
జులానా నుంచి వినేశ్
బాద్లీ నుంచి పునియా?
సాక్షి, న్యూఢిల్లీ: ఒలింపిక్ క్రీడాకారిణి, మల్లయోధురాలు వినేశ్ ఫొగాట్ రాజకీయ రంగప్రవేశం దాదాపు ఖాయమైంది. కాంగ్రెస్ తరఫున హరియాణా శాసనసభ ఎన్నికల్లో జులానా స్థానం నుంచి ఆమె పోటీచేసే అవకాశముందని కాంగ్రెస్‌లోని విశ్వసనీయ వర్గాలు బుధవారం వెల్లడించాయి. మరో ప్రముఖ మల్లయోధుడు భజరంగ్ పునియా సైతం బాద్లీ స్థానం నుంచి పోటీచేసే అవకాశముంది.
ఈ ఇద్దరు రెజ్లర్‌లు బుధవారం కాంగ్రెస్ నేత రాహుల్‌గాం«దీతో భేటీ అయ్యారు. దీంతో హస్తం పారీ్టలో వీరిద్దరి చేరిక ఖాయమైందని వార్తలొచ్చాయి. రాహుల్‌తో వినేశ్, పునియాలు దిగిన ఫోటోను కాంగ్రెస్ తన అధికారిక ఖాతా ’ఎక్స్’లో పోస్ట్ చేసిన అనంతరం వీరి పోటీ అంశం ప్రాధాన్యత సంతరించుకుంది. వీరిద్దరి అభ్యరి్థత్వాన్ని గురు లేదా శుక్రవారం జరగబోయే కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో ఖరారుచేస్తారని తెలుస్తోంది. వీరిద్దరి పోటీపై గురువారం నాటికి స్పష్టత వస్తుందని హరియాణా రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి దీపక్ బాబరియా మంగళవారం పేర్కొనడం తెల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment