హ్యాండిచ్చిన బీజేపీ.. మీడియా ముందు మాజీ ఎమ్మెల్యే కంటతడి | BJP Haryana MLA Shashi Ranjan Weeps After Being Dropped | Sakshi
Sakshi News home page

హ్యాండిచ్చిన బీజేపీ.. మీడియా ముందు బోరున విలపించిన మాజీ ఎమ్మెల్యే

Published Fri, Sep 6 2024 1:49 PM | Last Updated on Fri, Sep 6 2024 3:09 PM

 BJP Haryana MLA Shashi Ranjan Weeps After Being Dropped

మరో నెల రోజుల్లో హర్యానా అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. దీంతో అన్ని పార్టీలు వేగం పెంచాయి. అభ్యర్థుల ఎంపికపై కసరత్తు ప్రారంభించాయి. ఈ క్రమంలో 90 మంది సభ్యులున్న హర్యానా అసెంబ్లీకి జరిగే ఎన్నికల కోసం 67 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను బీజేపీ ప్రకటించింది.  ఈలిస్ట్‌లో విద్యుత్‌ శాఖ మంత్రి రంజిత్ సింగ్ చౌతాలాతో పాటు తొమ్మిది మంది సిట్టింగ్‌ ఎమ్మెల్యేలను మినహాయించింది.

దీంతో పార్టీ నుంచి ఆశించిన వారికి టికెట్లు దక్కకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు నేతలు.  ఇప్పటికే  బీజేపీ నుంచి టికెట్‌ దక్కకపోవడం రంజిత్‌ సింగ్‌ చౌతాలా గురువారం తన మంత్రి పదవకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.  స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు ఆయన వెల్లడించారు.

తాజాగా పార్టీ అధిష్టానం నుంచి తనకు టికెట్‌ నిరాకరించడంతో మరో బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే శశి రంజన్‌ పర్మార్‌ కంటతడి పెట్టుకున్నారు. అయితే బివానీ జిల్లలోని తోషమ్‌ నియోజకవర్గం నుంచి శశి రంజన్‌ పోటీ చేయాలని భావించారు. కానీ ఆయనకు టికెట్‌ దక్కకపోవడంతో కలత చెంది శుక్రవారం ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ భావోద్వేగానికి లోనయ్యారు.

బీజేపీ ప్రకటించిన జాబితాలో నా పేరు వస్తుందని అనుకున్నాను. పార్టీ నా విలువను చూస్తుందని, నా నియోజకవర్గాన్ని చూస్తుందని అనుకున్నాను. నా పేరు పరిశీలనలో ఉందని నేను ప్రజలకు హామీ ఇచ్చాను. నేను ఇప్పుడు ఏమి చేయాలి? నిస్సహా స్థితిలో ఉన్నాను.’ అంటూ కంటతపడి పెట్టుకున్నాడు. అయితే అతన్ని ఇంటర్వ్యూ చేస్తున్న వ్యక్తి మాజీ ఎమ్మెల్యేను ఓదార్చేందుకు ప్రయత్నించినా ఆయన మాత్రం ఏడుస్తూనే ఉన్నారు.

అయితే పార్టీ కార్యకర్తలకు, తనకు ఓటేసిన ప్రజలకు అండగా ఉండాలని ఇంటర్వ్యూ చేసే వ్యక్తి చెప్పగా..‘నాకే ఎందుకు ఇలా జరుగుతోంది. నన్ను ఎందుకు పార్టీ పట్టించుకోవడం లేదు. చాలా బాధగా ఉంది. ఎందుకు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు’ అంటూ ఏడుస్తూ చెప్పుకొచ్చారు.

కాగా హర్యానాలో అక్టోబర్ 5న ఎన్నికలు జరగనుండగా, అక్టోబర్ 8న ఓట్ల లెక్కింపు జరగనుంది. నామినేషన్లు దాఖలు చేయడానికి చివరి తేదీ సెప్టెంబర్ 12. నామినేషన్ల పరిశీలన సెప్టెంబర్ 13న జరనుంది. సెప్టెంబర్ 16 వరకు నామినేషన్లను ఉపసంహరించుకునే అవకాశం ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement