తప్పనిసరి పరిస్థితుల్లో ఒంటరి ప్రయాణాలు చేసే మహిళలకు చేదు అనుభవాలు ఎదురుకావడం కొత్తేం కాకపోవచ్చు. కానీ, ఆ ఘటనలను మరికొందరి దృష్టికి తీసుకెళ్లి.. ఇతరులను అప్రమత్తం చేయాలనే ఆలోచన మాత్రం మంచిదే!. తాజాగా ఢిల్లీలో ఓ హర్యానాలో ఓ యువతి.. ఓ ఆటోడ్రైవర్‌తో తనకు ఎదురైన చేదు అనుభవం పంచుకునేందుకు ట్విటర్‌ను వేదిక చేసుకుంది. అలా ఆమె ట్వీట్లు రీ-ట్వీట్లు, షేర్ల ద్వారా వైరల్ అవుతున్నాయి.
నిష్తా పలివాల్.. కమ్యూనికేషన్స్ స్పెషలిస్ట్‌గా పని చేసే యువతి(అంతకు మించి వివరాలేవీ వెల్లడించలేదు). డిసెంబర్ 19న మధ్యాహ్న సమయంలో తనకు భయానక అనుభవం ఎదుర్కొన్నట్లు ట్విటర్ ద్వారా తెలియజేసిందామె. ఓ ఆటోడ్రైవర్ దాదాపుగా ఆమెను కిడ్నాప్ చేసినంత పని చేశాడట. కానీ, అదృష్టం బాగుండి ఆమె ఆ దాడి నుంచి తప్పించుకోగలిగింది.
Yesterday was one of the scariest days of my life as I think I was almost abducted/ kidnapped. I don’t know what it was, it’s still giving me chills. Arnd 12:30 pm, I took an auto from the auto stand of a busy market Sec 22 (#Gurgaon) for my home which is like 7 mins away (1/8)
— Nishtha (@nishtha_paliwal) December 20, 2021
‘‘మధ్యాహ్నం 12గం.30ని సమయం. గుర్గావ్ సెక్టార్ 22లోని బిజీ మార్కెట్‌లోని ఆటోస్టాండ్ అది. అక్కడున్న ఓ ఆటో దగ్గరికి వెళ్లా. డివోషనల్ సాంగ్స్(అతను ఏ మతస్తుడో చెప్పడం నాకిష్టం లేదు.. ఎందుకంటే ఇది మతానికి సంబంధించిన అంశం కాదు కాబట్టి) మీడియం వాల్యూమ్‌లో పెట్టుకుని వింటున్నాడతను. అతని వాలకం చూస్తే నాకే అనుమానం రాలేదు. నా దగ్గర క్యాష్ లేకపోవడంతో పేటీఎం చేస్తానని ఆ డ్రైవర్‌తో చెప్పా. అతను సరేనన్నాడు. కేవలం ఏడు నిమిషాల్లో ఇంటికి చేరాలి. కానీ, వెళ్లాల్సిన రోడ్డులో కాకుండా.. మరో రోడ్డులో అతను టర్న్ తీసుకున్నాడు. ఎందుకు ఈ దారి అని అడిగినా.. అతని నుంచి సమాధానం లేదు.
పదేపదే అడగడంతో బిగ్గరగా దేవుడ్ని తల్చుకున్నాడతను. ఆ చేష్టలతో భయం వేసింది. ఆ భయంలోనే అతన్ని భుజం మీద పదే పదే కొట్టాను. అయినా స్పందన లేదు. చివరికి ఒక్కటే మార్గం కనిపించింది. బయటకు దూకితే ఏమైతది మహా అంటే కాళ్లు, చేతులు విరుగుతాయి. లేదంటే తల పగులుతుంది. కానీ, ఆ మృగం చేతిలో పడితే.. మానం వీలైతే ప్రాణమూ పోవచ్చు. అందుకే దూకేశా. ఆ డ్రైవర్ మాత్రం వెనక్కి తిరిగి చూడకుండా అలాగే ముందుకు వెళ్లిపోయాడు. నేను సురక్షితంగా బయటపడ్డా. పట్టపగలే ఆరోజు నరకం చూశా. ఇలాంటి అనుభవం మరొకరికి ఎదురు కాకూడదనే ఈ విషయం చెప్తున్నా’’ అంటూ పోస్ట్ చేసిందా యువతి. ఇక ఈ ఘటనపై పోలీసులు స్పందించారని, ఆటో డ్రైవర్‌ను ట్రేస్ చేసే పనిలో ఉన్నారని చెబుతూ మరో ట్వీట్ చేసిందామె.
చదవండి: కన్నీళ్లతో వైరల్ అవుతున్న బాలుడి ఫొటో.. ఎందుకో తెలుసా?
Comments
Please login to add a commentAdd a comment