
చంద్రుడిపైకి వెళ్లాలని ఎవరికి మాత్రం ఉండదు! మనం శాస్త్రవేత్తలం కాదు కాబట్టి వెళ్లలేము. శాస్త్రం తో సంబంధం లేని సామాన్యులు కూడా చంద్రుడిపైకి వెళ్లబోతున్నారట కదా..అంటే వాళ్లేమో బాగా డబ్బున్న వాళ్లు. ఇక చంద్రుడిపైకి ఎలా వెళ్లగలం? సరిగ్గా మనలాంటి వారి కోసమే వచ్చింది ‘డీయర్‌మూన్’ అనే బంఫర్ ఆఫర్. ‘డబ్బు గురించి ఆలోచించకండీ. కాణీ ఖర్చు లేకుండా చంద్రుడి పైకి తీసుకెళతాను’ అంటున్నాడు జపనీస్ కుబేరుడు యుసకు మజవా. స్పేస్‌ఎక్స్ ఫ్లైట్ 2023 (ఫస్ట్ సివిలియన్ ట్రిప్) లో ఎనిమిది మందిని ఉచితంగా చంద్రుడి పైకి తీసుకెళతానని ప్రకటించాడు యుసకు. మొదట్లో ఆర్టిస్ట్‌లను మాత్రమే తీసుకెళదామని అనుకున్నాడు.
‘ప్రతివ్యక్తిలో ఒక ఆర్టిస్ట్ ఉంటాడు’ అనే ఆలోచన వచ్చిన తరువాత ‘ఆర్టిస్ట్‌లకు మాత్రమే’ అనే నిబంధనను మార్చాడు. ‘ప్రపంవ్యాప్తంగా ఎవరైనా ఈ ఫ్రీ ట్రిప్‌కు అప్లై చేసుకోవచ్చు’ అని ట్విట్టర్‌లో ప్రకటించాడు ఫ్యాషన్ మొగల్ యుసకు. ఈ వీడియోలో అప్లికేషన్ వివరాలకు సంబంధించిన లింక్‌ను షేర్ చేశాడు. ఎంపిక ప్రక్రియకు సంబంధించిన మరిన్ని వివరాలను మార్చి15 తరువాత తెలియజేస్తారట. ‘ఈ ట్రిప్‌ను ఫన్ ట్రిప్‌గా మార్చుదాం’ అంటున్నాడు యుసకు. ఆ ఎనిమిదిమంది అదృష్టవంతులు ఎవరో వేచి చూద్దాం.
Comments
Please login to add a commentAdd a comment