
లతా మంగేష్కర్ తన మధురమైన గాత్రంతో కోట్లాది మంది ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించుకుంది. పైగా ఆమెకు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది అభిమానులు ఉన్నారు. ఆమె ఆసుపత్రిలో చేరిన రోజు నుంచే అభిమానులు ఆమెకు అన్ని విధాలుగా మద్దతునిస్తున్నారు. ఈ నేపథ్యంలో ముంబైకి చెందిన ఆటో డ్రైవర్.. లతా మంగేష్కర్ చికిత్స కోసం తన సంపాదనను దానం చేశాడు.
ఈ మేరకు లతా మంగేష్కర్ గత 10 రోజులుగా ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స పోందుతున్న సంగతి తెలిసిందే. ముంబైలో నివసించే సత్యవాన్ గీతే లతా మంగేష్కర్‌కి పెద్ద అభిమాని. అంతేకాదు లతామంగేష్కర్‌ను అతను సరస్వతి దేవి రూపంగా కూడా భావిస్తాడు. పైగా అతను తన ఆటోను లతామంగేష్కర్ చిత్రాలతో అలంకరించాడు. ఈ మేరకు సత్యవాన్ లతా మంగేష్కర్ ఆసుపత్రిలో చేరారనే వార్త తెలుసుకున్నప్పటి నుంచి నిరంతరం ప్రార్థనలు చేస్తున్నాని చెప్పాడు.
(చదవండి: 'ప్రైవసీ ఇవ్వండి.. దీదీ ఇంకా ఐసీయూలోనే')
Comments
Please login to add a commentAdd a comment