ సోదరు లు భావించారు. దీనికి అనుగుణంగానే బహిరంగ సభను నిర్వహించిన మజ్లిస్...కాంగ్రెస్‌కు దీటుగా జవాబిచ్చింది. తమ పార్టీకి కంచుకోటగా ఉన్న పాతబస్తీలో కాంగ్రెస్ పార్టీ ఉనికి కనుమరుగవుతుందని... ‘పతంగ్’ను ఎవరూ ఏమీ చేయలేరని ధీమా వ్యక్తం చేసింది. పోలింగ్ రోజు ఏం జరిగిందంటే... చార్మినార్ ఎమ్మెల్యే సయ్యద్ అహ్మద్ పాషా ఖాద్రీ (మజ్లిస్), పురానాపూల్ కాంగ్రెస్ అభ్యర్థి మహ్మద్ గౌస్ మంగళవారం ఉదయం నుంచీ పోలింగ్ సరళిని పరిశీలిస్తున్నారు. పోలింగ్ స్టేషన్లను సందర్శిస్తూ.. పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఈ నేపథ్యం లో మధ్యాహ్నం 1.30 గంటలకు జలాల్‌కుంచా ప్రాంతంలో ఎమ్మె ల్యే, కాంగ్రెస్ అభ్యర్థి ఒకరికొకరు ఎదురు పడ్డారు. దీం తో ఇరువర్గాల్లో ఆగ్రహం కట్టలు తెం చుకుంది. వాగ్వాదాలతో ప్రారంభమై దాడులకు దారి తీసింది. విష యం తెలుసుకున్న దక్షిణ మండల డీసీ పీ వి.సత్యనారాయణ సంఘటన స్థలానికి చేరుకొని ఇరువురినీ అదుపులోకి తీసుకున్నారు. ఎమ్మెల్యేను చార్మినార్ పోలీ స్ స్టేషన్‌కు... మహ్మద్ గౌస్‌ను మీర్‌చౌక్ పోలీస్‌స్టేషన్ కు తరలించారు. విషయం తెలుసుకుని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ, పరిగి ఎమ్మెల్యే రాంమోహన్‌రెడ్డి ... ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తమ అనుచరులతో వేర్వేరుగా పోలీస్ స్టేషన్‌కు చేరుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తతకు దారితీసి దాడులకు పాల్పడిన విషయం తెలిసిందే. ప్రేమకు వంతెన... ప్రేమకు వారధిగా నిర్మించిన పురానాపూల్ బ్రిడ్జి పేరుతో ఈ డివిజన్ ఏర్పడింది. ప్రిన్స్ మహ్మద్ కులీ కుతుబ్‌షా మూసీ నది ఇవతల ఉన్న భాగమతిని ప్రేమించారు. ఆమెను కలవడానికి మూసీ నదిని దాటుతూ వచ్చేవారు. దీనిని గమనించిన ఆయన తండ్రి సుల్తాన్ ఇబ్రహీం కులీకుతుబ్‌షా 1578లో నదిపై ప్యారానాపూల్ బ్రిడ్జిని నిర్మించారు. ప్యార్ అంటే ప్రేమ. పూల్ అంటే బ్రిడ్జి. ప్రేమకు గుర్తుగా నిర్మించిన ఈ ‘ప్యారానాపూల్’ కాలక్రమంలో పురానాపూల్‌గా మారిం ది. పురానా అంటే పురాతన అని అర్థం. దక్షిణ భారతదేశంలోనే అతి పురాతనమైనదిగా పేరొందిన ఈ వంతెన హైదరాబాద్ నగరంలో మొట్టమొదటిది.