Mohanlal: వందల కోట్ల స్టార్‌ హీరోకి దారుణ పరిస్థితి! | Mohanlal Latest Film Alone Disappointed At Box Office | Sakshi

Mohanlal: వందల కోట్ల స్టార్‌ హీరోకి దారుణ పరిస్థితి!

Feb 1 2023 3:21 PM | Updated on Feb 1 2023 3:24 PM

Mohanlal Latest Film Alone Disappointed At Box Office - Sakshi

మాలీవుడ్‌ స్టార్‌ హీరోల్లో మోహన్‌లాల్‌ ఒకరు. ఆరు పదుల వయస్సులో కూడా కుర్ర హీరోలు సైతం షాక్ అయ్యేలా బ్యాక్‌ టు బ్యాక్‌ సినిమాలు చేస్తున్నాడు. అక్కడ లాల్‌ నటించిన చిత్రాలను టాలీవుడ్‌లో రీమేక్‌ చేస్తున్నాం. అయితే ఇదంత కాయిన్‌కి ఒకవైపే. మరోవైపు మాలీవుడ్‌లో మోహన్‌లాల్‌ పరిస్థితి దారుణంగా ఉంది. ఒకప్పుడు లాల్‌ సినిమా అంటే వంద కోట్ల కలెక్షన్స్‌.. కాని ఇప్పుడు కనీసం కోటి రూపాయల కలెక్షన్స్‌ కూడా దాటడం లేదు. 

రెండేళ్ల క్రితం వరకు మోహన్‌లాల్‌ మాలీవుడ్‌ బాక్సాఫీస్‌ను శాసిస్తూ వచ్చాడు. పులి మురుగన్‌ సినిమాతో మాలీవుడ్‌కు రూ.100 కోట్లు, లూసీఫర్‌ తో రూ.150 కోట్ల వసూళ్లను చూపించాడు. అయితే కరోనా తర్వాత మోహన్‌లాల్‌కు కష్టాలు ప్రారంభమయ్యాయి. ఈ స్టార్ హీరో గతేడాది మాన్‌స్టర్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా.. ఆశించిన స్థాయిలో ఆడలేకపోయింది.

ఇక ఈ ఏడాది రిపబ్లిక్ డే సందర్భంగా విడుదల చేసిన అలోన్‌ (Alone) సినిమాకు  అయితే తొలి రోజే గెటివ్‌ టాక్‌ రావడం అభిమానులను షాక్‌కు గురిచేసింది. అసలు ఇలాంటి కథను మోహన్‌లాల్ లాంటి స్టార్ హీరో ఎలా అంగీకరించారంటూ కొంత మంది విమర్శకులు కామెంట్‌ చేశారు. ఫలితంగా ఈ చిత్రం తొలి రోజు వసూళ్లు రూ.40 లక్షలు కూడా దాటలేదు. దీంతో లాల్‌ ఫ్యూచర్‌పై మాలీవుడ్‌లో టెన్షన్‌ మొదలైంది. కానీ ఈ బిగ్‌స్టార్‌ త్వరలోనే స్ట్రాంగ్‌ కమ్‌బ్యాక్‌ ఇస్తాడని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మోహన్‌లాల్‌ చేతిలో లూసీఫర్‌ 2, దృశ్యం3 చిత్రాలు ఉన్నాయి. అలాగే రజనీకాంత్‌ హీరోగా నటిస్తున్న జైలర్‌ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement