Thread
-
నయా సైబర్ క్రైం.. డీప్ ఫేక్!
సోషల్ మీడియాలో ఫొటోలు, ఆడియో, వీడియోలు విరివిగా పోస్ట్ చేస్తుంటారా.. అయితే జరభద్రం.. సైబర్ నేరాల్లో కొత్తగా పుట్టుకొచ్చిన డీప్ ఫేక్ గురించి మీరు కచ్చితంగా తెలుసుకోవాల్సిందే.. వీడియోలో మీ ముఖమే కనిపిస్తూ ఉంటుంది... కానీ అది మీరు కాదు. ఆడియోలో మీ మాటలే వినిపిస్తూ ఉంటాయి... కానీ మాట్లాడేదీ మీరు కాదు. మీరు చేయని అభ్యంతరకరమైన పనులు కూడా మీరే చేసినట్లు మారుస్తారు.. ఎలాగంటే.. మీ వాయిస్, వీడియో, ఫొటోలను వినియోగించి అశ్లీల వీడియోలతో సింథసిస్ చేసి మీరే వీడియో కాల్ చేసినట్లు సృష్టిస్తారు. లేదంటే కిడ్నాప్ అయ్యాననో, అత్యవసరమనో మీ ఫేక్ వీడియోలు సృష్టించి వాటిలో చెప్పిస్తారు. ఆ వీడియోలను కుటుంబీకులకు చూపించి అందినకాడికి దండుకుంటారు. ఈ నేరాలు ఘోరాలు చేసేందుకు అవసరమైన ఫోన్ నంబర్లు, వివరాలన్నీ తెలుసుకునేందుకు నేరగాళ్లు పెద్ద కష్టపడక్కర లేదు.. కేవలం మన సోషల్ మీడియా ఖాతాల నుంచే సంగ్రహిస్తున్నారు.. సాక్షి, హైదరాబాద్: ఆడియో–వీడియో సింథసిస్ ప్రక్రియ ద్వారా జరుగుతున్న సరికొత్త సైబర్ నేరమే డీప్ ఫేక్. ఈ నయా తరహా సైబర్ నేరాలు పాల్పడేందుకు నేరగాళ్ళకు అవసరమైన డేటా డార్క్ వెబ్‌తో పాటు సోషల్ మీడియాలో తేలిగ్గా లభిస్తోంది. సోషల్ మీడియాలో పోస్టు చేసిన ఫొటోలు, ఆడియో, వీడియోలను సంగ్రహిస్తున్న ఈ–కేటుగాళ్ళు వాటిని సేకరిస్తున్నారు. డార్క్ వెబ్ సహా ఇంటర్నెట్ నుంచి ఖరీదు చేసిన టూల్స్ వినియోగించి సింథసిస్ ప్రక్రియ చేయడుతున్నారు. ఇది కేవలం నేరగాళ్ళు మాత్రమే కాదు... సాంకేతికతపై పట్టున్న వాళ్లు కూడా చేస్తున్న వ్యవహారం కావడం ఆందోళన కలిగించే అంశం. ఈ నయా సైబర్ క్రైం డీప్ ఫేక్‌తో బాధితులు ఆర్థికంగా నష్టపోవడమే కాదు... కొన్ని సందర్భాల్లో పరిస్థితి ఆత్మహత్యలు చేసుకునే వరకు వెళుతోంది. యువతీ యువకులతో పాటు మధ్య వయస్సుల్లో జరుగుతున్న ‘కారణం తెలియని’ సూసైడ్స్‌కి ఈ సింథసిస్ ప్రక్రియ కూడా ఓ కారణమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. బ్లాంక్ వీడియో కాల్స్‌తో... సెక్సార్షన్ నుంచి ఎక్సార్షన్ వరకు వినియోగం... ఇటీవల కాలంలో అనేకమందికి వర్చువల్ నంబర్ల నుంచి బ్లాంక్ వీడియో కాల్స్ వస్తున్నాయి. వీటిని స్పందించి ఫోన్ ఎత్తితే.. అవతలి వారు కనిపించరు, మాట్లాడరు. ఎవరు కాల్ చేశారో తెలుసుకోవడానికి కొద్దిసేపు ఫోన్లో ప్రశ్నిస్తుంటాం. ఆ సమయంలో సైబర్ నేరగాళ్ళు రిసీవర్ వీడియో రికార్డు చేస్తారు. దీన్ని అశ్లీల వీడియోలతో సింథసిస్ చేసి వాళ్ళే ఆ వీడియోలో ఉన్నట్లు రూపొందిస్తారు. ఈ వీడియోను చూపించి బాధితుడిని భయపెట్టి వీలున్నంత దండుకుంటారు. ప్రధానంగా యువకులు, మధ్య వయసు్కలే ఈ నేరంలో టార్గెట్‌గా మారుతున్నారు. నేరగాళ్ళే కాదు అవసరార్థులూ వాడేస్తున్నారు.. ఈ సింథసిస్ ప్రక్రియను సైబర్ నేరగాళ్ళతో పాటు మరికొందరూ వాడేస్తున్నారు. ఆన్లైన్ ఇంటర్వ్యూలకు హాజరయ్యే యువత కూడా సింథసిస్ టెక్నిక్ వాడి అడ్డదారిలో గట్టెక్కుతోంది. బ్యాంకులు, ఇతర సంస్థలకు వీడియో అథెంటికేషన్ చేయాల్సిన వచ్చినప్పుడూ ఈ ప్రక్రియ వాడుతున్నారు. ఈ కారణంగానే ఇటీవల కార్పొరేట్ సంస్థలు ఆన్లైన్ ఇంటర్వ్యూలను రికార్డు చేస్తూ, అభ్యర్థిని హెచ్ఆర్కు పిలిచి పరిశీలించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటున్నాయి. ఇక బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థల్ని మోసం చేయడానికి వీడియో సింథసిస్ వినియోగిస్తున్నట్లు సైబర్ నిపుణులు చెబుతున్నారు. భర్త గొంతును రికార్డు చేసి.. వేధిస్తున్నట్టు మార్చి... మనస్పర్ధల నేపథ్యంలో తన భర్తపై ఫిర్యాదు చేయాలని భావించిన ఓ భార్య వాయిస్ సింథసిస్ టెక్నిక్ వాడారు. తన భర్త గొంతును రికార్డు చేసి తనను దూషిస్తున్నట్లు, వేధిస్తున్నట్లు మార్చేశారు. ఆ రికార్డునే ఆధారంగా చూపించి భర్తపై ఆరోపణలు చేశారు. అయ్యో తాను అసలు అట్లా మాట్లాడలేదంటూ భర్త గోడువెళ్లబోసుకోవడంతో కౌన్సెలింగ్ చేసిన పెద్దల విచారణలో అసలు విషయం బయటపడింది. ఆ వీడియోలు చూడగానేతొందరపడొద్దు.. ఈ సింథసిస్ ప్రక్రియను ఫోరెన్సిక్ ల్యాబ్‌ల్లోనూ పూర్తి స్థాయిలో నిర్థారించడం సాధ్యం కావట్లేదు. కొన్ని అభ్యంతరకర అంశాలకు సంబంధించి తమ వారికి సంబంధించిన వీడియోలు, ఆడియోలను చూసిన కుటుంబీకులు తొందర పడకూడదు. అవి ఆడియో–వీడియో సింథసిస్ ప్రక్రియ ద్వారా తయారయ్యాయేమోనని అనుమానించాలి. బెనిఫిట్ ఆఫ్ డౌట్‌ను వర్తింపజేయాలి. బాధితులుగా మారిన వారికి దన్నుగా ఉంటే ఒంటరితనం, కుంగిపోవడం జరగక ఆత్మహత్యలు వంటి వాటికి ఆస్కారం ఉండదు. – పెండ్యాల కృష్ణశాస్త్రి, సైబర్ నిపుణుడు -
గడ్డిదారంతో దుస్తులు.. పట్టుపురుగులొద్దు, పత్తి వద్దు. పాలిస్టర్ వద్దు
‘పట్టు కోసం పట్టుపురుగుల ్రపాణాలు తీయవద్దు. పత్తి కోసం రైతులు కష్టాలను కొని తెచ్చుకోవద్దు. మట్టిలో కలవడానికి మొరాయిస్తుంది పాలియెస్టర్. ఆ దుస్తులతో పర్యావరణానికి హాని కలిగించద్దు.గడ్డి దారంతో ఫ్యాషన్‌లో కొత్త ట్రెండ్ తీసుకువద్దాం.స్టైల్ స్టేట్మెంట్కి కొత్త నిర్వచనం ఇద్దాం’... ...అంటోంది నేచర్ లవర్ శృతి రావల్. హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీలో ఫ్యాషన్ డిజైనింగ్ చేసిన శృతి అంతర్జాతీయ సదస్సులో తన పరిశోధన పత్రాన్ని సమర్పించింది. పర్యావరణ పరిరక్షణ పట్ల సమాజాన్ని చైతన్యవంతం చేయాలనే తన సంకల్పానికి వస్త్ర ప్రపంచాన్ని వేదికగా మార్చుకుందామె. ఎకో ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ పట్ల తన ఆసక్తిని సాక్షితో పంచుకున్నదీ యువతి. ఫ్యాషన్ – పర్యావరణం ‘‘నేను పుట్టింది హరియాణాలోని పంచకుల. అమ్మ పుట్టిల్లు పంజాబ్. నాన్నది హరియాణా. నాన్న ఉద్యోగరీత్యా హైదరాబాద్ వచ్చేటప్పటికి నేను సిక్తŠస్ క్లాస్‌లో ఉన్నాను. ఇక నా చదువు, కెరీర్ అంతా హైదరాబాద్‌తోనే ముడివడిపోయింది. ఫ్యాషన్ ప్రపంచాన్ని బాగా అధ్యయనం చేసే కొద్దీ ఈ ఇండస్ట్రీ నుంచి పర్యావరణానికి కలిగే హాని అర్థమైంది. చాలా ఆందోళన కలిగింది. మన వస్త్రాల మోజు భూమిని అతలాకుతలం చేస్తోంది. భూమాతను కలుషితం చేస్తున్న ఇండస్ట్రీలలో ఫ్యాషన్ ఇండస్ట్రీ రెండవది. దీనికి పరిష్కారం ఈ రంగంలోనే వెతకాలనిపించింది. పర్యావరణహితమైన ప్రత్యామ్నాయాన్ని చూపించాలనేదే నా ప్రయత్నం. నా స్టూడియోకి ‘ఎవోక్’ అని పేరు పెట్టడంలోని ఉద్దేశం కూడా పర్యావరణం పట్ల నిద్ర మేల్కొనండి’ అని పిలుపునివ్వడం. రిస్క్ అని హెచ్చరించారు! ఎవోక్ ్రపాజెక్ట్ నా బ్రెయిన్ చైల్డ్. ఈ ఎకో ఫ్రెండ్లీ క్లోతింగ్ స్టూడియోని 2020 మార్చిలో ్రపారంభించాను, అదే నెలలో లాక్డౌన్ మొదలైంది. ఆ మెటీరియల్‌తో మాస్కులు చేసి పోలీస్ డిపార్ట్మెంట్కి విరాళంగా ఇచ్చాను. ఈ ్రపాజెక్టు ్రపారంభానికి ముందే... ‘రిస్క్ చేస్తున్నావు’ అన్నారు తెలిసిన వాళ్లందరూ. పర్యావరణ పరిరక్షణ గురించి దశాబ్దాలుగా చెప్తున్నా కూడా సమాజంలో తగినంత చైతన్యం రానేలేదు. ఈ గడ్డి దుస్తుల గురించి అసలే తెలియదు. రంగు భరోసా, వస్త్రం మన్నిక ఉంటుందని కూడా తెలియదు. అలాంటప్పుడు మార్కెట్ ఎలా? పెట్టుబడి వెనక్కి వచ్చేదెప్పటికి? అన్నారు. అందరూ అలా అనుకుని తమను తాము సేఫ్జోన్లో ఉంచుకుంటే చాలా? బాగా లాభాలు వచ్చే రంగాన్నే ఎంచుకోవాలనే స్వార్థం తప్పు కాదు. కానీ లాభాల కోసం కొన్నేళ్లపాటు ఎదురు చూడగలిగిన ఆర్థిక పరిపుష్టి ఉన్నవాళ్లయినా ఒక ప్రయత్నం చేయాలి. ఇరవై ఏళ్ల కిందట ఎవరూ ముందుకు రాకపోతే మనం ఈ రోజు ఎలక్ట్రానిక్ వెహికల్‌ను వాడగలిగేవాళ్లమా? అలాగే వీగన్ డైట్ గురించి కూడా ఎంతోమంది సమావేశాలు ఏర్పాటు చేసి మరీ చైతన్యవంతం చేశారు. నేను కూడా గత నెల 23వ తేదీన హెంప్, బెంబెర్గ్, టెన్సెల్, సిట్రస్ పీల్ వస్త్రాలతో రూపొందించిన డిజైనర్ వేర్‌తో ఫ్యాషన్ పెరేడ్ నిర్వహించాను. ఎకో ఫ్రెండ్లీ, ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ ఉద్యమంలో మమేకమయ్యే క్రమంలో నేను వెజిటేరియన్‌గా మారిపోయాను’’ అని చెప్పింది శృతి. ‘భవిష్యత్తులో మనం ప్రతి విషయంలోనూ పర్యావరణహితమైన ప్రత్యామ్నాయాలను వెతుక్కోవాల్సిందే. అందులో భాగంగా నేను నా ఫ్యాషన్ రంగాన్నే మాధ్యమంగా ఎంచుకున్నాను’ అని చె΄్పారు శృతి రావల్. ఆకులతో దారం ! ఒక రైతు పొలం దున్ని పత్తి పంట వేసి ఒక కేజీ పత్తి పండించాలంటే ఇరవై వేల లీటర్ల నీరు కావాలి. ఒక టెక్స్టైలర్ ఒక టీ షర్టుకి రంగులద్దడానికి రెండున్నర వేల లీటర్ల నీరు కావాలి. పత్తి పండడానికి పట్టే నీటిని భూమి పీల్చుకుంటుంది, ఇది కొంతలో కొంత నయం. కానీ హాట్ డైయింగ్ పద్ధతిలో రసాయన రంగులద్దిన నీరు భూమిని కలుషితం చేస్తుంది. అందుకే నేను గడ్డి మొక్కల దారంతో వడికిన వస్త్రాలను పరిచయం చేస్తున్నాను. మనదేశంలో ఇలాంటి సంస్థలు నాలుగైదుకి మించిలేవు. ఇక పూర్తి స్థాయి హెంప్ (నార) క్లోతింగ్ స్టూడియో హైదరాబాద్‌లో ఇదొక్కటే. ఆకులను శుభ్రం చేసే ్రపాసెస్లో బూజు పట్టకుండా సహజసిద్ధమైన వనరులనే జత చేస్తారు. ఎండిన ఆకులతో దారం వడుకుతారు. మొక్కల ఆకుల దారంతో వస్త్రాలు తయారు చేసే పరిశ్రమలు మనదేశంలో రాజస్థాన్, ఉత్తరాఖండ్‌లో మాత్రమే ఉన్నాయి. ఈ గడ్డి రకం మొక్కలు పత్తిలాగ ఎక్కువ నీటిని తీసుకోవు, పత్తికంటే త్వరగా పెరిగి చేతికి వస్తాయి. వీటి పరిరక్షణ కోసం శ్రమించాల్సిన అవసరం ఉండదు. ఈ దారం ఇప్పుడు చైనా నుంచి దిగుమతి అవుతోంది. ఈ దుస్తులు ఎలా ఉంటాయోననే ఆందోళన అక్కర్లేదు. నేను ధరించింది హెంప్ వీవింగ్ డ్రస్సే. క్లాత్ మీద డిజైన్లు నేను రూపొందించి డిజిటల్ ప్రింట్ చేయిస్తాను. కోల్డ్ డై కలర్స్ కాబట్టి క్లాత్‌తోపాటు ఎక్కువ కాలం మన్నుతాయి. – శృతి రావల్, ఫౌండర్, ఎవోక్ స్టూడియో,హైదరాబాద్ - – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
అయ్యో పాపం.. అడవి కుక్క
మైసూరు: ప్లాస్టిక్ వల్ల జీవజాలం మనుగడకు ముప్పు ఏర్పడుతోంది. మైసూరు సమీపంలోని నారగహోళె అడవిలో ఒక అడవి కుక్క మెడకు దారం చుట్టుకుని మెడభాగం దాదాపు తెగిపోయే స్థితిలో ఉంది. అంతలో అటవీసిబ్బంది దానిని పట్టుకుని చికిత్స చేయడంతో ప్రాణాపాయం తప్పింది. ప్రపంచంలోనే అరుదైన అడవి కుక్కలు నాగరహోళె అడవుల్లో కనిపిస్తాయి. వీటిపై పలు అంతర్జాతీయ చానెళ్లలో కథనాలు కూడా వచ్చాయి. ఇటీవల కుక్కల గుంపు తిరుగుతుండగా ఒక కుక్క మెడకు ప్లాస్టిక్ దారం చుట్టుకోవడంతో తీవ్ర గాయమైంది. మృత్యువు అంచుల్లో ఉన్న దానిని అటవీ సిబ్బంది చాకచక్యంగా పట్టుకుని దారాన్ని తొలగించి వైద్యం చేయించారు. (చదవండి: పిల్లి అరుస్తూ నిద్రాభంగం చేస్తోందని యజమాని హత్య) -
