దిల్‌సుఖ్‌నగర్: గాలిపటం ఎగిరేస్తుండగా కరెంట్ షాక్ తగిలిన విద్యార్థి చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఈ సంఘటన నగరంలోని చైతన్యపురి పోలీస్‌స్టేషన్ పరిధిలోని న్యూనాగోల్ లో శనివారం జరిగింది. వివరాలు.. కాలనీకి చెందిన సంతోష్(14) స్థానిక పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. ఈ క్రమంలో పాఠశాలకు సెలవులు రావడంతో రెండు రోజుల కిందట ఇంటి పైన ఢాబా మీద గాలిపటం ఎగరవేస్తూ ప్రమాదవశాత్తూ విద్యుత్ తీగలపై పడ్డాడు.
తీవ్రగాయాలైన అతన్ని కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతిచెందాడు.