
సాక్షి, హైదరాబాద్ : గత కొన్ని రోజులుగా హైదరాబాద్ నగరంలోకి కురుస్తున్న భారీ వర్షాలకు రోడ్లున్నీ దెబ్బతిన్నాయి. భారీ వరదల కారణంగా మూసీ నదికి వందేళ్ల కాలంలో ఎన్నడూ లేనంత వరద పోటెత్తడంతో పరివాహ ప్రాంతాలను మూసీ ముంచెత్తింది. ఈ క్రమంలోనే పురానాపూల్ వంతెన సైతం దెబ్బతిన్నది. భారీ ప్రవాహం ధాటికి బ్రిడ్జ్ పిల్లర్‌పై పగుళ్లు ఏర్పడటంతో కొంతమేర కుంగింది. సమచారం అందుకున్న అధికారులు పురానాపూల్ వంతెనపై నుంచి వాహనాల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేశారు. బారికేడ్లను ఏర్పాటు చేసి వాహనాలను మళ్లిస్తున్నారు. నిపుణుల కమిటీ పరిశీలించిన తర్వాత రాకపోకలపై నిర్ణయం తీసుకోనున్నారు. దీంతో వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు వర్షాల ముప్పు ఇంకా పొంచివుందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో నగర వాసులు భయపడుతున్నారు. ముఖ్యంగా మూసీ నది పరివాహక ప్రాంతంలోని నివాసితులు భీతిల్లుతున్నారు. (నిజాంల ‘ప్లాన్’ బెస్ట్!)
Comments
Please login to add a commentAdd a comment