వైభవంగా లాల్‌దర్వాజా సింహవాహిని బోనాలు | Simhavahini Ammavari Bonala festival | Sakshi
Sakshi News home page

వైభవంగా లాల్‌దర్వాజా సింహవాహిని బోనాలు

Published Mon, Aug 1 2016 1:51 AM | Last Updated on Mon, Sep 4 2017 7:13 AM

వైభవంగా లాల్‌దర్వాజా సింహవాహిని బోనాలు

వైభవంగా లాల్‌దర్వాజా సింహవాహిని బోనాలు

హైదరాబాద్: పాతబస్తీలోని లాల్‌దర్వాజా సింహవాహిని అమ్మవారి బోనాల ఉత్సవం ఆదివారం అంగరంగ వైభవంగా జరిగింది. తెల్లవారు జాము నుంచే అమ్మవారికి బోనం సమర్పించడానికి మహిళలు బారులు తీరారు. భక్తుల రద్దీతో పరిసర రోడ్లన్నీ కళకళలాడాయి. రాష్ట్ర ప్రభుత్వం తరుఫున దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో మంత్రులు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.

ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీతో పాటు మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి, కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, మాజీ మంత్రి దానం నాగేందర్, ఎమ్మెల్యేలు శ్రీనివాస్ గౌడ్, టి. ప్రకాశ్ గౌడ్, మహేశ్ గౌడ్, బీజేపీ ఎమ్మెల్యేలు కిషన్‌రెడ్డి, రాంచంద్రారెడ్డి, మాజీ మంత్రి డి.కె. అరుణ, గ్రేటర్ బీజేపీ అధ్యక్షుడు బి. వెంకట్ రెడ్డి తదితరులు పూజల్లో పాల్గొన్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తుతో పాటు భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement