Free rides
-
USA Presidential Elections 2024: పోలింగ్ డే ఉచితాలు
మన లోక్‌సభ ఎన్నికల్లో ఓటింగ్‌ను పెంచేందుకు.. కొన్ని కంపెనీలు ఇచ్చిన ఆఫర్లు గుర్తున్నాయా? ఓటేస్తే ఉచితంగా బీర్, రెస్టారెంట్లో బిల్లుపై డిస్కౌంట్, పోలింగ్ కేంద్రానికి ఉచిత ప్రయాణం..! ఆ... అలాంటి ఆఫర్లే ఇప్పుడు అమెరికా ఎన్నికల్లోనూ ఓటర్లకు పలు కంపెనీలు ఇస్తున్నాయి. 2,000 కంటే ఎక్కువ కంపెనీలు ‘టైమ్ టు ఓట్’ కార్యక్రమంలో భాగం పంచుకుంటున్నాయి. ఉద్యోగులు ఓటు వేసేందుకు అనుగుణంగా పని షెడ్యూల్‌ను అందుబాటులోకి తెచ్చాయి. ఓటేయడానికి వెళ్లేందుకు ఉచిత ప్రయాణాల నుంచి.. ఓటేసిన వారికి ఉచిత డోనట్స్వరకు కొన్ని సంస్థలో ఉచితాలు ప్రకటించాయి. → పోలింగ్ రోజు ఉబర్ యాప్‌లోని ‘గో ఓట్’ ఆప్షన్‌పై క్లిక్ చేస్తే యూజర్లకు రకరకాల ఆఫర్లు వస్తాయి. పోలింగ్ కేంద్రానికి ప్రయాణాలపై 50 శాతం డిస్కౌంట్ (10 డాలర్ల వరకు) పొందవచ్చు. సమీపంలోని పోలింగ్ కేంద్రాన్ని కూడా యాప్‌లో తెలుసుకోవచ్చు. ఉబర్ ఈట్స్ కూడా 25 శాతం డిస్కౌంట్‌పై ఆర్డర్లను అందిస్తోంది. → పోలింగ్ రోజున 50 శాతం డిస్కౌంట్ (10 డాలర్ల దాకా) ఇస్తున్నట్లు ‘లిఫ్ట్’ యాప్ తెలిపింది. యూజర్లు నవంబర్ 5లోగా రైడ్ కోడ్ ఓటీటీ24ను ప్రీలోడ్ చేసుకోవచ్చు. దీనివ్లల కనీసం 30 లక్షల మంది ఓటేసేందుకు వస్తారని లిఫ్ట్ అంటోంది. → కారు రెంటల్ కంపెనీ హెరŠట్జ్ ‘డ్రైవ్ ది ఓట్’ డీల్‌లో భాగంగా అక్టోబర్ 21 నుంచి నవంబర్ 5 దాకా రెండు, అంతకంటే ఎక్కువ రోజులు రెంట్‌కు తీసుకునే వారికి ఒక రోజు రెంట్ డిస్కౌంట్ ఇస్తోంది. → సెలవు దినాల్లో ఆఫర్లు ప్రకటించే క్రిస్పీ క్రీమ్.. ఉచితంగా డోనట్స్ ఆఫర్ చేస్తోంది. యూఎస్‌లోని అన్ని క్రిస్పీ క్రీమ్ దుకాణాలు ఓటేసిన వారికి ఉచిత ఒరిజినల్ గ్లేజ్డ్ డోనట్ అందిస్తున్నాయి. → ఓటేసినట్టు రుజువు చూపించి తమ స్టోర్‌లో ఏదైనా కొనుగోలు చేస్తే ఉచిత షేక్ ఇస్తామని డైనర్ స్టైల్ చైన్ జానీ రాకెట్స్ ప్రకటించింది. → 400 కంటే ఎక్కువ స్టోర్లున్న రౌండ్ టేబుల్ పిజ్జా పలు ఆఫర్లు ప్రకటించింది. తమ అతి పెద్ద పిజ్జాపై ఆరు డాలర్ల డిస్కౌంట్ ఇస్తోంది. → ఫర్నిచర్ స్టోర్ ఐకియా కూడా ఓటింగ్ డే నాడు ఓటర్లకు ఫ్రోజెన్ యోగర్ట్ ఉచితంగా ఇస్తోంది. → ఎనిమిది రాష్ట్రాల్లో 50 రెస్టారెంట్లున్న లేజీ డాగ్ కూడా ‘ఐ ఓట్’ స్టిక్కర్ ఉన్నవారికి ఎంట్రీ కొనుగోలుపై నాన్ ఆల్కహాలిక్ డ్రింక్ ఉచితంగా అందిస్తోంది. → ఓటింగ్ రోజు ఉచిత ప్రయాణాన్ని ‘లైమ్’ అందుబాటులోకి తెచ్చింది. ఓటర్లు చెకౌట్ ఆప్షన్ దగ్గర కోడ్ Vౖఖీఉ2024 నమోదు చేస్తే లైమ్ స్కూటర్, బైక్ రైడ్‌తో పోలింగ్ కేంద్రానికి ఉచితంగా వెళ్లొచ్చు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
చాన్స్ మిస్.. ఆధార్ లేకపాయే.. ఆర్టీసీ ఆఫర్ ఆగమాయే..
మహిళా దినోత్సవం సందర్భంగా అరవై ఏళ్లు పైబడిన మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో మంగళవారం ఉచిత ప్రయాణం ఆఫర్ ప్రకటించారు. అయితే, ఈ ప్రకటనపై పెద్దగా ప్రచారం చేయకపోవడంతో చాలా మందికి తెలియలేదు. దీనికి తోడు ఉదయం ఒకరిద్దరు ఈ విషయమై అడిగినా తమకేం ఆదేశాలు రాలేదని కండక్టర్లు చెప్పినట్లు తెలిసింది. ఆ తర్వాత ఆర్ఎం ఆదేశాలతో కండక్టర్లు అనుమతించినప్పటికీ.. అవగాహన లోపంతో చాలా మంది మహిళలు ఆధార్ కార్డులు వెంట తెచ్చుకోలేదు. ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తున్న మహిళలు ఆధార్ కార్డు ఉంటేనే ఉచిత ప్రయాణమని, లేకపోతే టికెట్ తీసుకోవాల్సిందేనని చెప్పడంతో ఆఫర్ మిస్ అయినట్లయింది. ఆర్భాటంగా ఆఫర్ ప్రకటించిన ఆర్టీసీ అధికారుల.. రెండు, మూడు రోజుల ముందు నుంచి ప్రచారం చేస్తే బాగుండేదని అభిప్రాయం వ్యక్తమైంది. కాగా, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణంపై ‘సాక్షి’ జిల్లా కేంద్రంతో పాటు సత్తుపల్లి, మధిర, వైరాల్లో పరిశీలించగా.. ఎక్కువ మంది ఉపయోగించుకోలేదని వెల్లడించారు. ఈ సందర్భంగా పలువురి అభిప్రాయాలు ఇలా ఉన్నాయి. – ఖమ్మం మామిళ్లగూడెం / వైరా / సత్తుపల్లి టౌన్ / మధిర రూరల్ టికెట్ తీసుకోక తప్పలేదు.. నాకు ఫించన్ కూడా వస్తుంది. వయస్సు ఎప్పుడో 60 ఏళ్లు దాటింది. కానీ గుర్తింపు కార్డు తెచ్చుకోవటం మర్చిపోయాను. దీంతో కండక్టర్ కార్డు ఉంటేనే ఆఫర్ ఉంటుందన్నారు. ఇక టికెట్ తీసుకోక తప్పలేదు. – చింతలపాటి వరమ్మ, సత్తుపల్లి ముందే చెబితే బాగుండు.. వరంగల్ వెళ్దామని బస్సు ఎక్కా. ప్రయాణంలో ఆఫర్ ఉందని బస్సులోకి ఎక్కాక చెప్పారు. తీరా చూస్తే నా దగ్గర గుర్తింపు కార్డు లేదు. ప్రభుత్వం కల్పించిన ఆఫర్ వాడుకోలేకపోయా. ఇలాంటివి ముందే చెబితే బాగుండేది. – మాదాసి లక్ష్మమ్మ, సత్తుపల్లి వైరా నుంచి మధిర.. అరవై ఏళ్లు నిండిన మహిళలకు మహిళా దినోత్సవ కానుకగా బస్సుల్లో ఉచిత ప్రయాణం కానుక బాగుంది. నేను వైరా నుంచి మధిర వరకు ప్రయాణించా. ఇంకా ఎక్కువ మందికి తెలియజేస్తే ఆధార్ కార్డు తెచ్చుకునేవారు. – గంగసాని అరుణ, బ్రాహ్మణపల్లి, మధిర ఆనందంగా ఉంది మహిళా దినోత్సవం సందర్భంగా 60 ఏళ్లు దాటిన మహిళలకు బస్సుల్లో ఉచితంగా ప్రయాణ సౌకర్యం కల్పించడం ఆనందంగా ఉంది. ముందుగా తెలియడంతో ఆధార్‌కార్డు తెచ్చుకున్నా. కండక్టర్‌ను చూపించి మధిర నుంచి రాపల్లికి వెళ్లా. – వాసిరెడ్డి రజిని, రాపల్లి అభినందనీయం మహిళలను గౌరవించడం సంప్రదాయం. మహిళా దినోత్సవం సందర్భంగా ఆర్టీసీ ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడం అభినందనీయం. వయోవృద్ధులైన మహిళలకు బస్సులు, బస్టాండ్లలో మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించాలి. – గరిక సరోజిని, గంపలగూడెం కార్డు తెచ్చుకోలే.. ఆర్టీసీ బస్సులో ఈరోజు ఉచితంగా వెళ్లొచ్చని నాకు తెలియదు. ఈ విషయంపై చాలా మందికి అవగాహన లేదు. దీంతో ఆధార్‌కార్డు తెచ్చుకోలేదు. ఆధార్‌కార్డు ఉంటేనే టికెట్ లేకుండా ప్రయాణించొచ్చని కండక్టర్ చెప్పాడు. దీంతో టికెట్ కొన్నా. – కరి కమల, అనాసాగరం ఆధార్ అడగలేదు నేను బస్సులో ప్రయాణిస్తున్న సమయంలో కండక్టర్ టికెట్ కొట్టా రు. ఆధార్‌కార్డు ఉందా అని కానీ ఇతర గుర్తింపు కార్డులు ఉన్నాయా అని కానీ అడగలేదు. దీంతో టికెట్ తీసుకునే ప్రయాణం చేశాను. ఆ తర్వాత ఆఫర్ ఉందనే విషయం తెలిసింది. – స్వరూప, ప్రయాణికురాలు ఆధారాలు లేకపోవడంతోనే... అరవై ఏళ్లు పైబడిన మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాం. ఇందుకోసం ఆధార్ కార్డు.. ఇతర గుర్తింపు కార్డు చూపించాల్సి ఉంటుంది. ప్రయాణికులు ఎక్కువ మంది కార్డులు లేకుండా రావడంతో టికెట్ తీసుకోవాల్సి వచ్చింది. – సోలోమన్, రీజియన్ మేనేజర్ (ఇది చదవండి: వంట నూనెల సలసల.. 15 రోజుల్లో భారీగా పెరిగిన ధర, ఇలా అయితే కష్టమే!) -
జనరల్నాలెడ్జ్ ఉంటే చాలు!... ఈ ఆటోలో ఫ్రీగా వెళ్లిపోవచ్చు!!
Bengal E-Rickshaw Driver Gives Free Rides: కొన్ని కొన్ని విషయాలు చూస్తే మనకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అబ్బా ఇలాంటి వాళ్లు కూడా ఉన్నారా అని అనిపించక మానదు. అచ్చం అలానే ఇక్కడొక ఆటోవాలా తన వింతైన తీరుతో అందరి మనసులు దోచుకున్నాడు. (చదవండి: కారు డ్రైవింగ్ చేస్తూ.. స్పృహ తప్పి పడిపోయింది! అతని సాహసానికి హ్యాట్సాఫ్) అసలు విషయంలోకెళ్లితే...బెంగాల్‌లోని లిలుహ్ (హౌరా జిల్లా)లోని ఈ రిక్షా డ్రైవర్ సురంజన్ కర్మాకర్ ప్రయాణికులను తాను అడిగే ప్రశ్నలకు సమాధానమిస్తే ఉచితంగా డ్రాప్ చేస్తానంటూ చెబుతుంటాడు. ఈ క్రమంలో ఒక జంట సంకలన్ సర్కార్ అతని భార్య ఇద్దరూ సురంజన్ ఆటో ఎక్కుతారు. సురంజన్ వెంటనే తానడిగే 15 జీకే ప్రశ్నలకు జవాబు చెబితే మిమ్మల్ని ఉచితంగా తీసుకువెళ్తానంటాడు. దీంతో ఆ జంట ఆ డ్రైవర్ సురంజన్ తీరు చూసి ఒక్కసారిగా షాక్‌కి గురువుతారు. అయితే ఆ జంట అతని ప్రశ్నలేంటో తెలుసుకుందామనే ఆసక్తితో అతని ఆటో ఎక్కుతారు. ఆ తర్వాత సురంజన్ ప్రశ్నల పరంపర చాలా రసవత్తరంగా సాగుతుంటుంది. అతను జీకేలో అన్నింటిని టచ్ చేసుకుంటూ వెళ్లిపోతాడు. అయితే ప్రయాణికుడు సంకలన్ మొదటగా ఈ డ్రైవర్ తన సంపాదనతో సంతృప్తి చెందక ఇలా ప్రయాణికులను ప్రశ్నలడిగి ఒకవేళ వాళ్లు సరైన సమాధానం చెప్పకపోతే అధిక చార్జీలు వసూలు చేద్దాం అని ఇలా చేస్తున్నాడు అనుకుంటాడు. అయితే ఈ క్విజ్ అయిపోయిన వెంటనే డ్రైవర్ సురంజన్ మాట్లాడుతూ... "ఆర్థిక ఇబ్బందుల కారణంగా నేను ఆరవ తరగతి వరకు చదువుకున్నాను. అయితే నాకు ప్రతిరోజూ తెల్లవారుజామున 2 గంటల వరకు చదివే అలవాటు ఉంది. అంతేకాదు లిలూయా బుక్ ఫెయిర్ ఫౌండేషన్‌లో సభ్యునిగా ఉన్నాను. మీరు నన్ను గూగుల్‌లో 'అద్భుత్ తోటివాలా'గా కూడా చూడవచ్చు" అని అన్నాడు. ఈ మేరకు ఈ ఘటనకు సంబంధించిన విషయాన్ని ఫేస్బుక్లో పోస్ట్ చేయడంతో ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. (చదవండి: సైబర్ మోసాలకు చెక్ పెట్టే మొబైల్ యాప్! ఇక సైబర్ కేటుగాళ్ల ఆటకట్టు..) -
వ్యాక్సిన్ వేయించుకోవాలా? ఉబెర్ ఆఫర్
సాక్షి, ముంబై: కరోనా సంక్షోభ సమయంలో క్యాబ్ సేవల సంస్థ ఉబెర్ కీలక నిర్ణయం తీసుకుంది. వ్యాక్సినేషన్ కేంద్రాలకు ఉచిత రైడ్లను అందిస్తున్నట్లు ఉబెర్ మంగళవారం ప్రకటించింది. కరోనా వ్యాక్సిన్ తీసుకోవడానికి టీకా కేంద్రాలకు వెళ్లేవారికి ఉచిత క్యాబ్ సౌకర్యాన్ని అందిస్తోంది. రైడర్స్ టీకా కోసం వెళ్లి, ఇంటికి వచ్చేందుకు రూ .300 విలువైన రైడ్లు (వెళ్లడానికి రూ. 150, రావడానికి రూ. 150 వరకు) పొందవచ్చని ఉబెర్ తెలిపింది. ఈ మేరకు అర్హులైన తన వినియోగదారులకు ఈమెయిల్ సమాచారాన్నికూడా అందించింది. (ఫైజర్ ఔదార్యం: కంపెనీ చరిత్రలో అతిపెద్ద సాయం) ఈ ఉచిత రైడ్ ఉబెర్ గో, ఉబెర్ గో సెడాన్, ఉబెర్ ప్రీమియర్లలో మాత్రమే చెల్లుతుందని ఉబెర్ ప్రకటించింది. ఇందుకోసం దేశవ్యాప్తంగా టీకా కేంద్రాల జాబితాను విడుదల చేసింది. అలాగే ఈ ఫ్రీ రైడ్‌ను వినియోగించుకునేందుకు యూజర్లకు యాప్ ఒక ప్రోమోకోడ్‌ను అందిస్తుంది. సర్వీస్ పనిచేసే 36 నగరాల్లోని అన్ని టీకా కేంద్రాలను పేర్కొంది. ఎలా వినియోగించుకోవాలి యాప్ ఓ పెన్ చేసిన తరువాత ఎగువ ఎడమ మూలలో మెనూని క్లిక్ చేసి “వాలెట్” సెలెక్ట్ చేసి ఉచిత ప్రయాణానికి యూజర్లు ప్రోమో కోడ్ (10ఎం21వి) ని ఎంచుకోవాలి. ఆ తరువాత సమీప టీకా కేంద్రానికి పిక్-అప్ లేదా డ్రాప్ వివరాలను ఎంటర్ చేసి, నిర్ధారించుకోవాలి. అంతేకాదు ఉబెర్ తన యాప్ ద్వారా దగ్గరలోని అధీకృత టీకా కేంద్రాల సమాచారాన్ని కూడా అందిస్తుంది. కాగా మూడో దశ వ్యాక్సినేషన్లో భాగంగా మే 1 నుంచి దేశంలో 18నుంచి 45 సంవత్సరాలు పైబడినవారికి కరోనా వ్యాక్సిన్ అందివ్వనున్నట్టు కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే. -
మానవత్వం బతికే ఉంది.. కరోనా పేషెంట్లకు ఫ్రీ రైడ్
రాంచీ: ప్రజలు కోవిడ్ మహమ్మారి సోకి నరకయాతన అనుభవిస్తుంటే కొందరు మాత్రం రోగుల నుంచి ఎవరికి తోచిన విధంగా వారు దొరికినంత దోచుకుంటున్నారు. ఇటీవల రెమ్డిసెవర్ ఇంజక్షన్లు, ఆక్సిజన్ల కొరతను అడ్డుపెట్టుకొని బ్లాక్‌లో వేలల్లో వీటిని అమ్ముకున్న సంగతి తెలిసింతే. వీళ్లు మానవత్వం చూపించకపోయినా ఫర్వాలేదు కానీ ప్రాణాలతో ఇలా వ్యాపారం చేయకూడదనే విషయాన్ని కూడా మరిచారు. ఓ వైపే ఇలా ఉంటే మరోవైపే మనుషుల్లో ఇంకా మానవత్వం మిగిలే ఉందనేందుకు నిదర్శనంగా కొందరు కరోనా రోగులను తమ వంతు సాయం అందజేయడానికి ముందుకు వస్తున్నారు. అలా రాంచీలో ఓ ఆటోడ్రైవర్ కరోనా పేషంట్లకు తన వంతు సాయం చేస్తూ వార్తల్లో నిలిచాడు. వివరాల్లోకి వెళితే.. జార్ఖండ్ రాంచీకి చెందిన ఓ ఆటో డ్రైవర్ కోవిడ్ పేషెంట్ల కష్టాలు చూసి తన వంతు సహాయంగా ఏమైనా చేయదలచాడు. తన ఆటోలో ప్రయాణించే కరోనా రోగులకు ఉచిత ప్రయాణం కల్పిస్తూ తన మానవత్వాన్ని చాటుకుంటున్నాడు. అంతేగాక సోషల్ మీడియాలో తన ఫోన్ నెంబర్ని పెట్టాడు. ఆటోకి కూడా ఫోన్ నెంబర్‌తో ఉన్న పోస్టర్ని అతికించాడు. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే కోవిడ్ రోగులను హాస్పిటల్‌కి తీసుకెళ్లుతున్నాడు. వారి నుంచి ఎలాంటి డబ్బులు వసూలు చేయడం లేదు. ఇలా చేయడానిక ఓ కారణం ఉందని.. ఈనెల 15న కోవిడ్ సోకిన ఓ మహిళను రిమ్స్ హాస్పిటల్లో దింపగా ఆ తర్వాత ఆమెని తీసుకెళ్లడానికి ఎవరూ ముందుకు రాలేదు. దీంతో మహిళ ఆ రోజు పడిన వేదన చూసినప్పటి నుంచి ఈ ఫ్రీ రైడ్ ప్రారంభమైందని అంటున్నాడు. అసలే కర్ఫ్యూ, అది కాకుండా పెరిగిన పెట్రోల్ ధరలతో ఆటో పై వచ్చే సంపాదన ఎంత. కానీ లాభాపేక్ష లేకుండా కేవలం మానవత్వంతో ఈ ఆటోడ్రైవర్ చేస్తోన్న సహాయానికి స్థానికులే కాదు నెటిజన్ల నుంచి కూడా ప్రశంసలు అందుతున్నాయి. ( చదవండి: రూ.22 లక్షల కారు అమ్మేశాడు: ఎందుకో తెలిస్తే దండం పెడతారు! ) Jharkhand: An auto driver in Ranchi offers free ride to people who need to go to hospitals, amid #COVID19 pandemic. Ravi, the driver says, "Doing this since 15th April when I dopped a woman at RIMS after everyone else refused. My number's on social media so people can contact me" pic.twitter.com/HkL49rzUni — ANI (@ANI) April 23, 2021 -
చంద్రుడి పైకి ‘ఫ్రీ’గా తీసుకెళతాడు
చంద్రుడిపైకి వెళ్లాలని ఎవరికి మాత్రం ఉండదు! మనం శాస్త్రవేత్తలం కాదు కాబట్టి వెళ్లలేము. శాస్త్రం తో సంబంధం లేని సామాన్యులు కూడా చంద్రుడిపైకి వెళ్లబోతున్నారట కదా..అంటే వాళ్లేమో బాగా డబ్బున్న వాళ్లు. ఇక చంద్రుడిపైకి ఎలా వెళ్లగలం? సరిగ్గా మనలాంటి వారి కోసమే వచ్చింది ‘డీయర్మూన్’ అనే బంఫర్ ఆఫర్. ‘డబ్బు గురించి ఆలోచించకండీ. కాణీ ఖర్చు లేకుండా చంద్రుడి పైకి తీసుకెళతాను’ అంటున్నాడు జపనీస్ కుబేరుడు యుసకు మజవా. స్పేస్ఎక్స్ ఫ్లైట్ 2023 (ఫస్ట్ సివిలియన్ ట్రిప్) లో ఎనిమిది మందిని ఉచితంగా చంద్రుడి పైకి తీసుకెళతానని ప్రకటించాడు యుసకు. మొదట్లో ఆర్టిస్ట్‌లను మాత్రమే తీసుకెళదామని అనుకున్నాడు. ‘ప్రతివ్యక్తిలో ఒక ఆర్టిస్ట్ ఉంటాడు’ అనే ఆలోచన వచ్చిన తరువాత ‘ఆర్టిస్ట్‌లకు మాత్రమే’ అనే నిబంధనను మార్చాడు. ‘ప్రపంవ్యాప్తంగా ఎవరైనా ఈ ఫ్రీ ట్రిప్‌కు అప్లై చేసుకోవచ్చు’ అని ట్విట్టర్లో ప్రకటించాడు ఫ్యాషన్ మొగల్ యుసకు. ఈ వీడియోలో అప్లికేషన్ వివరాలకు సంబంధించిన లింక్‌ను షేర్ చేశాడు. ఎంపిక ప్రక్రియకు సంబంధించిన మరిన్ని వివరాలను మార్చి15 తరువాత తెలియజేస్తారట. ‘ఈ ట్రిప్‌ను ఫన్ ట్రిప్‌గా మార్చుదాం’ అంటున్నాడు యుసకు. ఆ ఎనిమిదిమంది అదృష్టవంతులు ఎవరో వేచి చూద్దాం. -
నిరుపేదలకు ఉచిత ప్రయాణం
నేటి రోజులతో పోల్చుకుంటే ఒకనాడు పడిన కష్టమే నయం అనిపిస్తుంది. ఈ రోజు ఎలా గడుస్తుందా అని ఆపన్నుల కోసం దిక్కులు చూసే జీవులే ఎన్నో. ఇక అత్యవసర పరిస్థితి వస్తే.. ఆరోగ్యం సహకరించకపోతే.. ఆసుపత్రికి వెళ్లాలన్నా కష్టమే. కావల్సిన సరుకులు తీసుకొని ఇంటికి తిరిగి రావాలన్నా సరైన రవాణా సదుపాయం లేక యాతనపడే వారెందరో. ఇలాంటి సమయంలో పేదలకు ఉచితంగా ఆటో సదుపాయం అందిస్తోంది ముంబయ్‌లోని ఓ మహిళా డ్రైవర్. ఆమె పేరు శీతల్. తన కుటుంబ పోషణకు శీతల్ కొన్నేళ్లుగా ఆటో నడుపుతోంది. కరోనా వైరస్ కారణంగా దేశమంతా లాక్డౌన్ కొనసాగుతోంది. అత్యవసర పరిస్థితుల్లో ఇళ్ల నుంచి బయటకు వచ్చిన నిరుపేదలను తన ఆటోలో ఉచితంగా తీసుకెళుతోంది. తిరిగి వారిని వారున్న చోటుకు చేర్చుతోంది. ‘నా కుటుంబ పోషణకు ఆటోను నడిపేదాన్ని. ఇప్పుడు పేదప్రజల ఇబ్బందిని చూసి, వారికి ఇలా సేవ చేయాలనుకున్నాను. వారిని వారి గమ్యాలకు చేర్చడం, అవసరాలు తీరే మార్గం చూపడం నాకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది’ అంటుంది శీతల్. ఈ కష్ట సమయంలో శీతల్ లాంటి వ్యక్తులు తమ సేవాగుణంతో గొప్పవారిగా నిలుస్తున్నారు. -
‘లిఫ్ట్ ప్లీజ్’ అని నగరాలను చుట్టొచ్చాడు!
సాక్షి, హైదరాబాద్: ఆ యువకుడు ‘లిఫ్ట్ ప్లీజ్’ అంటూ హైదరాబాద్ నుంచి బయలుదేరి ఏకంగా దేశంలోని ప్రధాన నగరాలను చుట్టి వచ్చేశాడు. డబ్బుల అవసరం లేకుండానే రెండు దఫాల్లో సుమారు 12 వేల కి.మీ. మేర పర్యటించి చరిత్ర సృష్టించాడు నగరానికి చెందిన గ్రాఫిక్ డిజైనర్ వంగవేటి కరుణాకర్. 29 రోజుల పాటు సాగిన తన సుదీర్ఘ పర్యటనలో మహోన్నతమైన భారతీయ ఆత్మను సమున్నతంగా ఆవిష్కరించాడు. వైవిధ్యభరితమైన సంస్కృతులు, జీవన విధానాలు ఎన్నెన్ని ఉన్నా అంతిమంగా భారతీయులంతా ఒక్కటేనని నిరూపించాడు. దేశంలో ఎక్కడికి వెళ్లినా అతిథిలా ఆదరించి అక్కున చేర్చుకుంటారని నిరూపించాడు. ట్రావెలింగ్‌పై మక్కువతో ప్రపంచమంతా పర్యటించాలనే చిన్నప్పటి తన కలను సాకారం చేసుకునే తొలి అడుగు పడిందంటున్నాడు కరుణాకర్. ఆయన ఫ్రీ ట్రావెలింగ్ ఎలా సాగింది.. తనకు ఎదురైన అనుభవాలేమిటి? తదితర అంశాలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం. అలా మొదలైంది.. ‘లిఫ్ట్ ప్లీజ్’ అంటే ఏ వాహనదారైనా ఐదారు కి.మీ వరకు తీసుకెళ్తాడు. కానీ ఊళ్లకు ఊళ్లు.. రాష్ట్రాలు దాటించడం సాధ్యం కాదు. దేశ సరిహద్దుల వరకు వెళ్లలేం కదా. అటు నేపాల్‌లోని ఖాట్మండూ. ఇటు పాక్ సమీపంలోని అనూబ్‌ఘర్ వరకు కేవలం ఇతరుల సహాయంతో చేరుకోలేం కదా. కానీ అలాంటి సాహసోపేతమైన పర్యటనే చేశాడు కరుణాకర్. ఏ మాత్రం పరిచయం లేని వ్యక్తుల సహాయంతో రోడ్డు మార్గంలో రకరకాల వాహనాలపై వెళ్లాడు. అలా వెళ్లే క్రమంలో కేవలం ఒక్క కి.మీ. తీసుకెళ్లినవారూ ఉన్నారు. 500 కి.మీ. వరకు దాటించినవారూ ఉన్నారు. నగరంలోని కృష్ణానగర్‌లో ఉన్న తన ఇంటి నుంచి ఓ బైక్ లిఫ్ట్ తీసుకొని బయలుదేరితే దారిలో ట్రక్కు, లారీ, కారు, సైకిల్, ఒంటెబండి.. ఇలా ఏ వాహనంలో చోటు లభిస్తే ఆ వాహనంలో వెళ్లాడు కరుణాకర్. సాహసమే ఊపిరిగా.. ప్రయాణం అంటేనే డబ్బులతో ముడిపడిన విషయం. అవి లేకుండా ప్రయాణం చేయడం సాహసమే. ‘మొదట మా ఊరికి వెళ్లాను. మాములుగా అయితే ఖమ్మం సమీపంలోని మా ఊరికి హైదరాబాద్ నుంచి 6 గంటల సమయం పడుతుంది. లిఫ్ట్ తీసుకొని వెళ్లడంతో 9 గంటలు పట్టింది. కానీ తిరుగు ప్రయాణంలో 5 గంటల్లోనే చేరుకున్నాను. ఈ అనుభవం నాకు గొప్ప దైర్యాన్ని ఇచ్చింది. ఆ స్ఫూర్తితోనే పర్యటన మొదలైంది అని చెబుతున్నాడు కరుణాకర్. అక్టోబర్‌లో 15 రోజుల పాటు రాజస్థాన్ ప్రయాణం చేశాడు. ఈ ప్రయాణంలో చుట్టూ పొలాల మధ్యలో ఉన్న ఓ ఇంట్లో, ఓ పంజాబీ ఫ్యామిలీ ఆతిథ్యం స్వీకరించడం గొప్ప అనుభూతిగా మిగిలింది. అహ్మదాబాద్‌కు, ఉదయపూర్ మధ్యలో రాత్రి 2గంటల సమయంలో ప్రయాణం చేయాల్సివచ్చినప్పుడు ఓ ఆర్టీఓ అధికారి లిఫ్ట్ ఇచ్చాడు. ఈ ట్రిప్‌లో కార్లు, బైక్‌లు, ట్రక్కులు, ట్రాక్టర్లు, ఒంటెల బండ్లు, సైకిల్, బస్సు, అన్ని రకాల వాహనాల్లో వెళ్లాడు. రెండు దఫాలుగా.. కరుణాకర్ భారత యాత్ర రెండు దఫాలుగా సాగింది. మొదట హైదరాబాద్– రాజస్థాన్ వరకు వెళ్లి వచ్చాడు. 15 రోజుల్లో మొత్తం3,500 కి.మీ చుట్టొచ్చాడు. ముంబై, జోధ్‌పూర్, ఉదయ్‌పూర్, బికనీర్, అనూబ్‌ఘర్, శ్రీగంగానగర్, జైపూర్ మీదుగా తిరిగి హైదరాబాద్ చేరుకున్నాడు. -
జయమ్మ కోసం ఆటోడ్రైవర్ సేవ
చెన్నై: గడిచిన 17 రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తమిళనాడు సీఎం జయలలిత ఆరోగ్యం బాగుపడాలని అభిమానులు పెద్ద ఎత్తున పూజలు నిర్వహిస్తున్నారు. 'అమ్మ' పథకాలతో లబ్దిపొందిన ఇంకొందరు ఆమె పేరున తోచిన రీతిలో సేవాకార్యక్రమాలు చేస్తున్నారు. చెన్నైకి చెందిన ఆటోడ్రైవర్ సుగుమార్.. జయ అపోలోలో చేరననాటి నుంచి ఆ ఆసుపత్రి ప్రాంగణంలోనే కనిపిస్తున్నాడు. చికిత్స అనంతరం అపోలో ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యేవారిని సుగుమార్ తన ఆటోలో వారు కోరుకున్న చోట దిగబెడుతున్నాడు. 17 రోజులుగా అతను ఇదే పనిలో ఉన్నాడు. 'అమ్మ తొందరగా కోలుకోవాలన్నదే నా ప్రార్థన.. ఆసుపత్రి నుంచి వెళ్లేవారిని ఆటోలో ఉచితంగా దింపడం ద్వారా నాకు తోచిన సేవ చేస్తున్నా. ఆ పుణ్యమంతా అమ్మకే దక్కాలి. అమ్మ బాగుండాలి' అని సుగుమార్ అంటున్నాడు. -
అపోలో ఆసుపత్రికి ఉబర్‌లో ఉచిత ప్రయాణం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: క్యాబ్ అగ్రిగేటర్ ఉబర్.. వైద్య సేవల రంగంలో ఉన్న అపోలో హాస్పిటల్స్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. దీనిలో భాగంగా అపోలో ఆసుపత్రికి వైద్యం కోసం వెళ్లే వారికి ఉచిత రైడ్స్‌ను అందించనుంది. హైదరాబాద్, వైజాగ్తోసహా 11 నగరాల్లో ఉబర్ కొత్త యూజర్లకు ఈ సేవలు అందుబాటులో ఉంటాయి. ఆరోగ్య పరీక్షల కోసం పేరు నమోదు చేసుకున్న వారికి రాను, పోను ఒక్కొక్కటి రూ.250 విలువ గల రెండు ప్రోమో కోడ్స్‌ను అపోలో హాస్పిటల్స్ ఇస్తుంది. ఉబర్ పాత కస్టమర్లకు పలు వైద్య పరీక్షలపై అపోలో డిస్కౌంట్ ఆఫర్ చేస్తుంది.