physics
-
కెమిస్ట్రీ పాఠాన్ని ఇలా కూడా బోధిస్తారా? ఆ టీచర్ వేరే లెవల్!
ఉపాధ్యాయుల బోధనా పద్ధతులన్నీ.. విద్యార్థులకు విపులంగా అర్థం కావాడమే ప్రధాన అంశం. అందుకోసం ఒక్కొక్క టీచర్ ఒకో పంథాలో తమ క్లాస్‌ని చెబుతుంటారు. కొందరు టీచర్లు చెప్పే బోధనా పద్ధతి విద్యార్థులకు బోరింగ్ ఫీలింగ్ కలగుకుండా ఆ సబ్జెక్ట్‌పై ఆసక్తిని పెంచేలా ఉంటుంది. అచ్చం అలానే ఓ ఫిజిక్స్ ఉపాధ్యాయుడు విద్యార్థులకు రసాయన శాస్త్రంలోని ఓ కాన్సెప్ట్ క్లియర్‌గా అర్థం కావాలని ఎంతలా కష్టపడ్డాడో చూస్తే.. ఫిదా అవ్వాల్సిందే.ఎలా చెప్పారంటే..ప్రముఖ ఎడ్ టెక్కి చెందిన ఒక ఫిజిక్స్ ఉపాధ్యాయుడు విద్యార్థులకు కెమిస్ట్రీలోని చిరాలటీ కాన్సెప్ట్‌ని బోధిస్తున్నారు. చిరాలటీలో అణువులు ఒక చిరాల్ కేంద్రాన్ని కలిగి ఉంటాయి. అద్దంలో అతిగా ఇంపోజ్ కావు. కాకపోతే రసాయన చర్యలో ఎడమ, కుడిగా కుడి ఎడమ గానూ అద్దంలో కనిపించే చిత్రంలాగా కనిపిస్తుంది. అదే దీని ప్రత్యేకత. ఇది విద్యార్థులకు అర్థమయ్యేలా తన శరీర భంగిమలతో క్లియర్‌గా వివరించారు. చెప్పాలంటే తన బోధనలో యోగాని కూడా మిళితం చేసి చెబుతున్నట్లుగా వివరించారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీన్ని చూసిన నెటిజన్లు ఆ ఉపాధ్యాయుడికి తన వృత్తిపై ఉన్న అభిరుచి, నిబద్ధతలను ప్రశంసిచగా, మరికొందరు ఇంతలా కష్టపడటం ఎందుకు త్రీడీ వస్తువులతో లేదా ఏదైనా ప్లాస్టిక్ వస్తువులను ఉదాహరణగా తీసుకుని చెబితే సరి అని కామెంట్లు చేస్తూ పోస్టులు పెట్టారు.Absolute cinema 🎥 pic.twitter.com/KkhZwOr9dD— Priyanka 🪷 (@Oyepriyankasun) December 14, 2024 (చదవండి: 20 ఏళ్లకే డాక్టర్, 22 ఏళ్లకు ఐఏఎస్ ఆఫీసర్..ఇవాళ ఏకంగా..!) -
భౌతికశాస్త్రంలో ఇద్దరికి నోబెల్ బహుమతి
2024 సంవత్సరానికిగానూ భౌతిక శాస్త్రంలో ఇద్దరికి నోబెల్ బహుమతి లభించింది. జాన్ జోసెఫ్ హాప్ఫీల్డ్, జెఫ్రీ ఎవరెస్ట్ హింటనల్‌కు ఈ పురస్కారం దక్కింది. కృత్రిమ న్యూరల్ నెట్‌వర్క్‌లతో మెషిన్ లెర్నింగ్ ఆవిష్కరణలు చేసినందుకుగానూ వీరిద్దరికి ఈ ఏడాది నోబెల్ ప్రకటిస్తున్నట్లు స్టాక్‌హోమ్‌లోని రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ వెల్లడించింది.కాగా గతేడాది భైతిక శాస్తంలో ఈ పురస్కారం ముగ్గురిని వరించింది. 1901 నుంచి ఇప్పటివరకు మొత్తంగా 117సార్లు భౌతికశాస్త్రంలో నోబెల్ ప్రకటించారు. ఇక సోమవారం మెడిసిన్ విభాగంలో ఇద్దరికి నోబెల్ బహుమతి ప్రకటించిన సంగతి తెలిసిందే. అమెరికాకు చెందిన శాస్త్రవేత్తలు విక్టర్ ఆంబ్రోస్, గ్యారీ రువ్‌కున్‌లకు నోబెల్ బహుమతి దక్కింది. మైక్రోఆర్ఎన్ఏను ఆ ఇద్దరు శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు. స్వీడన్‌కు చెందిన శాస్త్రవేత్త, ఇంజినీర్, వ్యాపారవేత్తగా పేరుగాంచిన ఆల్ఫ్రెడ్ నోబెల్ పేరు మీదుగా ప్రపంచంలో వివిధ రంగాల్లో విశేష సేవలందించినవారికి ఈ అవార్డును ప్రదానం చేస్తారు. 1896లో ఆల్ఫ్రెడ్ నోబెల్ మరణించగా.. 1901 నుంచి ఆయన ట్రస్ట్ ద్వారా ఈ అవార్డులను ఏటా ప్రదానం చేస్తున్నారు. వీటిని ఆల్ఫ్రెడ్ జయంతి సందర్భంగా డిసెంబర్ 10న విజేతలకు బహుమతులు అందజేస్తారు. -
ఒక్క డీల్‌తో దూసుకెళ్లిన ఫిజిక్స్‌వాలా
న్యూఢిల్లీ: ఎడ్టెక్ యూనికార్న్ ఫిజిక్స్‌వాలా తాజాగా రూ.1,753 కోట్ల నిధులను సమీకరించింది. సిరీస్–బి రౌండ్లో హార్న్‌బిల్ క్యాపిటల్, లైట్‌స్పీడ్ వెంచర్ పార్ట్నర్స్, జీఎస్వీ, వెస్ట్‌బ్రిడ్జ్ ఈ మొత్తాన్ని అందించాయి. ఈ డీల్‌తో కంపెనీ విలువ ఏడాదిలో రెండున్నర రెట్లు దూసుకెళ్లి రూ.23,380 కోట్లకు చేరింది.ఇదీ చదవండి: అనిల్ అంబానీకి ఇక అన్నీ మంచి రోజులేనా?పెద్ద సంస్థల వాల్యుయేషన్‌లో గణనీయమైన తగ్గుదల కారణంగా భారతీయ ఎడ్టెక్ రంగంలో పెద్ద ఎత్తున నిధుల కొరత చాలా కాలంగా ఉంది. ‘ఎడ్టెక్ రంగానికి సవాలుగా ఉన్న ప్రస్తుత సమయంలో తాజా ఫండింగ్ రౌండ్ ఆశావాదానికి దారితీసింది. కంపెనీ అభివృద్ధి, దేశం అంతటా విద్యను ప్రజాస్వామ్యం చేయాలనే లక్ష్యంపై ఇప్పటికే ఉన్న, కొత్త పెట్టుబడిదారుల అచంచల విశ్వాసానికి ఇది నిదర్శనం’ అని ఫిజిక్స్‌వాలా తెలిపింది. -
విద్యార్థుల్లారా.. రండి మాతృ దేశానికి సేవ చేయండి.. ఫిజిక్స్ వాలా పిలుపు
అమెరికాలో ఉన్న భారతీయ విద్యార్ధుల్లారా.. మీరెక్కడున్నా దేశానికి తిరిగి వచ్చేయండి. దేశ సేవ చేయండి. దేశ అభివృద్దిలో పాలు పంచుకోండి అంటూ ప్రముఖ ఎడ్యుటెక్ ఫిజిక్స్ వాల వ్యవస్థాపకుడు, సీఈఓ అలఖ్ పాండే పిలుపునిచ్చారు.యూఎస్‌లో చదువుతున్న భారతీయ విద్యార్ధులు దేశ సేవ చేయాలని అలఖ్ పాండే కోరారు. తిరిగి రాలేని వారు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా దేశ పురోగతికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.అలఖ్ పాండే ఇటీవల హార్వర్డ్, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీల్లో ప్రసంగించేందుకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రపంచ ప్రఖ్యాత యూనివర్సిటీ క్యాంపస్‌లలో భారతీయ విద్యార్ధులతో దిగిన ఫోటోల్ని, అనుభవాల్ని సోషల్ మీడియాలో షేర్ చేశారు. అవును, మన దేశంలో చాలా లోపాలు ఉన్నాయి. కానీ ఏ దేశం పరిపూర్ణంగా లేదు. కానీ యువత దేశాన్ని మార్చుకునే అవకాశం ఉందని అన్నారు. View this post on Instagram A post shared by Physics Wallah (PW) (@physicswallah) -
రూ.5 వేల జీతానికి నానా అగచాట్లు.. ఇప్పుడు ఏకంగా...
సాధారణంగా ప్రైవేటు టీచర్లంటే చిన్నచూపు ఉంటుంది. తక్కువ జీతం ఉంటుందని, పెద్దగా సంపాదన ఉండదని భావిస్తారు. కానీ టీచింగ్‌తోనే ఎడ్టెక్ సంస్థలు పెట్టి రూ.కోట్లు సంపాదిస్తున్న వారూ ఉన్నారు. వారిలో దేశంలోనే రిచెస్ట్ టీచర్‌గా నిలిచిన ఓ వ్యక్తి గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.. ప్రస్తుతం భారతదేశంలో అత్యంత సంపన్న ఉపాధ్యాయుడిగా నిలిచారు ఫిజిక్స్‌వాలా ( PhysicsWallah ) వ్యవస్థాపకుడు, సీఈవో అలఖ్ పాండే ( Alakh Pandey ). అయితే దేశంలో రిచెస్ట్ టీచర్ బైజూస్ రవీంద్రన్ అని చాలామంది వాదించవచ్చు. కానీ ఇప్పుడు ఆ టైటిల్ ఆయనది కాదు. ఫోర్బ్స్ ప్రకారం బైజూస్ పతనం తర్వాత, దాని నికర విలువ కూడా రూ. 830 కోట్లకు పడిపోయింది. అంటే రూ. 2000 కోట్ల కంటే ఎక్కువ నెట్‌వర్త్ ఉన్న అలఖ్ పాండేనే దేశంలోనే అత్యంత ధనిక ఉపాధ్యాయుడు. ప్రముఖ ఉపాధ్యాయుడు, ఎంటర్‌ప్రిన్యూర్‌గా పేరొందిన అలఖ్ పాండే సాధారణంగా లైమ్‌లైట్‌కు దూరంగా ఉంటారు. కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల శాఖలో ఈ స్టార్టప్ నమోదై ఆయన వార్షిక వేతనం వెల్లడి కావడంతో వార్తల్లోకి వచ్చారు. భారతీయ టెక్, స్టార్టప్ సంస్థల సమాచారం అందించే ‘Inc42’ నివేదిక ప్రకారం.. అలఖ్ పాండే వేతనం 2022 ఆర్థిక సంవత్సరంలో రూ. 9.6 కోట్లు. దీంట్లో ఆయన రూ.5 కోట్లను తగ్గించుకున్నారు. అయినప్పటికీ 2023 ఆర్థిక సంవత్సరంలో అలఖ్ పాండే వేతనం రూ. 4.57 కోట్లు. ఇంత ఆదాయం ఉన్న అలఖ్ పాండే మొదటి సంపాదన ఎంతో తెలుసా.. కేవలం రూ.5 వేలు. అది కూడా చాలా మంది పిల్లలకు ట్యూషన్లు చెప్పడం ద్వారా వచ్చేది. యాక్టర్ కావాలనుకున్నాడు దేశంలో 101వ యునికార్న్ కంపెనీ ఫిజిక్స్‌వాలాను స్థాపించిన అలఖ్ పాండే ఒక టీచర్‌గానే చాలా మందికి తెలుసు. అయితే యాక్టర్ కావాలన్నది తన కల అని ఎంత మందికి తెలుసు? అలహాబాద్‌లో జన్మించిన అలఖ్ పాండే యాక్టర్ అవ్వాలనే కోరికతో నుక్కడ్ నాటకాల్లో పాల్గొనేవాడు. అయితే ఆర్థిక పరిస్థితులు అనుకూలించకపోవడంతో 8వ తరగతి నుంచే ట్యూషన్లు చెప్పడం ప్రారంభించాడు. అలఖ్ పాండే, ఆయన సోదరి చదువుల కోసం వారి తల్లిదండ్రులు తమ ఇంటిని అమ్మేశారు. అలఖ్ పాండే చాలా చురుకైన విద్యార్థి. 10వ తరగతిలో 91 శాతం, 12వ తరగతిలో 93.5 శాతం మార్కులు వచ్చాయి. కోటి మందికిపైగా సబ్స్క్రైబర్లు ఐఐటీలో చేరాలనుకున్న అలఖ్ పాండే కాన్పూర్‌లోని హార్కోర్ట్ బట్లర్ టెక్నికల్ ఇన్స్టిట్యూట్లో చదువుకున్నాడు. అయితే, కోర్సు మూడవ సంవత్సరం తర్వాత కాలేజీ మానేశాడు. 2017లో యూపీలో ఒక చిన్న గది నుంచి యూట్యూబ్ వీడియోలను రూపొందించడం ప్రారంభించాడు. కోవిడ్ మహమ్మారి సమయంలో అలాఖ్ పాండే వీడియోలు చాలా విజయవంతమయ్యాయి. ఎంతగా అంటే ఓ ఎడ్-టెక్ కంపెనీని ప్రారంభించేంతలా. ఇందులో ఇప్పుడు 500 మందికి పైగా టీచర్లు, 100 మంది టెక్నికల్ సిబ్బంది పనిచేస్తున్నారు. యూట్యూబ్‌లో ఫిజిక్స్‌వాలా చానల్‌కు కోటి మందికిపైగా సబ్స్క్రైబర్లు ఉన్నారు. -
ఎలక్ట్రాన్ల ప్రపంచానికి కొత్త ‘కాంతి పుంజం’
ఫిజిక్స్‌లో ముగ్గురికి నోబెల్ భౌతిక శాస్త్రంలో ఈ ఏడాది ముగ్గురు శాస్త్రవేత్తలకు ప్రతిష్టాత్మక నోబెల్ బహుమతి లభించింది. అమెరికాలోని ఒహాయో స్టేట్ యూనివర్సిటీకి చెందిన పియరీ అగోస్తినీ, జర్మనీలోని మాక్స్‌ప్లాంక్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ క్వాంటమ్ ఆప్టిక్స్, లుడ్వింగ్ మాక్సిమిలియన్ యూనివర్సిటీ ఆఫ్ మ్యూనిచ్కు చెందిన ఫెరెంక్ క్రౌజ్, స్వీడన్‌లోని లుండ్ యూనివర్సిటీకి చెందిన అన్నె ఎల్ హుయిలర్ను ఈ బహుమతి వరించింది. 24 ఫ్రేమ్స్ గురించి మీరు వినే ఉంటారు. సెకనుకు ఇరవై నాలుగు ఫ్రేమ్‌ల చొప్పున రీలు తిరిగితే తెరపై బొమ్మ, ఆట, పాట, మాట అన్నీ సవ్యంగా కనిపిస్తాయి! సినిమాకైతే ఇలా ఓకే కానీ పరమాణువుల్లోని ఎల్రక్టాన్లను చూడాలనుకోండి లేదా వాటి కదలికలను అర్థం చేసుకోవాలనుకోండి. అస్సలు సాధ్యం కాదు! ఈ అసాధ్యాన్నీ సుసాధ్యం చేయడంలో కీలకపాత్ర పోషించారు కాబట్టే పియరీ అగోస్తినీ, ఫెరెంక్ క్రౌజ్, అనే ఎల్ హుయిలర్ చేసిన ప్రయోగాలకు ఈ ఏటి భౌతికశాస్త్ర నోబెల్ బహుమతి లభించింది. ఇంతకీ ఏమిటీ ప్రయోగాలు? వాటి ప్రయోజనాలేమిటి? అట్టోసెకను ఫిజిక్స్ ఒక సెకను కాలంలో కాంతి ఎంత దూరం ప్రయాణిస్తుందో మీకు తెలుసా? మూడు లక్షల కిలోమీటర్లకు పిసరంత తక్కువ. మరి అట్టోసెకను కాలంలో? సెకను.. అర సెకను.. పావు సెకను తెలుసు కానీ ఈ అట్టోసెకను ఏమిటి? 3,711 కోట్ల సంవత్సరాల కాలంలో ఒక సెకను ఎంతో సెకనులో అట్టోసెకను అంతన్నమాట! ఇంకోలా చెప్పాలంటే.. టెన్ టు ద పవర్ ఆఫ్ మైనస్ 18. గందరగోళం లేకుండా ఉండాలని అనుకుంటే.. సూక్ష్మాతి సూక్ష్మమైన కాలావధి అని అనుకుందాం. ఇంత తక్కువ సమయంలోనూ కాంతి 0.3 మైక్రోమీటర్లు లేదా ఒక వైరస్ పొడవు అంత దూరం ప్రయాణించగలదు. ఈ సంవత్సరం భౌతికశాస్త్ర నోబెల్ ప్రైజ్ గ్రహీతలు ఇంత సూక్ష్మస్థాయిలో కాంతి పుంజాలను విడుదల చేయగల టెక్నాలజీని అభివృద్ధి చేయడంలో కీలకపాత్ర పోషించారు. ముందుగా చెప్పుకున్నట్లు ఎల్రక్టాన్ల కదలికలు, కాంతికి, పదార్థానికి మధ్య ఉన్న సంబంధాలను అర్థం చేసుకునేందుకు ఈ అట్టోసెకను ఫిజిక్స్ చాలా ఉపయోగపడుతుంది. అంతేకాదు.. వీరి ప్రయోగాల పుణ్యమా అని అణువులు, పరమాణువుల లోపలి కణాలను మరింత క్షుణ్నంగా అర్థం చేసుకునేందుకు ఆస్కారం ఏర్పడింది. కాంతి పుంజాల విశ్లేషణ 2001లో అమెరికాకు చెందిన పియరీ అగోస్తినీ ఈ అట్టోసెకను కాంతి పుంజాలను ఉత్పత్తి చేయడం మాత్రమే కాకుండా సుమారు 250 అట్టోసెకన్ల కాలం ఉండే కాంతి పుంజాలను విశ్లేషించడంలోనూ విజయం సాధించారు. ఈ కాలంలోనే జర్మనీకి చెందిన ఫెరెంక్ క్రౌజ్ కూడా ఈ అట్టోసెకను కాంతి పుంజాలపై పరిశోధనలు చేస్తూండేవారు. కాకపోతే ఈయన 650 అట్టోసెకన్ల కాలపు కాంతి పుంజాన్ని వేరు చేయడంలో విజయవంతం కావడం గమనార్హం. ఒకప్పుడు అసాధ్యం అని అనుకున్న ప్రాసెస్లను కూడా గమనించడం ఈ ముగ్గురు శాస్త్రవేత్తలు చేసిన ప్రయోగాల వల్ల ఇప్పుడు వీలైంది. ‘‘ఎలక్ట్రాన్ల ప్రపంచానికి ఈ ప్రయోగాలు తలుపులు తెరిచాయి. అట్టోసెకన్ ఫిజిక్స్ ద్వారా ఎల్రక్టాన్లలో జరుగుతున్న కార్యకలాపాలను గమనించడం వీలైంది. ఇకపై ఈ విషయాలను వాడుకోవడం ఎలా? అన్నది మొదలవుతుంది’’ అని నోబెల్ అవార్డు భౌతిక శాస్త్ర కమిటీ అధ్యక్షులు ఎవా ఓల్సన్ వ్యాఖ్యానించడం విశేషం. వ్యాధుల నిర్ధారణలోనూ ఉపయోగకరం ఈ అట్టోసెకను ఫిజిక్స్‌ను ఎల్రక్టానిక్స్‌లో సమర్థంగా ఉపయోగించుకునేందుకు అవకాశముంది. ఎల్రక్టాన్లు ఏ రకమైన పదార్థంతో ఎలా ప్రవర్తిస్తుందో తెలుసుకోగలిగితే.. అతితక్కువ విద్యుత్తును ఉపయోగించుకుని మరింత సమర్థంగా పనిచేయగల ఎల్రక్టానిక్ పరికరాలను తయారు చేయడం వీలవుతుంది. ఎలక్ట్రాన్ల ప్రవాహాన్నే మనం విద్యుత్తు అంటామన్నది తెలిసిందే. వేర్వేరు మూలకాలను గుర్తించేందుకు అట్టోసెకను కాంతి పుంజాలు ఉపయోగపడతాయి కాబట్టి.. భవిష్యత్తులో వ్యాధుల నిర్ధారణకు కూడా వీటిని వాడుకోవడం వీలవుతుంది. – సాక్షి, నేషనల్ డెస్క్ 1987లో శ్రీకారం అట్టోసెకను కాలపు కాంతి పుంజాలతో ఫొటోలు తీస్తే అణువులు, పరమాణువుల్లో జరిగే కార్యకలాపాలేమిటన్నది స్పష్టంగా తెలుస్తాయి. ఈ అట్టోసెకను కాంతి పుంజాల తయారీకి 1987లో స్వీడన్‌కు చెందిన ఎల్ హుయిలర్ శ్రీకారం చుట్టారని చెప్పాలి. అప్పట్లో ఈ శాస్త్రవేత్త జడ వాయువు గుండా పరారుణ కాంతిని ప్రసారం చేసినప్పుడు వేర్వేరు ఛాయలున్న రంగులు బయటకొస్తున్నట్లు గుర్తించారు. ఒక్కో ఛాయ పరారుణ కాంతి జడ వాయువులోని పరామాణువులతో జరిపిన పరస్పర చర్యల ఫలితం. కొన్ని ఎల్రక్టాన్లు ఈ లేజర్ కిరణాల ద్వారా అదనపు శక్తి పొంది దాన్ని విడుదల చేస్తూంటాయి అన్నమాట. ఈ అంశంపై ఎల్ హుయిలర్ తన ప్రయోగాలు కొనసాగించగా ఆ తరువాతి కాలంలో అనేక కీలకమైన ఫలితాలు లభించాయి. సెకను కంటే తక్కువ సమయాన్ని ఇలా సూచిస్తారు సెకనులో వెయ్యో వంతు... ఒక మిల్లీ సెకను మిల్లీ సెకనులో వెయ్యో వంతు.. ఒక మైక్రో సెకను ఒక మైక్రో సెకనులో వెయ్యో వంతు... ఒక నానో సెకను ఒక నానో సెకనులో వెయ్యో వంతు.. ఒక పికో సెకను ఒక పికో సెకనులో వెయ్యో వంతు.. ఒక ఫెమ్టో సెకను (లాసిక్ కంటి శస్త్రచికిత్సల్లో ఈ స్థాయి లేజర్ కిరణాలను వాడతారు) ఒక ఫెమ్టో సెకనులో వెయ్యో వంతు.. ఒక అట్టో సెకను -
Nobel Prize 2023: భౌతిక శాస్త్రంలో ముగ్గురికి నోబెల్ పురస్కారం
స్టాక్‌హోమ్: ఆయా రంగాల్లోని ప్రజ్ఞావంతులకు నోబెల్ పురస్కారాలను అందించడం సంప్రదాయంగా వస్తోంది. ఇదే క్రమంలో 2023 సంవత్సరానికిగాను భౌతిక శాస్త్రంలో అపార ప్రతిభ కనబరిచిన ముగ్గురు శాస్త్రవేత్తలను ఈ నోబెల్ బహుమతి వరించింది. అమెరికాకు చెందిన శాస్త్రవేత్తలు పెర్రీ అగోస్టిని, ఫెరెంక్ క్రౌజ్, ఎల్'హ్యులియర్‌లకు 'ఒక పదార్థంలోని ఎలక్ట్రాన్ డైనమిక్స్'పై చేసిన విస్తృత పరిశోధనలకుగాను వీరిని నోబెల్ బహుమతి వరించింది. BREAKING NEWS The Royal Swedish Academy of Sciences has decided to award the 2023 #NobelPrize in Physics to Pierre Agostini, Ferenc Krausz and Anne L’Huillier “for experimental methods that generate attosecond pulses of light for the study of electron dynamics in matter.” pic.twitter.com/6sPjl1FFzv — The Nobel Prize (@NobelPrize) October 3, 2023 విభిన్న రంగాల్లోని ప్రతిభావంతులకు నోబెల్ అవార్డులను ప్రకటించే ప్రక్రియ సోమవారం ప్రారంభం కాగా మొదట వైద్య రంగంలోని అవార్డు గ్రహీతలను ప్రకటించింది కమిటీ. ఈరోజు భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతికి ఎంపికైన శాస్త్రవేత్తలు పేర్లను ప్రకటించారు. కాగా ఈ ఏడాది ముగ్గురు శాస్త్రవేత్తలకు సంయుక్తంగా ఈ అవార్డును ప్రకటించడం విశేషం. వీరు ఒక పదార్ధంలోని ఎలక్ట్రాన్ డైనమిక్స్‌లను అధ్యయనం చేసేందుకు అట్టోసెకెండ్ పల్సెస్ డెవలప్మెంట్పై చేసిన ప్రయోగాలకుగాను ఈ అత్యున్నత పురస్కారానికి ఎంపికైనట్లు రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ప్రకటించింది. 2023 physics laureate Pierre Agostini succeeded in producing and investigating a series of consecutive light pulses, in which each pulse lasted just 250 attoseconds. At the same time, his 2023 co-laureate Ferenc Krausz was working with another type of experiment, one that made it… pic.twitter.com/pEFAM0ErNP — The Nobel Prize (@NobelPrize) October 3, 2023 వీరిలో ఎల్'హ్యులియర్ భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి సాధించిన ఐదవ మహిళగా ఘనత సాధించారు. 1903లో మేరీ క్యురీ, 1963లో మరియా గొప్పెర్ట్-మేయర్, 2018లో డొన్నా స్ట్రిక్లాండ్, 2020లో ఘెజ్ భౌతిక శాస్త్రంలో నోబెల్ పురస్కారాలను సాధించగా 2023 సంవత్సరానికి గాను హ్యులియర్ ఈ పురస్కారాన్ని సాధించి చరిత్రలో చోటు సంపాదించారు. Electrons’ movements in atoms and molecules are so rapid that they are measured in attoseconds. An attosecond is to one second as one second is to the age of the universe.#NobelPrize pic.twitter.com/5Bg9iSX5eM — The Nobel Prize (@NobelPrize) October 3, 2023 This year’s #NobelPrize laureate in physics Anne L’Huillier discovered that many different overtones of light arose when she transmitted infrared laser light through a noble gas. Each overtone is a light wave with a given number of cycles for each cycle in the laser light. They… pic.twitter.com/bJWD4kiE5Z — The Nobel Prize (@NobelPrize) October 3, 2023 నోబెల్ బహుమతుల విజేతలను ప్రకటించే క్రమంలో ఇప్పటికే వైద్య, భౌతిక రంగంలోని అవార్డు గ్రహీతలను ప్రకటించిన కమిటీ బుధవారం రసాయన శాస్త్రం, గురువారం సాహిత్యం, శుక్రవారం నోబెల్ శాంతి రంగాల్లో బహుమతుల విజేతలను ప్రకటించనుంది. చివరిగా ఈ నెల 9న అర్థశాస్త్రంలో విజేతను ప్రకటించనుంది జ్యురీ. నోబెల్ విజేతలకు డిసెంబర్ 10న బహుమతులను ప్రదానం చేస్తారు. గత ఏడాది నోబెల్ గ్రహీతలకు 10 మిలియన్ల స్వీడిష్ క్రోనర్లు అందజేశారు. ఈసారి ఆ బహుమతిని మరింత పెంచుతూ 11 మిలియన్ల క్రోనర్లు ఇవ్వనున్నారు. ఇది కూడా చదవండి: పాక్‌లో జోరుగా కిడ్నీల దోపిడీ.. 328 సర్జరీలు..? -
నోబెల్ 2022: ఫిజిక్స్‌లో ముగ్గురికి ప్రైజ్
స్టాక్‌హోమ్: భౌతిక శాస్త్రంలో 2022 ఏడాదికిగానూ నోబెల్ బహుమతిని ప్రకటించారు. మంగళవారం మధ్యాహ్నం స్టాక్‌హోమ్‌లోని రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ కమిటీ ఈ ప్రకటన చేసింది. భౌతిక శాస్త్ర మేధావులు అలెయిన్ ఆస్పెక్ట్, జాన్ ఎఫ్. క్లౌజర్, ఆంటోన్ జెయిలింగర్‌లకు సంయుక్తంగా ఈసారి ప్రైజ్ దక్కింది. చిక్కుబడ్డ ఫోటాన్లు, బెల్ అసమానతలను ఉల్లంఘించడం, క్వాంటం ఇన్ఫర్మేషన్ సైన్స్‌కు మార్గదర్శకత్వం వహించడం లాంటి పరిశోధలకుగానూ ఈ ముగ్గురికి ఈసారి నోబెల్ పురస్కారం దక్కింది. వీళ్ల ప్రయోగాత్మక సాధనాల అభివృద్ధి ‘క్వాంటం టెక్నాలజీ’ కొత్త శకానికి పునాది వేసిందని రాయల్ స్వీడిష్ అకాడమీ ప్రకటన సమయంలో పేర్కొంది. ఫ్రాన్స్‌కు చెందిన భౌతిక శాస్త్రవేత్త అలెయిన్ ఆస్పెక్ట్ కాగా.. జాన్ ఎఫ్. క్లౌజర్ అమెరికాకు చెందిన భౌతిక శాస్త్రవేత్త. ఇక ఆంటోన్ జెయిలింగర్ ఆస్ట్రియాకు చెందిన క్వాంటం భౌతిక శాస్త్రవేత్త. BREAKING NEWS: The Royal Swedish Academy of Sciences has decided to award the 2022 #NobelPrize in Physics to Alain Aspect, John F. Clauser and Anton Zeilinger. pic.twitter.com/RI4CJv6JhZ — The Nobel Prize (@NobelPrize) October 4, 2022 చిక్కుకుపోయిన క్వాంటం స్థితులను ఉపయోగించి సంచలనాత్మక ప్రయోగాలను నిర్వహించారు ఈ ముగ్గురు. ఇక్కడ రెండు కణాలు విడిపోయినప్పుడు కూడా ఒకే యూనిట్‌గా ప్రవర్తిస్తాయి. ఈ ముగ్గురి సాధన ఫలితాలు.. క్వాంటం సమాచారం ఆధారంగా కొత్త సాంకేతికతకు మార్గం క్లియర్ చేశాయి అని నోబెల్ కమిటీ ప్రకటించింది. ► కిందటి ఏడాది కూడా ఫిజిక్స్‌లో ముగ్గురికే సంయుక్తంగా అవార్డు దక్కిన విషయం తెలిసిందే. ► 1901 నుంచి ఇప్పటిదాకా భౌతిక శాస్త్రంలో 115 బహుమతులను ఇచ్చారు. ఇందులో నలుగురు గ్రహీతలు మాత్రమే మహిళలు. మేడమ్ క్యూరీ(1903), మారియా జియోప్పెర్ట్ మయర్(1963), డొన్నా స్ట్రిక్‌ల్యాండ్(2018), ఆండ్రియా గెజ్(2020) ఈ లిస్ట్‌లో ఉన్నారు. ► ఇక ఫిజిక్స్‌లో చిన్నవయసులో నోబెల్ ఘనత అందుకుంది లారెన్స్ బ్రాగ్. కేవలం పాతికేళ్ల వయసుకే ఇతను 1915లో ఫిజిక్స్ నోబెల్ అందుకున్నాడు. -
ఫామ్‌లోనే లేడు.. పాఠ్య పుస్తకాల్లోకి మాత్రం ఎక్కాడు
పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం ప్రస్తుత తరంలో టాప్ క్రికెటర్లలో ఒకడిగా కొనసాగుతున్నాడు. అయితే కొంతకాలంగా బాబర్ ఆజం నిరాశజనక ప్రదర్శన కొనసాగిస్తున్నాడు. ఇటీవలే ముగిసిన ఆసియా కప్‌లో కెప్టెన్ హోదాలో జట్టును ఫైనల్ చేర్చినప్పటికి.. బ్యాటింగ్‌లో ఘోర ప్రదర్శన చేశాడు. ఒక్క హాఫ్ సెంచరీ కూడా నమోదు చేయని బాబర్ ఆజం.. ఆరు మ్యాచ్‌లు కలిపి 68 పరుగులు మాత్రమే చేశాడు. ఆరు ఇన్నింగ్స్‌ల్లో వరుసగా 10,9 14, 0,30, 5 పరుగులు ఉన్నాయి. ఇందులో ఒక గోల్డెన్ డక్ ఉండడం విశేషం. అయితే ఆట ఎలా ఉన్నా బాబర్ ఆజం షాట్స్ మంచి టెక్నిక్‌తో కూడుకొని ఉంటాయి. ముఖ్యంగా బాబర్ ఆజం కవర్ డ్రైవ్ షాట్ చూడముచ్చటగా ఉంటుంది. అందుకే అతని కవర్‌డ్రైవ్ షాట్ క్రికెట్‌కు మాత్రమే పరిమితం కాలేదు. తాజాగా తన దేశంలోని పాఠ్య పుస్తకాల్లో బాబర్ ఆజం పేరు దర్శనమిచ్చింది. అవునండీ.. వినడానికి వింతగా ఉన్నా ఇది నిజం. బాబర్ ఆజం కవర్ డ్రైవ్ గురించి 9వ తరగతి ఫిజిక్స్ సిలబస్‌లో ఒక ప్రశ్న తయారు చేశారు. దీనికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ''బాబర్ ఆజం తన బ్యాట్ ద్వారా బంతికి 150 జౌల్స్తో కైనటిక్ ఎనర్జీ అందించడం ద్వారా కవర్ డ్రైవ్‌ను కొట్టాడు. (ఎ) బంతి ద్రవ్యరాశి 120 గ్రా అయితే బంతి ఏ వేగంతో బౌండరీకి వెళుతుంది? (బి) 450గ్రా ద్రవ్యరాశి కలిగిన ఫుట్‌బాల్‌ను ఈ వేగంతో తరలించడానికి ఫుట్‌బాల్ క్రీడాకారుడు ఎంత కైనటిక్ ఎనర్జీ అందించాలి?" అంటూ ఒక ప్రశ్న వచ్చింది. దీనిపై అభిమానులు మాత్రం కాస్త భిన్నంగా స్పందించారు. ''ఫామ్‌లోనే లేడు.. అయినా పాఠ్య పుస్తకాల్లోకి ఎక్కాడు.. దీనికి అతను అర్హుడేనా'' అంటూ కామెంట్ చేశారు. Babar Azam's cover drive related question in 9th grade physics syllabus (federal board) (via Reddit) pic.twitter.com/I2Tc9HldsG — Shiraz Hassan (@ShirazHassan) September 13, 2022 చదవండి: స్మృతి మందాన మెరుపులు.. ఇంగ్లండ్‌పై ఘన విజయం -
సాహో... ప్రొఫెసర్ శాంతమ్మ!
‘‘కుదిరితే పరిగెత్తు..లేకపోతే నడువు..అదీ చేతకాకపోతే పాకుతూ పో..అంతేకాని ఒకేచోట అలా కదలకుండా ఉండిపోకు’’..అంటూ మహాకవి శ్రీశ్రీ చెప్పిన మాటలను ఆమె అక్షరాలా అమలు చేస్తున్నారు. 93 ఏళ్ల వయసులోనూ మొక్కవోని దీక్షతో రోజూ రానూపోనూ 140 కిలోమీటర్లు ప్రయాణం చేస్తూ విద్యార్థులకు ఫిజిక్స్ పాఠాలు చెబుతున్నారు. కాలం ఎంతో విలువైనదని..దానిని ఎప్పుడూ, ఎవరూ వృథా చేయకూడదని చెబుతున్న ఆమె పేరు ప్రొఫెసర్ చిలుకూరి శాంతమ్మ. పంచే కొద్దీ జ్ఞానం పెరుగుతుందని నమ్మే శాంతమ్మ గురించి తెలుసుకోవాలని ప్రయత్నించగా విజయనగరం జిల్లా సెంచూరియన్ యూనివర్శిటీలో రెండు ఊత కర్రల సాయంతో నడుస్తూ... విద్యార్థులకు భౌతిక శాస్త్ర పాఠాలు బోధిస్తూ కనిపించారామె. వయసు మీదపడిందనే సంకోచం ఏమాత్రం ఆమెలో కనిపించలేదు. ఈ వయసులోనూ సంపూర్ణ ఆరోగ్యంతో అధ్యాపకురాలిగా సేవలందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్న శాంతమ్మ తన జీవన ప్రయాణం గురించి ‘సాక్షిప్రతినిధి’కి చెప్పిన వివరాలు ఆమె మాటల్లోనే.. ‘‘మా స్వస్థలం కృష్ణాజిల్లా మచిలీపట్నం..1929 మార్చి 8న జన్మించాను. నా తండ్రి సీతారామయ్య, న్యాయ వ్యవస్థలో పనిచేసేవారు. నేను ఐదు నెలల పసికందుగా ఉన్నప్పుడే ఆయన మా నుంచి దూరమయ్యారు. మా అమ్మ వనజాక్షమ్మ మాత్రం 104 ఏళ్లు జీవించారు. రాజమండ్రి, మదనపల్లి ప్రాంతాల్లో నా పాఠశాల విద్యాభ్యాసం గడిచింది. విశాఖపట్నం మద్రాసు రాష్ట్రంలో ఉన్నప్పుడు ఏవీఎన్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదివాను. అప్పుడే మహారాజా విక్రమ్ దేవ్ వర్మ నుండి భౌతికశాస్త్రంలో బంగారు పతకాన్ని అందుకున్నాను. ఫిజిక్స్ అంటే అంత ఇష్టం. అందులోనే బీఎస్సీ ఆనర్స్ చేశాను. ఆంధ్రా యూనివర్సిటీ నుండి మైక్రోవేవ్ స్పెక్ట్రోస్కోపీలో పీహెచ్‌డీకి సమానమైన డీఎస్సీ పూర్తి చేసి, ఆ తర్వాత 1956లో ఆంధ్రా యూనివర్సిటీలోని కాలేజ్ ఆఫ్ సైన్స్‌లో ఫిజిక్స్ లెక్చరర్‌గా చేరాను. లెక్చరర్ నుండి ప్రొఫెసర్, ఇన్వెస్టిగేటర్, రీడర్ వరకూ అనేక బాధ్యతలు నిర్వర్తించాను. ఇవన్నీ చేసే సరికి తెలియకుండానే 60 ఏళ్ల వచ్చేశాయి. 1989లో తప్పనిసరై పదవీ విరమణ చేశాను. విద్యార్థులకు ఇంకా పాఠాలు చెప్పాలనిపించింది. మళ్లీ ఆంధ్రా యూనివర్సిటీలో గౌరవ అధ్యాపకురాలిగా చేరాను. అక్కడే ఆరేళ్లు గడిచిపోయింది. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్, యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్, డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వంటి వివిధ కేంద్ర ప్రభుత్వ విభాగాలలో పరిశోధనాత్మక ఇన్‌ఛార్జ్‌గా కూడా పనిచేశాను. పాఠాలు భోదిస్తూ... వృత్తిలో భాగంగా చాలా దేశాలు వెళ్లొచ్చాను. యూఎస్, బ్రిటన్, కెనడా, స్పెయిన్‌తో సహా అనేక దేశాల్లో జరిగిన సమావేశాలకు హాజరయ్యాను. అటామిక్ స్పెక్ట్రోస్కోపీ, మాలిక్యులర్ స్పెక్ట్రోస్కోపీకి సంబంధించిన అంశాలపై చేసిన విశ్లేషణ 2016లో వెటరన్ సైంటిస్ట్స్ క్లాస్‌లో అనేక అవార్డులతో పాటు బంగారు పతకాన్ని సాధించిపెట్టింది. 12 మంది విద్యార్థులు నా పర్యవేక్షణలో పీహెచ్డీ పూర్తి చేశారు. నా భర్త చిలుకూరి సుబ్రహ్మణ్య శాస్త్రి కొన్నేళ్ల క్రితం చనిపోయారు. మూడేళ్లు ఆయన మంచంపైనే ఉన్నారు. అంతకు ముందు వరకూ రోజూ నన్ను ఎక్కడికైనా ఆయనే తీసుకువెళ్లేవారు. ఆయన తెలుగు ప్రొఫెసర్ కావడంతో నాకు ఉపనిషత్తుల గురించి బోధించేవారు. ఆయన వల్లనేమో పురాణాలు, వేదాలు, ఉపనిషత్తులపై కూడా ఆసక్తి ఏర్పడింది. భగవద్గీత శ్లోకాలను ఆంగ్లంలోకి అనువాదం చేసి ‘భగవద్గీత ది డివైన్ డైరెక్టివ్‘ అనే పుస్తకాన్ని రచించే వరకూ వెళ్లింది. వయసుతో వచ్చే సమస్యలు నన్నేమీ చేయలేకపోయాయి. రెండు మోచిప్పలకూ శస్త్ర చికిత్స జరిగి ఇరవై ఏళ్లయ్యింది. అయినా ఇప్పటికీ నడుస్తూనే ఉన్నాను. చనిపోయేవరకూ చదువు చెప్పాలనేది నా సంకల్పం. నేను క్లాస్ తీసుకుంటే విద్యార్థులెవరూ మిస్ అవ్వరు. అలాగే క్లాస్‌కి ఆలస్యంగా వెళ్లడం నా డిక్షనరీలో లేదు. సెలవు రోజుల్లోనూ ప్రత్యేక క్లాసులకు వస్తుంటాను. ఎందుకంటే యూనివర్శిటీలోని విద్యార్థులే నా పిల్లలు. పొద్దున్న 4 గంటలకే నిద్ర లేస్తాను. విశాఖపట్నంలో బయలుదేరి విజయనగరం చేరుకుంటాను. ఇక్కడి సెంచూరియన్ యూనివర్శిటీలో రోజుకు కనీసం ఆరు క్లాసులు తీసుకుంటాను. చిత్రమేమిటంటే ఆంధ్రా యూనివర్శిటీ మాజీ వీసీ, ఇప్పుడు సెంచూరియన్ యూనివర్శిటీ వీసీ ప్రొఫెసర్ జీఎస్ఎన్ రాజు నా దగ్గరే చదువుకున్నారు. ప్రపంచంలోనే పెద్ద వయసు ప్రొఫెసర్‌ను నేనేనట. గిన్నిస్‌బుక్ వాళ్లకు నా పేరును సూచిస్తానని నా శిష్యుడు రాజు ఈ మధ్యనే అన్నారు. మాది ఆరెస్సెస్ నేపథ్యం ఉన్న కుటుంబం... డబ్బు, ఆస్తిపాస్తులపై మమకారం లేదు. మా వారు ఇంటిని కూడా వివేకానంద మెడికల్ ట్రస్ట్‌కు విరాళంగా ఇచ్చేద్దామంటే సరే అన్నారు. ఇప్పుడు అద్దె ఇంటిలో ఉంటున్నాను. మావారికి ఆరోగ్యం బాగోలేనప్పడు ఒక అబ్బాయి నాకు తోడుగా ఉండేవాడు. అతనిని చదివించి, పెళ్లి చేశాను. అతనికి ముగ్గురు పిల్లలు.. అతనితోపాటు అతని భార్య, పిల్లలు కలిపి ఇంట్లో మొత్తం ఆరుగురం. అందరం అదే అద్దె ఇంటిలో జీవిస్తున్నాం’’. – బోణం గణేష్, సాక్షి, అమరావతి. ఫొటోలు: డి.సత్యనారాయణమూర్తి, విజయనగరం. -
భౌతిక శాస్త్ర విభాగంలో నోబెల్ బహుమతి విజేతలు వీరే..!
వాషింగ్టన్: మెడిసిన్ విభాగంలో 2021 గాను డాక్టర్ డేవిడ్ జూలియస్, డా. అరర్డెం పటాపౌషియన్‌లకు ఉమ్మడిగా నోబెల్ బహుమతిని రాయల్ స్వీడిష్ అకాడమీ ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ ఏడాది గాను భౌతిక శాస్త్ర విభాగంలో చేసిన కృషికిగాను సైకురో మనాబే, క్లాస్ హస్సెల్మాన్, జార్జియో పారిసిలకు సంయుక్తంగా నోబెల్ బహుమతి వరించింది. చదవండి: నోబెల్ : నూట ఇరవై ఏళ్లలో నలుగురు అమెరికాలోని ప్రిన్స్టన్ విశ్వవిద్యాలయంలో సైకూరే మనాబే సీనియర్ వాతావరణ శాస్త్రవేత్తగా పనిచేస్తున్నారు. వాతావరణంలో పెరిగిన కార్బన్ డయాక్సైడ్ స్థాయిలు భూఉపరితలంపై ఉష్ణోగ్రతల పెరుగుదలకు ఎలా దారితీస్తాయనే విషయంపై చేసిన పరిశోధనకుగాను నోబెల్ బహుమతి వరించింది. జర్మనీలోని మాక్స్ ప్లాంక్ ఇనిస్టిట్యూట్ ఫర్ మెటరాలజీ యూనివర్సీటిలో ప్రొఫెసర్ క్లాస్ హస్సెల్మాన్ పనిచేస్తున్నారు. వెదర్ అండ్ క్లైమెట్‌కు సంబంధించిన మోడల్‌ను రూపొందించినందుకుగాను నోబెల్ బహుమతి లభించింది. రోమ్‌లోని సపియెంజా యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ జియోర్జియో పారిసికి, అస్తవ్యస్తమైన సంక్లిష్ట పదార్థాలలో దాచిన నమూనాలను కనుగొన్నందుకు నోబెల్ బహుమతి వరించింది. సంక్లిష్ట వ్యవస్థల సిద్ధాంతానికి అతని ఆవిష్కరణలు చాలా ముఖ్యమైనవి. BREAKING NEWS: The Royal Swedish Academy of Sciences has decided to award the 2021 #NobelPrize in Physics to Syukuro Manabe, Klaus Hasselmann and Giorgio Parisi “for groundbreaking contributions to our understanding of complex physical systems.” pic.twitter.com/At6ZeLmwa5 — The Nobel Prize (@NobelPrize) October 5, 2021 చదవండి: వైద్యరంగంలో ఇద్దరికి పురస్కారం -
మార్పులు లేవు! తెలంగాణ విద్యామండలి కీలక నిర్ణయం..
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్‌లో చేరాలంటే మ్యాథ్స్, ఫిజిక్స్ సబ్జెక్టులు తప్పనిసరిగా చదివి ఉండాల్సిన అవసరం లేదన్న అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) మార్గదర్శకాలను 2021–22 విద్యా సంవత్సరంలో అమలు చేయబోమని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి స్పష్టం చేసింది. కరోనా నేపథ్యంలో విద్యార్థులపై ఒత్తిడికి గురిచేసే ఎలాంటి మార్పులను, సంస్కరణలను అమలు చేయబోమని చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి తెలిపారు. ఏఐసీటీఈ దాదాపు 15 రకాల సబ్జెక్టులను పేర్కొందని, రాష్ట్రంలో ఇంటర్మీడియట్లో ఐదారు రకాల బ్రాంచీలే (గ్రూపులు) ఉన్నాయని, వాటిల్లో ఏఐసీటీఈ పేర్కొన్న సబ్జెక్టులు పెద్దగా లేవని పేర్కొన్నారు. మంగళవారం తనను కలసిన మీడియాతో పాపిరెడ్డి మాట్లాడారు. ప్రస్తుతం రాష్ట్ర ఇంటర్మీడియట్లో ఇంజనీరింగ్ కోసం మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీతో కూడిన ఎంపీసీ బ్రాంచీ ఉందని, మెడికల్, అగ్రికల్చర్ కోర్సుల కోసం బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులతో కూడిన బైపీసీ బ్రాంచీ ఉందని వివరించారు. ఏఐసీటీఈ ఇటీవల జారీ చేసిన కాలేజీల అనుమతుల మార్గదర్శకాల్లో.. 2021–22 విద్యా సంవత్సరంలో విద్యార్థులు బీఈ/ బీటెక్‌లో చేరాలంటే ఇంటర్మీడియట్లో ఫిజిక్స్/ మ్యాథమెటిక్స్/ కెమిస్ట్రీ/ కంప్యూటర్ సైన్స్/ ఎలక్ట్రానిక్స్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ బయాలజీ/ ఇన్ఫర్మాటిక్స్ ప్రాక్టీసెస్/ బయోటెక్నాలజీ/ టెక్నికల్ వొకేషనల్ సబ్జెక్టు/ ఆర్కిటెక్చర్/ ఇంజనీరింగ్ గ్రాఫిక్స్/ బిజినెస్ స్టడీస్/ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సబ్జెక్టుల్లో ఏవేనీ మూడు సబ్జెక్టులను చదివి ఉంటే చాలని పేర్కొందని వెల్లడించారు. వారు నాలుగేళ్ల ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కోర్సుల్లో చేరేందుకు అర్హులేనని తెలిపిందని, మన రాష్ట్రంలో ఇంటర్మీడియట్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ వంటి సబ్జెక్టులే ప్రధానంగా ఉన్నాయని, మిగతా సబ్జెక్టులేవీ లేవని వివరించారు. సబ్జెక్టు అర్హతల విషయంలో సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు/ యూనివర్సిటీలు తీసుకునే నిర్ణయ మే ఫైనల్ అని ఏఐసీటీఈ పేర్కొన్న నేపథ్యంలో తాము ఈసారి వాటిని అమలు చేయబోమని వివరించారు. ఎంసెట్ ర్యాం కుల ఖరారులో ఇంటర్మీడియట్ మార్కులకు 25 శాతం వెయిటేజీ ఉందని, ఈ పరిస్థితుల్లో మార్పులు చేస్తే విద్యార్థుల్లో గందరగోళం నెలకొంటుందని వివరించారు. పైగా ఇప్పటికే ఎంసెట్ పరీక్ష తేదీలను ప్రకటించామని పేర్కొన్నారు. ఈసారి ఎంసెట్‌లో ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో 100 శాతం సిలబస్, ద్వితీయ సంవత్సరంలో 70 శాతం సిలబస్‌నే ప్రామాణికంగా తీసుకొని ఎంసెట్‌ను నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. భవిష్యత్తులో ఏఐసీటీఈ మార్గదర్శకాలను అమలు చేయాల నుకుంటే నిపుణులతో కమిటీ ఏర్పాటు చేసి, ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామన్నారు. 20 నుంచి ఎంసెట్ దరఖాస్తులు ఎంసెట్–2021 నోటిఫికేషన్‌ను ఈనెల 18న జారీచేసేందుకు సెట్ కమిటీ ఏర్పాట్లు చేస్తోంది. ఈనెల 20 నుంచి ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కానుంది. మే నెల 18 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనుంది. ఆలస్య రుసుముతో జూన్ 28 వరకు దరఖాస్తులు స్వీకరించనుంది. ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా ఈనెల 20 నుంచి మే 18 వరకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు మే 19 నుంచి 27 వరకు దరఖాస్తుల్లో పొరపాట్లను సవరించుకునే అవకాశం కల్పించనుంది. ఇక జూలై 5 నుంచి ఎంసెట్ పరీక్షలు ఆన్లైన్లో నిర్వహించనుంది. జూలై 5, 6 తేదీల్లో అగ్రికల్చర్, మెడికల్ స్ట్రీమ్ పరీక్షలు, జూలై 7, 8, 9 తేదీల్లో ఇంజనీరింగ్ స్ట్రీమ్ ఎంసెట్‌ను నిర్వహించనుంది. ప్రతిరోజూ రెండు విడతల్లో ఈ పరీక్షలను నిర్వహించనుంది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు తొలి విడత, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రెండో విడత పరీక్షలను ఆన్లైన్లో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని 23 టెస్ట్ జోన్ల పరిధిలోని 58 పట్టణాల్లో పరీక్షలను నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తోంది. -
మ్యాథ్స్, ఫిజిక్స్ లేకున్నా.. ఇంజనీరింగ్
సాక్షి, హైదరాబాద్: బీఈ/బీటెక్ ప్రవేశాలకు విద్యార్థులకు ఉండాల్సిన అర్హతల విషయంలో అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) కీలక నిర్ణయం తీసుకుంది. 2021-22 విద్యా సంవత్సరంలో ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కోర్సుల్లో చేరే విద్యార్థులు ఇంటర్మీడియట్లో కచ్చితంగా మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ సబ్జెక్టులను చదివి ఉండాలన్న నిబంధనను తొలగించింది. వాటిని ఆప్షనల్‌గానే పేర్కొంది. నిర్దేశిత అర్హతల్లో ఏవైనా మూడు సబ్జెక్టులు చదివి ఉంటే చాలని వెల్లడించింది. వాటితో పాటు ప్రవేశాల కోసం జాతీయ స్థాయిలో లేదా రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వాలు నిర్వహించే ప్రవేశ పరీక్షల్లో ర్యాంకు సాధించి ఉండాలని, ఆ ర్యాంకుల ఆధారంగా ప్రవేశాలు ఉంటాయని పేర్కొంది. అయితే ఈ అర్హతల విషయంలో సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు/యూనివర్సిటీలు తీసుకునే నిర్ణయమే ఫైనల్ అని స్పష్టం చేసింది. గతేడాది ఆ సబ్జెక్టులు తప్పనిసరి.. 2020–21 విద్యా సంవత్సరం ప్రవేశాల కోసం గతేడాది ఫిబ్రవరిలో జారీ చేసిన ఏఐసీటీఈ అప్రూవల్ ప్రాసెస్ హ్యాండ్‌బుక్ (రివైజ్డ్) 2020–21లో బీఈ/ బీటెక్/ బీఆర్క్/ బీప్లానింగ్ వంటి యూజీ కోర్సుల్లో ప్రవేశాలకు ఉండాల్సిన అర్హతలను వెల్లడించింది. ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ వంటి సబ్జెక్టులను విద్యార్థులు తప్పనిసరి సబ్జెక్టులుగా చదివి ఉండాలని స్పష్టం చేసింది. వాటితో పాటు మరొక సబ్జెక్టు ఉండాలని పేర్కొంది. అందులో కెమిస్ట్రీ/ బయోటెక్నాలజీ/ బయాలజీ/ టెక్నికల్ వొకేషనల్ సబ్జెక్టు/ కంప్యూటర్ సైన్స్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ ఇన్ఫర్మాటిక్స్ ప్రాక్టీసెస్/ అగ్రికల్చర్/ ఇంజనీరింగ్ గ్రాఫిక్స్/ బిజినెస్ స్టడీస్ వంటి సబ్జెక్టులో ఏదో ఒకటి ఉంటే చాలని పేర్కొంది. అంటే బీఈ/బీటెక్/బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్/ బ్యాచిలర్ ప్లానింగ్ కోర్సుల్లో చేరాలంటే ఆయా విద్యార్థులు ఇంటర్మీడియట్లో (12వ తరగతి) మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ సబ్జెక్టులను తప్పనిసరి సబ్జెక్టులుగా చదివి ఉండాలని పేర్కొంది. అయితే తాజాగా మ్యాథ్స్, ఫిజిక్స్ సబ్జెక్టుల విషయంలో తప్పనిసరి అన్న నిబంధనను తొలగించింది. 2021–22 విద్యా సంవత్సరంలో విద్యార్థులు బీఈ/ బీటెక్‌లో చేరాలంటే ఇంటర్మీడియట్లో ఫిజిక్స్/ మ్యాథమెటిక్స్/ కెమిస్ట్రీ/ కంప్యూటర్ సైన్స్/ ఎలక్ట్రానిక్స్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ బయాలజీ/ ఇన్ఫర్మాటిక్స్ ప్రాక్టీసెస్/ బయోటెక్నాలజీ/ టెక్నికల్ వొకేషనల్ సబ్జెక్టు/ ఆర్కిటెక్చర్/ ఇంజనీరింగ్ గ్రాఫిక్స్/ బిజినెస్ స్టడీస్/ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సబ్జెక్టుల్లో ఏవైనా మూడు సబ్జెక్టులు చదివి ఉంటే నాలుగేళ్ల ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కోర్సుల్లో చేరేందుకు అర్హులుగా పేర్కొంది. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం మన దగ్గర ఎంపీసీ విద్యార్థులే ఇంజనీరింగ్‌లో చేరుతారు. ఏఐసీటీఈ పేర్కొన్న పలు కాంబినేషన్ల సబ్జెక్టులు మన దగ్గర ఇంటర్మీడియట్లో లేవు. పైగా ఎంసెట్ ర్యాంకుల ఖరారులో ఇంటర్మీడియట్ మార్కులకు 25 శాతం వెయిటేజీ కూడా ఉంది. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. - పాపిరెడ్డి, చైర్మన్, ఉన్నత విద్యామండలి అన్ని కోణాల్లో పరిశీలిస్తాం నిర్దేశిత సబ్జెక్టుల్లో ఏవైనా మూడు చదివి ఉంటే చాలని పేర్కొన్న ఏఐసీటీఈ నిబంధనను పరిశీలిస్తాం. ఈసారి సాధ్యం అవుతుందా లేదా అన్న దానిపై సబ్జెక్టు నిపుణులతో, యూనివర్సిటీ బోర్డ్ ఆఫ్ స్టడీస్ విభాగం నిపుణులతో చర్చిస్తాం. అన్ని కోణాల్లో పరిశీలించి నిర్ణయం తీసుకుంటాం. అయితే అర్హతల విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు/యూనివర్సిటీలు/ సంబంధిత బోర్డు తీసుకునే నిర్ణయమే ఫైనల్ అని చెప్పినందున ఈ విషయాన్ని ఉన్నత విద్యా మండలితో చర్చిస్తాం. మండలి సూచనల మేరకు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. - ప్రొఫెసర్ గోవర్ధన్, ఎంసెట్ కన్వీనర్ -
నోబెల్ : నూట ఇరవై ఏళ్లలో నలుగురు
ఎలా కనిపెడతారు వీళ్లు?! ఇంటిపని చేస్తూనే రేడియో ధార్మికతల్ని పిల్లల్ని ఆడిస్తూనే పరమాణు స్వభావాల్ని వండి పెడుతూనే కాంతి ఉష్ణ కిరణాల్ని నిద్ర చాలకనే మార్మిక కృష్ణ బిలాల్ని! ఎక్కడిది వీళ్లకింత శక్తి? సూక్ష్మదృష్టి? భౌతిక శాస్త్రమే ఆవహిస్తోందా? పాలపుంతల నుంచి ప్రవహిస్తోందా? శాస్త్రం జీవితాన్ని సులభతరం చేస్తుంది. ఎలా చేస్తుందో అర్థం చేసుకోవడం మాత్రం కష్టమైన విషయం! సెల్‌ఫోన్‌ను చెవి దగ్గర పెట్టుకుని ‘హలో’ అని వేల మైళ్ల దూరంలో ఉన్నవారితో మాట్లాడినంత సులభం కాదు, ఎలా మాట అంతదూరం వెళ్లి, మళ్లీ వస్తుందో అర్థం చేసుకోవడం. అందుకే నిరంతరం శాస్త్రాన్ని అర్థం చేసుకుని, అర్థం చేయించే పనిలో ఉండే శాస్త్రవేత్తలకు.. ముఖ్యంగా ఏ ప్రయోగ అనుకూలతలూ ఉండని మహిళా శాస్త్రవేత్తలకు చేతులు జోడించి నమస్కరించాలి. ఇటు గృహ బంధనాలు, అటు శాస్త్ర శోధనలు! గ్రేట్. అణు ధార్మికత (రేడియో యాక్టివిటీ) పై చేసిన పరిశోధనలకు పొలెండ్ శాస్త్రవేత్త మేరీ క్యూరీకి నోబెల్ బహుమతి రావడం వెనుక కూడా జీవితకాల పరిశోధనలు, ప్రయోగాలు ఉన్నాయి. మరియా గోపర్ట్ మేయర్ (1906–1972) భౌతికశాస్త్రంలో తొలి నోబెల్ గెలుచుకున్న మహిళ ‘మేడమ్’ క్యూరీ. ఆ ‘రేడియో ధార్మికత’ అనే పేరు ఆమె పెట్టిందే! అంతకుముందు కూడా రేడియో ధార్మికత ఉండేది. ఫలానా అని దానికొక గుర్తింపును క్యూరీ ఇచ్చారు. అణుధార్మికత ప్రయోగాల ల్యాబ్‌కు ఆమె తన జీవితాన్నే పణంగా పెట్టారు. ఆ దుష్ప్రభాలతోనే చివరికి ఆమె చనిపోయారని అంటారు! మానవ దేహంలో కణుతులకు జరిగే రేడియం చికిత్స పరిణామాలను వైద్యులు అంచనా వేయగలగడాన్ని సాధ్యం చేయించింది క్యూరీ పరిశోధనా ఫలితాలే. ∙∙ మేరీ క్యూరీ తర్వాత భౌతిక శాస్త్రంలో నోబెల్ ప్రైజ్ పొందిన మహిళ మరియా గోపర్ట్ మేయర్. జర్మనీ శాస్త్రవేత్త. ఆటమిక్ న్యూక్లియస్‌లోని ‘న్యూక్లియర్ షెల్ మోడల్’ను ప్రతిపాదించినందుకు ఆమెకు నోబెల్ లభించింది. ఆటమిక్ న్యూక్లియస్ అంటే పరమాణు కేంద్రకం. అందులోనే ప్రొటాన్లు, న్యూట్రాన్లు ఉంటాయి. ఆ కేంద్రకం శక్తి స్థాయుల నిర్మాణం ఫలానా విధంగా ఉంటుందని మరియా కనిపెట్టారు. సరే, ఎవరికి ప్రయోజనం? అది పూర్తిగా శాస్త్రపరమైన అంశం. అణు స్వభావాలను తెలుసుకోడానికి పనికొచ్చే మేథమెటిక్స్. వైద్యరంగాన్నే తీసుకుంటే.. వ్యాధుల నిర్థారణ, వ్యాధి దశల గుర్తింపు, చికిత్స.. వీటికి అవసరమైన అధ్యయనానికి కూడా పరిశోధకులకు ‘న్యూక్లియర్ షెల్ మోడల్’ ఒక దారి దీపం. ∙∙ భౌతికశాస్త్రంలో నోబెల్ పొందిన మూడో మహిళా శాస్త్రవేత్త డోనా స్ట్రిక్లాండ్. ఆప్టికల్ ఫిజిసిస్ట్. ఎలక్ట్రో మ్యాగ్నటిక్ రేడియేషన్‌పై పరిశోధనలు చేస్తుంటారు. కెనడా ఆమెది. ‘పల్స్డ్ లేజర్స్’ గురించి కొత్త విషయాలు కనిపెట్టినందుకు రెండేళ్ల క్రితం డోనాను నోబెల్ వరించింది. సి.పి.ఎ. (చర్ప్‌డ్ పల్స్ ఆంప్లిఫికేషన్) ను ఆచరణాత్మకంగా ప్రయోగించి అత్యధిక తీవ్రతను కలిగిన, అతి చిన్న కాంతి ఉష్ణ కిరణాలను ఆమె సృష్టించారు. కంటికి చేసే లేజర్ చికిత్సలలో ఇది చక్కగా ఉపకరిస్తోంది. ∙∙ ఆండ్రియా గెజ్ ఈ ఏడాది నోబెల్ పొందిన మహిళా ఖగోళ శాస్త్రవేత్త. ఫిజిక్స్‌లో నాల్గవ మహిళా నోబెల్ విజేత. పాలపుంత మధ్యలో ధూళితో నిండి ఉన్న ‘ధనుర్భాగాన్ని’ (సాజిటేరియస్ –ఎ ) గెజ్ ఆధ్వర్యంలోని బృందం నిశితంగా పరిశీలించి, అక్కడి కాంతిమంతమైన నక్షత్రాల గమ్యాన్ని గుర్తించింది. గెజ్ అంచనా ప్రకారం ఆ ప్రదేశంలో బ్రహ్మరాక్షసి వంటి మార్మిక బిలం ఒకటి ఆ చుట్టుపక్కల నక్షత్రాల కక్ష్యలకు దారి చూపుతోంది! కొన్ని నక్షత్రాలను ఆధాటున మింగేస్తోంది. ఈ విశ్వవైపరీత్యాన్ని గెజ్ శక్తిమంతమైన టెలిస్కోప్‌తో కనిపెట్టారు. గెజ్ పరిశోధన మున్ముందు మనిషి ఈ విశ్వాన్ని మరింత సూక్ష్మంగా శోధించేందుకు, విశ్వ రహస్యాలను ఛేదించేందుకు తోడ్పడుతుంది. పంచుకోవడంలో సంతోషం ఉంటుంది. అయితే అవార్డుల విషయంలో అదేమంత సంతోషాన్నివ్వదు. చిన్న అవార్డు అయినా విడిగా ఒక్కరికే వస్తే ఉండే ప్రత్యేక గుర్తింపు కలివిడిగా వస్తే ఉండదు. భౌతికశాస్త్రంలో నోబెల్ పొందిన ఈ నలుగురు మహిళా శాస్త్రవేత్తలూ మరో ఇద్దరితో అవార్డును పంచుకోవలసి వచ్చినవారే. ఇది కొంచెం నిరుత్సాహం కలిగించే విషయమే అయినా, మానవ జీవితాలకు కలిగే ప్రయోజనాల ఆవిష్కరణల్లో భాగస్వామ్యం కలిగి ఉండటం కూడా శాస్త్రవేత్తగా జన్మ ధన్యం అవడమే. నోబెల్ గెలుపును మించిన సార్థక్యమది. నూట ఇరవై ఏళ్లలో నలుగురు నోబెల్ ప్రైజ్‌లు 1901లో ప్రారంభం అయ్యాక ఇప్పటì వరకు భౌతికశాస్త్రంలో 114 సార్లు నోబెల్‌ని ప్రకటించారు. 215 మంది విజేతలు అయ్యారు. వీరిలో నలుగురంటే నలుగురే మహిళలు. ఒక నోబెల్ ప్రైజ్‌ను ముగ్గురికి మించి పంచరు. ఆ ముగ్గురి మధ్య కూడా కనీసం రెండు వేర్వేరు ఆవిష్కణలకు ప్రైజ్‌ను పంచడం ఉంటుంది. ఈ ఏడాది భౌతిక శాస్త్రంలో ఇద్దరు పురుషులతో కలిసి బ్లాక్‌హోల్స్‌పై చేసిన పరిశోధనలకు ఆండ్రియా గెజ్ నోబెల్‌ను గెలుపొందారు. 1901లో విల్హెల్మ్ రాంట్జెన్ ఎక్స్–రే కనిపెట్టినందుకు భౌతికశాస్త్రంలో తొలి నోబెల్ గెలుచుకున్న రెండేళ్లకే 1903లో మేరీ క్యూరీ రేడియో ధార్మికతకు నోబెల్ సాధించారు. తర్వాత అరవైఏళ్లకు గానీ ఒక మహిళ భౌతిక శాస్త్రంలో నోబెల్‌ను దక్కించుకోలేకపోయారు. 1963లో మరియా గోపర్ట్ మేయర్ న్యూక్లియర్ స్ట్రక్చర్‌కు నోబెల్ పొందారు. 2018లో డోనా స్ట్రిక్లాండ్ లేజర్ పల్సెస్‌కు నోబెల్ సాధించారు. అయితే ఈ నలుగురు మహిళల్లో విడిగా ఏ ఒక్కరికీ నోబెల్ రాలేదు. నలుగురూ మరో ఇద్దరు పురుషులతో నోబెల్‌ను పంచుకున్నవారే. మొత్తం మీద భౌతికశాస్త్రంలో ఏక విజేతగా 47 మంది నోబెల్‌ను గెలుపొందగా.. ఒకరితో కలిసి 32 మంది, ఇద్దరితో కలిసి 34 మంది నోబెల్‌ను పంచుకున్నారు. యుద్ధపరిస్థితుల కారణంగా 1916, 1931, 1934, 1940, 1941, 1942లలో ఆరుసార్లు నోబెల్‌ను ఇవ్వలేదు. -
ఫిజిక్స్ కఠినంగా.. మ్యాథ్స్ మధ్యస్తంగా..
సాక్షి, హైదరాబాద్: ఐఐటీల్లో ప్రవేశాల కోసం దేశవ్యాప్తంగా ఆదివారం నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా 15 కేంద్రాల్లో దాదాపు 15 వేల మంది విద్యార్థులు ఈ పరీక్షకు హాజరయ్యారు. ఇందులో భౌతిక శాస్త్రం ప్రశ్నలు కఠినంగా ఉన్నాయని, సుదీర్ఘ సమాధానాలు కలిగిన ప్రశ్నలు ఎక్కువగా వచ్చాయని విద్యార్థులతో పాటు సబ్జెక్టు నిపుణులు ఉమాశంకర్, ఎంఎన్ రావు వెల్లడించారు. ఇక మ్యాథమెటిక్స్‌లో ఎక్కువ ప్రశ్నలు మధ్యస్తంగా ఉండగా, కొన్ని ప్రశ్నలు మాత్రం కఠినంగా ఉన్నాయని, కెమిస్ట్రీలో మాత్రం సులభమైన ప్రశ్నలు వచ్చినట్లు తెలిపారు. ఉదయం జరిగిన పేపర్–1 పరీక్షలో ఒకే జవాబు కలిగిన ప్రశ్నలు 6, ఒకటి కంటే ఎక్కువ జవాబులు కలిగిన ప్రశ్నలు 6 వచ్చాయని, పూర్ణ సంఖ్య జవాబుగా కలిగిన ప్రశ్నలు మరో 4 ఉన్నట్లు వెల్లడించారు. మధ్యాహ్నం జరిగిన పేపర్–2 పరీక్షలోనూ ప్రశ్నల సరళి అలాగే ఉందన్నారు. పేపర్–1తో పోల్చితే పేపర్–2లో ఫిజిక్స్ ప్రశ్నలు చాలా కఠినంగా ఉన్నట్లు వివరించారు. గతేడాది కంటే ఈసారి జేఈఈ అడ్వాన్స్డ్ చాలా కఠినంగా ఉందని పేర్కొన్నారు. ఓపెన్ కేటగిరీలో కటాఫ్ మార్కులు 35 శాతం, ఓబీసీలో 28–30 శాతం, ఎస్సీ, ఎస్టీల్లో 12–15 శాతం ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. రెండు పేపర్లలో కలిపి 396 మార్కులకు గాను తెలుగు విద్యార్థులకు 360 మార్కులకు పైగా రావచ్చని నిపుణులు చెబుతున్నారు. 5వ తేదీన ఫలితాలు.. జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలను వచ్చే నెల 5న ఐఐటీ ఢిల్లీ విడుదల చేయనుంది. ఆ తర్వాతి రోజు నుంచే (6వ తేదీ) ఐఐటీ, ఎన్ఐటీ, ట్రిపుల్ఐటీ, కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో కొనసాగే విద్యా సంస్థల్లో (జీఎఫ్‌టీఐ) ప్రవేశాల కోసం జాయింట్ సీట్ అలొకేషన్ అథారిటీ (జోసా) ఉమ్మడి కౌన్సెలింగ్‌ను నిర్వహించనుంది. ఇందుకోసం షెడ్యూల్‌ను కూడా జారీ చేసింది. 6వ తేదీ నుంచి మొదటి విడత ప్రవేశాలకు రిజిస్ట్రేషన్లను ప్రారంభించి 16వ తేదీన సీట్లను కేటాయించనుంది. అనంతరం మరో ఐదు దశల కౌన్సెలింగ్ నిర్వహించి, నవంబర్ 7వ తేదీతో సీట్ల కేటాయింపును పూర్తి చేయనుంది. నవంబర్ 9వ తేదీ నాటికి కరోనా పరిస్థితి అదుపులోకి రాకపోతే విద్యార్థులు ఆన్లైన్లోనే రిపోర్టింగ్ చేసేలా చర్యలు చేపట్టింది. మరోవైపు బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్, బ్యాచిలర్ ఆఫ్ ప్లానింగ్‌లో ప్రవేశాల కోసం వచ్చే నెల 8వ తేదీన ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ టెస్టును (ఏఏటీ) నిర్వహించి, 11వ తేదీన వాటి ఫలితాలను ప్రకటించనుంది. -
ఇలాంటి అద్భుతాలు కొందరికే సాధ్యం
-
ఇలాంటి అద్భుతాలు కొందరికే సాధ్యం
కొన్ని అద్భుతాలు కొందరికే సాధ్యమవుతాయని ఈ వీడియో చూస్తే కచ్చితంగా చెప్పేస్తారు. ఎందుకంటే సాధారణంగా గ్లాసులో నీళ్లు నింపి దానితో ఏదైనా ప్రయోగం చేయాలని చూసేలోపే నీళ్లన్ని నేలపాలవ్వడం ఖాయం. కానీ ఒక వ్యక్తి మాత్రం రెండు గ్లాసుల్లో నీరు నింపి దానికి తాడు కట్టి ఇష్టం వచ్చినట్లుగా తిప్పినా ఒక్క చుక్క నీరు కూడా కింద పడకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను ప్రముఖ సైన్స్ అండ్ టెక్నాలజీ సంస్థ 'ఫిజిక్స్ అండ్ ఆస్ట్రానమిజోన్' తమ ట్విటర్లో షేర్ చేసింది. ' ఈ వీడియో భౌతిక శాస్త్రం గొప్పతనాన్ని చూపిస్తోంది.' అంటూ క్యాప్షన్ జత చేశాడు. (వైరల్ వీడియో: ఆ పక్షి పేరేంటో చెప్పండి!) ఇక వీడియో విషయానికి వస్తే మొదట రెండు గ్లాసుల్లో నీళ్లు పోసి వాటికి సమాంతరంగా రెండు తాళ్లను కట్టి పెండ్యులమ్(లోలకం) ఆకారంలో తిప్పడం ప్రారంభించాడు. తరువాత ఒక్కసారిగా స్పీడ్ పెంచి తల వెనుక భాగం నుంచి సర్కిల్ ఆకారంలో తిప్పడం మొదలుపెట్టాడు. ఆ సమయంలో ఒక్క చుక్క నీరు కూడా కింద పడకపోవడం విశేషం. ఆ తరువాత గ్లాసులోని నీళ్లను గటగట తాగేసి షో సమాప్తం అన్నట్లుగా సూచించాడు. అయితే ఆ వ్యక్తి చేసింది మ్యాజిక్ కాదని, భౌతికశాస్త్రంలోని న్యూటన్ ఫస్ట్ లా( లా ఆఫ్ ఇనర్షియా) జడత్వం, సెంట్రీపిటల్ ఫోర్స్‌ను ఆధారంగా చేసుకొని ఇలా చేశాడంటూ ఫిజిక్స్ అండ్ ఆస్ట్రానమి పేర్కొంది. ఈ వీడియోను ఇప్పటివరకు 1.7 మిలియన్ మంది వీక్షించారు. ఈ వీడియో ఎక్కడ తీశారనేదానిపై స్పష్టత లేదు కాని.. వీడియోలోని వ్యక్తి మాత్రం చెన్నైలోని కన్నాజీనగర్కు చెందిన వాడని ఒక నెటిజన్ పేర్కొన్నాడు. -
భౌతికశాస్త్రంలో ముగ్గురు శాస్త్రవేత్తలకు నోబెల్
స్టాక్‌హోమ్ : భౌతికశాస్త్రంలో విశేష పరిశోధనలు చేసిన ముగ్గురు శాస్త్రవేత్తలను 2019 సంవత్సరానికి గానూ ప్రఖ్యాత నోబెల్ పురస్కారం వరించింది. జేమ్స్ పీబుల్స్, మైఖేల్ మేయర్, డిడియర్ క్యులోజ్‌లకు భౌతిక శాస్త్రంలో ఈ పురస్కారాన్ని ఉమ్మడిగా అందజేయనున్నట్టు నోబెల్ అసెంబ్లీ మంగళవారం ప్రకటించింది. వారిలో పీబుల్స్ కెనడియన్ అమెరికన్ కాగా, మైఖేల్, క్యులోజ్‌లు స్విట్జర్లాండ్‌కు చెందినవారు. విశ్వసృష్టిలో సైద్ధాంతిక అవిష్కరణలకు గానూ వారు నోబెల్ పురస్కారాన్ని అందుకోనున్నారు. మొత్తం ప్రైజ్‌మనీ అయిన 9.18 లక్షల అమెరికన్ డాలర్లలో సగం పీబుల్స్‌కు వెళ్లగా, మిగతా సగాన్ని మైఖేల్, క్యులోజ్ పంచుకోనున్నారు. డిసెంబర్ 10వ తేదీన స్టాక్‌హోమ్‌లో జరిగే కార్యక్రమంలో వారు నోబెల్ పురస్కారం అందుకోనున్నారు. కాగా, సోమవారం వైద్య రంగానికి సంబంధించి నోబెల్ విజేతలను ప్రకటించిన సంగతి తెలిసిందే. -
ఇడ్లీ– ఉప్మా – డోక్లా... మూడేళ్లుంటాయి!
రేడియేషన్ సమీపానికి వెళ్లాలంటే అందరికీ భయం. కానీ రేడియేషన్‌తో ఇప్పటి వరకు ఉన్న లాభాలే కాకుండా, కనీవినీ ఎరుగని రీతిలో మరొక అత్యంత కీలకమైన ప్రయోజనాన్నీ కనుగొన్నారు ముంబై యూనివర్సిటీ ఫిజిక్స్ విభాగం భౌతిక శాస్త్రవేత్త ప్రొఫెసర్ వైశాలి బంబోలి. ముంబై యూనివర్సిటీ క్యాంపస్‌లోని బయో నానో ఫిజిక్స్ లాబ్‌లో గత ఐదేళ్లుగా పరిశోధనలు జరిపి ఆమె ఈ విషయాన్ని కనుగొన్నారు! ఉదయం వండిన వంటకాలు రాత్రి తినాలంటే ముఖం చిట్లించుకుంటాం. అయితే వాటిని రేడియేషన్ ద్వారా ఏకంగా వెయ్యి రోజులు.. అంటే సుమారు మూడు సంవత్సరాల పాటు తాజాగా ఉంచవచ్చని ప్రొఫెసర్ వైశాలి కనుగొన్నారు! ఇది భవిష్యత్తులో మానవాళికి ఉపయుక్తమైన పరిణామాలకు నాంది అవుతుందని ఆమె భావిస్తున్నారు. ‘‘ముఖ్యంగా నేటి సమాజంలో ఆహారం కొరతను తగ్గించడంతోపాటు, ప్రకృతి విపత్తుల సమయంలో ఆహారాన్ని దీర్ఘకాలం తాజాగా ఉంచి, అన్నార్తులకు అందించేందుకు వీలవుతుంది. అదే విధంగా మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతలున్న సరిహద్దులో ఉండే సైనికులకు కూడా తాజాగా ఆహారాన్ని అందించవచ్చు. మరో సంతోషకరమైన సంగతి.. అమెరికాతోపాటు దేశ విదేశాలలో ఉండే మనవారికి మన ఊరిలో మన ఇంట్లో తినే వంటలను తిన్పించేందుకు అవకాశం కలుగుతుంది’’ అన్నారు ప్రొఫెసర్ వైశాలి. ఏమిటా ప్రయోగం?! ‘రెడీ టు ఈట్’ ప్రాజెక్టులో భాగంగా.. వండిన పదార్థాలపై వైశాలి బృందం ఈ ప్రయోగం చేశారు. ఇడ్లీ, ఉప్మాతోపాటు తెల్లని డోక్లా (గుజరాతీ వంటకం) ను మూడేళ్లపాటు తాజాగా ఉంచవచ్చని తెలుసుకున్నారు. ప్రయోగ ఫలితాన్ని నిర్థారించుకున్న తర్వాతే ఈ విషయాన్ని ఇటీవల వెల్లడించారు. ‘‘ప్రత్యేకంగా రూపొందించిన మల్టీ లేయర్డ్ కవర్లలో (సంచులలో) ఆహార పదార్థాలను ఉంచి ప్యాక్ చేసి రేడియేషన్ ఇచ్చాం. ఇందుకోసం ఎలక్ట్రానిక్ బీమ్ రేడియేషన్ టెక్నాలజీ వినియోగించాం. ముఖ్యంగా ఎంత రేడియేషన్ ఇవ్వాలనేది కనుగొన్నాం. మేము అనేక తినుబండారాలపై చేసిన పరిశోధనలలో.. ముఖ్యంగా ఇడ్లీ, ఉప్మా, తెల్లని డోక్లాలపై చేసిన ప్రయోగం విజయవంతమైంది. ఇప్పుడు మూడేళ్ల అనంతరం కూడా వాటి రుచితోపాటు వాటి నాణ్యత, వాటిలోని ప్రొటీన్స్, ఫ్యాట్స్, కార్బొహైడ్రేట్స్, మైక్రో సెన్సరీ వాల్యూస్ అన్నీ మూడేళ్ల కింద ఉన్నట్టే ఉన్నాయి’’ అని ప్రొఫెసర్ ౖవైశాలి చెప్పారు. అయిదేళ్ల నాటి ఆలోచన ‘‘రేడియేషన్ సాధారణంగా వండిన వంటకాలపై కాకుండా కూరగాయలు, పండ్ల నిల్వ విధానానికి ఉపయోగిస్తారు. అయితే మనం వండిన వంటలపై వినియోగిస్తే ఎలా ఉంటుందనే ఆలోచన అయిదేళ్ల కిందట వచ్చింది. అయితే గామా రేడియేషన్‌కు కొన్ని సమస్యలున్న సంగతి అందరికీ తెలిసిందే. కాని ఎలక్ట్రానిక్ బీమ్ రేడియేషన్ ద్వారా ప్రయత్నిస్తే ఫలితం దక్కవచ్చని భావించాను. బోర్డ్ ఆఫ్ రేడియేషన్, ఐసోటోప్ టెక్నాలజీ (బిఆర్ఐటి) సంస్థలోని రేడియేషన్ యంత్రాన్ని నా పరిశోధన కోసం వినియోగించుకునేందుకు అనుమతి కోరాను. అనంతరం ముంబై యూనివర్సిటీలోని కలీనా క్యాంపస్‌లో బయో నానో ఫిజిక్స్ లాబ్ ఏర్పాటు చేసుకున్నాం. ముందుగా రేడియేషన్ డోస్ ఎంత ఇవ్వాలనే దానిపై పరిశోధన చేశాం. అనంతరం వంటకాలను ఎలాంటి ప్యాకేజీలలో ఉంచి రేడియేషన్ ఇస్తే బాగుంటుందని ప్రయోగాలు చేశాం. మొదట పరిశీలనలో భాగంగా ముప్పై రోజుల అనంతరం రేడియేషన్ ద్వారా ప్రత్యేక ప్యాకెట్లో ఉంచిన ఇడ్లీ, ఉప్మా, డోక్లాను అన్ని రకాలుగా పరీక్షలు చేశాం. ప్యాకింగ్ చేసిన రోజు ఎలా ఉన్నాయో నెల తర్వాత కూడా ఆ వంటకాలు అలానే తాజాగా ఉండడం గమనించాం. అనంతరం వెయ్యి రోజుల పరీక్షలు నిర్వహించాం. అప్పటికి కూడా ఆ వంటకాలలో ఎలాంటి మార్పులేదు’’ అని వివరించారు వైశాలి. త్వరలో యంత్రాల అభివృద్ధి టేబుల్ టాప్ ఎలక్ట్రానిక్ రేడియేషన్ యంత్రం సహాయంతో రాబోయే రోజుల్లో ఇతర వంటకాలను కూడా తాజాగా ఉంచే పరిశోధనల్ని వైశాలి బృందం చేయబోతోంది. ‘‘అయితే ఇందుకోసం కావలసిన రేడియేషన్ యంత్రాలు కొన్ని ప్రాంతాల్లోనే అందుబాటులో ఉన్నాయి. చైనాలో టేబుల్‌టాప్ ఎలక్ట్రానిక్ బీమ్ రేడియేషన్ యంత్రాలు అందుబాటులోకి వచ్చినప్పటికీ వాటి ధరలు భారీగా ఉన్నాయి. దీంతో మేమే అత్యంత తక్కువ ధరలో ఆ యంత్రాలను అభివృద్ధి చేస్తున్నాం’’ అని ప్రొఫెసర్ వైశాలి తెలిపారు. – గుండారపు శ్రీనివాస్, సాక్షి, ముంబై -
దక్షిణనియ్యి! వద్దొద్దు! నాకెందుకు నీ దక్షిణ!?
ఎక్కడైనా సరే కన్నతల్లిని చూస్తే తన బిడ్డ కళ్లలోకి అలా చూసి క్షణం ఆగి గట్టిగా హత్తుకుని పెద్ద ముద్దు పెట్టుకుంటుంది. ఈ ఇద్దరిలోనూ కన్పించే తేడా ఏమిటి? తేడా ఏమిటో కన్పించనితనమే!కన్నతల్లి తన బిడ్డ కళ్లలోకి చూస్తూ ఎంత ఎదురుచూసేలా చేశావురా? బొజ్జలో ఉండి ఎన్ని తన్నులు తన్నావురా? ఎన్ని తినరాని(మట్టి సుద్ద మరీపులుపు..) వాటిని ఇష్టంగా తినిపించావురా? ఒకసారి నేను కూడా దక్కని పరిస్థితిని కల్పించి ఎంత గాభరా పుట్టించావురా? అనుకుంటూ ఆ పసివాడి కళ్లలోకి ఈ భావాన్నంతటినీ వ్యక్తీకరిస్తూ ఆ ఆనందాతిశయాన్ని భౌతికంగా వ్యక్తీకరిస్తూ ‘గాట్టి పెద్ద ముద్దు’ని పెడుతుంది.అదే మరి పక్కనున్న మరొక ఆమె అయితే.. బోసినవ్వు ఎంత బాగుంది? గిరజాలెంత చక్కగా ఉన్నాయి? బుగ్గలెంత బూరెల్లా కనిపిస్తున్నాయి..! అంటూ ముద్దెట్టుకుంటుంది. ఇద్దరూ చేస్తున్నదీ చేసిందీ ఒకే పని అయినా ఎంత వ్యత్యాసముంది?ఇదే తీరుగా ఏదో బాబాని దర్శించేయడం కాకుండా ‘బాబా! నన్నెంత తలకిందులైన పరిస్థితి నుండి ఊహాతీతంగా బయటపడేశావ్? పూర్తిగా ఎండిన చెట్టులా ఉన్న నన్ను చిగిర్చి పుష్పించేలా చేశావు?’ అనుకుంటూ చూసేవారికి బాబా మరింత ఆనంద అనుగ్రహదర్శనాన్నిస్తాడు. ఏదో పదిమందితో వెళ్లాం కదా! అని చూస్తే కనిపిస్తాడు తప్ప దర్శనాన్ని ఇవ్వడు. ఇది అనుభవం ద్వారా మాత్రమే తెలిసే విషయం.ఇక్కడ ఈ మాటలెందుకనుకోవచ్చు! బాబాని దర్శించడానికి వెళ్లే ముందు బాబా గురించిన ఎంతో సమాచారాన్ని ప్రస్తుతం మనం తెలుసుకుంటున్నట్టుగా తెలుసుకుని గాని దర్శించుకున్నట్లయితే ఆ చూసే చూపులో లోతుదనమే వేరు. అలా కాక కేవలం దర్శించి నమస్కరించేస్తే పై ఉదాహరణలో కన్నతల్లి కాని ఆమె పొందినది ఆనందమే అయినా అది కన్నతల్లి ఆనందంలాంటిదెలా కాదో.. కాలేదో.. అలాగే ఉంటుంది. 15 రూపాయలివ్వు! సాయి దర్శనం కోసం గోవా నుంచి ఇద్దరు పెద్ద వయసువాళ్లొచ్చారు. సాయి దర్శనాన్ని చూస్తూనే చెప్పలేని ఆనందంతో పాదాభివందనాన్ని వినమ్రులై చేశారు. ఇద్దరూ కలిసే వచ్చారు. ఇద్దరూ కలిసే పాదాభివందనాన్ని చేశారు. అయితే సాయి మాత్రం మొదటివాణ్ని చూస్తూ ‘నాకో 15 రూపాయల దక్షిణనివ్వు!’ అని అడిగాడు. సాయి దర్శనం లభించడమే అదృష్టకరమైన అంశమనుకుంటూ ఉంటే ఆయనే దక్షిణ అడిగి మరీ తీసుకోవడం అనేది మరింత అదృష్టకరమైన అంశమనుకుంటూ వెంటనే 15 రూపాయలనీ ఇచ్చేశాడు మొదటి వ్యక్తి.‘అయ్యో! ఆయన అడక్కుండానే దక్షిణనిచ్చి ఉంటే ఎంత బాగుండేది?’ అనుకుంటూ రెండవ వ్యక్తి 35రూపాయల దక్షిణని సాయికివ్వబోతే వద్దు అంటూ చేతి సంజ్ఞని చేస్తూ సాయి తిరస్కరించాడు.ఇతని దగ్గర అడిగి తీసుకోవడమేమిటి? అతను తనంత తానుగా ఇంతకంటే ఎక్కువనియ్యబోతే తిరస్కరించడమేమిటి? అని అక్కడున్న భక్తులందరికీ, వచ్చిన గోవాభక్తులిద్దరికీ సంశయం కలిగింది. బాబాని అడగాలంటే భయం, సంకోచం కాబట్టి ఎవ్వరూ అడగలేకపోయారు. గానీ ‘శ్యామా’మాత్రం బాగా చనువున్నవాడు కాబట్టి సాయికి నమస్కరించి ‘ఈ సంశయాన్ని ఆయన ముందు పెట్టి అనుమానాన్ని తీర్చవూ?’ అని అడిగాడు సాయిని.బాబా శ్యామా ముఖంలోనికి చూస్తూ.. ‘శ్యామా! నాకు కుటుంబం ఉందా?’ అని అడిగాడు. ‘లేదు లేదు’ అన్నాడు శ్యామా.‘భార్య, పుత్రులు, దత్తులు ఉన్నారా?’‘లేరు లేరు..!!’‘తీర్చుకోవలసిన బాధ్యతలూ చేసిన అప్పులూ ఏమైనా ఉన్నాయా?’‘లేనే లేవు..!’‘మరి నాకు డబ్బెందుకు?’ అన్నాడు సాయి.వెంటనే శ్యామా ‘బాబా! మరి నువ్వేకదా దక్షిణ అడిగావు! ఒకరి వద్ద తీసుకున్నావు. మరొకరియ్యబోతుంటే వద్దన్నావు! అదీ కాక నీకు సొమ్ము అవసరమే లేకపోతే మరి కొందరి దగ్గర కూడా దక్షిణ అడిగి తీసుకు రమ్మంటుంటావు. తెచ్చాక తీసుకుంటావు కదా!’ అని చుట్టూ ఉన్న అందరి భక్తుల అనుమానాలన్నింటినీ కలిపి అడుగుతున్నా అన్నట్లు ధైర్యంగా అడిగాడు. సాయి చిరునవ్వు నవ్వుతూ ‘శ్యామా! చేసిన అప్పు, శత్రుత్వం, చంపితీరాలనే పగా అనేవి జన్మలెన్ని ఎత్తినా తీర్చుకోనంత కాలం అవి వెంట వస్తూనే ఉంటాయి. నీకు ఏ రుణమూ లేదు. అందుకే నాకింత సన్నిహితుడివిగా ఉంటున్నావు. ఒక్కమాటలో చెప్పాలంటే... రుణవిముక్తి కోసమే నా దగ్గరి కొస్తారు. రుణ విముక్తిని చేసుకుంటారు. ఇక నాకు అతుక్కుని అలా వస్తూ పోతూనే ఉంటారు’ అన్నాడు బాబా.శ్యామాతో పాటు భక్తులంతా అర్థమైనట్టూ బాబా చెప్పినమాటలు కానట్టూ ఉండగానే బాబా చెప్పడం మొదలెట్టాడు వివరంగా.‘ఇదుగో! ఈ భక్తుడున్నాడే! ఒకప్పుడితనికి ఉద్యోగం లేదు. తీవ్రమైన సంకట పరిస్థితుల్లో ఉన్నాడు. నిరుపేద. ఒకరోజున మొక్కుకున్నాడు. ఉద్యోగం వస్తే మొదటి జీతం ఇస్తానని. మొక్కుకున్నట్లే ఉద్యోగం వచ్చింది. మొక్కుబడి విషయాన్ని మరచిపోయాడు. 15.. 30.. 50... అలా పెరిగిన జీతం ఈ రోజున 700 అయ్యింది. అదుగో ఆ వచ్చిన ఈ వ్యక్తి నాకు రుణగ్రస్తుడు కాదూ! అందుకే అతను ఇస్తానని ఆనాడు ఒప్పుకున్న ఆ 15 రూపాయలని మాత్రమే అడిగి తీసుకున్నాను. ఇప్పుడు 700 కావచ్చు. అది నా కొద్దు. అది అతని మొదటి జీతం కాదు గదా! కాబట్టి ఇతన్ని అడిగి తీసుకున్న 15 రూపాయలు నాకు చెల్లించవలసిన బాకీపడిన పైకం మాత్రమే’ అన్నాడు. అంతా ఆశ్చర్యచకితులయిపోయారు.30,000 రూపాయల చౌర్యం‘శ్యామా! నేనొకప్పుడు సముద్రపు ఒడ్డున తిరుగుతున్నాను. అలా నడుస్తూ ఉంటే ఓ సుందరమైన భవనం కనిపించింది. అదొక సద్బ్రాహ్మణునిది అని ఆ భవనానికున్న నామఫలకం చెప్తోంది. మంచి జాతి కదా అని గ్రహించి ఆ భవనానికున్న వరండాలో కూర్చున్నాను. ఆ యజమాని నన్నేమీ అనలేదు సరికదా నన్ను లోనికి పిలిచి చక్కని భోజనాన్ని పెట్టి మంచి వసతిగా ఉన్న శుభ్రమైన పడకగదిలో పడుకోబెట్టాడు కూడా! నేనెంత గాఢంగా నిద్రపోయానో నాకే తెలియదు. అయితే తెల్లవారిన తర్వాత చూసుకుంటే నా జేబులో ఉన్న 30 వేల రూపాయల కరెన్సీ కాగితాలు చౌర్యానికి గురయ్యాయని అర్థమయింది. ఆయన సద్బ్రాహ్మణుడే కాక సకాలంలో ఆదుకున్నవాడు. ఆయన్ని అనుమానించడం మహాపాపం. ఆయన ఈ విషయాన్ని విని చాలాసేపు నన్ను ఓదార్చాడు. పొగిలి పొగిలి ఏడుస్తూనే ఉన్నాను. ఒకరోజు రెండ్రోజులు కాదు. అదే బ్రాహ్మణుని ఇంటి వరండాలో 15 రోజుల పాటు రోజూ చేసేపని ఏడవడమే. ఆ మరుసటి రోజున కూడా ఇలాగే తలుచుకు తలుచుకు ఏడుస్తూ ఉంటే ఎక్కడి నుండో ఓ ఫకీరొచ్చాడు. ఉర్దూలో రెండురెండు పాదాలు మాత్రమే ఉండే ద్విపదల్లాంటివి పాడుతూ నా దగ్గరికే వచ్చాడు.‘ఎందుకు ఏడుస్తున్నావు?’ అని అడిగాడు. జరిగిందంతా చెప్పాను. ‘ఇంతేగా! నీకో ఫకీరు పేరు చెబుతాను. ఆయన ఉండే చోటు కూడా చెప్తాను. ఆయనకి మొక్కుకో! ‘నీ డబ్బు మొత్తం నీకు తిరిగొచ్చి నీకు చేరే వరకూ ప్రతిరోజూ నువ్వుతింటున్న వరి అన్నాన్ని తిననే తిననని ఆ ఫకీరుకి పూర్తి శరణాగతుడివి అయి ఆయన నామాన్నే జపించుకుంటూ ఉండు’ అని.మరేమీ తోచలేదు. ఆ ఫకీరు చెప్పినట్లే పూర్తి నిష్ఠతో నామాన్ని జపిస్తూ ఉండిపోయాను. సరిగ్గా కొన్నిరోజులు జపించానో లేదో ఆ దొంగిలింపబడ్డ సొమ్ము నా వద్దకొచ్చింది. ఆనందంతో ఆ బ్రాహ్మణుని ఇంటిని విడుస్తూ ఆయనకి ధన్యవాదాలు చెప్పి సముద్రం దగ్గర కొచ్చాను. స్టీమర్ (నౌక) వచ్చింది. దాన్నిండా జనం. ఎవరో ఒక సిపాయి నాకు అడ్డుపడి లోనికి తీసుకుపోయి నాకు చోటునిచ్చి మరీ కూర్చోమన్నాడు. నౌక సముద్రం ఆ ఒడ్డుకి చేరింది. అక్కడి నుంచి రైలెక్కాను. ఇదిగో ద్వారకామాయి’ కొచ్చానన్నాడు బాబా.శ్యామాతో పాటు భక్తులందరికీ ఈ 2వ కథ అగమ్యగోచరంగా ఉండేసరికి ఆశ్చర్యంగా వింతగా చూడసాగారు బాబా వైపు. వెంటనే శ్యామాని చూస్తూ బాబా ‘శ్యామా! ఈ అతిథుల్ని నీ ఇంటికి తీసుకెళ్లు. మంచి భోజనాన్ని పెట్టి విశ్రాంతినిప్పించు’ అన్నాడు.శ్యామా ఆ ఇద్దరినీ తనింటికి తీసుకెళ్లాడు. చక్కగా భోజనాన్ని పెట్టాడు. వాళ్లు తినడం ముగించాక! బాబా చెప్పిన కథ మీకేమైనా అర్థమయిందా? బాబా ఎప్పుడూ ఇక్కడే ఉంటాడు. ఉన్నాడు. ఆయనేమిటి? సముద్రపు ఒడ్డేమిటి? బ్రాహ్మణగృహంలో ఉండటమేమిటి? ఆయన దగ్గర 30 వేల రూపాయలుండటం, అవి ఓ దొంగ చేతికి చిక్కడం, ఆయన దుఃఖిస్తూ ఉండిపోవడం, తిరిగి సొమ్ము ఆయనకి రావడం... ద్వారకామాయికి రావడం... ఇదంతా అగమ్యగోచరంగా ఉంది నాకు. మీ ఇద్దరూ వచ్చాక బాబా ఈ కథని చెప్పాడంటే ఈ కథకి తుదీ మొదలూ మీకే తెలిసుండాలి’ అన్నాడు. దాంతో ఆ ఇద్దరి కంఠాలు గద్గదమైపోతూ ఉంటే మొదటి ఆయన చెప్పాడు. ఆ కథ నాదే. చిచిఘాట్ నా జన్మస్థానం. నిరుపేదనైన నేను సముద్రపు ఒడ్డున తిరుగుతూ ఉద్యోగం కోసం ప్రయత్నించసాగాను. దత్తాత్రేయుణ్ని కొలుస్తూ ఉద్యోగం రాగానే మొదటి జీతాన్ని సమర్పించుకుంటానన్నాను. చిత్రమేమంటే నా మొదటి జీతం 15. నేటి జీతం 700. అన్నాను గానీ మొదటి జీతాన్ని మొక్కుగా చెల్లించుకోవాలనే మాటను మరచాను. సరిగ్గా బాబా నేటి జీతాన్ని 700 అని చెప్తూ నాటి జీతమే (15 మాత్రమే) కావాలని నేను చెప్పకుండా ఈయకుండా ఉంటే ‘అడిగి మరీ తీసుకున్నాడు’. ఆయన ఓ దైవం. సర్వజ్ఞుడు.దోషాన్ని మనకి మనమే గుర్తించేలా చేసి క్షమించే దైవం అని ముగించాడు.కాబట్టి కంచికామకోటి పరమాచార్యులవారు ఓ మాటని చెప్తూ ఉండేవారు. ఎవరైనా దైవానికి మొక్కుకుని ఉంటే ప్రతిరోజూ డైరీలోనూ మొదటివాక్యంగా ఈ మొక్కు వివరాలను రాసుకుంటూ ఉండాలని. అది ఎంత గొప్పమాట. సత్యనారాయణస్వామి వ్రతంలో మొక్కుని మరిచిపోవడం, షావుకారుకి భార్య గుర్తు చేసినా వాయిదా వేయడం, చివరికి తప్పుని అంగీకరించి ఒడ్డునపడటం.. అనే ఆ కథ ఎంతటి కనువిప్పునిస్తుంది మనకి! గమనించుకోవాలి! అనుకోకుండా వచ్చిన క్రమక్రమ ఆపదలలో మొక్కేసుకోవడం ఇన్ని సంఖ్యలో ఉన్న మొక్కుల్లో దేన్నో మర్చిపోవడం లేదా మొక్కుకున్న వివరం గుర్తులేకపోవడం వంటివి జరుగుతూ ఉండటం సర్వసాధారణం. సాయి దయార్ద్రహృదయుడు కాబట్టి మనం చేసిన దోషాన్ని గుర్తుచేసి మరీ మనచేత తీర్పించుకుంటాడన్న మాట. అలాగని ఆయనే గుర్తు చేస్తాడు కదా! అహంకార నిర్లక్ష్యభావాన్ని చూపిస్తే మనకి ఫలితం బాగా అర్థమయ్యేలా చేస్తాడు కూడా! కాబట్టి సకాలంలో మొక్కుని సరిగా తీర్చుకోవాలి తప్పదు! రెండవది నా కథే! రెండవ ఆయన కన్నీళ్లు తన్నుకుంటూ వస్తూంటే తన కథని చెప్పసాగాడు. ‘నేనొక వర్తకుడ్ని. వ్యాపారపు పనుల కారణంగా కుదరదనుకుని ఒక బ్రాహ్మణజాతి వంటవాడ్ని ఏర్పాటు చేసుకున్నాను. 35 ఏండ్ల నుండే మా ఇంట్లో తలలో నాలుకగా అయిపోయాడాయన.ఎవరో ఒక నీచుని సహవాసం వచ్చింది. దాంతో నేను పడుకునే గదిలో డబ్బు దాచుకునే బీరువా ఏ గోడలో బిగింపబడి ఉంటుందో తెలిసిన అతను ఓ నాటి రాత్రి ఆ గోడకి అమర్చబడిన బీరువాకి అటు ఇటూ ఉండే ఇటుకల్ని తొలగించి బీరువాకి రంధ్రాన్ని చేసి 30,000 రూపాయల సొమ్ముని కాజేశాడు. వ్యాపారపు పెట్టుబడి సొమ్మంతా దొంగతనానికి గురైందని తెలిసి ఇవ్వవలసినవారికి ఎలా ఇయ్యాలో.. సరుకుని ఎలా కొనుగోలు చేయాలో?... ఏం దిక్కుతోచక బావురుమంటూ ఏడుస్తూ 15 రోజుల పాటు కంటికీ మింటికీ ధారగా ఏడుస్తూనే గడిపాను రాత్రింబవళ్లని.15 రోజుల పాటూ మరో పనిలేదు. ఏడుపే ఏడుపే. 15 రోజులు నిండాక ఓ ఫకీరు నా దగ్గర కొచ్చాడు. ఏడుస్తున్న నన్ను దగ్గరికి తీసుకుంటూ కారణాన్ని అడిగాడు. చెప్పాను. వెంటనే తరుణోపాయాన్ని (కష్టాన్ని దాటగల ఉపాయాన్ని) చెప్పాడు. ‘కీపర్గాంవ్ అనే తాలూకాలో షిరిడీ అనే కుగ్రామం ఉంది. అక్కడ ‘సాయి’ అనే ఓ జాలియా (నియమ బద్ధమైన జీవితాన్ని గడిపే జ్ఞాని అయిన ఫకీరు) ఉన్నాడు. ఆయనకి మొక్కుకో! ‘నీ సొమ్ము నీకు వచ్చేలా చేయవలసిందనీ సొమ్మొచ్చే వరకూ వరి అన్నాన్ని (నిత్య ఆహారం) ముట్టనే ముట్టననీ సొమ్ము లభించాక దర్శనానికొస్తాననీ, ఈలోగా నామజపాన్ని చేస్తూనే ఉంటాను’ అని మొక్కుకో అన్నాడు. ఆ ఫకీరు చెప్పిన మాటల్నే మంత్రంగా భావించి అలాగే చేయసాగాను. ఆశ్చర్యకరంగా ఆ బ్రాహ్మణజాతి వంటవాడు వచ్చి 30 వేల రూపాయలనీ ఇచ్చేసి.. మతిభ్రమించి ఏం చేశానో ఆ సమయంలో తెలియలేదు. తిరిగి ఈ సొమ్మునిచ్చే వరకూ మనశ్శాంతి లేక ఇలా వచ్చాను అని చెప్పి వెళ్లిపోయాడు. ఆ తర్వాత ఎన్నిమార్లు వెదికినా నాకు ఈ కోపర్‌గాంవ్ జిల్లాలోని షిరిడీ కుగ్రామంలోని సాయి వద్దకి వెళ్లవలసిందనీ ఆహార నిషేధాన్ని పాటించవలసిందనీ నామజపాన్ని కానిస్తూండవలసిందనీ చెప్పిన ఆనాటి ఫకీరు కనపడనే లేదు. అలాంటి వ్యక్తి ఎవరికీ కనపడలేదని కూడా అందరూ చెప్పారు.ఈ రోజున ఇక్కడికి వచ్చాను. ఆ ఫకీరు చెప్పిన సాయి ఈయనయే. నా చరిత్ర మొత్తం అలా కళ్లకి కట్టినట్టు చెప్పడం.. 30 వేలు మాత్రమే అని చెప్పగలగడం. నా 15 రోజుల శోకం.. ఇదంతా అక్షరాక్షర సత్యం అని ఆనందాశ్రువుల్ని రాల్చాడు.సొమ్ము 30 వేలూ నాకు లభించాక కూడా నేను మరింత వ్యాపారాభివృద్ధికి ‘కొలాబా’ అనే ప్రదేశానికి వెళ్లాను. సాయి నాకు స్వప్నంలో కనిపించాడు. అంతే! బుర్ర పాడయిపోయింది. ఇంత సొమ్ములభింపజేసిన సాయి దర్శనం కంటే వ్యాపారం ముఖ్యమా? అనుకుంటూ సముద్రపు నౌక దగ్గరికి రాగానే అడ్డుకున్నాడు సరంగు(కెప్టెన్). ఒక సిపాయి–తనకి నేను బాగా తెలుసునని చెప్తూ లోనికి ఎక్కనిచ్చాడు. ఇలా రాగలిగాను బుద్ధివంకరని పోగొట్టుకుని. ఆయనకి నేను 35 రూపాయలని ఇయ్యబూనడమా? ఎంత అవివేకిని? అంటూ బిగ్గరగా ఏడ్చాడు. గమనించుకోవాలి! మనం మొక్కుని ఎప్పుడు తీర్చుకోకుండా ఉంటామో అప్పుడు మన అపరాధాన్ని తెలియజేసే కరుణార్ద్రహృదయుడాయన. అహంకరిస్తే అథఃపాతాళానికి తొక్కే సాహసపరాక్రమవంతుడూ ఆయనే. – సశేషం -
భారత సంతతి వ్యక్తికి ఐన్‌స్టీన్ ప్రైజ్
చికాగో: భౌతికశాస్త్రంలో అత్యున్నత సేవలందించిన వారికి ప్రోత్సాహకంగా అమెరికన్ ఫిజికల్ సొసైటీ (ఏపీఎస్) అందజేస్తున్న ప్రతిష్టాత్మక ‘ఐన్‌స్టీన్ ప్రైజ్’కు ఈ ఏడాది భారత సంతతి వ్యక్తి ప్రొఫెసర్ అభయ్ అష్టేకర్ ఎంపికయ్యారు. అక్టోబర్ 23న జరగనున్న అవార్డుల ప్రదానోత్సవంలో అభయ్ ఐన్‌స్టీన్ ప్రైజ్–2018తోపాటు పదివేల డాలర్లను నగదు ప్రోత్సాహకాన్ని అందుకుంటారు. అభయ్ ప్రస్తుతం ఫిజిక్స్ ప్రొఫెసర్‌గా సేవలందిస్తుండడంతోపాటు పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్సిటీలో ఇన్స్టిట్యూట్ ఫర్ గ్రావిటేషన్ అండ్ ది కాస్మోస్‌కి డైరెక్టర్‌గానూ వ్యవహరిస్తున్నారు. ఈ సందర్భంగా అభయ్ మాట్లాడుతూ... ‘ఈ అవార్డు గెలుచుకోవడం చాలా ప్రత్యేకమైంది. ఎందుకంటే ఏపీఎస్ అందించే పురస్కారాల్లో ఇదే అత్యంత గౌరవమైంది. భారత్‌లో విద్యనభ్యసిస్తున్నప్పటి నుంచి నాకు భౌతికశాస్త్రంపై ఎంతో ఆసక్తి ఉండేది. మొదట్లో నాకు కేవలం ఒక మరాఠీ మాత్రమే తెలిసేది. పదకొండో తరగతి వరకు మరాఠీ మీడియంలో చదువుకున్నాను. హిందీ, ఇంగ్లిష్ భాషలపై పట్టుసాధించిన తర్వాత సంస్కృతిపై భాష ఎలాంటి ప్రభావం చూపుతుందన్న విషయాన్ని తెలుసుకున్నాను. కాలేజీ రోజుల్లో నేర్చుకున్న భౌతికశాస్త్రం ప్రకృతిని అర్థం చేసుకోడానికి ఎంతగానో ఉపయోగపడింద’న్నారు. 1974లో యూనివర్సిటీ ఆఫ్ చికాగో నుంచి పీహెచ్‌డీని పూర్తిచేసిన అభయ్... లూప్ క్వాంటమ్ గ్రావిటీ ప్రోగ్రామ్‌పై అనేక పరిశోధనలు చేశారు. -
‘ఆప్టికల్ లేజర్’కు నోబెల్
స్టాక్‌హోం: ఆప్టికల్ లేజర్లపై కీలక పరిశోధనలు చేసి కంటి శస్త్రచికిత్సల్లో అధునాతన పరికరాలను ఉపయోగించేందుకు దోహదపడిన ముగ్గురు శాస్త్రవేత్తలకు ఈ ఏడాది నోబెల్ భౌతికశాస్త్ర బహుమతి దక్కింది. అమెరికా శాస్త్రజ్ఞుడు ఆర్థర్ ఆష్కిన్ (96), ఫ్రాన్స్‌కు చెందిన జెరార్డ్ మోరో (74), కెనడా శాస్త్రజ్ఞురాలు డొనా స్ట్రిక్లాండ్ (59)లను ఈ ఏడాది నోబెల్ భౌతిక శాస్త్ర బహుమతికి ఎంపిక చేసినట్లు రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ మంగళవారం ప్రకటించింది. భౌతిక శాస్త్ర నోబెల్‌ను తొలిసారిగా 1901లో ప్రవేశపెట్టగా అప్పటి నుంచి ఈ బహుమతి అందుకున్న మూడో మహిళ, 55 ఏళ్లలో తొలి మహిళ డొనా స్ట్రిక్లాండ్ కావడం విశేషం. అలాగే నోబెల్ బహుమతి పొందిన అత్యంత పెద్ద వయస్కుడిగా ఆర్థర్ ఆష్కిన్ నిలవడం మరో విశేషం. 2007లో అమెరికా ఆర్థికవేత్త లియోనిడ్ హర్విచ్ తనకు 90 ఏళ్ల వయ సులో నోబెల్ పొందగా, ఆర్థర్ ఆష్కిన్ 96 ఏళ్ల వయసులో నోబెల్ గెలుచుకుని రికార్డు నమో దు చేశారు. నోబెల్ బహుమతి మొత్తం విలువ 1.01 మిలియన్ డాలర్లు కాగా, ఇందులో సగాన్ని ఆర్థర్ ఆష్కిన్‌కు, మిగిలిన సగాన్ని మళ్లీ రెండు సమ భాగాలుగా చేసి జెరార్డ్ మోరో, డొనా స్ట్రిక్లాండ్లకు ఇవ్వనున్నారు. ఆప్టికల్ ట్వీజర్ల తయారీకి తగిన గుర్తింపు సూక్ష్మ క్రిములు, అణువులు, పరమాణువులు, ఇతర జీవించి ఉన్న కణాలను లేజర్ బీమ్‌లను ఉపయోగించి పట్టుకునే ఆప్టికల్ ట్వీజర్ల (పట్టుకారు వంటివి)ను తయారుచేసినందుకు ఆర్థర్ ఆష్కిన్‌కు ఈ గౌరవం దక్కింది. ఈ ట్వీజర్ల సాయంతో కాంతి ధార్మిక పీడనాన్ని ఉపయోగించి భౌతిక పదార్థాలను ఆయన కదల్చగలిగారని అకాడమీ తెలిపింది. ఆష్కిన్ 1952 నుంచి 1991 మధ్య కాలంలో అమెరికాలోని ఏటీ అండ్ టీ బెల్ ల్యాబొరేటరీస్‌లో పనిచేస్తున్న కాలంలోనే 1987లో సూక్ష్మజీవులకు హాని చేయకుండానే వాటిని పట్టుకునే ట్వీజర్లను కనుగొన్నారు. ఈ ఆవిష్కరణకుగాను ఆయనకు నోబెల్ ఇస్తున్నట్లు అకాడమీ తెలిపింది. 1991లో పదవీ విరమణ పొందిన ఆష్కిన్, అప్పటి నుంచి తన ఇంట్లోని ప్రయోగశాలలోనే జీవితం గడుపుతున్నారు. మరోవైపు అత్యంత చిన్న ఆప్టికల్ పల్స్‌లను ఉత్పత్తి చేసే విధానాన్ని అభివృద్ధి చేసినందుకు జెరార్డ్ మోరో, డొనా స్ట్రిక్లాండ్లకు నోబెల్ లభించింది. మోరోకు ఫ్రాన్స్‌లోని ఎకోల్ పాలిటెక్నిక్‌తోపాటు అమెరికాలోని మిషిగన్ విశ్వవిద్యాలయంతో అనుబంధం ఉండ గా, డొనా స్ట్రిక్‌ల్యాండ్ ఆయన విద్యార్థినే. ప్రస్తు తం ఆమె కెనడాలోని వాటర్లూ విశ్వవిద్యాలయంలో అధ్యాపకురాలిగా పనిచేస్తున్నారు. వీరు ఉత్పత్తి చేసిన ఆప్టికల్ పల్స్ అత్యంత చిన్నవి, సమర్థవంతమైనవని జ్యూరీ పేర్కొంది. మహిళలు చాలా అరుదు: డొనా స్ట్రిక్లాండ్ నోబెల్ బహుమతిని ప్రకటించిన అనంతరం డొనా అకాడమీతో ఫోన్లో మాట్లాడారు. స్త్రీలకు పెద్దగా దక్కని అవార్డును తాను అందుకోవటం తనను పులకరింపజేస్తోందని ఆమె అన్నారు. ‘మహిళా భౌతిక శాస్త్రవేత్తలు చాలా తక్కువగా ఉన్నారు. కాబట్టి వారు చాలా ప్రత్యేకం. అలాంటి వారిలో నేనొకరిని అయినందుకు గర్వంగా ఉంది’ అంటూ స్ట్రిక్లాండ్ ఆనందం వ్యక్తం చేశారు. స్ట్రిక్లాండ్ కన్నా ముందు 1903లో మేడం క్యూరీకి, 1963లో మరియా గోప్పెర్ట్ మాయెర్కు మాత్రమే భౌతిక శాస్త్ర నోబెల్ బహుమతి దక్కింది. అంటే భౌతిక శాస్త్రంలో నోబెల్ అందుకున్న మూడో మహిళ. మహిళా శాస్త్రవేత్తలకు నోబెల్ బహుమతులు తక్కువగా వస్తుండటంపై అకాడమీ గతంలోనే విచారం వ్యక్తం చేసింది. తామేమీ పురుషుల పట్ల పక్షపాతంతో వ్యవహరించడం లేదనీ, క్షేత్రస్థాయిలో ప్రయోగశాలల తలుపులు మహిళలకు చాలా చోట్ల మూసుకుపోయాయని గతంలో వ్యాఖ్యానించింది. -
నోబెల్ : 55 ఏళ్లలో ఫిజిక్స్‌లో తొలిసారి మహిళకి...
