
చార్మినార్: కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా తాత్కాలికంగా రద్దయిన ఏక్ షామ్.. చార్మినార్ కే నామ్ కార్యక్రమం ఈ నెల 21 (నేటి) నుంచి తిరిగి ప్రారంభమవుతుంది. ఇప్పటికే ట్యాంక్ బండ్‌పై సండే ఫన్ డే ప్రారంభమైంది. ఈ ఆదివారంతో ఏక్ షామ్.. చార్మినార్ కే నామ్ కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభిస్తున్నామని కులీకుతుబ్‌షా నగరాభివృద్ది సంస్థ కార్యదర్శి తెలిపారు. స్టాల్స్‌తో పాటు ఇతర వ్యాపార సంస్థల స్టాల్స్ కొనసాగిస్తామని.. వినోదాత్మక కార్యక్రమాలు ప్రస్తుతానికి ఉండవని ఆయన తెలిపారు.
సాయంత్రం 5 నుంచి రాత్రి 10 గంటల వరకు ఈ కార్యక్రమం కొనసాగనుంది. ఇందుకోసం ఇప్పటికే అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కాగా.. శనివారం పాతబస్తీలోని పర్యాటక ప్రాంతాలు సందర్శకులతో రద్దీగా మారాయి. చార్మినార్ కట్టడంతో పాటు హెచ్‌ఈహెచ్ నిజాం మ్యూజియం, సాలార్ జంగ్ మ్యూజియం, చౌమహల్లా ప్యాలెస్, లాడ్‌బజార్ తదితర ప్రాంతాలలో సందర్శకుల సందడి కనిపించింది.
(చదవండి: ప్రీలాంచ్ మాయ )
Comments
Please login to add a commentAdd a comment