సాక్షి, హైదరాబాద్: నగరంలోని పురానాపూల్‌లో భారీ అగ్ని ప్రమాద ఘటన చోటుచేసుకుంది. పురానాపూల్‌లో ఉన్న ఓ గోదాంలో బుధవారం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
వివరాల ప్రకారం.. పురానాపూల్‌లోని ఓ గోదాంలో అగ్ని ప్రమాదం జరిగింది. గోదాంలో టైర్లకు సంబంధించిన మెటీరియల్ ఉండటంతో మంటలు ఎగిసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువస్తున్నారు. ఆరు ఫైరింజన్లతో మంటలను అదుపులోకి తెస్తున్నారు. ఇక, షార్ట్ సర్య్కూట్ కారణంగా మంటలు చెలరేగాయా లేక మరేదైనా కారణంగా ప్రమాదం జరిగిందా? అనే విషయం తెలియాల్సి ఉంది. అయితే, ఈ ప్రమాదంలో ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.
ఈ ప్రమాదం సందర్భంగా తెలంగాణ రీజినల్ ఫైర్ ఆఫీసర్ పాపయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. కాగా, పాపయ్య మీడియాతో మాట్లాడుతూ.. ‘నాలుగు గోడల మధ్యనే అగ్ని ప్రమాదం జరిగింది కాబట్టి త్వరగా అదుపులోకి తీసుకొచ్చాం. షెడ్డు కూలి పడిపోవడంతో లోపలికి వెళ్లడానికి ఆలస్యమైంది. మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చాం. మొదటగా ఒక ఫైర్ ఇంజన్ మాత్రమే వచ్చింది. తర్వాత 7 ఫైరింజన్లు రావడంతో మంటలను అదుపులోకి తెచ్చాం.
గోదాం పరిసర ప్రాంతాల్లో ఉన్న నివాసాలకు ఎలాంటి ప్రమాదం లేదు. అగ్ని ప్రమాదం కారణంగా చుట్టుపక్కల ఉన్న వారందరూ భయాందోళనలకు గురయ్యారు. ఈ గోదాంలో ఫైర్ సేఫ్టీ లేదు. సేఫ్టీ పాటించనందుకు కఠిన చర్యలు తీసుకుంటాం. ఈ ప్రమాదం ఎలా జరిగింది అనే దానిపై దర్యాప్తు కొనసాగుతోంది. ఈ ప్రమాదం షార్ట్ సర్కిటా వేరే కారణాలు జరిగిందా అనే దానిపై దర్యాప్తు కొనసాగుతుంది. ప్రతీ ఒక్కరూ ఫైర్ సేఫ్టీ పాటించాలి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అవగాహన కార్యక్రమం చేపడతాం’ అని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment