
కరెంటు తీగపై గాలిపటం తీయబోతూ..!
శామీర్‌పేట(రంగారెడ్డి జిల్లా): శామీర్‌పేట పట్టణంలోని ముదిరాజ్‌బస్తీలో విషాదం చోటుచేసుకుంది. తాను ఎగరేసిన గాలిపటం కరెంటుతీగలకు చిక్కుకోవడంతో దానిని తీయడానికి ప్రయత్నించిన 11 ఏళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు.
కర్నూలు జిల్లా తుగ్గలికి చెందిన నాగరాజు, వీరమ్మలు 15 సంవత్సరాల క్రితం శామీర్‌పేటలో స్థిరపడ్డారు. వీరికి సాయి కుమార్(11) అనే ఒక కుమారుడు ఉన్నాడు.
ఆదివారం ఇంటికి సమీపంలో సాయి గాలిపటం ఎగర వేస్తుండగా..అది పైనఉన్న కరెంటు తీగలపై పడింది. తీగలపై పడ్డ గాలిపటాన్ని అతను ఇనుప చువ్వతో తీయడానికి ప్రయత్నించడంతో కరెంటు షాక్ తగిలింది. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న సాయిని స్థానికులు వెంటనే దగ్గర్లోని ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. దీంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.