రంజాన్ పోలీస్ | Police Commissioner Mahender Reddy visited by charminar | Sakshi
Sakshi News home page

రంజాన్ పోలీస్

Published Mon, Jul 4 2016 11:29 PM | Last Updated on Tue, Aug 21 2018 7:58 PM

రంజాన్   పోలీస్ - Sakshi

రంజాన్ పోలీస్

నగర పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి సోమవారం రాత్రి పాతబస్తీలో పర్యటించారు. మదీనా నుంచి చార్మినార్ వరకు ఆయన కాలినడకన వెళ్లి రాత్ బజార్‌ను తిలకించారు. మదీనా చౌరస్తా వరకు పోలీసు వాహనంలో వచ్చిన మహేందర్‌రెడ్డి...అక్కడి నుంచి దారిపొడుగునా నడుచుకుంటూ పలుచోట్ల షాపింగ్ చేశారు. పర్‌ఫ్యూమ్ కొనుగోలు చేసి చార్మినార్‌కు చేరుకున్నారు. అక్కడి నుంచి పిస్తాహౌస్, శాలిబండ, రాజేశ్ మెడికల్ హాల్ వరకు నడుచుకుంటూ వెళ్లారు.

పోలీసుల బందోబస్తును పర్యవేక్షించారు. పిస్తా హౌస్ దగ్గర హలీమ్‌ను ఆసక్తిగా తిలకించారు. రంజాన్ సందర్భంగా పాతబస్తీలో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటుచేశామని,పోలీసు శాఖ అప్రమత్తంగా ఉందని చెప్పారు. నగర అదనపు పోలీసు కమిషనర్(శాంతి భద్రతలు) వీవీ శ్రీనివాసరావు, సౌత్‌జోన్ డీసీపీ సత్యనారాయణలు సీపీ వెంట ఉన్నారు.     
 - యాకుత్‌పురా
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement