Lal Darwaza Simhavahini Ammavari Bonala festival
-
నెత్తిన బోనంతో సినీ, రాజకీయ ప్రముఖుల సందడి.. ఫోటో హైలైట్స్
సాక్షి, హైదరాబాద్: బోనాలంటే నగరమంతా ఉత్సాహమే.. భాగ్యనగరమంతా సందడిగా బోనమెత్తుతోంది. ఇందుకు గ్రేటర్ హైదరాబాద్‌లోని అమ్మవారి ఆలయాలను సర్వాంగసుందరంగా ముస్తాబు చేశారు. 113వ లాల్‌దర్వాజ సింహవాహిని అమ్మవారి వార్షికోత్సవ ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. మహంకాళి అమ్మవారిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వేల సంఖ్యలో భక్తులు వస్తున్నారు. ఆదివారం బోనాల సందర్భంగా ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయింది. పలువురు సినీ, టెలివిజన్ తారలు.. ప్రజాప్రతినిధులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఆ ఫోటోలు మీకోసం పాతబస్తీ లాల్ దర్వాజ సింహవాహిని అమ్మవారు బంగారు బోనంతో జోగిని శ్యామల నెత్తిమీద బోనాలతో మహిళలు అమ్మవారికి బోనం తీసుకొస్తున్న మాజీ మంత్రి గీతారెడ్డి బోనంతో వస్తున్న సింగర్ మధుప్రియ బోనమెత్తిన బిగ్‌బాస్ ఫేం సుజాత బోనాలతో మహిళల సందడి నెత్తిన బోనంతో బయల్దేరిన విజయశాంతి, పక్కన బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ బోనమెత్తిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారిని దర్శించుకున్న హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ బోనమెత్తిన హైదరబాద్ ఆడపడుచులు -
ఘనంగా లాల్ దర్వాజ సింహవాహిని అమ్మవారి బోనాల ఉత్సవాలు
-
Hyderabad Bonalu: భక్తితో బయలెల్లి.. అమ్మవార్లకు ప్రణమిల్లి..
సాక్షి, హైదరాబాద్/చాంద్రాయణగుట్ట /చార్మినార్ : మహానగరం బోనమెత్తింది. ఆదివారం బోనాల జాతర ఉత్సాహంగా సాగింది. పాతబస్తీ లాల్‌దర్వాజ సింహవాహిని, చార్మినార్ భాగ్యలక్ష్మి, మీరాలం మహంకాళి, హరిబౌలి బంగారు మైసమ్మ, శాలిబండ అక్కన్న మాదన్న ఆలయం, ఉప్పుగూడ మహంకాళి, కార్వాన్ దర్బార్ మైసమ్మ, ట్యాంక్‌బండ్ కట్ట మైసమ్మ సహా నగరంలోని పలు ప్రాంతాల్లో కన్నులపండువగా వేడుకలు జరిగాయి. పోతురాజుల విన్యాసాలు, తొట్టెల ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. లాల్‌దర్వాజ సింహవాహిని అమ్మవారికి మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇంద్రకరణ్‌రెడ్డి, మహ్మద్ మహమూద్ అలీలు పట్టువస్త్రాలు సమర్పించారు. అమ్మవారిని దర్శించుకున్న ప్రముఖులు.. లాల్‌దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారిని మాజీ మంత్రి టి.దేవేందర్ గౌడ్, హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ, సినీ నటి, మాజీ ఎంపీ విజయశాంతి, వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే దానం నాగేందర్, మాజీ మంత్రి డి.కె.అరుణ, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ తదితరులు దర్శించుకున్నారు. వెల్లివిరిసిన ఆధ్యాత్మికత.. సాధారణంగా గోల్కొండ, సికింద్రాబాద్ మహంకాళి బోనాల తర్వాత పాతబస్తీలో ఆషాఢ మాసం బోనాల పండగ జరుగుతుంది. నగర శివార్లలో మాత్రం శ్రావణ మాసంలోనే వేడుకలు నిర్వహిస్తారు. కానీ ఈసారి చాలాచోట్ల ఒకేసారి వేడుకలు జరగడంతో నగరమంతా ఆధ్యాత్మికత వెల్లివిరిసింది. అమ్మవారిని కీర్తిస్తూ సాగిన భక్తి గీతాలతో మైకులు హోరెత్తాయి. అందంగా అలంకరించిన ఆలయాల వద్ద గుగ్గిలం పరిమళాలు గుబాళించాయి. గతేడాది కోవిడ్ కారణంగా బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకోలేకపోయిన నగరవాసులు ఈసారి అన్ని చోట్లా పెద్ద సంఖ్యలో తరలి వచ్చి అమ్మవార్లకు బోనాలు సమర్పించారు. కరోనా మహమ్మారి నుంచి కాపాడాలని, అందరినీ చల్లగా చూడాలని వేడుకున్నారు. -
బోనాల పండుగకు ముస్తాబవుతున్న లాల్ దర్వాజ్ సింహవాహిని ఆలయం
-
బోనాల జాతర షురూ
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్‌లో ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి మినీ జాతర శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది. ఉదయం అయిదు గంటల నుంచే భక్తులు పెద్ద ఎత్తున అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి భక్తులు ఒడిబియ్యం సమర్పించారు. పోతురాజుల నృత్యాలతో అమ్మవారి ఊరేగింపు ఘనంగా జరిగింది. జాతరలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. కాగా బోనాలకు ముందు వచ్చే శుక్రవారాన్ని మినీ జాతరగా పిలుస్తారు. పాతబస్తీలో మొదలైన సందడి మరోవైపు పాతబస్తీలోని లాల్ దర్వాజ సింహవాహిని మహంకాళి దేవాలయంలో బోనాల ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. జీఎచ్ఎంసీ కమిషనర్ దాన కిశోర్, నగర పోలీస్ కమిషనర్ అంజని కుమార్ కలశ స్థాపన ద్వారా ఉత్సవాలను ప్రారంభించారు. ఉత్సవాల నిర్వహణ కోసం జీహెచ్ఎంసీ రూ. 25 కోట్లు కేటాయించింది. బోనాలు జరిగే ఆలయాల వద్ద శానిటేషన్ సిబ్బందిని ఏర్పాటు చేశారు. -
వైభవంగా లాల్‌దర్వాజా సింహవాహిని బోనాలు
హైదరాబాద్: పాతబస్తీలోని లాల్‌దర్వాజా సింహవాహిని అమ్మవారి బోనాల ఉత్సవం ఆదివారం అంగరంగ వైభవంగా జరిగింది. తెల్లవారు జాము నుంచే అమ్మవారికి బోనం సమర్పించడానికి మహిళలు బారులు తీరారు. భక్తుల రద్దీతో పరిసర రోడ్లన్నీ కళకళలాడాయి. రాష్ట్ర ప్రభుత్వం తరుఫున దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో మంత్రులు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీతో పాటు మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి, కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, మాజీ మంత్రి దానం నాగేందర్, ఎమ్మెల్యేలు శ్రీనివాస్ గౌడ్, టి. ప్రకాశ్ గౌడ్, మహేశ్ గౌడ్, బీజేపీ ఎమ్మెల్యేలు కిషన్‌రెడ్డి, రాంచంద్రారెడ్డి, మాజీ మంత్రి డి.కె. అరుణ, గ్రేటర్ బీజేపీ అధ్యక్షుడు బి. వెంకట్ రెడ్డి తదితరులు పూజల్లో పాల్గొన్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తుతో పాటు భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు.