ఇక ఎలోన్ కాదు | Bipasha Basu and Karan Singh Grovers Wedding | Sakshi
Sakshi News home page

ఇక ఎలోన్ కాదు

Published Sun, May 1 2016 11:12 PM | Last Updated on Sun, Sep 3 2017 11:12 PM

ఇక ఎలోన్ కాదు

ఇక ఎలోన్ కాదు

 శుభముహూర్తంలో చేసే పనులన్నీ శుభంగా జరుగుతాయంటారు. బహుశా బిపాసా బసు, కరణ్ సింగ్ గ్రోవర్ ‘ఎలోన్’ చిత్రంలో నటించడానికి అంగీకరించిన ముహూర్తం బాగుండి ఉంటుంది. ఎందుకంటే ఇక ఎప్పటికీ వాళ్లు ఎలోన్ కాదు. జాన్ అబ్రహాంతో సహజీవనం చేసి, విడిపోయాక బిపాసా ఒంటరి జీవితం గడిపారు. మొదటి భార్య శ్రద్ధా నిగమ్ నుంచి విడిపోయి, జెన్నిఫర్ వింగెట్‌ను పెళ్లి చేసుకుని, ఆమె నుంచి విడాకులు తీసుకుని కరణ్ కూడా ఎలోన్‌గా మిగిలిపోయారు. ఈ ఒంటరితనమే బిపాసా, కరణ్‌లను దగ్గర చేసి ఉంటుంది. త్వరగానే ప్రేమలో పడ్డారు. అంతే త్వరగా విడిపోతారని చాలామంది ఊహించారు.
 
  కానీ, తమ బంధం చాలా గట్టిదని నిరూపిస్తూ ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. ముంబైలో వివాహ వేడుకను కుటుంబ సభ్యులు, ఆప్తుల సమక్షంలో జరుపుకున్న ఈ జంట రిసెప్షన్‌కి మాత్రం అందర్నీ  ఆహ్వానించారు. ఈ వేడుకలో అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యా రాయ్, సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్, సంజయ్ దత్, సుస్మితాసేన్, శిల్పాశెట్టి, ఆమె భర్త రాజ్‌కుంద్రా, జెనీలియా, ఆమె భర్త రితేష్, మాధవన్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు. అన్నట్లు.. బిపాసా బసు తెలుగులో ‘టక్కరి దొంగ’ చిత్రంలో నటించిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement