హర్యానాలో అసెంబ్లీ ఎన్నికలపై ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ మద్దతు లేకుండా హర్యానాలో ప్రభుత్వం ఏర్పాటు కాదని అన్నారు.
శుక్రవారం జగధ్రిలో పార్టీ అభ్యర్ధి ఆదర్శ్‌పాల్ గుజ్జర్‌కు మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆప్ అధినేత.. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ మెరుగైన ఫలితాలు సాధిస్తుందని తెలిపారు.. బీజేపీ ప్రజలకు చేసిందేమీ లేదని మండిపడ్డారు. కాషాయ పాలకులు అవినీతి, నిరుద్యోగం, ద్రవ్యోల్బణాన్ని ప్రజలకు అందించడం మినహా ప్రజల మేలు కోసం చేసిందేమీ లేదని విమర్శలు గుప్పించారు, . ఈసారి రాష్ట్ర ప్రజలు మార్పు కోరుతున్నారని అన్నారు.
‘హర్యానాలో ఏ ప్రభుత్వం కొలువుతీరినా ఆప్ మద్దతుతోనే సాధ్యమవుతుంది. ఆప్ మంచి స్థాయిలో స్ధానాలను చేజిక్కించుకుంటుంది. తమ పార్టీ తోడ్పాటు లేకుండా ప్రభుత్వ ఏర్పాటు సాధ్యం కాని పరిస్ధితి నెలకొంటుంది’ అని రోడ్‌షోలో పార్టీ మద్దతుదారులను ఉద్ధేశించి పేర్కొన్నారు.
‘కేజ్రీవాల్ నిజాయితీ లేని వ్యక్తి అని ప్రజలు అనుకుంటే, నాకు ఓటు వేయకండి. నీ నేను మీరు వారు నమ్మితే, అప్పుడు మాత్రమే నాకు ఓటు వేయండి., ఢిల్లీ ప్రజలు నన్ను తిరిగి ఎన్నుకున్న తర్వాతే తిరిగి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుంటాను. నేను అనుకుంటే సీఎం సీటులో ఉండిపోగలను. కానీ నేను రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నాను. ఇక ప్రజలే నిర్ణయించుకుంటారు. ఏ నాయకుడూ ఈ స్థాయి ధైర్యాన్ని ప్రదర్శించలేదని నేను భావిస్తున్నాను’ అని కేజ్రీవాల్ తెలిపారు.
చదవండి: జమ్ముకశ్మీర్‌లో బస్సు బోల్తా.. ముగ్గురు బీఎస్‌ఎజవాన్ల మృతి
ఇదిలా ఉండగా 90 మంది సభ్యుల హర్యానా అసెంబ్లీకి అక్టోబర్ 5న ఎన్నికలు జరగనుండగా, అక్టోబర్ 8న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. హర్యానాలో ఈసారి బీజేపీ, కాంగ్రెస్ మధ్య గట్టి పోటీ నెలకొంది. వీటిటోపాటు , ఆప్, జననాయక్ జనతా పార్టీ, ఆజాద్ సమాజ్ పార్టీ (కాన్షీరామ్), ఇండియన్ నేషనల్ లోక్ దళ్, బహుజన్ సమాజ్ పార్టీ కూడా బరిలోకి దిగుతున్నాయి. ఇక గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 40 సీట్లతో ఏకైక పెద్ద పార్టీగా అవతరించగా, కాంగ్రెస్ 31, జేజేపీ 10 స్థానాల్లో విజయం సాధించాయి.
అసెంబ్లీ ఎన్నికల్లో ముందుగా కాంగ్రెస్, ఆప్ పొత్తుతో బరిలోకి దిగాలని భావించిన సంగతి తెలిసిందే. అయితే సీట్ల పంపకాల విషయంలో ఏకాభిప్రాయం కుదరకపోవడంతో.. వేర్వేరుగానే ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి. ఈ క్రమంలో కేజ్రీవాల్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
Comments
Please login to add a commentAdd a comment