గంట్యాడ: డైట్‌సెట్‌లో గంట్యాడ మండలం రావివలస విద్యార్థిని స్టేట్ ఫస్ట్ సాధించింది. ఈ ఫలితాలను ఇటీవల ప్రకటించగా, శనివారం విడుదల చేశారు. నూతన ఆంధ్రప్రదేశ్‌లో ఆమె మొదటి స్థానంలో నిలిచింది. రావివలస గ్రామంలోని నిరుపేద కుటుంబానికి చెందిన ఆదినారాయణ, మంగమ్మల ప్రథమ కుమార్తె గంట జ్యోతి డైట్‌సెట్‌లో ఆమె 100కు 86 మార్కులు సాధించి, రాష్ట్ర స్థాయిలో ప్రధమ స్థానంలో నిలిచింది.
ఈమెను తల్లిదండ్రులు, గ్రామ సర్పంచ్ సిరిపురపు రాము, మాజీ సర్పంచ్ గంట అప్పల సత్యంలు అభినందించారు. ఈమె 10వతరగతి వరకు ఎస్వీడీ గంగాధర ప్రైవేటు పాఠశాలలో చదివింది. ఇంటర్మీడియెట్ విజయ నగరం శ్రీనివాస కళాశాలలో చదివింది. మండలానికి వన్నె తెచ్చిన చదువుల సరస్వతిని గజపతినగరం ఎమ్మెల్యే కొండపల్లి అప్పలనాయుడు, వైఎస్‌ఆర్‌సీపీ నాయకుడు కడుబండి శ్రీనువాసరావు, పార్టీ మండల కన్వీనర్ కృష్ణబాబు, ఎంపిపి బి.దేవుడమ్మ, జెడ్పీటీసీ కె.రమేష్‌కుమార్‌లు ఫోన్‌లో అభినందనలు తెలిపారు.
డైట్‌సెట్‌లో రావివలస విద్యార్థిని స్టేట్‌ఫస్ట్
Published Sun, Aug 3 2014 2:54 AM | Last Updated on Fri, Nov 9 2018 4:59 PM
Advertisement
Advertisement