పోలీసుల అదుపులో 267 మంది యువకులు | 267 youth taken into custody in hyderabad | Sakshi

పోలీసుల అదుపులో 267 మంది యువకులు

Published Sat, Jul 22 2017 9:49 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

పోలీసుల అదుపులో 267 మంది యువకులు - Sakshi

పోలీసుల అదుపులో 267 మంది యువకులు

- పాతబస్తీలో ఆపరేష్‌న్‌ చబుత్రా
హైదరాబాద్‌: నగరంలోని పాతబస్తీలో శుక్రవారం రాత్రి పోలీసులు ఆపరేషన్‌ చబుత్ర నిర్వహించారు. బస్తీలోని పలు ప్రాంతాల్లో అర్ధరాత్రి దాటాక గుమిగూడి కాలక్షేపం చేస్తున్న 267 మంది యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో మైనర్లు కూడా ఉన్నారు.

గతంలో నిర్వహించిన ఆపరేషన్‌లో పట్టుబడి.. మళ్లీ ఇప్పుడు చిక్కిన వారిపై పెట్టీ కేసుల నమోదు చేశారు. పలువురు అనుమానితుల నుంచి వేలి ముద్రలు సేకరించారు. శనివారం యువకుల తల్లిదండ్రుల సమక్షంలో వారికి కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement