
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో వరుస బాంబు బెదిరింపులు తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి. గత శుక్రవారం ఢిల్లీలోని పలు స్కూళ్లకి బాంబు బెదిరింపులు వచ్చాయి. అయితే ఈ బెదిరింపు మెయిల్స్ చేసింది విద్యార్థులేనని పోలీసులు నిర్ధారించారు.
సాధారణంగా స్కూల్స్, కాలేజీ విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తుంటారు. ఇందు కోసం విద్యార్థులు రేయింబవళ్లు శ్రమిస్తుంటారు. కానీ వారిలో కొంత మంది విద్యార్థులు పరీక్షల ముందు రోజు బుక్ తీసి మమ అనిపిస్తుంటారు. సరిగ్గా చదవక.. స్కూల్‌కో,లేదంటే కాలేజీకి వెళ్లి పరీక్ష రాయాల్సి వస్తుందనే భయంతో ఆరోగ్యం సరిగా లేదని, ఊరెళుతున్నామని ఇలా రకరకాల కారణాలు చెప్పి తప్పించుకుంటుంటారు.
ఇదిగో ఢిల్లీలోని రోహిణి జిల్లాకు చెందిన స్కూల్ విద్యార్థులు కూడా అంతే. పరీక్ష రాయాల్సి వస్తుందని స్కూల్‌లో బాంబు తామే పెట్టామని బెదిరించినట్లు ఢిల్లీ స్పెషల్ పోలీసులు గుర్తించారు.
తాజాగా రోహిణి జిల్లాలో రెండు స్కూల్స్‌కు బాంబు బెదిరింపు ఈ-మెయిల్స్ వచ్చాయి. సమాచారం అందుకున్న పోలీసులు బెదిరింపు ఈ-మెయిల్స్ విచారణ చేపట్టారు. తమ విచారణలో ‘ఒకే పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థులు రెండు వేర్వేరు పాఠశాలలకు ఇ-మెయిల్స్ పంపినట్లు తేలింది’అని ఢిల్లీ పోలీసుల ప్రత్యేక విభాగం ఒక ప్రకటనలో తెలిపింది. విద్యార్థులిద్దరూ స్కూల్‌లో పరీక్ష రాయాల్సి వస్తుందని బెయిరింపు ఇ - మెయిల్స్ పంపినట్లు వెల్లడించారు. విద్యార్థులు కావడంతో, వారికి కౌన్సెలింగ్ ఇచ్చి వదిలిపెట్టారు.
#BreakingNews | #DelhiBombThreat : Major update has come in that students were behind the bomb threat that has been sent to 2 schools.@_pallavighosh | @shankar_news18 decodes#delhibombthreat #delhi #schools pic.twitter.com/FGAquLsFzV
— News18 (@CNNnews18) December 22, 2024
11 రోజులుగా వందకు పైగా బాంబు బెదిరింపులు
ఢిల్లీ పోలీసులు గత 11 రోజులుగా 100కి పైగా పాఠశాలలకు వరుస బాంబు బెదిరింపులు పంపడంపై దర్యాప్తు చేపట్టారు. వర్చువల్ ప్రైవేట్ నెట్‌వర్క్ ఉపయోగించి ఇ-మెయిల్స్ పంపడంతో నేరస్థులను గుర్తించడం పోలీసులకు సవాలుగా మారింది.
ఢిల్లీలో బాంబు బెదిరింపులు రావడం ఇదే తొలిసారి కాదు. ఈ సంవత్సరం మే నుండి, నగరంలోని పాఠశాలలు, ఆసుపత్రులు, విమానాశ్రయాలు, విమానయాన సంస్థలను లక్ష్యంగా చేసుకుని 50కి పైగా బాంబు బెదిరింపు ఇ-మెయిల్‌లు వచ్చాయి. ఈ కేసుల్లో పోలీసులు ఇంకా ఎలాంటి పురోగతి సాధించలేదు.