మనిషి తన వినోదం కోసం మూగ జీవాల ప్రాణాలు తీస్తున్నాడు. తమ మనుగడ కోసం మూగ జీవాలను వాడుకుంటున్న జనాలు... తమకు తెలిసి, ఒక్కోసారి తెలియకుండా..
విశాఖ : మనిషి తన వినోదం కోసం మూగ జీవాల ప్రాణాలు తీస్తున్నాడు. తమ మనుగడ కోసం మూగ జీవాలను వాడుకుంటున్న జనాలు... తమకు తెలిసి, ఒక్కోసారి తెలియకుండా వాటి ప్రాణాలు పోవడానికి కారణమవుతున్నాడు. ఈ చిత్రంలో కనిపిస్తున్న హృదయాన్ని కదిలించే దృశ్యం విశాఖలోని సర్క్యూట్ హౌస్ వద్ద బుధవారం 'సాక్షి' కెమెరా కంటపడింది. వినోదం కోసం ఎవరో ఎగరేసిన గాలిపటం దారం చెట్టు మీద సేద తీరుతున్న పిట్ట మెడకు చుట్టుకుంది. దాన్ని వదిలించుకునే క్రమంలో దారం పిట్ట మెడకు బిగుసుకుపోవడంతో గిలగిలా కొట్టుకుంటూ ప్రాణం విడిచింది. ఎవరో తమ ఆనందం కోసం ఎగరేసిన గాలిపటం ఇలా ఓ పక్షిని బలిగొంది.