స్టాక్‌హోమ్ : 55 ఏళ్లలో తొలిసారి.. భౌతిక శాస్త్రం(ఫిజిక్స్)లో నోబెల్ పురస్కారాన్ని ఓ మహిళా కూడా అందుకున్నారు. నేడు భౌతిక శాస్త్రంలో నోబెల్ పురస్కారాన్ని ప్రకటించారు. ఈ పురస్కారాన్ని లేజర్ ఫిజిక్స్‌లో సంచలనాత్మకమైన ఆవిష్కరణలు చేసినందుకు గాను, ఆర్థూర్ ఆష్కిన్‌కు, మరో ఇద్దరు శాస్త్రవేత్తలు జెరార్డ్ మౌరో, డోన్నా స్క్రిక్లాండ్లకు సమిష్టిగా అందజేస్తున్నట్టు ‘ది రాయల్ స్వీడిస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్’ నేడు ప్రకటించింది. 55 ఏళ్లలో తొలిసారి ఈ పురస్కారాన్ని అందుకున్న మహిళ స్క్రిక్లాండ్. మహిళా భౌతిక శాస్త్రవేత్తలందరూ ఎంతో సంబరం చేసుకోవాల్సినవసరం వచ్చిందని, వారిలో నేను ఒకదాన్ని అని స్టాక్‌హోమ్‌లో నోబెల్ పురస్కారం ప్రకటన తర్వాత న్యూస్ కాన్ఫరెన్స్‌లో స్క్రిక్లాండ్ ఆనందం వ్యక్తం చేశారు. ఫిజిక్స్‌లో నోబెల్ అవార్డు అందుకున్న మహిళల్లో స్క్రిక్లాండ్ మూడో మహిళ. అంతకముందు 1903లో మేరి క్యూరికి, 1963లో మారియ గోపెర్ట్ మేయర్‌కు ఈ పురస్కారం దక్కింది. స్క్రిక్లాండ్ షేర్ చేసుకున్న శాస్త్రవేత్తలో ఆష్కిన్ది అమెరికా కాగా, మౌరు ఫ్రెంచ్కు చెందిన వారు. ఇక స్క్రిక్లాండ్ కెనడియన్ మహిళ. వీరు మొత్తం తొమ్మిది మిలియన్ల స్వీడిష్ క్రోనర్ అంటే రూ.7,34,33,374ను పొందనున్నారు. -
మానవ మనుగడకు భౌతిక శాస్త్ర పరిశోధనలే కీలకం
విజయనగరం అర్బన్ : విశ్వమానవ మనుగడకు భౌతిక శాస్త్ర పరిశోధనలే కీలకమని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిజిక్స్ సంస్థ (భువనేశ్వర్) డైరెక్టర్ ప్రొఫెసర్ సుధాకర్ పండా అన్నారు. ఇండియన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ బెంగళూరు సంయుక్త సహకారంలో స్థానిక మహరాజా అటానమస్ కళాశాలలో రెండు రోజుల పాటు నిర్వహిస్తున్న సదస్సు ప్రారంభోత్సవ సభలో గురువారం ఆయన ముఖ్యఅతిథిగా మాట్లాడుతూ గురుత్వాకర్షణ తరంగాల నుంచి అంతరాల పరమాణు కణాల వరకు ప్రతి అంశం మానవ జీవనానికి ముడిపడినవేని చెప్పారు. భౌతిక శాస్త్ర అంశాలపై పరిశోధనలు విస్తృత స్థాయిలో జరగాలని సూచించారు. విద్యార్ధి దశ నుంచి పరిశోధనా దృక్పథాన్ని కల్పించే బోధనాంశాల శైలి రావాలని అభిప్రాయపడ్డారు. అనంతరం సదస్సు తొలిరోజు కార్యక్రమాలను ప్రారంభించారు. తొలిరోజు వక్తలుగా ప్రొఫెసర్లు అజిత్ మోహన్ శ్రీవత్స, డాక్టర్ సంజీవకుమార్ అగర్వాలా, డాక్టర్ నిష్నికాంత్ కాందాయ పాల్గొన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జి.ఎ.కల్యాణి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మాన్సాస్ ట్రస్ట్ సభ్యులు పూసపాటి అదితిగజపతిరాజు, కరస్పాండెంట్ డాక్టర్ డి.ఆర్.కె.రాజు, ఫిజిక్స్ విభాగ అధిపతి డాక్టర్ డి.బి.ఆర్.కె.మూర్తి, కళాశాల భౌతిక శాస్త్ర అధ్యాపకులు, పరిశోధన విద్యార్థులు, పీజీ, డిగ్రీ విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. -
విద్యార్థులపై ఒత్తిడి తగదు
భౌతికశాస్త్రంలో నోబెల్ బహుమతిని మించినది ‘ఫండమెంటల్ ఫిజిక్స్ అవార్డు’. శాస్త్ర పరిశోధన రంగంలో విశిష్ట గుర్తింపు కలిగిన ఈ అవార్డును రష్యన్ నోబెల్‌గా పరిగణిస్తారు. దీని కింద ఇచ్చే నగదు బహుమతి నోబెల్ బహుమతికి రెట్టింపు ఉంటుంది. ఈ అవార్డు సాధించిన భారతీయుడు, ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త ప్రొఫెసర్ అశోక్‌సేన్. ఆయన ప్రతిపాదించిన తీగ సిద్ధాంతానికి(స్ట్రింగ్ థియరీకి) ఫండమెంటల్ ఫిజిక్స్ అవార్డు దక్కింది. సేన్‌ను ప్రముఖ శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ స్వయంగా ‘రాయల్ సొసైటీ ఫెలోషిప్’కు నామినేట్ చేశారు. సేన్‌కు పలు జాతీయ, అంతర్జాతీయ ప్రతిష్టాత్మక అవార్డులు లభించాయి. భారత ప్రభుత్వం పద్మశ్రీ, పద్మభూషణ్ పురస్కారాలతో సత్కరించింది. దేశ విదేశాల్లో పరిశోధనలు చేసిన ఆయన కాన్పూర్ ఐఐటీలో ఎంఎస్సీ (ఫిజిక్స్) చేశారు. అమెరికాలోని ‘స్టోనీ బ్రూక్’ యూనివర్సిటీ నుంచి పీహెచ్డీ పట్టా పొందారు. మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎంఐటీ)తో పాటు పలు దేశాల్లో పనిచేసిన తర్వాత స్వదేశానికి వచ్చి టాటా ఇన్స్టిట్యూ ట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్‌లో పనిచేశారు. ప్రస్తుతం అలహాబాద్‌లోని హరీష్–చంద్ర రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో పరిశోధనలు సాగిస్తున్నారు. మల్లు విశ్వనాథరెడ్డి – సాక్షి, అమరావతి బ్యూరో : ఓ విద్యార్థి విజ్ఞానానికి, చదివే మాధ్యమానికి (మీడియం) సంబంధం లేదని ప్రముఖ భౌతిక శాస్త్ర వేత్త, ఫండమెంటల్ ఫిజిక్స్ అవార్డు గ్రహీత ప్రొఫె సర్ అశోక్‌సేన్ పేర్కొన్నారు. కాలేజీలో చేరే వరకూ తాను బెంగాలీ మాధ్యమంలో చదువుకున్నానని చెప్పారు. ప్రాథమిక విద్యకు చాలా ప్రాధాన్యం ఉందని, అందుకు తగినట్లుగా బడ్జెట్ కేటాయింపులు పెరగాలన్నారు. ప్రతిష్టాత్మక విద్యాసంస్థలో సీటు సాధించాలనే లక్ష్యంతో పిల్లలపై తీవ్ర ఒత్తిడి పెంచడం తగదని తల్లిదండ్రులకు సూచించారు. ఎక్కువ జీతం లభించే ఉద్యోగం వైపు కాకుండా ఆసక్తి ఉన్న వైపు ప్రయాణిస్తేనే విజయం వరిస్తుందని తెలిపారు. ‘చుక్కపల్లి పిచ్చయ్య 6వ స్మారక ఉపన్యాసం’కోసం విజయవాడ వచ్చిన ఆయన ‘సాక్షి’కి ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు. ముఖ్యాంశాలు ఇవీ.. సాక్షి: ప్రతిష్టాత్మక ఫండమెంటల్ ఫిజిక్స్ అవార్డు అందుకున్నందుకు అభినందనలు. అవార్డులో భాగంగా వచ్చిన నగదు తీసుకోవడానికి ప్రభుత్వం పన్ను రాయితీ ఇచ్చిందా? సేన్: లేదు. అవార్డు కింద 3 మిలియన్ డాలర్ల నగదు బహుమతి వచ్చింది. ట్రస్టు ఏర్పాటు చేశా. విద్యారంగంలో ఈ ట్రస్టు పనిచేస్తోంది. సాక్షి: మీ బాల్యం గురించి చెప్పండి. మీరు భౌతికశాస్త్రం వైపు రావడానికి స్ఫూర్తి ఎవరు? సేన్: మా నాన్న ఫిజిక్స్ టీచర్. అందువల్ల ఫిజిక్స్ మీద ఆసక్తి కలిగింది. నేను +2 పూర్తి చేసిన సమయంలో బెంగాల్లో ఫిజిక్స్ మోస్ట్ పాపులర్ సబ్జెక్ట్. బోర్డు పరీక్షల్లో నేను టాప్ 10లో లేను. టాప్ టెన్‌లో ఐదుగురు ఫిజిక్స్ తీసుకున్నారు. అప్పట్లో ఫిజిక్స్‌కు బాగా క్రేజ్ ఉండేది. సాక్షి: పరిశోధన రంగం పట్ల ఆకర్షితులు కావడానికి కారకులెవరు? సేన్: ఒకరని చెప్పలేను. నేను డిగ్రీ చదివిన కోల్‌కతా ప్రెసిడెన్సీ కాలేజీలో అమల్ రాయ్‌చౌధురి, కాన్పూర్ ఐఐటీలో చాలా మంది ప్రొఫెసర్లు, టీచర్లు చాలా మంది నా జీవితంలో ఉన్నారు. సాక్షి: తెలుగు రాష్ట్రాల్లో ఐఐటీ పట్ల విపరీతమైన ఆకర్షణ ఉంది. తల్లిదండ్రుల్లో ఎక్కువ మంది తమ పిల్లలు ఐఐటీల్లో చదవాలని ఉబలాటపడుతున్నారు. ఈ బలహీనతను ఆసరాగా చేసుకొని కొన్ని కార్పొరేట్ కాలేజీలు పెద్ద వ్యాపారం చేస్తూ రూ. కోట్లు సం పాదించుకుంటున్నాయి. పాఠశాల స్థాయిలోనే ఐఐ టీ ఫౌండేషన్ కోర్సులు నిర్వహిస్తున్నామని ప్రకటనలు గుప్పిస్తున్నారు. దీనిపై మీ సలహా ఏమిటి? సేన్: పిల్లలు ఎలా ఎదగాలి? ఏం కావాలి? అనే విషయాలను వారికే విడిచిపెట్టాలి. పాఠశాలల్లో ఉన్న పిల్లలకు తమ ఆసక్తి ఏమిటనే విషయం పూర్తిగా తెలియకపోవచ్చు. పిల్లల మీద విపరీతమైన ఒత్తిడి తగదు. ఐఐటీలో సీటు రాకపోతే జీవితం లేదనే భావన మంచిది కాదు. పాఠశాల స్థాయి నుంచే ఐఐటీ ఫౌండేషన్ కోర్సులంటే పిచ్చి అనుకోవాలి. సాక్షి: టెన్త్ తర్వాత ఎక్కువ మంది ఎంపీసీ, బైపీసీ గ్రూపుల వైపు వెళ్తున్నారు. ఏటా లక్షలాదిగా ఇంజనీర్లు తయారవుతున్నారు. కోర్ సైన్స్ వైపు రావట్లే దు. పరిశోధన రంగం మీద దీని ప్రభావం ఉండదా? సేన్: అందరూ ఇంజనీర్లు కావాలనే ఆలోచన మంచిది కాదు. కోర్ సైన్స్‌లోనూ మంచి భవిష్యత్ ఉంది. సైన్స్ పట్ల ఆసక్తి ఉంటే తప్పనిసరిగా అటు వైపు రావాలని నేను విద్యార్థులకు సూచిస్తా. ఆసక్తి ఉన్న వైపు ప్రయాణిస్తేనే విజయం వరిస్తుంది. సాక్షి: మీరు పలు దేశాల్లో పరిశోధన రంగంలో పని చేశారు. విదేశాలకు, ఇక్కడకు ఉన్న తేదా ఏమిటి? సేన్: థియరిటికల్ రీసెర్చ్‌లో పెద్దగా ఉండదు. నేను అందులోనే పరిశోధనలు చేస్తున్నా. సైద్ధాంతిక పరిశోధనకు ల్యాబ్ కూడా అక్కర్లేదు. విదేశీ వర్సిటీల్లో పరిశోధన కార్యకలాపాలు బాగా ఎక్కువ. ప్రయోగాత్మక పరిశోధనకు మంచి అవకాశాలున్నాయి. మనకు బ్యూరోక్రసీ పెద్ద అడ్డంకి. ప్రభుత్వాలు నిధులు ఇస్తున్నాయి కానీ వ్యయం చేయడంలోనే సమస్యలున్నా యి. శాస్త్ర పరిశోధన రంగంలో ఉన్న వారికే వ్యయం చేసే అధికారం ఇవ్వాలి. లోయస్ట్ బిడ్డర్ విధానం పనికిరాదు. బ్యూరోక్రసీ దాన్నే అనుసరిస్తోంది. సాక్షి: విద్యలో నాణ్యత పెరగడానికి మీరిచ్చే సలహా? సేన్: ప్రాథమిక విద్య చాలా ముఖ్యం. కాలేజీల్లో, వర్సిటీల్లో మాత్రం టీచర్ల మీద మరీ ఎక్కువగా ఆధారపడాల్సిన అవసరం లేదు. కొంత గైడెన్స్ ఉంటే సరి పోతుంది. ప్రాథమిక స్థాయిలో అలా కాదు. టీచర్ గైడెన్స్ మీద పిల్లల భవిష్యత్ ఆధారపడి ఉంటుంది. వర్సిటీ ప్రొఫెసర్లకు ఇస్తున్న స్థాయిలో ప్రైమరీ టీచ ర్లకు జీతాలు ఇవ్వాలి. తద్వారా మంచి ప్రతిభ ఉన్న వారిని ఆకర్షించడానికి అవకాశం ఉంటుంది.