Bengal E-Rickshaw Driver Gives Free Rides: కొన్ని కొన్ని విషయాలు చూస్తే మనకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అబ్బా ఇలాంటి వాళ్లు కూడా ఉన్నారా అని అనిపించక మానదు. అచ్చం అలానే ఇక్కడొక ఆటోవాలా తన వింతైన తీరుతో అందరి మనసులు దోచుకున్నాడు.
(చదవండి: కారు డ్రైవింగ్ చేస్తూ.. స్పృహ తప్పి పడిపోయింది! అతని సాహసానికి హ్యాట్సాఫ్)
అసలు విషయంలోకెళ్లితే...బెంగాల్‌లోని లిలుహ్ (హౌరా జిల్లా)లోని ఈ రిక్షా డ్రైవర్ సురంజన్ కర్మాకర్ ప్రయాణికులను తాను అడిగే ప్రశ్నలకు సమాధానమిస్తే ఉచితంగా డ్రాప్ చేస్తానంటూ చెబుతుంటాడు. ఈ క్రమంలో ఒక జంట సంకలన్ సర్కార్ అతని భార్య ఇద్దరూ సురంజన్ ఆటో ఎక్కుతారు. సురంజన్ వెంటనే తానడిగే 15 జీకే ప్రశ్నలకు జవాబు చెబితే మిమ్మల్ని ఉచితంగా తీసుకువెళ్తానంటాడు. దీంతో ఆ జంట ఆ డ్రైవర్ సురంజన్ తీరు చూసి ఒక్కసారిగా షాక్‌కి గురువుతారు. అయితే ఆ జంట అతని ప్రశ్నలేంటో తెలుసుకుందామనే ఆసక్తితో అతని ఆటో ఎక్కుతారు.
ఆ తర్వాత సురంజన్ ప్రశ్నల పరంపర చాలా రసవత్తరంగా సాగుతుంటుంది. అతను జీకేలో అన్నింటిని టచ్ చేసుకుంటూ వెళ్లిపోతాడు. అయితే ప్రయాణికుడు సంకలన్ మొదటగా ఈ డ్రైవర్ తన సంపాదనతో సంతృప్తి చెందక ఇలా ప్రయాణికులను ప్రశ్నలడిగి ఒకవేళ వాళ్లు సరైన సమాధానం చెప్పకపోతే అధిక చార్జీలు వసూలు చేద్దాం అని ఇలా చేస్తున్నాడు అనుకుంటాడు. అయితే ఈ క్విజ్ అయిపోయిన వెంటనే డ్రైవర్ సురంజన్ మాట్లాడుతూ... "ఆర్థిక ఇబ్బందుల కారణంగా నేను ఆరవ తరగతి వరకు చదువుకున్నాను. అయితే నాకు ప్రతిరోజూ తెల్లవారుజామున 2 గంటల వరకు చదివే అలవాటు ఉంది. అంతేకాదు లిలూయా బుక్ ఫెయిర్ ఫౌండేషన్‌లో సభ్యునిగా ఉన్నాను. మీరు నన్ను గూగుల్‌లో 'అద్భుత్ తోటివాలా'గా కూడా చూడవచ్చు" అని అన్నాడు. ఈ మేరకు ఈ ఘటనకు సంబంధించిన విషయాన్ని ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేయడంతో ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
(చదవండి: సైబర్ మోసాలకు చెక్ పెట్టే మొబైల్ యాప్! ఇక సైబర్ కేటుగాళ్ల ఆటకట్టు..)
Comments
Please login to add a commentAdd a comment