ఆటోడ్రైవర్ చేష్టలతో వణికిపోయిన యువతి.. పట్టపగలే ఘటన
తప్పనిసరి పరిస్థితుల్లో ఒంటరి ప్రయాణాలు చేసే మహిళలకు చేదు అనుభవాలు ఎదురుకావడం కొత్తేం కాకపోవచ్చు. కానీ, ఆ ఘటనలను మరికొందరి దృష్టికి తీసుకెళ్లి.. ఇతరులను అప్రమత్తం చేయాలనే ఆలోచన మాత్రం మంచిదే!. తాజాగా ఢిల్లీలో ఓ హర్యానాలో ఓ యువతి.. ఓ ఆటోడ్రైవర్‌తో తనకు ఎదురైన చేదు అనుభవం పంచుకునేందుకు ట్విటర్‌ను వేదిక చేసుకుంది. అలా ఆమె ట్వీట్లు రీ-ట్వీట్లు, షేర్ల ద్వారా వైరల్ అవుతున్నాయి. నిష్తా పలివాల్.. కమ్యూనికేషన్స్ స్పెషలిస్ట్‌గా పని చేసే యువతి(అంతకు మించి వివరాలేవీ వెల్లడించలేదు). డిసెంబర్ 19న మధ్యాహ్న సమయంలో తనకు భయానక అనుభవం ఎదుర్కొన్నట్లు ట్విటర్ ద్వారా తెలియజేసిందామె. ఓ ఆటోడ్రైవర్ దాదాపుగా ఆమెను కిడ్నాప్ చేసినంత పని చేశాడట. కానీ, అదృష్టం బాగుండి ఆమె ఆ దాడి నుంచి తప్పించుకోగలిగింది. Yesterday was one of the scariest days of my life as I think I was almost abducted/ kidnapped. I don’t know what it was, it’s still giving me chills. Arnd 12:30 pm, I took an auto from the auto stand of a busy market Sec 22 (#Gurgaon) for my home which is like 7 mins away (1/8) — Nishtha (@nishtha_paliwal) December 20, 2021 ‘‘మధ్యాహ్నం 12గం.30ని సమయం. గుర్గావ్ సెక్టార్ 22లోని బిజీ మార్కెట్లోని ఆటోస్టాండ్ అది. అక్కడున్న ఓ ఆటో దగ్గరికి వెళ్లా. డివోషనల్ సాంగ్స్(అతను ఏ మతస్తుడో చెప్పడం నాకిష్టం లేదు.. ఎందుకంటే ఇది మతానికి సంబంధించిన అంశం కాదు కాబట్టి) మీడియం వాల్యూమ్‌లో పెట్టుకుని వింటున్నాడతను. అతని వాలకం చూస్తే నాకే అనుమానం రాలేదు. నా దగ్గర క్యాష్ లేకపోవడంతో పేటీఎం చేస్తానని ఆ డ్రైవర్‌తో చెప్పా. అతను సరేనన్నాడు. కేవలం ఏడు నిమిషాల్లో ఇంటికి చేరాలి. కానీ, వెళ్లాల్సిన రోడ్డులో కాకుండా.. మరో రోడ్డులో అతను టర్న్ తీసుకున్నాడు. ఎందుకు ఈ దారి అని అడిగినా.. అతని నుంచి సమాధానం లేదు. పదేపదే అడగడంతో బిగ్గరగా దేవుడ్ని తల్చుకున్నాడతను. ఆ చేష్టలతో భయం వేసింది. ఆ భయంలోనే అతన్ని భుజం మీద పదే పదే కొట్టాను. అయినా స్పందన లేదు. చివరికి ఒక్కటే మార్గం కనిపించింది. బయటకు దూకితే ఏమైతది మహా అంటే కాళ్లు, చేతులు విరుగుతాయి. లేదంటే తల పగులుతుంది. కానీ, ఆ మృగం చేతిలో పడితే.. మానం వీలైతే ప్రాణమూ పోవచ్చు. అందుకే దూకేశా. ఆ డ్రైవర్ మాత్రం వెనక్కి తిరిగి చూడకుండా అలాగే ముందుకు వెళ్లిపోయాడు. నేను సురక్షితంగా బయటపడ్డా. పట్టపగలే ఆరోజు నరకం చూశా. ఇలాంటి అనుభవం మరొకరికి ఎదురు కాకూడదనే ఈ విషయం చెప్తున్నా’’ అంటూ పోస్ట్ చేసిందా యువతి. ఇక ఈ ఘటనపై పోలీసులు స్పందించారని, ఆటో డ్రైవర్‌ను ట్రేస్ చేసే పనిలో ఉన్నారని చెబుతూ మరో ట్వీట్ చేసిందామె. చదవండి: కన్నీళ్లతో వైరల్ అవుతున్న బాలుడి ఫొటో.. ఎందుకో తెలుసా? -
చే'నేత'
మల్కా దారాల అల్లిక, చేనేత మగ్గాల విప్లవం. ఈ విప్లవానికి నాంది పలికింది ఉజ్రమ్మ. పత్తి రైతు, స్పిన్నింగ్ మిల్లు, చేనేతకారుడు... పరస్పర ఆధారితమై మనుగడ సాగించాలి. ఎవరూ ఎవరి మీదా పెత్తనం చేయరాదు... ఎవరూ ఎవరి ముందూ చేతులు కట్టుకోరాదు. నేతకారులను సంఘటితం చేస్తోందీ ఉక్కుమహిళ చేనేతను ప్రగతిబాట పట్టిస్తోందీ నేత. మీరు హైదరాబాదీనా? నార్త్ ఇండియనా? పుట్టింది హైదరాబాద్‌లోనే. పెరిగింది నార్త్‌లో. నాన్న రైల్వే ఆఫీసర్ కావడంతో నార్త్‌లో చాలా నగరాల్లో పెరిగాను. స్కూలు, కాలేజ్ కూడా నార్త్‌లోనే. మీరేం చదివారు? ఇంగ్లిష్ లిటరేచర్ మీ తరంలో అమ్మాయిల చదువుకి పెద్ద ఆంక్షలే ఉండేవేమో! ముఖ్యంగా ఇస్లాం సంప్రదాయ కుటుంబాల్లో...! మాది అభ్యుదయ కుటుంబం, మా నానమ్మ ఆ రోజుల్లోనే బురఖాకు వ్యతిరేకంగా పోరాడింది. అలాంటి నేపథ్యంలో ఆడపిల్లల చదువు మీద ఆంక్షలు ఎందుకుంటాయి? మీ చదువుకీ, మీరు చేస్తున్న సామాజిక ఉద్యమానికి సంబంధమే కనిపించడం లేదు? మా చిన్నాన్న సజ్జద్ జహీర్ ప్రముఖ కమ్యూనిస్ట్ లీడర్. ఆయన ప్రభావం నా మీద చాలా ఉంది. పర్సన్‌గా నా వికాసంలో చిన్నాన్నదే మెయిన్ రోల్. ఆయన నాకు రోల్‌మోడల్ కూడా. ఇంగ్లిష్ లిటరేచర్‌లో కెరీర్ ప్లాన్ చేయనేలేదా? నాలాగ సోషల్ ఇష్యూస్ మీద స్పందించే వ్యక్తికి లిటరేచర్ ప్రొఫెషన్‌గా ఉపయోగపడదనిపించింది. పత్తి మీద, చేనేత మీద నేను చేసిన పనిని అక్షరీకరించడానికి ఆ చదువు ఉపయోగపడింది. చేనేత రంగం మీద ప్రత్యేక ఆసక్తి ఎందుకు? బ్రిటిష్ పాలన కాలంలో మనదేశపు పత్తి బ్రిటన్‌కు ఎగుమతి కావడం మొదలైంది. ఎగుమతికి అవకాశాలు పెరిగాయి సంతోషమే. అక్కడ మన ఉనికిని మనమే పణంగా పెట్టాల్సిన కుట్ర ఎవరికీ తెలియకుండా జరిగిపోయింది. బ్రిటన్‌లోని స్పిన్నింగ్ మిల్లులకు అనువుగా ఉండే పత్తి రకాలను పండించడానికి మన రైతుల్ని సిద్ధం చేసేశారు. దాంతో మనదేశంలో ఉన్న వైవిధ్యతను కోల్పోయాం. దానికి తోడు మన చేనేతకారులకు దారం అవసరమైనంతగా అందడం లేదు. ఇటు పత్తి రైతు, అటు వస్త్రాన్ని నేసే నేతకారుడు ఇద్దరూ స్పిన్నింగ్ మిల్లు దయాదాక్షిణ్యాల మీద ఆధారపడాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ ఇద్దరినీ నియంత్రించే స్థాయికి, నిర్దేశించే స్థాయికి చేరిపోయింది స్పిన్నింగ్ పరిశ్రమ. ఈ ఉద్యమంలో మీ లక్ష్యం ఏమిటి? సమన్యాయం. రైతు, చేనేత కారుడు, స్పిన్నింగ్ మిల్లు యజమాని... ముగ్గురూ సమాజంలో ఒకే రకమైన గౌరవాలను అందుకోగలగాలి. స్పిన్నింగ్ పరిశ్రమ ఉక్కు కౌగిలి నుంచి పత్తి రైతులు, చేనేత కారులు బయటపడాలి. ఇంతకీ మల్కా అంటే ఏమిటి? ఇది ఒకరకమైన ఫ్యాబ్రిక్. ఖాదీ వంటిదే. దారం నునుపుగా, మృదువుగా ఉంటుంది. మన్నిక కూడా ఎక్కువే. ఈ దారంతో చేసిన వస్త్రం చేతికి కొంచెం గరుకుగా తగులుతూ ఒంటికి హాయినిస్తూంటుంది. మన భారతీయ సంప్రదాయ నేత విధానానికి ఆధునిక టెక్నాలజీని మేళవించి రూపొందుతున్న వస్త్రం. మల్కా చీర కడితే కుచ్చిళ్లు చక్కగా అమరుతాయి. నార్మల్ కాటన్కీ దీనికీ తేడా ఉంటుందా? పాశ్చాత్య కంపెనీలు మన పత్తిని వాళ్ల దేశాలకు రవాణా చేయడానికి బేలింగ్ విధానం పాటిస్తాయి. పత్తిని గట్టిగా ఒత్తిడికి గురిచేసి నలుచదరంగా డబ్బాలాగ ప్యాక్ చేస్తారు. వాటినే మనం పత్తి బేళ్లు అంటాం. బేలింగ్లో కంప్రెస్ చేసినప్పుడు, తిరిగి స్పిన్నింగ్ మిల్లులో ఏకినప్పుడు పత్తి పోగుల్లో సహజంగా ఉండే సున్నితత్వం, మెరుపు తగ్గుతుంది. మల్కా నేత కోసం పత్తిని బేల్ చేయరు. వదులుగా ప్యాక్ చేసి రవాణా చేస్తారు. చిన్న చిన్న నూలు మిల్లులు ఏర్పాటు చేసి, పత్తి రైతులు, చేనేత కారులకు అందుబాటులోకి ఉండేట్టు చూస్తున్నాం. వాటిని చేనేతకారులే సహకార సంఘాలుగా ఏర్పడి నడిపించుకుంటున్నారు. సిరిసిల్లలో 70 చేనేత కుటుంబాలు మల్కా ప్రోత్సాహక, పరిరక్షణ ఉద్యమంలో పని చేస్తున్నాయి. వాళ్లు పత్తిని రైతుల నుంచి కొని దారం తీస్తారు, వారే దుస్తులు నేస్తారు. మన పత్తి పాశ్చాత్య కంపెనీల్లో దారంగా మారడం తప్పంటారా? తప్పా ఒప్పా అనేది కాదిక్కడ. నాలుగు వేల ఏళ్ల మన వస్త్ర పరిశ్రమ మనది. ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకమైన పత్తి పండేది. వాటి నుంచి వచ్చే దారంలోనూ తేడా ఉంటుంది. దానిని బట్టి అక్కడ తయారయ్యే వస్త్రాల్లో వైవిధ్యత ఉండేది. పాశ్చాత్య కంపెనీలు... వాళ్ల మిషన్లకు అనువుగా ఉండే పత్తినే ప్రమోట్ చేస్తున్నాయి. దాంతో ఒకే రకమైన దారంతో ఒకటే రకం కాటన్ తయారవుతోంది. మనకు పెద్ద ఆస్తిలాంటి వైవిధ్యత పోతోంది. అలాగే వాళ్లు సూచించే పత్తి వంగడాలకు మన వాతావరణంలో తెగుళ్లు ఎక్కువ. దాంతో మందులు ఎక్కువ చల్లాలి, రైతుకి ఖర్చు పెరుగుతుంది. ఈ నేలలో జీవం పోసుకున్న పత్తి వంగడం ఇక్కడి వాతావరణంలో తెగుళ్లను కూడా ఎదుర్కోగలుగుతుంది. దేశీయ పత్తి, చేనేత గురించి ఇన్ని విషయాలు చెబుతున్నారు, చాలా స్టడీ చేసినట్లున్నారు! స్టడీ కాదు, రీసెర్చ్ చేశాను. ‘పేట్రియాటిక్ అండ్ పీపుల్ ఓరియెంటెడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ(పిపిఎస్టి)’లో పరిశోధన చేశాను. యూరప్, అమెరికాలు... అవి పాటిస్తున్న సైన్స్‌కి మోడరన్ సైన్స్ అనే పేరు పెట్టి మూడవ ప్రపంచదేశాల మీద ఆధిపత్యం చెలాయించడం, ఆయా దేశాల్లో అప్పటికే అభివృద్ధి చెంది ఉన్న సైన్స్‌ను తుడిచిపెట్టే ప్రయత్నం చేయడం మీద మనదేశంలోని యువశాస్త్రవేత్తలు కొంతమంది డెబ్బైలలో ఒక ఫౌండేషన్‌గా ఏర్పడ్డారు. ఇండియాలో విస్తరించిన సైన్స్‌ను వెలుగులోకి తెచ్చే ప్రయత్నం అది. మల్కా ఉద్యమాన్ని ఎప్పుడు మొదలుపెట్టారు? పదేళ్ల కిందట, 2008లో. అంతకు ముందు ఆదిలాబాద్ జిల్లా చెన్నూరులో చేనేతకారుల కోసం పనిచేశాను. దస్తకార్ ఆంధ్రా మార్కెటింగ్ అసోసియేషన్ స్థాపన కోసం పని చేశాను. రాష్ట్రంలోని చేనేతకారులు సంఘటితంగా స్వయంగా మార్కెట్ చేసుకోవడానికి వేదిక అది. మల్కా మార్కెటింగ్ ట్రస్ట్ కూడా అలాంటిదే. తెలంగాణలో ఒకప్పుడు ఉండి ఇప్పుడు కనుమరుగవుతున్న డిజైన్లతో మల్కానేతలో ప్రయోగాలు చేస్తున్నాం. వస్త్రాన్ని మచిలీపట్నం పంపించి వాటి మీద సహజరంగులతో కలంకారీ అద్దకం చేయిస్తున్నాం. మన దేశీయ పత్తి, చేనేతకు మన అద్దకం మేళవింపు అన్నమాట. మల్కాను ప్రమోట్ చేయడానికి సెలబ్రిటీ అంబాసిడర్లున్నారా? మల్కా చీరను ధరించిన ప్రతి మహిళా మల్కాకు బ్రాండ్ అంబాసిడరే. ఒకసారి వీటిలో సౌకర్యాన్ని ఆస్వాదిస్తే ఇక వదిలిపెట్టరు. మల్కా దుస్తుల ధర చాలా ఎక్కువ కదా? కొంత వరకు నిజమే, కానీ ఆరోగ్యం అంతకంటే ముఖ్యం. చెమటను పీల్చుకునే వస్త్రం ఒంటికి చేసే మేలు గురించి ఒకరు చెప్పాల్సి రావడం బాధాకరమే. «ధరే కాదు, మన్నిక కూడా ఎక్కువే. మీ ప్రయత్నంలో విజయం సాధించారా? ఇది ముందు తరాలకు కొనసాగే అవకాశముందా? ఇది విస్త్రృతమైన ప్రపంచం. నేను వేసిన అడుగులు కొన్నే. నేను చైతన్యపరిచిన చేనేతకారుల కుటుంబాల్లో ఈ వృత్తి జీవితాన్ని నిలబెడుతుందనే నమ్మకమైతే కుదిరింది. ఈ జర్నీ కొనసాగాలంటే ప్రభుత్వాలు పూనుకోవాలి. ప్రభుత్వాలు చేనేత రంగాన్ని సన్‌సెట్ ఇండస్ట్రీగా చూస్తున్నాయి. ప్రభుత్వాలిచ్చే ప్రోత్సాహకాలు ఉన్న కళను పరిరక్షించడానికే అరకొర అవుతున్నాయి. భవిష్యత్తు నిర్మాణానికి సరిపోవడం లేదు. నిజానికి ఇది భవిష్యత్తు ఉన్న గ్రీన్ ఇండస్ట్రీ. ప్రపంచంలో అత్యధికంగా చేనేతకారులున్న దేశం మనది. ప్రభుత్వం ప్రోత్సహిస్తే చైనాను మించిపోతుంది ఇండియా. మన పత్తి నుంచి దాని