చిత్రగుప్తుడి ఆలయం | Chitragupta Temple | Sakshi
Sakshi News home page

చిత్రగుప్తుడి ఆలయం

Published Tue, Dec 5 2017 10:56 PM | Last Updated on Tue, Dec 5 2017 10:56 PM

Chitragupta Temple - Sakshi

చిత్రగుప్తుడి పేరు వినే ఉంటారు కదా... యమధర్మరాజు వద్ద  పాపుల చిట్టాపద్దులు చూసే ఆయన. ఆయనకు ఒక ఆలయం ఉంది. మృత్యుదేవత అయిన యమధర్మరాజుకు ఆలయాలు ఉన్నప్పుడు ఆయన అనుంగు అనుచరుడైన చిత్రగుప్తుడికి కూడా ఆలయాలు లేకపోతే ఎలా మరి... ఈ లోటు తీర్చడానికే కాబోలు... హైదరాబాద్‌ పాతబస్తీలోని ఉప్పుగూడ రైల్వేస్టేషన్‌కు సమీపంలోగల ఛత్రినాకలో చిత్రగుప్త మహాదేవుడి ఆలయం ఉంది. సుమారు రెండున్నర శతాబ్దాల క్రితం నిర్మించినట్లుగా భావిస్తున్న ఈ ఆలయంలో నిత్యం పూజలు జరుగుతుంటాయి.

అన్నట్టు చిత్రగుప్తుడి నోము కూడా ఉంది తెలుసు కదా... పాపప్రక్షాళన జరిగి, ఆయుష్షు పెంచుకునేందుకు నోచే నోమది. స్త్రీలు సుమంగళిత్వం కోసం నోచుకుంటారా నోమును. విశాలమైన ప్రాంగణంలో గల ఈ ఆలయంలో చిత్రగుప్తుడితోపాటు ఆయన దేవేరులు, ఆయన సంతానానికి కూడా విగ్రహాలున్నాయి. కాయస్థ వంశస్తులు తమ కులదైవంగా చిత్రగుప్తుని కొలుస్తుంటారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement