అపోలో ఆసుపత్రికి ఉబర్‌లో ఉచిత ప్రయాణం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: క్యాబ్ అగ్రిగేటర్ ఉబర్.. వైద్య సేవల రంగంలో ఉన్న అపోలో హాస్పిటల్స్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. దీనిలో భాగంగా అపోలో ఆసుపత్రికి వైద్యం కోసం వెళ్లే వారికి ఉచిత రైడ్స్‌ను అందించనుంది. హైదరాబాద్, వైజాగ్‌తోసహా 11 నగరాల్లో ఉబర్ కొత్త యూజర్లకు ఈ సేవలు అందుబాటులో ఉంటాయి. ఆరోగ్య పరీక్షల కోసం పేరు నమోదు చేసుకున్న వారికి రాను, పోను ఒక్కొక్కటి రూ.250 విలువ గల రెండు ప్రోమో కోడ్స్‌ను అపోలో హాస్పిటల్స్ ఇస్తుంది. ఉబర్ పాత కస్టమర్లకు పలు వైద్య పరీక్షలపై అపోలో డిస్కౌంట్ ఆఫర్ చేస్తుంది.