పరీక్షల్లో తక్కువ మార్కులు.. తల్లిదండ్రులు తిడతారనే భయం. ఫలితం ఇద్దరు విద్యార్థులు పోలీసులకు కంటిమీద కునుకు లేకుండా చేశారు. చివరికి
ఢిల్లీ నోయిడా సెక్టార్-56లోని ఆర్యన్ చౌరాశ్యా, నితిన్ ద్యాన్‌లు ఉత్తరాఖండ్ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు. అయితే గత వారం స్కూల్లో జరిగిన పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. అ పరీక్షల్లో ఇద్దరు విద్యార్థులకు మార్క్‌లు తక్కువ వచ్చాయి.
‘ఇటీవల జరిగిన పరీక్షల్లో మీ ఇద్దరికి తక్కువ మార్కులు వచ్చాయి. ఈ ప్రోగ్రెస్ రిపోర్ట్స్ మీద మీ తల్లిదండ్రులతో సైన్ చేయించి.. రేపు ఉదయం స్కూల్‌కు రండి. మీ పేరెంట్స్‌ని వెంట తీసుకుని రండి. వారితో మాట్లాడాలి ’ అంటూ క్లాస్ టీచర్ ఆదేశాలతో ఇద్దరు విద్యార్ధులు బయపడిపోయారు. అదే రోజు సాయంత్రం తల్లిదండ్రులు తమని తిడతారేమోనని అటు స్కూల్.. దూరంగా పారిపోవాలని ప్లాన్ చేసుకున్నారు. అదే రోజు సాయంత్రం స్కూల్ ముగిసిన వెంటనే పారిపోయారు.
ఇదీ చదవండి : రంగంలోకి ఇండియన్ జేమ్స్ బాండ్
స్కూల్ వెళ్లిన పిల్లలు సమయం మించిపోతున్నా.. ఇంటికి రాకపోవడంతో కంగారు పడ్డ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేపట్టారు. ఏడు బృందాలుగా విడిపోయిన పోలీసులు పిల్లల కోసం గాలించారు. 500 సీసీ కెమెరాలను తనిఖీలు చేయగా.. వారి ఇంటి నుంచి సుమారు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఢిల్లీలోని ఆనంద్ విహార్‌లో ఆచూకీ లభించింది. పిల్లల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని తల్లిదండ్రుల చెంతకు చేర్చడంతో కథ సుఖాంతమైంది.
Comments
Please login to add a commentAdd a comment