‘బాంబు బ్లాస్ట్’కు తొమ్మిదేళ్లు
ఘటన అనంతరం మక్కా మసీదులో భద్రత పెంపు
23 కెమెరాలు ఏర్పాటు... {పస్తుతం పని చేయని 18 కెమెరాలు
పట్టించుకోని అధికారులు
చార్మినార్: మే 18వ తేదీ వస్తుందంటే చాలు పాతబస్తీ ప్రజలు ఆనాటి ఛేదు జ్ఞాపకాల నుంచి తేరుకోలేకపోతున్నారు. 2007 మే 18వ తేదీ వుధ్యాహ్నం 1.18 గంటలకు జరిగిన బాంబు పేలుడు ఘటన ఈ ఏడాదితో తొమ్మిదేళ్లు పూర్తికావస్తోంది. ఆనాటి విషాదకర ఘటనలు గుర్తుకొచ్చి బాధిత కుటుంబాలు కన్నీరుమున్నీరవుతున్నాయి. బాంబు పేలుడు తదనంతరం జరిగిన పోలీసు కాల్పుల్లో వుృతి చెందిన తమ కుటుంబ సభ్యులకు తీరని నష్టం జరిగిందని వాపో తున్నారు.
మక్కా వుసీదులో రౌండ్ ది క్లాక్ భద్రత...
2007 మే 18న జరిగిన బాంబు పేలుడు అనంతరం మక్కా మసీదులో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇక్కడ భద్రతను పర్యవేక్షించడానికి మూడు షిప్టులలో 18 వుంది హోంగార్డులను ప్రభుత్వం నియుమించింది. వీరు రౌండ్ ది క్లాక్ విధుల్లో ఉంటున్నారు. అలాగే, ప్రధాన ద్వారం వద్ద డోర్ ఫ్రేమ్ మెటల్ డిటెక్టర్లను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు శాంతి భద్రతలను పర్యవేక్షిస్తున్నారు. విద్రోహశక్తులు, అనుమానితులు ప్రవేశాన్ని పసిగట్టేందుకు మసీదు ఆవరణ, కొలను, లైబ్రరీతో పాటు ప్రార్థనాలయం ప్రధాన హాలు, కార్యాలయం వద్ద నిఘా కెమెరాలను ఏర్పాటు చేశారు.
పని చేయని 18 సీసీ కెమెరాలు....
బాంబు పేలుడు ఘటన అనంతరం మక్కా మసీదులో ఏర్పాటు చేసిన 23 సీసీ కెమెరాలు, స్టాటిక్ కెమెరాలలో ప్రస్తుతం కేవలం 5 మాత్రమే పని చేస్తున్నాయి. ఆరు నెలలుగా 18 కెమెరాలు పని చేయడం లేదు.
నిరసన సభలకు అనుమతి లేదు ..
మక్కా వుసీదు వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు శాంతి భద్రతలను పర్యవేక్షిస్తున్నాం. దక్షిణ మండలంలోని నలుగురు ఏసీపీలు, 18 పోలీస్‌స్టేషన్ల ఇన్‌స్పెక్టర్లు, సబ్ ఇన్‌స్పెక్టర్లు ఇతర పోలీసు సిబ్బంది ఎప్పటికప్పుడు శాంతి భద్రతలను పర్యవేక్షిస్తున్నారు. పాతబస్తీలో ఎక్కడ నిరసన సభలు, ర్యాలీలు నిర్వహించుకోవడానికి ఎవరికీ ఎటువంటి అనువుతులు ఇవ్వడం లేదు. - వి.సత్యనారాయణ, దక్షిణ వుండలం డీసీపీ