నాణ్యత కోల్పోకుండా దారం తీయడానికి అనువైన యంత్రాల కోసం రీసెర్చ్ జరగాలి. మనకోసం మనమే యంత్రాలను తయారు చేసుకోవాలి. చేనేత ఉద్యమంతోపాటు మీ హాబీలేంటి? హాబీ కాదు కానీ, నా మరో ప్రొఫెషన్ జువెలరీ మేకింగ్. ఆభరణాల తయారీ కోర్సు చేశాను. ఇంట్లో వర్క్‌షాప్ ఉంది. బ్రాస్లెట్, నెక్లెస్, చెవిరింగులు, ఉంగరాల వంటివి కొత్త డిజైన్లు చేస్తుంటాను. మరి... రోజుకు ఎన్ని గంటలు పనిచేస్తారు? నాకిప్పుడు 75 ఏళ్లు. ఈ వయసులో ఎన్ని గంటలు చేయగలను. మల్కా కోసం నాలుగు గంటలు, ఆభరణాల వర్క్‌షాప్‌లో రెండు గంటలు. టూర్లను ఇష్టపడతారా? ఇండియాలో, విదేశాల్లో ప్రదేశాలకు వెళ్లాను. కానీ నేను టూరిస్ట్‌ను కాదు. అక్కడి మనుషులను కలవడానికే వెళ్లాను తప్ప ప్రదేశాలను చూడడానికి కాదు. రాష్ట్రీయ చేనేత జనసమాఖ్యను కలవడానికి చీరాలకు వెళ్లాను. ఒరిస్సా, కర్ణాటక, కేరళలోని హ్యాండ్లూమ్ వీవర్స్‌ను కలిశాను. లూమింగ్ రివల్యూషన్లో భాగంగా విస్తృతంగా పర్యటించాను. – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి పత్తి చరిత్ర మట్టి నుంచి పత్తిని పండించే రైతు, పత్తి నుంచి దారం తీసే యంత్రం, దారంతో వస్త్రాన్ని రూపొందించే హస్తకళా నైపుణ్యం... ఈ మూడూ తోడుగా ఉండడమే ఆధునిక మానవుడి ఆహార్య రహస్యం. ఈ మూడింటిలో మొదటి అడుగే తప్పటడుగు అవుతుంటే... మిగిలినవి తప్పుటడుగులే అవుతాయి. ఇప్పటికే కొన్ని దశాబ్దాలుగా పడిన తప్పటడుగులను సరిచేయడమే మల్కా ఉద్యమం ఉద్దేశం. దేశమంతటా పర్యటించి పరిశోధించిన సమాచారాన్ని ‘ఏ ఫ్రేడ్ హిస్టరీ : ద జర్నీ ఆఫ్ కాటన్ ఇన్ ఇండియా’ పేరుతో పుస్తకం రాశాను. ఈ పుస్తకంలో పత్తి చరిత్ర, పత్తిలో రకాలు, సాగు పద్ధతులు, దారం తీసే నైపుణ్యాలు, వస్త్రాన్ని నేయడంలో వివిధ ప్రాంతాల్లో అవలంబించే పద్ధతుల గురించి సమగ్రంగా చర్చించాను. నా తర్వాత ఈ ఉద్యమాన్ని నడిపించడానికి ముందుకు వచ్చే వాళ్లకి ఇది పనికొస్తుంది. నేను చేసిన పనినే మళ్లీ వాళ్లు కూడా మొదటి నుంచి చేయాల్సిన అవసరం లేకుండా ఈ పుస్తకం మార్గదర్శనం చేస్తుంది. – ఉజ్రమ్మ, మల్కా ఉద్యమకారిణి -
గాలిపటం ఎంత పని చేసింది..
ఘజియాబాద్: రంగురంగుల్లో ఆకాశంలో విహరించే గాలిపటం ఓ వ్యక్తి మరణానికి కారణమైంది. యోగేశ్ శర్మ(52) అనే వ్యక్తి పనులు ముగించుకుని ఢిల్లీలోని తన నివాసానికి బయలుదేరాడు. దారిలో ఠాకూర్ ద్వారా ఫ్లై-ఓవర్ మీదుగా బైక్ పై వెళ్తున్న సమయంలో ఓ తెగిన గాలిపటం దారం అతని మెడకు చుట్టుకుంది. వాహనాన్ని ఆపడానికి కొద్ది మీటర్లు ముందుకు వెళ్లేసరికి ఆయన గొంతు తెగిపోయి రక్తం చిమ్మి కొట్టిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యోగేశ్ చిన్న తరహా వ్యాపారాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. శుక్రవారం మధ్యాహ్నం వ్యాపారానికి సంబంధించిన పనులు ముగించుకుని ఢిల్లీలోని మౌజ్ పురాలోని తన నివాసానికి బయలుదేరారు. బైక్ పై వెళ్తున్న సమయంలో గాలిపటం దారం మెడకు చుట్టుకోవడంతో అతని స్వరపేటికతో పాటు రక్తనాళాలు తెగిపోయినట్లు చెప్పారు. రోడ్డు మీద రక్తపు మడుగులో పడి ఉన్న బాధితుడిని వెంటనే ఆసుపత్రికి తరలించామని అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు చెప్పారని తెలిపారు. గాలి పటం తయారీలో ఉపయోగించిన నైలాన్ దారం, సీసపు పూత కారణంగా పదునుగా తయారయిందని వివరించారు. ప్రతి ఏటా గాలిపటం దారాల వల్ల పక్షులు, ప్రజలు గాయాలపాలవుతున్న విషయం తెలిసిందే. -
పిట్టకు ఉరి....
విశాఖ : మనిషి తన వినోదం కోసం మూగ జీవాల ప్రాణాలు తీస్తున్నాడు. తమ మనుగడ కోసం మూగ జీవాలను వాడుకుంటున్న జనాలు... తమకు తెలిసి, ఒక్కోసారి తెలియకుండా వాటి ప్రాణాలు పోవడానికి కారణమవుతున్నాడు. ఈ చిత్రంలో కనిపిస్తున్న హృదయాన్ని కదిలించే దృశ్యం విశాఖలోని సర్క్యూట్ హౌస్ వద్ద బుధవారం 'సాక్షి' కెమెరా కంటపడింది. వినోదం కోసం ఎవరో ఎగరేసిన గాలిపటం దారం చెట్టు మీద సేద తీరుతున్న పిట్ట మెడకు చుట్టుకుంది. దాన్ని వదిలించుకునే క్రమంలో దారం పిట్ట మెడకు బిగుసుకుపోవడంతో గిలగిలా కొట్టుకుంటూ ప్రాణం విడిచింది. ఎవరో తమ ఆనందం కోసం ఎగరేసిన గాలిపటం ఇలా ఓ పక్షిని బలిగొంది. -
చండ్ర సెగలకు నూలుపోగు
వసంతగాలికోసం కోయిలలు తొందరపడుతున్నా.. ఆపై వచ్చే వడగాలులను తలుచుకుని కోనంగులు మాత్రం కాస్త టెన్షన్ పడుతున్నారు. వేసవిలో వరుస కట్టే వేడుకలకు ఎలా ముస్తాబవ్వాలో తెలియక తికమకపడుతున్నారు. ఒకప్పుడు మేలో ఎండలు మెండు అని చదువుకున్నాం. కానీ మారిన వాతావరణ పరిస్థితులతో మార్చి నుంచే భానుడు భగభగమంటున్నాడు. దీంతో హెవీ డ్రెస్సింగ్‌కు బె దురుతున్న మగువల కోసం ష్యాషన్ డిజైనర్లు సరికొత్త ఆప్షన్స్ తీసుకొస్తున్నారు. చంద్రునికో నూలుపోగన్నట్టు.. చండ్ర సెగలకూ నూలు పోగే కరెక్టని నయా డిజైన్స్ ఆవిష్కరిస్తున్నారు. ఫ్యాషన్ సూత్రాల కు లోబడి.. రిచ్ నెస్ ఏమాత్రం తగ్గకుండా.. సరికొత్త మోడల్స్ మార్కెట్లోకి రిలీజ్ చేస్తున్నారు. ఏడాదంతా ఎలాంటి ఫ్యాషన్ ప్రపంచంలో విహరించినా.. వేసవి రాగానే నూరు విధాలా నూలే కరెక్టని అందరూ ఫిక్సవుతారు. దీన్ని బేస్ చేసుకునే సమ్మర్ కోసం కాటన్‌తో మ్యాజిక్ చేస్తున్నారు ష్యాషన్ డిజైనర్లు. వేసవిలో పార్టీలకు, ఫంక్షన్లకు, గెట్ టుగెదర్ ఈవెంట్లకు వెళ్లే అతివలకు అతికినట్టు నప్పే ఫ్యాషన్ వేర్స్‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. నైలాన్, రాసిల్క్, బ్రోకెట్ వంటి ఫ్యాబ్రిక్స్‌తో మురిపించే వస్త్ర శ్రేణులు సమ్మర్ రాగానే బీరువాకే పరిమితం అవుతాయి. ఇక పట్టు చీరల సంగతి వేసవిలో మరచి పోవాల్సిందే. అందుకే నిండు ఎండాకాలంలో పెళ్లిసందడికైనా.. మరే వేడుకకైనా.. వెళ్లాల్సివస్తే నేత చీరలకే ఓటు వేస్తారు మహిళలు. నడి వయస్కులు, పెద్దమనుషులు నేత చీరలతో నెట్టుకొస్తారు.. మరి యువతుల సంగతో అంటే.. వారి కోసం సాఫ్ట్ స్పన్ అండ్ స్మూత్ కాటన్‌తో కంఫర్టబుల్ కాస్ట్యూమ్స్ ఉన్నాయంటున్నారు ఫ్యాషన్ డిజైనర్లు. ఇదే తరుణం.. చిట్టి పొట్టి ఫ్రాక్స్ నుంచి చుడీదార్స్, లాంగ్ స్కర్ట్స్, టాప్స్ ఇలా అన్నింటినీ కాటన్, స్పన్ కలగలిపి సమ్మర్ కాన్సెప్ట్‌లోకి షిఫ్ట్ చేస్తున్నారు. దీనికే నేచురల్ అందాలను జోడిస్తున్నారు. రకరకాల పూల డిజైన ్లను స్కర్ట్ మీద పూయించి అదిరిపోయేలా చేస్తున్నారు. నింగిలోని తారకల నమూనాలను ఫ్రాక్స్ మీద మెరిసేలా చేస్తున్నారు. అందుకే వేసవి వెదర్‌కు సెట్ అవుతూ.. కూల్‌గా ఉంచుతున్న ఈ డిజైనింగ్స్కు మంచి తరుణం మించిన దొరకదంటూ స్వాగతం పలుకుతున్నారు తరుణిలు. - సిరి